ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు - ఈటీవీ భారత్​ వార్తలు

top news
top news
author img

By

Published : Nov 14, 2021, 6:00 AM IST

Updated : Nov 14, 2021, 9:54 PM IST

21:43 November 14

టాప్​న్యూస్​@ 10PM

  • ఇలాంటి సమావేశాలతో రాష్ట్రాల సమస్యలకు పరిష్కారం

ఏపీలో తిరుపతి వేదికగా నిర్వహించిన దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన సదస్సు.. రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. జోనల్‌ మండలి భేటీలతో రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం అవుతాయని హోంమంత్రి అమిత్‌ షా అన్నారు.

  • టీఎస్​ఆర్టీసీకి అవసరమా..? 

పుట్టెడు నష్టాల్లో(tsrtc crisis) ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు ఓవైపు అధికారులు, కార్మికులు పడరానిపాట్లు పడుతున్నారు. మరోవైపేమో.. ఉన్నతాధికారులు అనవసర ఆడంబరాలకు పోయి దుబారా ఖర్చులు(telangana rtc expenditure) చేస్తున్నారు.

  • ఆ రోజు అసలేం జరిగింది?

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఎదురుకాల్పులను మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్‌ వాల్సే, గడ్చిరోలి ఎస్పీ అంకిత్‌ గోయల్‌ ధ్రువీకరించారు

  • 'అఖండ'లో  బాలయ్య గర్జన

అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన 'అఖండ' ట్రైలర్(akhanda trailer)​ రిలీజైంది. ఆద్యంతం యాక్షన్​తో సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. డిసెంబరు 2న థియేటర్లలోకి సినిమాను తీసుకురానున్నట్లు ప్రకటించారు.

  • ఆసీస్ లక్ష్యం 173

టీ20 ప్రపంచకప్​ (T20 World Cup) టైటిల్​ పోరులో ఆస్ట్రేలియాకు 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది న్యూజిలాండ్ (Australia vs New Zealand). కేన్ విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 85 పరుగులు చేశాడు.

20:50 November 14

టాప్​న్యూస్​@ 9PM

  • తిరుపతిలో దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం తిరుపతిలో ప్రారంభమైంది(Southern Zonal Council Meeting news). రాత్రి 7 గంటల వరకు భేటీ కొనసాగనుంది. ఈ సమావేశానికి సంబంధించి అజెండాలో ప్రవేశపెట్టిన 26 అంశాలపై చర్చించనున్నారు.

  • ఇక కేంద్ర మంత్రుల బాధ్యతే!

వివిధ పథకాల అమలులో అవలంబించాల్సిన మెరుగైన విధానాల రూపకల్పన బాధ్యతను కేంద్రమంత్రి మండలికి (Council Of Ministers India) అప్పగించారు ప్రధాని నరేంద్ర మోదీ. మొత్తం 77 మంది ఉండగా వీరిని 8 గ్రూపులగా విభజించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో నైపుణ్యం కలిగిన యువతతో పాటు రిటైర్డ్​ అధికారులకు ప్రాధాన్యం కల్పిస్తారని పేర్కొన్నాయి.

  • కేంద్ర మంత్రికి కేటీఆర్​ లేఖ..

చేనేత రంగంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి మద్దతు లేదని మంత్రి కేటీఆర్(minister ktr)​ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ ఎలాంటి వనరులు లేని రాష్ట్రాలకు అమలవుతున్నాయని విమర్శించారు. సిరిసిల్లకు మెగా పవర్​ లూమ్​ క్లస్టర్​(mega power loom cluster)ను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ.. కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​(union minister piyush goyal)కు కేటీఆర్​కు లేఖ రాశారు.

  • 'అది మా ఉద్దేశం కాదు'

'జై భీమ్' చిత్రంపై వస్తున్న విమర్శలపై సూర్య స్పందించారు. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని అన్నారు.

19:46 November 14

టాప్​న్యూస్​@ 8PM

  • 'ఆయన మరణం గట్టి ఎదురుదెబ్బ'

గడ్చిరోలి ఎన్​కౌంటర్​లో నక్సల్స్​ కీలక నేత మిలింద్​ తేల్​తుంబ్డే(gadchiroli naxal encounter news) మరణించాడు. ఆయన మరణం మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ అని గడ్చిరోలి డీఐజీ సందీప్​ పాటిల్​ అభిప్రాయపడ్డారు(milind teltumbde news ).

  •  గల్ఫ్​కు పంపిస్తానంటే దేహశుద్ధి చేసి మరీ.!

ఉద్యోగాలు, తక్కువ ధరకే బంగారం, కానుకల పేరిట నిరుద్యోగులు, అమాయకులకు ఎరవేసి అందినకాడికి దోచుకుంటారు కొందరు మోసగాళ్లు(crime). వీళ్ల ఉచ్చులో పడి కొందరు నిండా మునిగితే.. మరికొందరు అప్రమత్తమై వారి చెర నుంచి తప్పించుకుంటున్నారు

  • వారం రోజులు అంతరాయం..!

కరోనాకు ముందున్న సేవలను పునరుద్ధరించే ప్రణాళికల్లో భాగంగా రిజర్వేషన్​లను తాత్కాలికంగా నిలిపేయనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. వచ్చేవారం రోజులపాటు.. రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్​ఎస్) రాత్రి సమయాల్లో ఆరు గంటలు పనిచేయదని ఒక ప్రకటనలో తెలిపింది.

  •  కివీస్ ఫస్ట్ బ్యాటింగ్

టీ20 ప్రపంచకప్​ (T20 World Cup 2021) ఫైనల్లో టాస్​ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కివీస్ బ్యాటింగ్​కు దిగనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్​ (NZ vs Aus Final) జరుగుతుంది

18:42 November 14

టాప్​న్యూస్​@ 7PM

  • కోటి రూపాయల ఎద్దును చూశారా..?

ప్రణాళిక, వ్యాపార మెలకువలు పాటిస్తే వ్యవసాయంలో రూ.కోట్లు కళ్ల చూడొచ్చని కర్ణాటక రైతులు నిరూపిస్తున్నారు(karnataka farmers). అధునిక వ్యవసాయంవైపు దృష్టిసారించిన అన్నదాతలు దేశవాళీ పశువులను మార్కెట్‌ రారాజులుగా మారుస్తున్నారు. తాము అనుసరిస్తున్న వినూత్న విధానాలను ప్రజలకు వివరిస్తున్నారు. తమ ఆవిష్కరణలతో రైతులను స్వావలంబన దిశగా అడుగులు వేయిస్తున్నారు(karnataka farmers news).

  • భారత్​ అమ్ములపొదిలో క్షిపణులు

భారత అమ్ముల పొదిలోకి త్వరలోనే అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ఎస్​-400 (s400 India) చేరనుంది. ఒప్పందం మేరకు భారత్​కు ఎస్​-400 క్షిపణుల అందజేత ప్రక్రియ ప్రారంభమైనట్లు రష్యా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఐదు క్షిపణులు కొనుగోలు చేసేందుకు భారత్​ 500 కోట్ల​ డాలర్లు ఖర్చు చేస్తోంది.

  • 'సింగం 3' అప్పుడే..! 

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో గని, సింగం 3, రాక్షస కావ్యం, చిత్తం మహారాణి, మరక్కర్ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

  • గత జగజ్జేతలు  వీళ్లే..!

రికెట్ అభిమానులకు టీ20 ప్రపంచకప్​ పంచే వినోదం మరో స్థాయిలో ఉంటుంది. ధోనీసేన.. తొలి టీ20 ప్రపంచకప్ గెలుపును ఫ్యాన్స్​ ఇప్పటికీ మరచిపోలేరు. ప్రస్తుత ప్రపంచకప్​లో గ్రూప్​ దశలోనే టీమ్​ఇండియా నిష్క్రమించినా.. అద్భుత ఆటతీరుతో ఫైనల్ చేరుకున్నాయి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​ (Australia vs New Zealand). ఆదివారం అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు పొట్టి ప్రపంచకప్​ను అందుకున్నది ఎవరెవరో చూసేయండి.

17:51 November 14

టాప్​న్యూస్​@ 6PM

  • భారత్​కు త్వరలోనే క్షిపణులు

  • మహిళపై శునకాల దాడి

ఓ మహిళపై పెంపుడు శునకాలు దాడి (Dog attack Kozhikode) చేశాయి. మహిళను కిందపడేసి కరిచాయి. కుక్కల యజమాని కావాలనే వాటిని వదిలినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

  • 'యూపీలో  కాంగ్రెస్ ఒంటరి పోరాటం'

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో(UP polls 2022) ఒంటరిగా పోటీచేయనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. కార్యకర్తల అభీష్టం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(UP election priyanka gandhi) తెలిపారు.

  •  ప్రాణం మీదికొచ్చినా లెక్కచేయలేదు..!

తమ ప్రాణాలు పోతున్నా.. ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించే జవాన్ల కథలు ఎన్నో వింటుంటాం.. చూస్తుంటాం. ఇక్కడ కూడా ఓ బస్సు డ్రైవర్​(tsrtc bus driver).. జవానులా తన బస్సులోని ప్రయాణికులను కాపాడాడు(bus driver saves passengers). ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించి కాదు.. ఓర్చుకోలేనంతగా వచ్చిన నొప్పిని సైతం భరించి..! అసలు ఏం జరిగిందంటే..

16:42 November 14

టాప్​న్యూస్​@ 5PM

  • 'చట్టం మానవీయంగా పని చేయాలి'

న్యాయవ్యవస్థ అనేది బాధితునికి ఆఖరి ఆశాకిరణంగా కనిపిస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ (Cji Ramana News) అన్నారు. అందువల్ల న్యాయమూర్తులు చిత్తశుద్ధితో వ్యవహారించాలని కోరారు. చట్టం మానవీయంగా పని చేయాలని వ్యాఖ్యానించారు.

  • ఆమెకు మళ్లీ అనారోగ్యం

బ్రిటన్ మహారాణి ఎలిజబెత్​-2.. కీలక సంస్మరణ కార్యక్రమానికి హాజరుకావడం లేదు. కొద్ది కాలంగా సమావేశాలకు దూరంగా ఉంటున్న ఆమె.. మరోసారి అనారోగ్యం బారినపడినందు వల్లే రెండో ప్రపంచ యుద్ధ సంస్మరణ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నట్లు బకింగ్​హామ్ ప్యాలెస్ ప్రకటనలో తెలిపింది. అయితే రాజకుటుంబంలోని మిగతా సభ్యులు మాత్రం కార్యక్రమానికి హాజరవుతున్నారు.

  • ఎలాంటి అంచనాల్లేకుండా అద్భుతం..!

టీ20 ప్రపంచకప్ ఫైనల్​లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి ఆస్ట్రేలియా-న్యూజిలాండ్. ఎంతో ఒత్తిడి తట్టుకుని, ప్రత్యర్థి జట్లపై పైచేయి సాధించి తుదిపోరు వరకూ వచ్చాయి ఈ రెండు జట్లు. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో కివీస్ ప్రయాణం ఎలా సాగిందో గుర్తుచేసుకుందాం.

15:44 November 14

టాప్​న్యూస్​@ 4PM

  • తిరుపతి సమావేశానికి హోంమంత్రి

  • అది బూటకపు ఎన్​కౌంటర్..!

గడ్చిరోలిలో జరిగిన భీకర ఎన్​కౌంటర్​​(Gadchiroli Encounter)పై మావోయిస్టులు స్పందించారు. ఈ ఏడాది చేపట్టిన వాటిలో అతిపెద్ద ఆపరేషన్‌ ఇదేనని భావిస్తున్న ఈ ఎన్​కౌంటర్​(maoist encounter)పై మవోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లేఖ(Maoist letter latest news) విడుదల చేశారు. లేఖలో మావోయిస్టులు ఏం ప్రస్తావించారంటే..?

  •  సెంచరీ కొట్టిన బైక్‌.. ఎలాగంటే..! 

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల వాహనాల తనిఖీల్లో 107 చలాన్లు పెండింగ్ ఉన్న వాహనం(107 challans pending vehicle seized) పట్టుబడింది. వాహనంపై చలాన్ల మొత్తం రూ.35,835 ఉండటంతో పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే హోండా యాక్టివాను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

  • ఆలయంలో వైరైటీ దొంగ​

ఆలయంలోకి ప్రవేశించిన ఓ దొంగ.. కాసేపు దేవుని విగ్రహం ముందు ప్రార్థన చేసి, తర్వాత తన పనితనం ప్రదర్శించాడు. ఆలయంలో ఉన్న హుండీని ఎత్తుకుని పరారయ్యాడు. 

  • బన్నీతో ముద్దుగుమ్మ.. 'పుష్ప'లో స్పెషల్ సాంగ్!

ముద్దుగుమ్మ సమంత(samantha movies) క్రేజీ నిర్ణయం తీసుకుందట. 'పుష్ప'(pushpa release date) స్పెషల్ సాంగ్​లో నర్తించేందుకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చిందని సమాచారం. త్వరలో ఈ విషయమై క్లారిటీ రానుంది.

14:34 November 14

టాప్​న్యూస్​@ 3PM

  • ' అక్కడికి వెళ్తే అంతే పుణ్యం'

నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్టు(Swarnabharat Trust) 20వ వార్షికోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Vice President Venkaiah Naidu) పాల్గొన్నారు. స్వర్ణభారత్ ట్రస్టు ఇంతింతై... వటుడింతై.. అన్నట్లుగా ఎదిగిందన్నారు. ఏ పదవిలో ఉన్నా స్వర్ణభారత్‌ కార్యక్రమాల్లో పాల్గొంటానని ఉపరాష్ట్రపతి చెప్పారు.

  • ఆ వార్తలన్నీ అబద్ధం..!

హుజూరాబాద్​ ఫలితంపై నిన్న దిల్లీలో జరిగిన ఏఐసీసీ సమీక్ష(AICC review on huzurabad defeat) అర్థవంతంగా సాగిందని సీఎల్పీ నేత(CLP leader Bhatti Vikramarka) భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 

  •  జ్యూసర్ కడ్డీల్లో అమర్చి..!

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టుబడింది(gold smuggling in hyderabad airport). రూ.34 లక్షలు విలువచేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం(gold seized in shamshabad airport) చేసుకున్నారు. ఎయిర్‌పోర్టులో నిర్వహించిన తనిఖీల్లో... బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

  •  'దృశ్యం 2' అప్డేట్

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి(cinema updates). ఇందులో '18 పేజీస్'​, 'దృశ్యం 2', 'గని', 'ఛలో ప్రేమిద్దాం' చిత్రాల సంగతులు ఉన్నాయి.

  • ఎన్​సీఏ డైరెక్టర్​గా వీవీఎస్​ లక్ష్మణ్

జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్​సీఏ) డైరెక్టర్​గా వీవీఎస్ లక్ష్మణ్​ నియామకం ఖరారైంది. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఈ విషయంపై స్పష్టతనిచ్చారు.

13:45 November 14

టాప్​న్యూస్​@ 2 PM

  • రైతులపై ఎందుకింత నిర్లక్ష్యం

రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి(Revanth Reddy on KCR) హెచ్చరించారు. గతంలో కేసీఆర్​ ఇచ్చిన హామీ మేరకు.. ప్రతి గింజా(Paddy procurement issue in telangana) రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని(Revanth Reddy on KCR) డిమాండ్​ చేశారు. ఈ మేరకు గాంధీ భవన్​లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

  • ఆర్కే జ్ఞాపకాలతో పుస్తకం!

ఆర్కే సంస్మరణసభ నిర్వహించాలనుకుంటే పోలీసులు అడ్డుకున్నారని ఆయన భార్య శిరీష (Maoist RK wife Shirisha) ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్కే జ్ఞాపకాలతో పుస్తకం (Maoist RK Book) రాయాలని భావిస్తే... పుస్తక ముద్రణను అడ్డుకున్నారని అన్నారు. ప్రింటింగ్ ప్రెస్‌పై దాడి చేసి... పుస్తకాలను ఎత్తుకెళ్లారని తెలిపారు. పుస్తకాలను తిరిగివ్వాలని డిమాండ్ చేశారు.

  • ఒకే కుటుంబంలో నలుగురిని ఉరి తీసిన నక్సలైట్లు

బిహార్​ గయాలోని మౌన్​బార్ గ్రామంలో ఓకే కుటుంబానికి చెందిన నలుగురిని ఉరి తీశారు నక్సలైట్లు. వారి ఇంటిని బాంబుతో పేల్చారు. ఈ కుటుంబం ఇన్ఫార్మర్లుగా వ్యవరించినందు వల్ల గతంలో జరిగిన ఓ ఎన్​కౌంటర్​లో చాలా మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారని, అందుకు ప్రతీకారంగానే ఇప్పుడు ఈ చర్యకు పాల్పడినట్లు పోస్టర్​ అంటించారు.

  • రాజకీయాల్లోకి సోనూసూద్ సోదరి

తన సోదరి మాళవిక సూద్​ త్వరలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని బాలీవుడ్ నటుడు సోనూసూద్ తెలిపారు. అయితే.. ఏ పార్టీ తరఫున ఆమె పోటీ చేస్తారన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు.

  • పునీత్​ కళ్లతో మరో 10మందికి కంటిచూపు!

తాను మరణించినా నేత్రదానంతో నలుగురికి కంటిచూపునిచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపారు కన్నడ్ పవర్​ స్టార్​ పునీత్ రాజ్​కుమార్(puneet rajkumar news)​. అయితే ఆయన కళ్లతో ఇంకా చాలా మందికి చూపునివ్వొచ్చని నారాయణ నేత్రాలయ వైద్యులు వెల్లడించారు. పునీత్ కళ్ల స్టెమ్​ సెల్స్​తో 5 నుంచి 10 మందికి తిరిగి చూపు తీసుకురావచ్చన్నారు(puneeth rajkumar eyes).

13:00 November 14

టాప్​న్యూస్​@ 1 PM

  • వెంకయ్యనాయుడిపై షా ప్రశంసలు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎప్పుడూ రైతు సంక్షేమం గురించే ఆలోచిస్తారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రశంసించారు. రైతుల కోసం ఏదైనా చేయాలనేది వెంకయ్యనాయుడి తపనని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వెంకయ్య చాలా కృషిచేశారన్నారు. ఏపీలోని నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవంలో వెంకయ్యనాయుడుతో కలిసి అమిత్​షా పాల్గొన్నారు.

  • మద్యం దుకాణం​ తెరవటంపై మహిళల ఆగ్రహం

కర్ణాటక, చిక్కమంగళూరు జిల్లాలో మద్యం దుకాణాన్ని (liquor store vandalised) ధ్వంసం చేశారు మహిళలు. కడూర్ తాలూకా ముస్లాపుర్​ గ్రామంలో మద్యం దుకాణాన్ని​ ప్రారంభించాలని గతంలో నిర్ణయించగా.. దానిని స్థానిక మహిళలు వ్యతిరేకించారు. నిరసనలు సైతం చేశారు. అయినప్పటికీ రెండు రోజుల క్రితం బార్​ను ప్రారంభించారు. దానిని మూసివేయాల్సిందిగా 50 మంది మహిళలు అక్కడికి చేరుకుని ముందుగా అభ్యర్థించినా ఫలితం లేకపోయింది. దాంతో ఆగ్రహించిన మహిళలు బార్​లోకి ప్రవేశించి ఫర్నీచర్​ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బార్​ యజమానులు.

  • కరోనాతో మంచు చిరుతలు మృతి

అమెరికాలో కరోనాతో మూడు మంచు చిరుతలు (snow leopard corona) మృతి చెందాయి. ఈ మేరకు 'జూ' నిర్వాహకులు తమ అధికారిక ఫేస్​బుక్ పేజీలో తెలిపారు.

  • ప్రేయసితో స్టార్​ నటుడి నిశ్చితార్థం

బాలీవుడ్​ నటుడు రాజ్​కుమార్​ రావుకు తన ప్రేయసి, నటి పత్రలేఖతో నిశ్చితార్థం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్​ అవుతున్నాయి.

  • టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లేనా?

ప్రస్తుత టీ20 ప్రపంచకప్​(t20 world cup 2021)లో టాస్ కీలకపాత్ర పోషిస్తోంది. యూఏఈ పిచ్​ల్లో రాత్రి పూట మంచు ప్రభావమే అందుకు కారణం. అందుకే టాస్(t20 world cup 2021 toss results) గెలిస్తే బౌలింగ్ ఎంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు కెప్టెన్లు. నేడు (నవంబర్ 14) ఫైనల్(aus vs nz t20 final) పోరు నేపథ్యంలో ఈ టోర్నీలో టాస్ ప్రభావంపై ఓ లుక్కేద్దాం.

12:06 November 14

టాప్​న్యూస్​@ 12 PM

  • సింగూరు ప్రాజెక్టుకు జీఆర్​ఎంబీ ఛైర్మన్

రాష్ట్రంలో గోదావరి ప్రాజెక్టులను పరిశీలించేందుకు జీఆర్​ఎంబీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్(GRMB chairman chandra shkehar iyer) బృందం పర్యటన మొదలైంది. బోర్డు సభ్యుడు కుటియాల్, ఇంజినీర్లతో కలిసి సింగూరు(Singur Dam) ప్రాజెక్టును పరిశీలించారు. డ్యామ్ ఇంజినీర్లతో ఛైర్మన్ బృందం కాసేపు ముచ్చటించారు. 

  • 'గడ్చిరోలి'​ మృతుల్లో తుంబ్డే

మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పుల(gadchiroli encounter) మోతతో గ్యారపట్టి అడవులు దద్దరిల్లాయి. ఈ ఘటనలో కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్​ తేల్​తుంబ్డే సహా.. మొత్తం 26 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు గడ్చిరోలి ఎస్పీ అంకిత్‌ గోయల్‌ వెల్లడించారు. ఎదురు కాల్పుల్లో నలుగురు జవాన్లకు గాయాలైనట్లు తెలిపారు.

  • బుల్లెట్​ స్పీడ్​లో అక్షయ్.. 

బాలీవుడ్ స్టార్ అక్షయ్​ కుమార్​ దూకుడు మామూలుగా లేదు. ఏ స్టార్​కూ లేనన్ని సినిమాలు ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నాయి. ఒకటికాదు, రెండు కాదు ఏకంగా 9 సినిమాల్లో ప్రస్తుతం ఆయన నటిస్తున్నారు. మరి ఆ సినిమాలేంటో తెలుసుకుందామా..?

  • 'ఆ జట్టే ఫేవరెట్.. ఎందుకంటే?'

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో(t20 world cup 2021 final) న్యూజిలాండ్​పై ఆస్ట్రేలియా గెలుస్తుందని అభిప్రాయపడ్డారు భారత బ్యాటింగ్​ దిగ్గజం సునీల్‌ గావస్కర్. ఐసీసీ నాకౌట్ మ్యాచ్​ల్లో ఆసీస్​కు అత్యద్భుత రికార్డులు ఉండటమే ఇందుకు కారణమని తెలిపారు.

  • ఈ వారం మార్కెట్ల తీరు ఎలా ఉంటుందంటే?

ఈ వారం స్టాక్ మార్కెట్లకు (Market outlook for this week) అంతర్జాతీయ పరిణామాలే కీలకం కానున్నాయి. ద్రవ్యోల్బణం ఆందోళనలు సహా అమెరికా బాండ్లపై రాబడి మార్కెట్లను ప్రభావితం చేయనుందని నిపుణులు చెబుతున్నారు. విదేశీ సంస్థాగత మదుపర్లు భారత్ నుంచి పెట్టుబడులు తరలిస్తే.. సూచీలపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.

10:51 November 14

టాప్​న్యూస్​@ 11 AM

  • 'దగ్గరవ్వడమే మా లక్ష్యం'

నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు టీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్(TSRTC MD sajjanar). బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి రథచక్రాలను ప్రగతి పథంలో పరుగులు పెట్టించేందుకు ప్రణాళికలు రూపొందిస్తూ ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. కరోనా వల్ల ప్రజారవాణా మూటగట్టుకున్న నష్టాల(TSRTC is in loss)ను లాభాలుగా మార్చడానికి వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు.

  • అల్లుఅర్జున్​ కొత్త లుక్​ అదుర్స్​

అల్లుఅర్జున్​, రష్మిక జంటగా నటిస్తున్న 'పుష్ప'(pushpa update) సినిమా నుంచి మరో కొత్త అప్డేట్​ వచ్చింది. ఈ చిత్రంలోని నాలుగో పాటను నవంబరు 19న రిలీజ్​ చేయనున్నట్లు తెలుపుతూ ఓ కొత్త పోస్టర్​ను విడుదల చేసింది. ఇందులోని అల్లు అర్జున్​ కొత్త లుక్​ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.

  • 'ఆర్‌ఆర్‌ఆర్‌' నిర్మాత అసంతృప్తి

ఏపీలో సినిమా టికెట్ల ధర తగ్గింపుపై 'ఆర్​ఆర్​ఆర్​ నిర్మాత అసంతృప్తి వ్యక్తం చేశారు. టిక్కెట్ ధరల తగ్గింపుతో సినిమాపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

  • 'నేనే ఎక్కువ నిరాశలో ఉన్నా'

టీ20 ప్రపంచకప్​లో(T20 world cup 2021) భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్​లో(pak vs aus t20) కీలకమైన క్యాచ్​ను పాక్​ ఆటగాడు హసన్ అలీ(Hasan ali dropped catch) మిస్​చేయడంపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఫ్యాన్స్​కు క్షమాపణలు చెప్పాడు అలీ.

  • బంగారం ధరలు ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం (Gold Price today), వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి.

09:56 November 14

టాప్​న్యూస్​@ 10AM

  • రాజకీయ ఉద్ధండుడు డీఎస్​ దారెటు.. 

డీఎస్ దారెటు(dharmapuri srinivas latest news).. ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పార్టీలో రాష్ట్రం నుంచి అత్యంత సన్నిహితుడిగా పేరున్న డీఎస్.. ఏ పార్టీలో చేరుతారన్న చర్చ ఊపందుకుంది. ఇటీవల కాలంలోనే కాంగ్రెస్, భాజపా ముఖ్య నాయకులు డీఎస్​ను కలవడమే ఇందుకు కారణం. 

  • హైదరాబాదీలు బయటికొస్తున్నారా? 

Pollution in hyderabad: హైదరాబాద్​లో ఓ వైపు చలి వణికిస్తోంది. మరోవైపు కాలుష్య(Pollution in hyderabad) కోరలు కమ్మేస్తున్నాయి. స్వచ్ఛమైన గాలి కలుషితమై.. అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. సెప్టెంబర్​తో పోల్చితే అక్టోబర్​లో అన్ని ప్రాంతాల్లో దుమ్ము కణాల తీవ్రత భారీగా పెరిగినట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది.

  • నెహ్రూకు సోనియా​, మోదీ నివాళులు

భారత తొలి ప్రధాని జవహర్​లాల్​ నెహ్రూ(Nehru birth anniversary) జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi). ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ట్విట్టర్ వేదికగా నెహ్రూకు నివాళులు అర్పించారు.

  • మరో 11 వేల కరోనా కేసులు

భారత్​లో కరోనా కేసులు (Corona cases in India) స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 11,271 మందికి కరోనా (Coronavirus India) సోకింది. వైరస్​ కారణంగా మరో 285 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మ్యాచ్​ను మలుపుతిప్పే సమర్థులు!

టీ20 ప్రపంచకప్(t20 world cup 2021 final)​లో భాగంగా నేడు (నవంబర్ 14) న్యూజిలాండ్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్(AUS vs NZ Final) మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​ను మలుపుతిప్పగలిగే సామర్థ్యమున్న కీలక ఆటగాళ్లెవరో చూద్దాం.

09:00 November 14

టాప్​న్యూస్​@ 9AM

  • ఇక తెలంగాణలోనే చూసెయ్యొచ్చు!

ఇకపై పెద్దపులిని(Tiger) చూడాలంటే కర్ణాటకలోకి బందీపూర్‌, మధ్యప్రదేశ్‌లో కన్హా, మహారాష్ట్రలోని తాడోబా టైగర్‌ రిజర్వుకు వెళ్లాల్సిన అవసరం లేదు... ఇక మన రాష్ట్రంలోనే చూడొచ్చంటోంది అటవీశాఖ(Telangana forest ministry). అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు(Amrabad Tiger Reserve)ను సరికొత్తగా తీర్చిదిద్ది పర్యాటకులను రా రమ్మంటోంది...

  • బాలికలపై జిల్లా అధికారి వేధింపులు

ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. ఎన్ని కఠిన శిక్షలు అమలు చేసినా బాలికలు, మహిళలపై లైంగిక వేధింపులు(District officer harassment) తగ్గడం లేదు. పైగా జిల్లా స్థాయి అధికారి హోదాలో ఉండి కూడా... పాఠశాల విద్యార్థినుల అసభ్యంగా(Harassment at school) ప్రవర్తించారు ఓ వ్యక్తి. మద్యం మత్తులో రాత్రి ఎనిమిది గంటలవరకు అనవసర బోధనలు చేశారని.. పాటలు పాడుతూ, నృత్యాలు చేయాలంటూ అసభ్యకరంగా మాట్లాడారని విద్యార్థినులు ఆరోపించారు.

  • సెలబ్రిటీల సెంటిమెంట్లు ఏంటో తెలుసా?

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మందికి ఏదో ఒక సెంటిమెంట్​ ఉండటం సర్వసాధారణం. వాటిని తప్పకుండా ఫాలో అవుతుంటారు. వీరిలో మహేశ్​బాబు, ఎన్టీఆర్​, కాజల్​ అగర్వాల్​, దీపికా పదుకొణె సహా చాలా మంది నటులే ఉన్నారు. మరి వారెవరు? వారి సెంటిమెంట్లు ఏంటో చూసేద్దాం..

  • రవిశాస్త్రి భావోద్వేగ పోస్ట్​

టీమ్ఇండియా ప్రధాన కోచ్​గా ఐదేళ్లపాటు సేవలందించిన రవిశాస్త్రి(ravi shastri coaching tenure).. వీడ్కోలు తర్వాత భావోద్వేగమైన పోస్ట్ పెట్టాడు. ఈ అసాధారణ ప్రయాణంలో తనకూ భాగం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు.

  • 'రోబో సలహాలే బెటర్​!'

ఉద్యోగంలో వృద్ధి చెందేందుకు మనుషుల కంటే రోబోలు ఇచ్చే సూచనలే(career advice) ఎంతో మేలు చేస్తున్నాయని ప్రపంచ వ్యాప్తంగా 82% మంది విశ్వసిస్తున్నారు. తమ భవిష్యత్తును నిర్మించుకోవటానికి టెక్నాలజీ సాయం తీసుకోవాలని 85% మంది భావిస్తున్నారు. ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

07:56 November 14

టాప్​న్యూస్​@ 8AM

  • విశాఖలో స్వల్ప భూప్రకంపనలు

విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో స్వల్ప (Earthquake in Visakhapatnam) భూ ప్రకంపనలు వచ్చాయి. అక్కయ్యపాలెం, మధురానగర్‌, తాటిచెట్లపాలెం, అల్లిపురం, ఆసిల్‌మెట్ట, సీతమ్మధార, అల్లిపురం, రైల్వేస్టేషన్‌, హెచ్‌బీకాలనీ, జ్ఞానాపురం, బంగారమ్మమెట్ట ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు (Earthquake in Visakhapatnam) భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 

  • మృతుల్లో తెలంగాణ వారున్నారా?

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ధనోరా తాలుకాలోని గ్యార్​పట్టి అడవుల్లో జరిగిన ఎన్​కౌంటర్​లో(Gadchiroli Encounter) 26 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో తెలంగాణకు చెందిన వారున్నారా అనే కోణంలో రాష్ట్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. రాష్ట్రానికి చెందిన పడకల్​స్వామి(telangana Maoist) ప్రస్తుతం గడ్చిరోలి అడవుల్లోనే ప్లటూన్ కమాండర్​గా పనిచేస్తున్నట్లు సమాచారం ఉండటంతో ఈ ఎన్​కౌంటర్​(Gadchiroli Encounter)లో అతను కూడా మృతి చెందాడా అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు.

  • 'మరీ ఇంత అహంకారమా?'

ఓ ఉద్యోగి విషయంలో యూపీ అదనపు ప్రధాన కార్యదర్శి (రెవిన్యూ), ఆర్థిక కార్యదర్శి వ్యవహరించిన తీరు సరిగా లేదని సుప్రీంకోర్టు మండిపడింది. ఉద్యోగి సర్వీసును (sc on up officers) క్రమబద్దీకరించి, బకాయిలు చెల్లించడంలో అధికారులు చేస్తున్న తీవ్ర జాప్యాన్ని తప్పుపట్టింది. మరీ ఇంత అహంకారమా, న్యాయస్థానమంటే గౌరవం లేదా అంటూ నిలదీసింది.

  • 'విజయం నమ్మకాన్ని ఇచ్చింది'

'రాజావిక్రమార్క'(karthikeya raja vikramarka) సినిమాను హిట్​ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు హీరో కార్తికేయ. ఈ విజయం నమ్మకం, సంతృప్తినిచ్చాయని అన్నారు.

  • పండగ సీజన్​లో రూ.65వేల కోట్ల విక్రయాలు

ఈ ఏడాది పండగ సీజన్​లో ఇ-కామర్స్ (E Commerce sales)​ సంస్థలు గతేడాది కంటే 23 శాతం అధిక విక్రయాలు(festival sales online) చేశాయి. ఏకంగా రూ.65వేల కోట్లు మేర అమ్మకాలు జరిగాయని కన్సల్టింగ్​ సంస్థ రెడ్​సీర్​(redseer ecommerce report) అంచనా వేసింది.

07:06 November 14

టాప్​న్యూస్​@7AM

  • వైఎస్ వివేకాను చంపమంది ఆయనే! 

వైఎస్‌ వివేకానందరెడ్డిని (YS Viveka Murder Case) చంపేయ్‌. నువ్వు ఒక్కడివే కాదు మేమూ నీతో పాటు వస్తాం. దీని వెనుక వైఎస్‌ అవినాష్‌రెడ్డి (ys avinash reddy), వైఎస్‌ మనోహర్‌రెడ్డి (ys manohar reddy), వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, డి.శంకర్‌రెడ్డి వంటి పెద్దవాళ్లు ఉన్నారు. ఈ హత్య(YS Viveka Murder Case) చేస్తే శంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తారు. అందులో రూ.5 కోట్లు నీకు ఇస్తాను’ అంటూ వివేకాకు సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి (gangi reddy) తనతో చెప్పారని నిందితుల్లో ఒకరు, అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి వెల్లడించారు.

  • గోమూత్రం, పేడపై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

ఆవులు, వాటి మూత్రం, పేడతో వ్యక్తిగతంగా ఆర్థిక వృద్ధి సాధించటమే కాకుండా.. దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​. 'శక్తి 2021' కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

  • 53 ఉపగ్రహాలను ప్రయోగించిన స్పేస్‌ఎక్స్‌

ఫాల్కన్​-9 రాకెట్​ ద్వారా 53 ఉపగ్రహాలను రోదసిలోకి పంపింది స్పేస్​ఎక్స్(SpaceX news)​. ప్రయోగం అనంతరం ఈ రాకెట్​ క్షేమంగా తిరిగి భూమిపైకి వచ్చింది.

  • మోహన్​లాల్​ సినిమాలో మంచులక్ష్మీ!

మలయాళీ మెగాస్టార్​ మోహన్​లాల్​ నటించనున్న 'మాన్​స్టర్'​ సినిమాలో మంచు లక్ష్మీ ఓ కీలక పాత్రలో నటించనున్నారని తెలిసింది(lakshmi manchu upcoming movie ). థ్రిల్లర్​ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

  • 'బుమ్రా నుంచి... '

టీమ్​ఇండియా స్టార్​ బౌలర్​ జస్​ప్రీత్​ బుమ్రా (Bumrah News) బౌలింగ్​పై తనకున్న అభిమానాన్ని వ్యక్తపరిచాడు అఫ్గానిస్థాన్​ యువ పేసర్ నవీన్ ఉల్ హక్. బుమ్రా బౌలింగ్‌ గణాంకాల్లో తాను కనీసం 50 శాతం సాధించినా చాలన్నాడు.

05:15 November 14

టాప్​న్యూస్​@6AM

  • తిరుపతిలో దక్షిణ జోనల్‌ సమావేశం

పాలమూరు - రంగారెడ్డి, నక్కలగండి ఎత్తిపోతల పథకాలు సహా విద్యుత్ బకాయిలు, విభజన చట్టంలోని అంశాలు దక్షిణ జోనల్ సమావేశంలో (Southern States Zonal Council Meeting - 2021) చర్చకు రానున్నాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాలు ప్రతిపాదించిన ఎజెండా ప్రకారం వివిధ అంశాలు చర్చకు రానున్నాయి. 

మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పుల మోతతో గ్యారపట్టి అడవులు దద్దరిల్లాయి. ఈ ఘటనలో దాదాపు 26 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు గడ్చిరోలి ఎస్పీ అంకిత్‌ గోయల్‌ వెల్లడించారు. ఎదురు కాల్పుల్లో నలుగురు జవాన్లకు గాయాలైనట్లు తెలిపారు.

  • వేడెక్కిన కాంగ్రెస్​ వార్​ రూమ్

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఘోర పరాజయం (huzurabad defeat) కాంగ్రెస్‌లో కాక రేపింది. నేతలు మాటల ఈటెలు విసురుకున్నారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఓటమిపై పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కె.సి.వేణుగోపాల్‌ (kc venugopal) అధ్యక్షతన శనివారం ఇక్కడి వార్‌రూంలో సమీక్ష నిర్వహించారు.

  • ధరణికి భారీ ఆదాయం

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, ఇతర సేవల ద్వారా శనివారం నాటికి ధరణి ఆదాయం (dharani portal revenue) రూ.1500 కోట్లను దాటిందని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో చెల్లింపుల సంఖ్య 12.36లకు చేరుకుంది.

  • పద్ధతి కాదు..

ఎయిమ్స్ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (kishan reddy)..వాస్తవాలు వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావు (health minister harish rao) ఆరోపించారు. 

  • జైలులో ఘర్షణ- 52 మంది ఖైదీలు మృతి

ఈక్వెడార్​ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో దాదాపు 52 మంది ఖైదీలు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. 

  • బూస్టర్​ డోసుపై డబ్ల్యూహెచ్​ఓ అసంతృప్తి

అభివృద్ధి చెందిన దేశాల్లో.. రెండు డోసులు పూర్తయిన వారికి బూస్టర్ డోసులు ఇస్తుండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ మేరకు బూస్టర్ డోసుల పంపిణీ వెంటనే ఆపేయాలని డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ అన్నారు.

  • మోదీతో డబ్ల్యూఈఎఫ్​ అధ్యక్షుడు భేటీ

ప్రపంచ ఆర్థిక సదస్సు అధ్యక్షుడు బోర్గే బ్రెండే.. ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమ్యాయరు. ఈ మీటింగ్​లో పలు కీలక అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా.. వచ్చే ఏడాదికల్లా భారత్​ రెండంకెల వృద్ధిని నమోదు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • ఆసీస్​ ఆధిపత్యమా.. కివీస్​ పంతమా?

20 ప్రపంచకప్‌ ఫైనల్‌ (T20 World Cup Final).. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మధ్య ఆదివారం జరగనుంది. వన్డేల్లో ఐదుసార్లు ప్రపంచకప్‌లు నెగ్గిన ఆస్ట్రేలియా, ఒక్కసారి కూడా గెలవని న్యూజిలాండ్‌.. అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ రెండు జట్లకూ.. ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌ గెలుచుకోలేదు.

  • బాలయ్య టాక్ షోలో డార్లింగ్ హీరో!

మంచు ఫ్యామిలీ, నానిలతో కలిసి 'అన్​స్టాపబుల్'(unstoppable with nbk next guests) సందడి చేసిన బాలయ్య(balayya movies).. మూడో ఎపిసోడ్​లో పాన్ ఇండియా హీరోతో కలిసి అలరించనున్నారు. ఇంతకీ ఆ కథానాయకుడు ఎవరంటే?

Last Updated : Nov 14, 2021, 9:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.