ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

top ten news
టాప్​ టెన్​ న్యూస్​ @9PM
author img

By

Published : Mar 30, 2021, 8:57 PM IST

1.ఇక సమరమే..

రాష్ట్రంలో ఉత్కంఠ రేపుతున్న నాగార్జునసాగర్‌ ఉపఎన్నికకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. వరుస సెలవుల కారణంగా ప్రధాన పార్టీల అభ్యర్థులంతా చివరిరోజునే నామపత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ నుంచి మాజీమంత్రి జానారెడ్డి, తెరాస అభ్యర్థిగా నోముల భగత్‌, భాజపా తరఫున రవికుమార్‌, తెలుగుదేశం నుంచి మువ్వా అరుణ్‌ కుమార్‌ బరిలో నిలిచారు. మొత్తం 78 మంది నామినేషన్లు దాఖలు చేశారు. సాగర్‌లో గెలుస్తామని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2.తెలంగాణకు అగ్రస్థానం

ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో రాష్ట్రానికి అగ్రస్థానం దక్కింది. 48.39 శాతం టీకాలతో తెలంగాణ ముందంజలో ఉందని కేంద్రం అధికారికంగా వెల్లడించింది. ఇదే వరుసలో 43.11 శాతం వ్యాక్సినేషన్‌తో దిల్లీ రెండో స్థానంలో ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.ప్రైవేట్​ వ్యక్తులదే..

హఫీజ్‌పేట్ వివాదాస్పద భూములపై హైకోర్టు తీర్పును వెలువరించింది. 140 ఎకరాల వివాదాస్పద భూమి వక్ఫ్, ప్రభుత్వ భూమి కాదని ఉన్నత న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. సర్వే నెంబర్‌ 80లోని భూమి ప్రైవేట్‌ వ్యక్తులదేనని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.కరోనా కలవరం

యాదాద్రిలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. యాదగిరిగుట్ట మండలంలో కొత్తగా మరో 24 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ తేలింది. ఆరు రోజుల్లోనే 141 కేసులు వెలుగుచూశాయి. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మరో 10 మంది వైరస్‌ బారినపడ్డారు. ఇప్పటివరకు 83 మంది ఆలయ సిబ్బందికి కొవిడ్‌ సోకింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.మైకులు బంద్​

బంగాల్​, అసోం రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచార పర్వం ముగిసింది. బంగాల్​లో 30, అసోంలో 39 స్థానాలకు ఏప్రిల్​ 1న పోలింగ్ జరగనుంది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, భాజాపా నేత సువేందు అధికారి పోటీ చేస్తున్న నందిగ్రామ్​లో పోరు రసవత్తరంగా మారిన తరుణంలో ఈ నియోజకవర్గంపైనే అందరి దృష్టి నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6.మోదీ విస్తృత ప్రచారం

డీఎంకే, కాంగ్రెస్​కు మహిళల పట్ల గౌరవం లేదని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ. సీఎం పళనిస్వామి తల్లిని అవమానించిన వారు అధికారంలోకి వస్తే ఇంకా అనేక మంది మహిళలకు అదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన డీఎంకే కూటమిపై ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.పార్లమెంట్​లో నిఘా వ్యవస్థలు!

కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించేలా పార్లమెంట్​లో నిఘా వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు.. సీఎస్ఐఆర్ సూచించింది. వాయు, మురుగునీటి నిఘా వ్యవస్థల ద్వారా కరోనా ఎంత మందికి సోకిందనే విషయంపై అవగాహనకు రావొచ్చని తెలిపింది. ఈ మేరకు వెంకయ్యకు ఓ ప్రెసెంటేషన్ ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.బుల్​ జోరు

స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 1,128 పాయింట్లు పెరిగి 50,136 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 337 పాయింట్లు పుంజుకుని 14,845 కు చేరుకుంది. విద్యుత్​, ఐటీ, ఆర్థిక షేర్లు రాణించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9.దిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్​గా పంత్​

రానున్న ఐపీఎల్ సీజన్​ కోసం తమ కెప్టెన్​ను ప్రకటించింది దిల్లీ క్యాపిటల్స్​. గాయపడ్డ శ్రేయస్​ అయ్యర్​ స్థానంలో.. సారథిగా యువ బ్యాట్స్​మెన్, వికెట్​ కీపర్​ రిషభ్​ పంత్​ను నియమించింది.​ పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.'వకీల్​సాబ్​' ట్రైలర్​దే ఆ రికార్డు!

"నేను ట్రెండ్​ను ఫాలో అవ్వను.. ట్రెండ్​ సెట్​ చేస్తా!" అని 'గబ్బర్​సింగ్​' చిత్రంలో పవన్​ చెప్పే డైలాగ్​ ఇది. ఈ డైలాగు మాదిరిగానే 'వకీల్​సాబ్'​ ట్రైలర్​లో యూట్యూబ్​ రికార్డులతో సరికొత్త ట్రెండ్​ను సృష్టిస్తున్నారు పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​. టాలీవుడ్​లో మరే సినిమా ట్రైలర్​ సాధించనన్ని సరికొత్త రికార్డులను నెలకొల్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.