ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు - తెలంగాణ వార్తలు

ETV BHARAT
తెరాస
author img

By

Published : Nov 28, 2021, 5:58 AM IST

Updated : Nov 28, 2021, 10:00 PM IST

21:47 November 28

  • ​ శివశంకర్ మాస్టర్ ఇకలేరు

ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్(72) కన్నుమూశారు. కరోనాతో చికిత్స పొందుతూ గచ్చిబౌలి ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారాయన. ఇటీవల శివశంకర్ మాస్టర్ కుటుంబం కరోనా బారినపడింది. ప్రస్తుతం ఆయన పెద్ద కుమారుడు విజయ్​ శివశంకర్​ ఇంకా కోలుకోలేదు.

  • జియో యూజర్లకు షాక్

ఎయిర్​టెల్​, వోడాఫోన్​ బాటలోనే నడిచింది రిలయన్స్ జియో. తాము కూడా ప్రీపెయిడ్​ ప్లాన్​ల ధరలను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. పెరిగిన ధరలు ఎలా ఉన్నాయంటే..

  • ఆశ్రమంలో కరోనా కలకలం

ఆశ్రమంలో కాలం వెళ్లదీస్తున్న 55 మంది వృద్ధులకు కరోనా (Covid old age homes) సోకింది. వీరందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడ పనిచేసే ఐదుగురు ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఇద్దరికి సైతం వైరస్ పాజిటివ్​గా తేలిందని అధికారులు చెప్పారు. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నప్పటికీ వృద్ధులు కరోనా బారిన పడటం గమనార్హం.

  • 'మీరు తిరిగి పుంజుకోవాలి'

టీమ్​ఇండియా, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టులో భాగంగా కెప్టెన్ అజింక్య రహానే, ఛెతేశ్వర్ పుజారా పరుగులు తీయడంలో విఫలమయ్యారు. దీనిపై క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ అంశంపై మాట్లాడాడు టీమ్​ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్. వారు తిరిగి పుంజుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

  • అసలు ఊహించలేదు

కొరియోగ్రాఫర్​ శివశంకర్​ మాస్టర్​ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు మెగాస్టార్​ చిరంజీవి. మాస్టర్​తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఇంకా పలువురు నటులు కూడా ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలుపుతున్నారు.

20:46 November 28

టాప్​న్యూస్ @ 9PM

  • పార్లమెంట్​లో లేవనెత్తాలి

రాష్ట్ర ప్రయోజనాలు, రైతాంగ ప్రయోజనాల కోసం ఎంత వరకైనా వెళ్లాలని, పార్లమెంట్ సమావేశాల్లో బలంగా వాణి వినిపించాలని తెరాస ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు

  • సర్వం సిద్ధం- ఇక సమరమే!

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament winter session 2021) వాడీవేడీగా జరిగే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సన్నద్ధమైన వేళ.. సోమవారం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పెగసస్​, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, చైనా చొరబాట్లు వంటి అంశాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఆయా పార్టీలను దీటుగా ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.

  • ప్రమాదకరంగా ఒమిక్రాన్​..!

ఎయిమ్స్​ చీఫ్​ డా. రణ్​దీప్​ గులేరియా.. కరోనా కొత్త వేరియంట్​పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్​ స్పైక్​ ప్రోటీన్​లో 30కిపైగా మ్యుటేషన్లు ఉన్నట్టు పేర్కొన్నారు. ఎన్ని ఎక్కువ మ్యుటేషన్లు ఉంటే.. టీకాల సామర్థ్యం అంత తగ్గిపోతుందన్నారు.

  • భారత్​దే పైచేయి

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట పూర్తయ్యే సమయానికి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఓ వికెట్ కోల్పోయి నాలుగు పరుగులు చేసింది. కాగా, రెండో ఇన్నింగ్స్​ను 234/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది టీమ్​ఇండియా.

19:48 November 28

టాప్​న్యూస్ @ 8PM

  • ఆ విషయంలో రాజీ పడం

ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని పార్లమెంట్​లో లేవనెత్తాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్... పంటల కొనుగోలుకు సంబంధించి జాతీయ విధానం రావాల్సిన అవసరం ఉందని అన్నారు. పంటలకు కనీస మద్దతు ధర చట్టం, విద్యుత్ చట్టాల రద్దు కోసం పోరాడాలని ఎంపీలకు సూచించారు.

  • ఆకుపచ్చ వర్ణంలోకి కృష్ణాజలాలు..?

కృష్ణా జలాలు(krishna water) సరికొత్త వర్ణాన్ని సంతరించుకున్నాయి. అదేంటీ.. నీటికి రంగుండదు కదా.. అంటారా..? అక్కడే ఉంది మరి అసలు మతలబు. నిత్యం ప్రవహించే నదీ జలాలు.. ఆకుపచ్చ రంగులోకి మారిపోయాయి. ఈ ఆసక్తికర దృశ్యం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. అసలు.. కృష్ణాజలాలకు ఈ రంగు ఎలా వచ్చిందంటే..?

  • బావిలో వేడినీళ్లు..!

ఓ గ్రామంలోని శివాలయంలో బావి నుంచి వేడినీళ్లు(heat water from well) రావడం ఆసక్తిని కలిగిస్తోంది. అది ఏకంగా నాలుగు నెలల నుంచి ఆలా వస్తున్నాయంటే నమ్మాలనిపించడం లేదు కదూ... అయితే ఈ కథేంటో ఓసారి చూడండి.

  • రేపటి నుంచే బోట్​ ప్రయాణం

సాగర్​ నుంచి శ్రీశైలం వరకు లాంచీపై సాగిపోయే విహార యాత్రకు (nagarjuna sagar boating) సమయం ఆసన్నమైంది. సోమవారం సాగర్​ నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణం పారంభం కానుంది. గత రెండు నెలల కిందట ప్రారంభం కావాల్సిన లాంచీ ప్రయాణం పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

  • 'ఆ పని చేయొద్దు ప్లీజ్'

అభిమానులకు ఓ మంచి సందేశాన్ని ఇచ్చారు బాలీవుడ్​ హీరో సల్మాన్​ ఖాన్. తన ఫ్లెక్సీలపై పాలాభిషేకం చేయొద్దని, అందుకు బదులుగా పేద పిల్లలకు పాలను దానం చేయాలని ఫ్యాన్స్​ను కోరారు.

18:55 November 28

టాప్​న్యూస్ @ 7PM

  • 'పార్లమెంట్​లో ప్రశ్నిస్తాం'

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాష్ట్రం నుంచి ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెరాస ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. వానాకాలం ఎంత ధాన్యం సేకరిస్తారో చెప్పాలని.. యాసంగి ధాన్యం సేకరణపై స్పష్టత ఇవ్వాలని కోరినా... కేంద్రం మాత్రం పట్టించుకోవట్లేదని అన్నారు. దానిపై సభలో నిలదీస్తామన్నారు.

  • చెల్లెలిపైనే దారుణం.

మద్యానికి బానిసైన అన్న.. వావివరుసలు మరిచాడు. సొంత చెల్లెలిపైనే మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చగా.. విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అమానవీయ ఘటన కర్ణాటక, మైసూర్ జిల్లాలో జరిగింది.

  • భారీ భూకంపం

పెరూలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5:52 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రత నమోదైంది.

  • డిసెంబరులో గుడ్​ న్యూస్​.. !

కరోనా కొత్త వేరియంట్ ప్రభావంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో చమురు సంస్థలు వచ్చే నెల నుంచి గ్యాస్ సిలిండర్ ధరలను(LPG cylinder price:) భారీగా తగ్గించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సార్వత్రిక ఖాతా సంఖ్య(యూఏఎన్‌)ను ఆధార్‌తో అనుసంధానించడానికి ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది.

  • సరికొత్తగా 'పాడుతా తీయగా' ..!

తెలుగు పాటకు పట్టాభిషేకం చేసి తెలుగు సినీ సంగీత ప్రపంచానికి ఎంతో మంది యువ గాయనీ గాయకులను అందించిన కార్యక్రమం 'పాడుతా తీయగా'. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తెలుగింటి ఛానల్ ఈటీవీలో సుదీర్ఘ కాలంగా కొనసాగిన ఈ పాటల పోటీకి ఆయన అకాల మరణంతో చిన్న విరామం వచ్చింది.

17:55 November 28

టాప్​న్యూస్ @ 6PM

  • ఆ తర్వాతే నిర్ణయం..!

కరోనా కొత్త వేరియంట్​ వ్యాప్తితో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్​ భల్లా అధ్యక్షత అత్యవసర సమావేశం జరిగింది. కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులు నిర్ణయించారు. అంతర్జాతీయ వాణిజ్య విమాన సేవల పునరుద్ధరణపై సమీక్ష నిర్వహించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

  • సమావేశాలకు సర్వం సిద్ధం

  • వాటి కోసం భారీ క్యూలు

సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కొవిడ్​ మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారాన్ని అందిస్తోంది గుజరాత్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబ సభ్యులు కొవిడ్​ డెత్ సర్టిఫికేట్ల కోసం ఆసుపత్రుల వల్ల బారులు తీరుతున్నారు.

  • ఆయన​ను మర్చిపోలేకపోతున్నా

తన సోదరుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణ వార్తను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు నటుడు శివరాజ్​కుమార్​. పునీత్‌ కుటుంబానికి చేతనైనంత సాయం చేస్తూనే ఉంటానని అన్నారు.

  • ' కాస్త టైమ్​ ఇవ్వండి'

టీమ్​ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్​ పాండ్య ఫిట్​నెస్​పై చాలా రోజుల నుంచి చర్చజరుగుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటనకు అతడిని ఎంపిక చేస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో అతడు పూర్తిస్థాయి ఫిట్​నెస్​పై ఫోకస్​ చేస్తున్నట్లు తెలిసింది.

16:57 November 28

టాప్​న్యూస్ @ 5PM

  • ధాన్యం అంశాన్ని పార్లమెంట్​లో లేవనెత్తాలి

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్​ అధ్యక్షతన తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. రేపటి నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్​... తెరాస ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు

  • వరి దీక్షలో 9 తీర్మానాలు..

ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్‌లో... రెండో రోజు కాంగ్రెస్‌ వరి దీక్ష(Congress vari deeksha) కొనసాగుతోంది. వరి దీక్షకు మద్దతుగా తెజస అధ్యక్షుడు కోదండరామ్‌.. కాంగ్రెస్‌ నేతలతో కలిసి దీక్షలో పాల్గొన్నారు. రైతులకు మద్దతుగా పార్టీ నేతలు 9 తీర్మానాలు ప్రవేశ పెట్టారు. వీటిని ఏకగ్రీవంగా ఆమోదించారు.

  • ప్రమాదకరంగా ఒమిక్రాన్​.. ఇదే కారణం!

AIIMS Chief on Omicron: ఎయిమ్స్​ చీఫ్​ డా. రణ్​దీప్​ గులేరియా.. కరోనా కొత్త వేరియంట్​పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్​ స్పైక్​ ప్రోటీన్​లో 30కిపైగా మ్యుటేషన్లు ఉన్నట్టు పేర్కొన్నారు. ఎన్ని ఎక్కువ మ్యుటేషన్లు ఉంటే.. టీకాల సామర్థ్యం అంత తగ్గిపోతుందన్నారు.

  • 'సిద్ధ' వచ్చేశాడు

Acharya siddha teaser: మెగాస్టార్​ చిరంజీవి, రామ్​చరణ్​ కలిసి నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. ఈ సినిమాలో 'సిద్ధ'గా నటిస్తున్న చెర్రీకి సంబంధించిన టీజర్​ విడుదలైంది. ఇందులో చరణ్​ లుక్స్​ అదరిపోయాయి.

కివీస్​ లక్ష్యం ఎంతంటే?

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట పూర్తయ్యే సమయానికి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఓ వికెట్ కోల్పోయి నాలుగు పరుగులు చేసింది.

15:56 November 28

టాప్​న్యూస్ @ 4PM

  • 'ఆందోళన పడాల్సిన అవసరం లేదు'

కరోనా కొత్త వేరియంట్(corona new variant news) విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీహెచ్​ శ్రీనివాసరావు తెలిపారు. ఒమిక్రాన్​ను ఎదుర్కునేందుకు ప్రభుత్వం అన్ని రకాల సిద్ధంగా(Measures to control Corona New Variant) ఉందని స్పష్టం చేశారు.

  • రేవంత్​రెడ్డి పాదాభివందనం

revanth salutes to farmer: రైతుల సమస్యలు, శాశ్వత పరిష్కారంపై అద్భుతమైన పాట పాడిన 93 ఏళ్ల రాంరెడ్డి అనే వ్యక్తిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అభినందించారు. వేదికపైనే ఆయనకు పాదాభివందనం(revanth salutes to farmer) చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయనను అభినందించి ఆలింగనం చేసుకున్నారు.

  • 'సిద్ధంగా ఉండండి'..

కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ఈ విషయంపై ఆయా ప్రభుత్వాలకు లేఖ రాశారు.

  • 'ఆ మాట నా గుండెను కదిలించింది!'

హైదరాబాద్​లోని శిల్పకళా వేదికగా జరిగిన 'అఖండ' ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో బాలకృష్ణను ప్రశంసిస్తూ ఆయన గురించి పలు విషయాలను తెలిపారు దర్శకుడు బోయపాటి

  • తొలి భారత ఆటగాడిగా చరిత్ర .. !

Shreyas Iyer Record in Test Debut: న్యూజిలాండ్​తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్​లో అర్ధశతకంతో మెరిసిన టీమ్ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఓ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. అరంగేట్ర టెస్టులోనే సెంచరీ, హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు.

14:37 November 28

టాప్​న్యూస్ @ 3PM

  • ఎంపీలకు దిశానిర్దేశం

  • ఆమెపై మరో కేసు

హైదరాబాద్​లో శిల్పాచౌదరిపై మరో కేసు నమోదైంది. రూ.2.5 కోట్లు తీసుకుని మోసం చేసిందని శిల్పపై ప్రియ అనే మహిళ ఫిర్యాదు చేసింది.

  • వాటిపై చర్చకు విపక్షాల డిమాండ్​

సోమవారం(నవంబరు 29) పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసింది కేంద్రం. పెగసన్, ధరల పెరుగుదల, నిరుద్యోగం.. తదితర సమస్యలపై చర్చలు జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్​ చేశాయి.

  • మీ సీక్రెట్ ఏంటో చెప్పాలి

'అఖండ' ప్రీ రిలీజ్ ఈవెంట్​కు హాజరైన ప్రముఖ దర్శకుడు రాజమౌళి.. ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారు. బాలయ్య 'ఆటం బాంబ్' అని, దానిని ఎలా ఉపయోగించాలని బోయపాటికి తెలిసినంతగా వేరేవరికి తెలియదని అన్నారు. అలానే బాలయ్య ఎనర్జీ సీక్రెట్​ ఏంటో ఆయనే తమకు చెప్పాలని కోరారు.

  • ఇక వారి స్థానాలు కష్టమే!

టీమ్ఇండియా టెస్టు త్రయం విరాట్ కోహ్లీ(Virat Kohli Test Strike Rate), ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే స్ట్రైక్ రేట్ మ్యాచ్​మ్యాచ్​కూ పడిపోతూ వస్తోంది. న్యూజిలాండ్​తో జరుగుతున్న తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్​ల్లోనూ విఫలమైన రహానే(35, 4), పుజారా(26,22) పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

14:08 November 28

టాప్​న్యూస్ @ 2PM

  • తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం

సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రారంభమైంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెరాస ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు.

  • స్వలింగ సంపర్కుల పార్టీ.. 44మంది అరెస్టు

Police Raids on Homosexuals Party: హైదరాబాద్​ కూకట్​పల్లి వివేక్​నగర్​లో ఓ ఇంటిపై పోలీసులు దాడిచేశారు. పార్టీ చేసుకుంటున్న 44 మంది స్వలింగ సంపర్కులను అరెస్ట్​ చేశారు. స్థానికుల ఫిర్యాదుతో దాడులు చేసి.. మద్యం, హుక్కా సేవించి నృత్యాలు చేస్తుండగా అరెస్ట్​ చేశారు. వారాంతాల్లో యువకులు పార్టీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిర్వాహకులు ఇమ్రాన్, దయాల్‌పై కేసు నమోదు చేశారు.

  • పెగసస్, నిరుద్యోగంపై చర్చకు విపక్షాల డిమాండ్​

All Party Meeting Today: సోమవారం(నవంబరు 29) పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసింది కేంద్రం. పెగసన్, ధరల పెరుగుదల, నిరుద్యోగం.. తదితర సమస్యలపై చర్చలు జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్​ చేశాయి.

  • పుజారా, రహానే టెస్టు స్థానాలు ఇక గాల్లో దీపమే!

టీమ్ఇండియా టెస్టు త్రయం విరాట్ కోహ్లీ(Virat Kohli Test Strike Rate), ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే స్ట్రైక్ రేట్ మ్యాచ్​మ్యాచ్​కూ పడిపోతూ వస్తోంది. న్యూజిలాండ్​తో జరుగుతున్న తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్​ల్లోనూ విఫలమైన రహానే(35, 4), పుజారా(26,22) పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇప్పటికైనా మేలుకోకపోతే వీరి టెస్టు స్థానాలు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీరి స్ట్రైక్ రేట్ ఎలా ఉందో చూద్దాం.

  • 'రాధేశ్యామ్' రెండో పాట అప్డేట్

'రాధేశ్యామ్' కొత్త అప్డేట్ రిలీజైంది. రెండో గీతానికి సంబంధించిన టీజర్​ను సోమవారం(నవంబరు 29) విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

13:23 November 28

టాప్​న్యూస్ @ 1PM

  • రేపు మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం

Telangana Cabinet Meeting: ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎస్​ సోమేశ్​కుమార్​కు సీఎం ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటల సాగుపై కేబినెట్‌లో కీలక చర్చ జరగనుంది. కరోనా పరిస్థితులు సహా ఇతర అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది.

  • 'దేశంలోనే అసమర్థ సీఎం కేసీఆర్‌'

రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే ఈటల రాజేందర్(mla etela rajender) అన్నారు. ధాన్యం పేరుతో సీఎం కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం పర్యటనకు వెళ్తున్న ఈటలకు భాజపా శ్రేణులు ఘనస్వాగతం పలికారు.

  • 'ప్రజా సేవే లక్ష్యం'

దేశ ప్రజలకు ప్రధాన సేవకుడిగా ఉండడమే తన కర్తవ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం తీసుకువచ్చిన వివిధ పథకాలతో ప్రజల జీవితాలు మారాయని చెప్పారు. ఈ మేరకు 'మన్​ కీ బాత్'(Pm modi mann ki baat) కార్యక్రమంలో మాట్లాడారు.

  • 'భరత్​ గురించి ద్రవిడ్ అప్పుడే చెప్పాడు'

IND vs NZ Test 2021: న్యూజిలాండ్​తో జరుగుతున్న తొలి టెస్టులో సాహా స్థానంలో కీపింగ్​కు వచ్చిన కేఎస్ భరత్ ఆకట్టుకున్నాడు. వికెట్ల వెనుక సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఇతడు మూడు వికెట్లు తీయడంలో పాలుపంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​లో ఇతడి ప్రదర్శనపై స్పందించిన మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్.. ద్రవిడ్​ అతడిపై పెట్టుకున్న నమ్మకాన్ని భరత్ నిలబెట్టుకున్నాడని తెలిపాడు.

  • 'అఖండ' మాస్ జాతర

''అఖండ' మాస్ జాతర' పేరుతో కొత్త ట్రైలర్​ను ప్రేక్షకులకు అందించారు. ఇందులో బాలయ్య మార్క్​ డైలాగ్​లతో పాటు యాక్షన్ సీన్స్​ను కూడా చూపించారు.

11:48 November 28

టాప్​న్యూస్ @ 12PM

  • ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్​ సమీక్ష

ధాన్యం కొనుగోళ్లపై ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. కేంద్ర ఆహార, పౌరసరఫరాలు, వ్యవసాయశాఖ మంత్రులతో చర్చల సారాంశాన్ని సీఎంకు నిరంజన్​రెడ్డి వివరించారు.

  • ఒమిక్రాన్ నియంత్రణపై మంత్రి హరీశ్ సమీక్ష

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నియంత్రణపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో వైద్యాధికారులతో సమావేశమయ్యారు. అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. కొత్త వేరియంట్ ఉన్న దేశాల నుంచి రాకపోకల కట్టడిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

  • గుండెపోటుతో రోగి, వైద్యుడు మృతి

గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన రోగికి చికిత్స చేస్తున్న వైద్యుడుకి గుండెపోటు వచ్చింది. రోగి, వైద్యుడు ఇద్దరూ గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

  • చెన్నై తీర ప్రాంతాల్లో రెడ్అలర్ట్​

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తమిళనాడు(Tamil Nadu rains) ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వరద నీరు ఇళ్లల్లోకి ప్రవేశించడం వల్ల నిలువ నీడలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు అధికారులు. పలు కాలనీల్లో చేరుకున్న వరద నీటిని ఇంజన్లతో తోడుతున్నారు. మరోవైపు తీరప్రాంత జిల్లాలకు ప్రమాద హెచ్చరికలు(tamil nadu rains red alert) జారీ చేసింది ఐఎండీ.

  • మొయిన్ ఊచకోత

Abu Dhabi T10 League: అబుదాది టీ20 లీగ్​లో అత్యంత వేగంగా అర్ధశతకం చేసిన క్రికెటర్​గా రికార్డు సృష్టించాడు ఇంగ్లాండ్ బ్యాటర్ మొయిన్ అలీ. నార్తర్న్ వారియర్స్​కు ఆడుతున్న ఇతడు టీమ్ అబుదాబితో జరిగిన మ్యాచ్​లో ఈ ఘనత సాధించాడు.

10:58 November 28

టాప్​న్యూస్ @ 11AM

  • సెప్టిక్‌ ట్యాంక్ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీలు మృతి

హైదరాబాద్‌ సెప్టిక్‌ ట్యాంక్ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీలు మృతి చెందారు. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు దిగి ఊపిరాడక ఇద్దరు కూలీలు మరణించారు. కొండాపూర్‌ గౌతమి ఎన్‌క్లేవ్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది.

  • ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్​ పిల్లర్​​​.. ఎక్కడంటే?

world's tallest pier bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను పిల్లర్లతో మణిపుర్​లో నిర్మిస్తోంది భారతీయ రైల్వే. 141 మీటర్ల ఎత్తున్న పిల్లర్​ నిర్మించటం ద్వారా రికార్డ్​ సృష్టించనుంది. 2023, డిసెంబర్​ నాటికి నిర్మాణం పూర్తవుతుందని అధికారులు తెలిపారు.

  • చారిత్రక కట్టడాలపై ఏఎస్‌ఐ సర్వే.

Historic monuments in Telangana : కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలపై దృష్టి సారించారు. ఏఎస్‌ఐ పరిధిలోకి వీలైనన్ని కట్టడాలను తీసుకువచ్చేందుకు సర్వే చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తాజాగా మరో 30 కట్టడాల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

  • ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు ఇలా

బంగారం (Gold Price today), వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • బాలయ్య స్టెప్పులు అదుర్స్

'అఖండ' నుంచి 'జై బాలయ్య' అంటూ సాగే వీడియో సాంగ్​ను రిలీజ్ చేశారు. అభిమానుల్ని అలరిస్తున్న ఈ గీతం.. ఈ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది

09:50 November 28

టాప్​న్యూస్ @ 10 AM

  • 543 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు

భారత్​లో కొత్తగా 8,774 కొవిడ్​ కేసులు (covid cases in India) నమోదయ్యాయి. వైరస్​ ధాటికి మరో 621 మంది మరణించారు. ఒక్కరోజే 9,481వేల మందికిపైగా కరోనా నుంచి కోలుకున్నారు.

  • మూడో ముప్పు.. చేయొద్దు తప్పు

Corona Third Wave Telangana : కరోనా మహమ్మారి మొదటి, రెండు దశల్లో భాగ్యనగరాన్ని అతలాకుతలం చేసింది. తాజాగా దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇదే సమయంలో నగరంలోని లక్షలాది మంది రెండో డోసు టీకా విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కొంతమంది మొదటి డోసు వేసుకోవడానికి కూడా ముందుకు రావడం లేదు. ఆశా సిబ్బంది ఇళ్లకు వస్తున్నా కూడా.... 'అబ్బే.. మాకు వ్యాక్సిన్‌ అవసరం లేదు' అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మూడో దశలో కరోనా విజృంభిస్తే లక్షలాది మంది తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన నెలకొంది.

  • అంత్యక్రియలకు వెళ్తుండగా ప్రమాదం​- 17 మంది మృతి

అంత్యక్రియల కోసం మృతదేహాన్ని తరలిస్తున్న వ్యాన్​- ఓ ట్రక్కు ఢీకొన్న ఘటనలో 17 మంది మృతిచెందారు. బంగాల్​లోని ఫుల్బరీ హైవేలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • వానాకాలం పంటకూ తంటాలు

ఉప్పుడు బియ్యంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రభావం.. యాసంగితో పాటు, వానాకాలంపైనా (Paddy Procurement in telangana) పడింది. ఫలితంగా రైతులు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. మిల్లర్లూ తీసుకోడానికి నిరాకరిస్తుండడంతో పండిన ధాన్యాన్ని ఎక్కడ దాచాలో తెలియక రైతులు తిప్పలు పడుతున్నారు.

  • ఎన్టీఆర్ 'బిర్యానీ'.. రామ్​చరణ్ 'ఫొటోగ్రఫీ'

ఎప్పుడూ షూటింగ్​లతో తీరిక లేకుండా గడిపే పలువురు సెలబ్రిటీలు ఖాళీ సమయాల్లో పలు ఆసక్తికర పనులు చేస్తారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్​ బిర్యానీ చేస్తే, రామ్​చరణ్ ఫొటోగ్రఫీలో తన మెళకువలను బయటకు తీస్తున్నారు.

08:49 November 28

టాప్​న్యూస్ @ 9AM

  • అల్లరి చేస్తున్నాడని కొడుకుపై తండ్రి దాష్టీకం

Father Brutally Beats Son Hyderabad : మద్యం మత్తులో ఎనిమిదేళ్ల కుమారిడిపై ఓ తండ్రి కర్కశంగా వ్యవహరించాడు. అల్లరి చేస్తున్నాడని .. కర్రతో ఇష్టారీతిన చితకబాదాడు. కొడుకును కొడుతూ కుమార్తె చేత వీడియో తీయించి పైశాచిక ఆనందం పొందాడు. ఈ అమానవీయ ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

  • ట్యాంక్​బండ్​లోకి దూసుకెళ్లిన కారు

రాష్ట్రంలో ఇవాళ వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు(Road accident report) జరిగాయి. వివిధ జిల్లాల్లో చోటు చేసుకున్న ఈ ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారు. హైదరాబాద్​లో అతివేగంగా వెళ్తున్న ఓ కారు హుస్సేన్​సాగర్​లోకి దూసుకెళ్లింది.

  • తెల్లవాళ్లు కాళ్లావేళ్లా పడ్డ వేళ

Azadi Ka Amrit Mahotsav: ఆంగ్లేయులు భారత్‌లో 200 ఏళ్ల పాటు ఆధిపత్యం చెలాయించటమేగాదు.. తప్పైపోయిందని.. కాళ్లు పట్టుకొని ప్రాధేయపడ్డ సందర్భాలూ ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది... తొలినాళ్లలో జరిగిన చైల్డ్స్‌ వార్‌! తమకు మాయని మచ్చగా నిలిచిన ఈ తొలి ఆంగ్లో-ఇండియన్‌ యుద్ధాన్ని తెల్లవారు తెలివిగా చరిత్ర పుటల్లో మరుగున పడేలా చేశారు.

  • జల్‌జీవన్‌ మిషన్‌ అసలు లక్ష్యం అదే

2024 నాటికి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందించేందుకు ప్రారంభించిన జల్‌ జీవన్‌ మిషన్‌ అసలు ఉద్దేశం సాకారం అవుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మిషన్‌ అసలు లక్ష్యం ఇదే అని ప్రధాని ట్విట్టర్​ వేదికగా వివరించారు.

  • డైరెక్టర్ శ్రీనువైట్ల ఇంట్లో విషాదం

తెలుగు దర్శకుడు శ్రీనువైట్ల ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి వైట్ల కృష్ణారావు(83) ఆదివారం ఉదయం కన్నుమూశారు.స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లాలోని కందులపాలెంలో అనారోగ్యంతో కృష్ణారావు తుదిశ్వాస విడిచారు. కృష్ణారావు మృతితో శ్రీనువైట్ల కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు శ్రీనువైట్లకు ఫోన్‌ చేసి సంతాపం తెలిపారు

07:54 November 28

టాప్​న్యూస్ @ 8AM

  • గ్యాస్ బండ పేలితే బీమా అండ

Gas cylinder insurance price: ఇటీవల తరచుగా గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటివల్ల భారీ ధన, ప్రాణ నష్టం వాటిల్లుతోంది. అయితే ఈ ప్రమాదాలు జరిగినపుడు బాధితులను ఆదుకోవడం కోసం బీమా సదుపాయం ఉంటుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. గ్యాస్ ప్రమాదాల్లో ఎంతవరకు బీమా పొందొచ్చో తెలుసా...?

  • 20 ఏళ్లుగా తల్లడిల్లుతున్న మన ‘సిన్నతల్లి’

lakshmi narsavva fighting: ఇటీవల విడుదలైన ‘జైభీమ్‌’ సినిమాలాంటి ఘటనే సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగింది. సినిమాలో భర్త కోసం సిన్నతల్లి పోరాడితే ఇక్కడ తన తమ్ముడి లాకప్‌డెత్‌కు కారకులైన పోలీసులకు తగిన శిక్ష పడాలని పోరాడుతోంది అతడి సోదరి. దాదాపు 20 ఏళ్లు అవుతున్నా ఆమెకు మాత్రం ఇంకా న్యాయం దక్కలేదు. మరో పదేళ్లయినా పోరాడతానని చెబుతోంది ఆ మహిళ.

  • దేశ విభజనకు ముఖ్య కారణం అదే

mohan bhagwat news: హిందువులు లేకుండా భారతదేశం లేదన్నారు ఆర్​ఎస్​ఎస్ అధిపతి మోహన్ భాగవత్. భిన్నత్వంలో ఏకత్వం మన సంస్కృతి అని.. అందరూ క్రమశిక్షణతో నివసించి దీన్ని ఆచరించాలని పిలుపునిచ్చారు.

  • 'ఒమిక్రాన్‌' నియంత్రణకు అప్రమత్తం

కరోనా కొత్త వేరియంట్​ ప్రపంచ దేశాల్లో (Omicron Variant) కలకలం సృష్టిస్తోంది. దక్షిణాఫ్రికా సహా పలు ఆఫ్రికా దేశాల నుంచి విదేశీయులు రావొద్దని బ్రిటన్‌తో పాటు, అమెరికా, రష్యా, జపాన్‌, ఆస్ట్రేలియాలు కూడా ప్రకటించాయి. మరోవైపు ప్రపంచ దేశాలు వరుసపెట్టి తమపై ప్రయాణ ఆంక్షలు విధించడాన్ని దక్షిణాఫ్రికా తీవ్రంగా పరిగణిస్తోంది.

  • ఆ నిర్ణయం సమంజసం కాదు

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం.. సినిమా టికెట్​ ధరలపై తీసుకున్న నిర్ణయం సమంజసం కాదని నిర్మాత సురేశ్​బాబు అభిప్రాయపడ్డారు. అలానే గత 15 నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇండస్ట్రీకి చేసిందేమీ లేదని అన్నారు.

06:29 November 28

టాప్​న్యూస్ @ 7AM

  • ఆ శాఖ భూముల్లో మొక్కల పెంపకం

సాగునీటిశాఖ కింద ఉన్న భూముల్లో భారీ ఎత్తున మొక్కలు (Irrigation Plantation) నాటేలా ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేస్తోంది. ఇందుకు అనుగూణంగా 12 లక్షల ఎకరాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని భావిస్తోంది.

  • చనిపోయాడు కానీ.. ​ పంచాయత్​ పోల్​లో గెలిచాడు!

చనిపోయిన వ్యక్తి అనుకోకుండా పంచాయతీ ఎన్నికల్లో విజయం(bihar panchayat election 2021 result) సాధించాడు. ఈ ఘటన బిహార్‌లో వెలుగుచూసింది. ఇది ఎలా జరిగిందని ఆలోచిస్తున్నారా?.. అయితే ఈ స్టోరీ చదివేయాల్సిందే..

  • పోలీసుల అదుపులో ఐఎస్​ఐ ఏజెంట్

పాకిస్థాన్​కు చెందిన ఓ గుఢాచారి భారత్​లోని అరెస్టయ్యాడు. అతడిని పాక్​కు చెందిన 'ఐఎస్ఐ ఏజెంట్‌'గా పోలీసులు తెలిపారు. ఆ దేశాని​కి ఇన్ఫార్మర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అతనితో పాటు మరో వ్యక్తినీ అదుపులోకి తీసుకున్నారు.

  • వీకెండ్​లో కాల్పుల మోత.. ముగ్గురు మృతి

అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లిపోయింది. ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఈ కాల్పుల్లో ఘటనా స్థలంలోనే ముగ్గురు యువకులు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

  • 'అఖండ' వేరే స్థాయిలో ఉంటుంది

Akhanda pre release event: 'అఖండ' సినిమా అద్భుతంగా ఉంటుందని అన్నారు హీరో బాలకృష్ణ. తెలుగు ప్రేక్షకులు సినిమాను ప్రేమించినంతగా ఇంకెవరూ ఆదరించలేరని అన్నారు. అలాగే తాజాగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​లో పలు విషయాలు అభిమానులతో పంచుకున్నారు.

05:24 November 28

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

  • నేడు తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం

నేడు తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. రేపటి నుంచి జరిగే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

  • ఆఖరి గింజ కొనే దాకా కొట్లాడుతాం

వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలడుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy Comments) ఆరోపించారు. రైతులపై కక్ష సాధింపు చర్యలు ఆపాలన్నారు.

  • నకిలీ పత్రాలతో సరికొత్త మోసం

కొత్త పట్టాదార్ పాస్ పుస్తకం (Fake Passbook) కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా రాలేదు. మరోసారి ప్రయత్నించాలన్న అధికారుల సూచన మేరకు మీసేవా కేంద్రానికి వెళ్లిన ఆ భూయజమాని ఖంగుతిన్నాడు.

  • టాటా భారీ సెమీ కండక్టర్ల పరిశ్రమ

టాటా గ్రూపు దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేయనున్న భారీ సెమీకండక్టర్ల (చిప్‌ల) పరిశ్రమపై తెలంగాణ ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. రూ. 2,200 కోట్ల పెట్టుబడితో నాలుగువేల మంది ఉపాధి పొందే వీలున్న పరిశ్రమ కావడంతో ఇది రాష్ట్రానికి ఎంతో ఉపయుక్తమవుతుందని భావిస్తోంది.

ఐటీ కంపెనీలు ఒక్కసారిగా పంథా మార్చాయి. క్యాంపస్ ప్లేస్​మెంట్స్​లో కొలువులకు ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్న్‌షిప్‌(అంతర్గత శిక్షణ)ను తప్పనిసరి చేస్తున్నాయి.

  • డ్రగ్స్ దందా గుట్టు రట్టు

మాత్రల రూపంలో ఉన్న డ్రగ్స్​ను అసోం పోలీసులు సీజ్(drugs seized) చేశారు. ఘటనలో అరెస్టైన వ్యక్తి వద్ద నుంచి సుమారు 2.5లక్షల డ్రగ్స్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్​లో దాదాపు రూ.13కోట్లు ఉంటుందని తెలిపారు. మరో ఘటనలో ఉప్పు బస్తాల వెనుక ఉంచి గంజాయిని తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

  • చిత్రహింసలు పెట్టిన పోలీసులు

Torture In Police Custody: తనపై దొంగ కేసులు పెట్టి... వాటిని ఒప్పుకోవాలని కస్టడీలో చిత్రహింసలకు గురి చేసినట్లు ఓ గిరిజన యువకుడు ఆరోపించాడు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. కానీ ఆ వ్యక్తి చేసిన ఆరోపణలను అధికారులు కొట్టిపారేస్తున్నారు.

  • ఒమిక్రాన్​ కలకలం

దక్షిణాఫ్రికాలో బయటపడిన కరోనా కొత్త వేరియంట్‌.. ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే బోట్స్‌వాన, బెల్జియం, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌ దేశాల్లో కేసులు బయటపడగా.. తాజాగా రెండు ఒమిక్రాన్‌ కేసులు యూకేలో కూడా వెలుగు చూశాయి.

  • వీధుల్లో నటుడు షికార్లు

చెన్నైలో భారీ వర్షాలకు రోడ్లు చిన్నపాటి నదులుగా మారాయి. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన ఓ పని అభిమానులు, నెటిజన్లను తెగ నవ్విస్తోంది. బాత్​ టబ్​ను బోట్​గా మార్చి వీధుల్లో పాటలు పాడుకుంటూ షికార్లు చేశారాయన.

  • అది గుట్కా కాదు

Kanpur Test Gutka Man: భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు జరుగుతున్న సమయంలో ఓ అభిమాని నెట్టింట తెగ వైరల్​గా మారాడు. నోట్లో ఏదో నములుతూ స్టైల్‌గా ఫోన్లో మాట్లాడటం టీవీ స్క్రీన్ల మీద చూసిన నెటిజన్లు అతడిని ఓ ఆటాడేసుకున్నారు. తాజాగా ఈ విషయంపై స్పందించాడు ఆ యువకుడు.

Last Updated : Nov 28, 2021, 10:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.