ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

top ten news
టాప్​ టెన్​ న్యూస్​ @9PM
author img

By

Published : Mar 31, 2021, 8:49 PM IST

1.ఉద్యోగుల రిలీవ్​

ఏపీలో రాష్ట్రంలో పని చేస్తున్నతెలంగాణ ఉద్యోగులకు రిలీవ్ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగీకారం తెలిపారు. 711 మంది ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యోగుల ప్రతినిధులు.. సీఎం జగన్‌ను కలిశారు. తెలంగాణ ప్రభుత్వంలో తమ సర్వీసులను కొనసాగించేందుకుగానూ తమను రిలీవ్ చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2.భానుడి భగభగలు

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. వేసవి ఆరంభంలోనే భానుడి భగభగలతో ప్రజలు హడలెత్తుతున్నారు. మంగళవారం 23 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40డిగ్రీల సెల్సియస్‌ దాటగా... కుమురంభీం జిల్లాలో గరిష్ఠంగా నమోదైంది. రెండు మూడ్రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.'జానారెడ్డికి ఓటమి భయం పట్టుకుంది'

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్​ ఉపఎన్నికల్లో భాగంగా... హాలియా లక్ష్మీనరసింహా ఫంక్షన్ హాల్​లో ముస్లింలు, మైనారిటీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. జానారెడ్డికి ఓటమి భయం పట్టుకుని ప్రచారం చేయకుండా ఎవరి కార్యాలయంలో వారు కూర్చుందామని సూచనలు చేస్తున్నారని మంత్రులు మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.టీకాకు వేళాయే..

దేశంలో రెండు దశల్లో భాగంగా కరోనా టీకా కార్యక్రమం నడుస్తోంది. ఏప్రిల్​ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి కూడా కేంద్రం టీకా డోసులను పంపిణీ చేయనుంది. ఈ క్రమంలో టీకా వృథాపై ప్రధానంగా దృష్టి సారించింది. ఆ వృథాను ఒకశాతం లోపునకు కట్టడి చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు బుధవారం ఆరోగ్య శాఖ సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.బంగాల్​ దంగల్​-2021

బంగాల్ శాసనసభ ఎన్నికల రెండో విడత పోలింగ్​కు సర్వం సిద్ధమైంది. గురువారం 30 నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. 171 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మమతా బెనర్జీ-సువేందు అధికారి నువ్వానేనా అన్నట్లు తలపడిన నందిగ్రామ్​ తీర్పు సైతం గురువారం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6.సుప్రీంకు త్రిసభ్య కమిటీ నివేదిక

సాగు చట్టాలపై సుప్రీంకోర్టు నియమిత త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పించింది. 85 రైతు సంఘాలతో చర్చలు జరిపినట్లు వెల్లడించిన కమిటీ సీల్డ్‌ కవర్‌లో తన నివేదిక సమర్పించింది. ఈ మేరకు పరిష్కారం కోసం రైతు సంఘాలతో చర్చలు జరిపినట్లు కమిటీ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.తగ్గనున్న ఇంధన ధరలు!

కొద్దిరోజులుగా సామాన్యుడి నడ్డి విరుస్తున్న ఇంధన ధరల నుంచి త్వరలోనే ఉపశమనం లభించనుంది. నానాటికీ పైపైకి వెళ్తున్న ధరలు దిగొచ్చే అవకాశాలున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గడమే కారణమని వెల్లడించాయి. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులో పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు తగ్గనున్నట్లు పేర్కొన్నాయి. అటు.. గురువారం నుంచి వంటగ్యాస్‌ ధర సిలిండర్‌పై 10 రూపాయలు తగ్గనున్నట్లు ఇండియన్ ఆయిల్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.సెన్సెక్స్​ డౌన్​

అంతర్జాతీయ బలహీన పవనాలు, మదుపరుల లాభాల స్వీకరణ, కరోనా భయాలతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 627పాయింట్లు కోల్పోయి.. 49,509 దిగువకు చేరింది. నిఫ్టీ 154 పాయింట్లు తగ్గి..14,690 వద్ద స్థిరపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9.ఐపీఎల్​ టైటిల్​ దిల్లీదే: పంత్​

ఈ సారి తమ జట్టు ఐపీఎల్​ ట్రోఫీని సాధిస్తుందని తెలిపాడు దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్. ప్రతి మ్యాచ్​లో గెలవడానికి వంద శాతం కృషి చేస్తానని వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.'ఆచార్య': సాంగ్​ ఆగయా..!

మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఆచార్య'. మే 13న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులోని 'లాహే లాహే' లిరికల్​ వీడియోను చిత్రబృందం బుధవారం విడుదల చేసింది. ఈ పాటలో చిరు వేసే హుషారైన స్టెప్పులు అభిమానులను అలరిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.