ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

top news
top news
author img

By

Published : Nov 10, 2021, 6:12 AM IST

Updated : Nov 10, 2021, 10:00 PM IST

21:53 November 10

టాప్ ​న్యూస్ ​@10PM

  • హైకోర్టులో పిటిషన్

మద్యం దుకాణాలకు కేటాయింపులో రిజర్వేషన్లకు ప్రాతిపదిక ఏమిటో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లను సవాల్ చేస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన వాసిరెడ్డి రవికాంత్, నంద్యాల ప్రభాకర్ రావు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్​పై జస్టిస్ లక్ష్మణ్ అత్యవసర విచారణ చేపట్టారు.

  • ఆమె మృతిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పీఎస్‌లో మరియమ్మ మృతి కేసు(mariamma lockup death case)పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

  • అత్యాచారం కేసులో దోషిగా మాజీ మంత్రి

సామూహిక అత్యాచారం కేసులో మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతి సహా ముగ్గురిని కోర్టు దోషులుగా తేల్చింది. నవంబర్ 12న వారికి శిక్షను ఖరారు చేయనుంది. మరో నలుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.

  •  కేటీఆర్ ట్వీట్.. 'శ్రీమంతుడు' సీన్..!

బీబీపేట్ పాఠశాల ఆధునీకరణపై సూపర్​స్టార్ మహేశ్​బాబు స్పందించారు. త్వరలో శ్రీమంతుడు టీమ్​తో కలిసి బీబీపేట్​ పాఠశాలను సందర్శిస్తామని ట్వీట్(Mahesh babu twitter) చేశారు. ఈ పాఠశాల ప్రారంభోత్సవం ఫొటోలను మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో పోస్ట్ చేయగా... మహేశ్‌బాబు దీనిపై రెస్పాండ్ అయ్యారు.

  • మహిళా రెజ్లర్  దారుణ హత్య

మహిళా రెజ్లర్ నిశా దహియాను దుండుగలు కాల్చి చంపారు. హరియాణాలో జరిగిన ఈ దాడిలో ఆమె సోదరుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన స్థానికులు సుశీల్​ కుమార్ అకాడమీకి నిప్పంటించారు.

20:47 November 10

టాప్ ​న్యూస్ ​@9PM

  •  జిల్లా జడ్జిల బదిలీ

రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది మంది జిల్లా జడ్జిలు బదిలీ అయ్యారురాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా ఎం.వి.రమేశ్ బదిలీ అయ్యారు. రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా సీహెచ్‌కే భూపతి నియమితులయ్యారు. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

  • వారికి పరిహారంపై  జీవో

కొవిడ్ మృతులకు పరిహారం చెల్లించే అంశాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దరఖాస్తులు పరిశీలించిన తర్వాత అర్హులైన వారికి పరిహారాన్ని నేరుగా కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారని వెల్లడించింది.

  • బాలికపై దారుణం

14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు దుండగులు. అనంతరం ఆమెను గొంతు నులిమి హత్య చేశారు. గుజరాత్​లో వెలుగుచూసిన ఈ అమానుష ఘటనలో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తమిళనాడులో జరిగిన మరో ఘటనలో పదో తరగతి చదువుతున్న బాలికను 17ఏళ్ల బాలుడు అపహరించిన పెళ్లి చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది.

  • విజయ్ దేవరకొండ అందుకే ప్రచారం..!

అల్లు అర్జున్ సపోర్ట్ వల్లే తమ సినిమా ఎక్కువమందికి రీచ్ అయిందని ఆనంద్ దేవరకొండ అన్నాడు. విజయ్ దేవరకొండ ప్రచారం చేయడం గురించి మాట్లాడాడు.

  • టీకా వేసుకుంటేనే  ఎంట్రీ

న్యూజిలాండ్​తో టీ20 సిరీస్​కు(IND vs NZ t20 series) సన్నద్ధమవుతోంది టీమ్​ఇండియా. తొలి మ్యాచ్​ జైపుర్​ వేదికగా జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. కొవిడ్ టీకా తీసుకున్నవారినే మైదానంలోకి అనుమతించనున్నట్లు పేర్కొంది.

19:54 November 10

టాప్ ​న్యూస్ ​@8PM

  • జిల్లా జడ్జిల బదిలీ

రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది మంది జిల్లా జడ్జిల బదిలీ అయ్యారు. 

  •  రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్

మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ్, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఖమ్మం జిల్లాకు చెందిన రవికాంత్ వేసిన పిటిషన్‌పై ధర్మాసనం అత్యవసర విచారణ జరిపింది.

  •  ముగ్గురు దుర్మరణం

గుర్తు తెలియని వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు.  మేడ్చల్ జిల్లా దూలపల్లి అటవీప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

  • చైనాపై ఆగ్రహం

చైనా నాయకత్వంపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా(Dalai Lama Latest News) మరోమారు విమర్శలు గుప్పించారు. చైనాలో హాన్‌ వర్గం ఆధిపత్యమే ఎక్కువగా ఉందన్నారు. అత్యంత సంకుచిత మనస్తత్వం కలిగిన చైనా నాయకులు.. టిబెట్​ ప్రజలు, సంస్కృతిని అర్ధం చేసుకోలేరని వ్యాఖ్యానించారు. తాను భారత్​లోనే ఉంటానని.. ఇక్కడే ప్రశాంతంగా ఉందన్నారు.

18:42 November 10

టాప్ ​న్యూస్ ​@7PM

  • సీబీఐకి అప్పగించాలి

  • ప్రేమోన్మాది ఘాతుకం

హైదరాబాద్​లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తనతో పెళ్లికి నిరాకరించిందని యువతిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో బాధిత యువతి తీవ్రంగా గాయపడింది. 

  • స్కూల్లో కరోనా కలకలం

ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం రేకెత్తించింది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని ఎస్టీ బాలికల పాఠశాల విద్యార్థినులు, ఉపాధ్యాయులకు పాజిటివ్​గా నిర్ధరణ అయింది.  

  •  'డాన్' ఫస్ట్​లుక్

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో శెభాష్ మిథు, గణ్​పథ్, ఛలో ప్రేమిద్దాం, డాన్, సూర్య కొత్త సినిమా సంగతులు ఉన్నాయి.

  •  రెండు రోజుల్లో రెండు ఘనతలు

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో(Syed Mushtaq Ali Trophy 2021) విదర్భ(Vidarbha Bowler) బౌలర్​ రికార్డు సృష్టించాడు. ఓ మ్యాచ్​లో నాలుగు మెయిడిన్​ ఓవర్లు వేశాడు. తర్వాతి మ్యాచ్​లో హ్యాట్రిక్​ను తన ఖాతాలో వేసుకున్నాడు.

17:51 November 10

టాప్ ​న్యూస్ ​@6PM

  • గుండె ఆగిపోయేలా కొడతారా?

మరియమ్మ మృతిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గుండె ఆగిపోయేలా కొడతారా అని ప్రశ్నించింది. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పీఎస్‌లో మరియమ్మ మృతిపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.

  •  మంత్రి ట్వీట్.. 'శ్రీమంతుడు' రియాక్ట్..!

  •  ఆ రాష్ట్రంలో ఇంధన ధరల తగ్గింపు!

ఏపీలో పెట్రోలు లీటరుపై 1.51 రూపాయలు, డీజిల్​పై 2.22 రూపాయల మేర వ్యాట్ తగ్గింది. ఫలితంగా ఏడాదికి ఏపీ ప్రభుత్వం 1,114 కోట్ల రూపాయల మేర వ్యాట్ ఆదాయం కోల్పోనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

  • 'ధరల మంట'పై దేశవ్యాప్త ఆందోళనలు

ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నవంబరు 14 నుంచి కాంగ్రెస్​ పార్టీ(Congress News) ఆందోళనలు చేపట్టనుంది. 'జన్ జాగరణ్ అభియాన్' పేరుతో.. 15రోజుల పాటు దేశవ్యాప్తంగా నిరసనలు చేయనున్నట్లు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు.

  • అగ్రహీరోల సినిమా అప్డేట్స్​

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రాల అప్డేట్స్​తో వచ్చేశారు. రెండు రోజుల వ్యవధిలో వీరి సినిమాలు గ్రాండ్​గా లాంచ్​ కానున్నాయి.

16:45 November 10

టాప్ ​న్యూస్ ​@5PM

  •  నాగశౌర్య తండ్రికి బెయిల్

అనంతరం ఉప్పర్‌పల్లి కోర్టులో శివలింగప్రసాద్‌ను పోలీసులు హాజరుపర్చారు. మంచిరేవుల పేకాట కేసులో గుత్తా సుమన్​తో కలిసి పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ఇప్పటికే శివలింగప్రసాద్ పిటిషన్ దాఖలు చేయగా.. బెయిల్​ మంజూరైంది. 

  • మీకు ఆ ధైర్యముందా.. నేను నిరూపిస్తా..!

కాంగ్రెస్ చర్చ లేకుండా ఉండేందుకు భాజపా, తెరాసలు డ్రామాలాడుతున్నాయని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy on CM KCR) ధ్వజమెత్తారు. బండి సంజయ్‌ను కేసీఆర్ ఆరు ముక్కలు చేస్తామంటే భాజపా నేతలు ఎందుకు నోరువిప్పడం లేదని ప్రశ్నించారు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణా కార్యక్రమంలో అయన మాట్లాడారు.

  •  ముంబయిలో హైదరాబాదీ అరెస్టు.. ఎందుకంటే..!

 క్రికెటర్‌ను బెదిరించిన కేసులో హైదరాబాద్‌ వాసిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. పాక్‌ చేతిలో భారత్‌ ఓటమి తర్వాత ట్విటర్‌లో హైదరాబాద్​కు చెందిన రామ్​నగేశ్​ అనే వ్యక్తి అనుచిత పోస్టు చేశాడు. 

  • యమునా నదిలో  వెదురు తడకలు

యమునా నదిలో విషపు నురగల తొలగింపునకు దిల్లీ ప్రభుత్వం (chhath puja yamuna ghat in delhi) చర్యలు ప్రారంభించింది. ఘాట్​ వద్ద వెదురు తడకలను ఏర్పాటు చేస్తోంది. 

  • 'ఆదిపురుష్' షూటింగ్ పూర్తి..!

ప్రభాస్ రాముడిగా నటిస్తున్న 'ఆదిపురుష్' షూటింగ్ మొత్తం పూర్తయింది. వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

15:52 November 10

టాప్ ​న్యూస్ ​@4PM

  • హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్​

రంగారెడ్డి జిల్లా మంచిరేవుల(manchirevula case) ఫామ్‌హౌజ్‌ కేసులో(Gambling Case in Hyderabad) హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్​ను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. ఫాంహౌజ్ లీజు ఒప్పందాన్ని ఉల్లంఘించారని కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.  

  •  నలుగురు కార్మికులు దుర్మరణం

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సింగరేణి గని పైకప్పు కూలి నలుగురు కార్మికులు మృతి చెందారు

  • ఆ​ నిధుల పునరుద్ధరణకు  ఆమోదం

ఎంపీ ల్యాడ్స్ నిధుల పథకాన్ని పునరుద్ధరించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2025-26 వరకు దీన్ని కొనసాగించాలని నిర్ణయించింది. 2021-22 సంవత్సరానికి గానూ ఒక్కో ఎంపీకి రూ.2కోట్ల నిధులు మంజూరు చేయనుంది.

  • 'నాటు ' సాంగ్ రిలీజ్

'ఆర్ఆర్ఆర్'లో చరణ్-ఎన్టీఆర్ కలిసి స్టెప్పులతో అదరగొట్టిన 'నాటు నాటు' పూర్తి సాంగ్ వచ్చేసింది. భారీ బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమా.. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • కేఎల్  పైకి.. కోహ్లీ కిందకి..!

ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్​ను(ICC ranking T20) విడుదల చేసింది. టీమ్​ఇండియా ఓపెనర్​ కేఎల్ రాహుల్(kl rahul news) ఐదో స్థానానికి చేరుకోగా కెప్టెన్​ విరాట్ కోహ్లీ 8 స్థానానికి పడిపోయాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.

14:33 November 10

టాప్ ​న్యూస్ ​@3PM

  • రాజస్థాన్​లో ఘోర ప్రమాదం

రాజస్థాన్ బాడ్​మేర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 11 మంది మరణించారు. 22 మందికి గాయాలయ్యాయి. బాడ్​మేర్-జోధ్​పుర్ జాతీయ రహదారి వద్ద ఉన్న బందియావాస్ గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది.

  • నాలుగుకు చేరిన మృతులు

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సింగరేణి గని పైకప్పు కూలి నలుగురు కార్మికులు మృతి చెందారు. శ్రీరాంపూర్ సింగరేణి ఎస్ఆర్పీ-3 గనిలో ప్రమాదం చోటుచేసుకుంది.  విధులు నిర్వర్తిస్తున్న కార్మికులపై పైకప్పు కూలింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • ఆగిపోయిన 'ప్రజా ప్రస్థానం' 

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజా ప్రస్థాన యాత్రకు స్వల్ప విరామం ఇచ్చినట్లు వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల(YS Sharmila latest news) ప్రకటించారు. 

  • 10 వేలకు 12 లక్షలు..!

ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో చెప్పే సంఘటన ఇది. గుజరాత్​లో ఇటీవల 10వేల కానిస్టేబుల్​ ఉద్యోగాలకు నోటిఫికేషన్​(constable recruitment gujarat) విడుదల చేయగా.. నిరుద్యోగుల నుంచి విశేష స్పందన లభించింది. దాదాపు 12 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

  • ఆ హీరోను గుర్తుచేసుకున్న తలైవా..!

ఇటీవలే(puneeth rajkumar death news) గుండెపోటుతో కన్నుమూసిన కన్నడ ప్రముఖ నటుడు పునీత్​ రాజ్​కుమార్​ను​ గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు సూపర్​స్టార్​ రజనీకాంత్(puneeth rajkumar rajinikanth)​. అప్పు లేరన్న నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని ట్వీట్​ చేశారు. దీనిపై స్పందించిన అభిమానులు రజనీపై విపరీతంగా విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే?

13:56 November 10

టాప్ ​న్యూస్ ​@2PM

  • సింగరేణి గనిలో ప్రమాదం..

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సింగరేణి గని పైకప్పు కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. శ్రీరాంపూర్ సింగరేణి ఎస్ఆర్పీ-3 గనిలో ప్రమాదం చోటుచేసుకుంది.  విధులు నిర్వర్తిస్తున్న కార్మికులపై పైకప్పు కూలింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • 'హుజూరాబాద్ తీర్పు ఆరంభం మాత్రమే'

హుజూరాబాద్ ప్రజలు వాళ్ల ఆత్మను ఆవిష్కరించే గొప్ప తీర్పునిచ్చారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela rajender comments) అన్నారు. హుజూరాబాద్ తీర్పు ఆరంభం మాత్రమేనని పేర్కొన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థిగా గెలుపొందిన ఈటల రాజేందర్‌ ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.

  • ట్రక్కు, బస్సు ఢీ- ఎనిమిది మంది మృతి

రాజస్థాన్ బాడ్​మేర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన సీఎం అశోక్ గహ్లోత్.. వెంటనే సహాయక చర్యలకు ఆదేశించారు.

  • కుడి ఎడమైనా.. పొరపాటు లేదోయ్​!

శాస్త్రరంగంలో ప్రతి ఆవిష్కరణకూ ఒక ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది. కానీ ఇది కొన్నిసార్లు కుడి ఎడమలు కావొచ్చు. అసలు ఉద్దేశం ఒకటైతే మరో రకంగా ఉపయోగపడొచ్చు. అలాగని తక్కువ చూడటానికి లేదు. ఇలాంటివి మన జీవితం మీద గణనీయ ప్రభావాన్నే చూపొచ్చు. అలాంటి వాటిల్లో కొన్నింటి గురించి..!

  • త్వరలోనే 'స్క్విడ్ ​గేమ్'​ సీజన్​ 2

నెట్‌ఫ్లిక్స్‌లో(squid game characters) విడుదలైన దగ్గర నుంచి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్న వెబ్‌సిరీస్‌ 'స్క్విడ్‌ గేమ్‌'(squid game netflix review). ఇప్పుడీ సిరీస్​కు కొనసాగింపుగా సీజన్​ 2ను తీసుకొస్తామని చెప్పాడు దర్శకుడు వాంగ్​. అయితే ఎప్పుడనేది ఇప్పుడు చెప్పలేనని అన్నాడు.

12:43 November 10

టాప్ ​న్యూస్ ​@1PM

  • ట్రక్కు, బస్సు ఢీ- ఐదుగురు మృతి

రాజస్థాన్ బాడ్​మేర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్యాసెంజర్ బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి.

  • 'ధర్నాల కోసం కలెక్టర్ల అనుమతి తీసుకోండి'

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీరును నిరసిస్తూ ఈనెల 12న ధర్నాకు పిలుపునిచ్చిన అధికార తెరాస(TRS Dharna).. ఆందోళనను విజయవంతం చేయడంపై దృష్టిసారించింది. అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో ధర్నాలు చేయాలని శ్రేణులకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ దిశానిర్దేశం చేశారు. ధర్నాల కోసం కలెక్టర్ల అనుమతి తీసుకోవాలని సూచించారు.

  • ఎంపీ నివాసంపై కాల్పులు

రాజస్థాన్​ భాజపా ఎంపీ రంజీతా కోలీ నివాసంపై (attack on bjp leaders) మంగళవారం అర్ధరాత్రి దుండగులు కాల్పులు జరిపారు. అంతేకాకుండా బెదిరింపు లేఖను ఇంటికి అతికించారు.

  • ఆర్‌బీఐ హాకథాన్‌- గెలిస్తే రూ.40 లక్షలు!

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 'స్మార్టర్‌ డిజిటల్‌ పేమెంట్స్‌' అంశంపై (hackathon 2021) మొదటి అంతర్జాతీయ హాకథాన్‌ను నిర్వహిస్తోంది. ఈ హాకథాన్‌లో విజేతగా నిలిచిన వారికి రూ.40 లక్షలు, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.20 లక్షలను బహుమతిగా ఇవ్వనున్నారు.

  • మీ సహకారం చరిత్రలో నిలిచిపోతుంది: కోహ్లీ

టీమ్ఇండియా కోచింగ్ బృందం తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న(ravi shastri coaching tenure) సందర్భంగా జట్టు కోసం వారు చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపాడు విరాట్ కోహ్లీ(virat kohli news). వారి ప్రయాణం భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నాడు.

11:58 November 10

టాప్ ​న్యూస్ ​@12PM

  • ఈటల రాజేందర్ ప్రమాణస్వీకారం

హుజురాబాద్‌ ఉపఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఈటల రాజేందర్ (Etela Rajender sworn in as MLA) అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. శాసనసభ స్పీకర్ ఛాంబర్‌లో ఆయనతో సభాపతి పోచారం శ్రీనివాస్​ ప్రమాణ స్వీకారం చేయించారు. గతంలో తెరాస నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్... ఏడోసారి భాజపా అభ్యర్థిగా గెలుపొందడం విశేషం.

  • అమరావతి ఆకాంక్ష.. పల్లవించె ప్రతినోటా.

ఏపీలో "న్యాయస్థానం నుంచి దేవస్థానం" పేరిట అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర.. ఉత్సాహంగా సాగుతోంది. నేడు పదోరోజున దుద్దుకూరు నుంచి నాగులుప్పలపాడు వరకు 14 కి.మీ పాదయాత్ర సాగనుంది.

  • లారీని ఢీకొట్టిన యాత్రికుల బస్సు

ఝార్ఖండ్​ హజారిబాగ్​ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తోన్న ఓ బస్సు.. రోడ్డుపక్కన ఆగి ఉన్న ట్రక్కును వెనకునుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 75 మంది గాయపడ్డారు. వారిలో తొమ్మది మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

  • సింగపూర్​ జూలో సింహాలకు కరోనా

వన్యప్రాణులు కూడా భారీగానే మహమ్మారికి (corona virus in animals) గురైనట్టు తాజాగా ఓ పరిశోధన తేల్చింది. ఉత్తర అమెరికాలోని 40% జింకల్లో కొవిడ్‌ యాంటీబాడీలు పుష్కలంగా ఉన్నట్టు తేలింది. సింగపూర్​లోని ఓ జూలో నాలుగు సింహాలు కూడా కరోనా బారిన పడ్డాయి.

  • రణ్​బీర్-ఆలియా​ పెళ్లి?

బాలీవుడ్​ ప్రేమజంట రణ్​బీర్​-ఆలియా భట్​(ranbir alia bhatt marriage)​ ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోబోతున్నారని ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది. అయితే ఇప్పుడా వివాహ వేడుకను వచ్చే ఏడాదికి వాయిదా వేశారని తెలిసింది.

11:12 November 10

టాప్ ​న్యూస్ ​@11AM

  • బట్టల షాప్​లో పల్సర్​ బైక్​.. 

ఓ వస్త్ర దుకాణంలో అందరూ తిరిగ్గా కూర్చోని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఓ పల్సర్​ బైక్​ దుకాణంలోకి దూసుకొచ్చింది. అక్కడ ఉన్నవాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో వారికి అర్ధం కాలేదు. ఈ దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.

  • అలరించబోయి విలపించాడు..!

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని పాత వీధిలో నాగల చవితి సందర్భంగా నిర్వహిస్తున్న నేల వేషాలు కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. సంతోష్ అనే వ్యక్తి నోట్లో డీజిల్ పోసుకుని ఫైర్ చేస్తుండగా... రివర్స్ ఫైర్ అయ్యింది. దీంతో.. నోట్లోనే నిప్పు అంటుకుంది. 

  • అఫ్గాన్ అంశంపై భారత్ కీలక భేటీ.. 

అఫ్గానిస్థాన్ అంశంపై భారత్ నిర్వహిస్తున్న సమావేశానికి ఏడు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు (NSA meeting on Afghanistan) హాజరయ్యారు. దిల్లీ వేదికగా జరిగే ఈ భేటీకి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ నేతృత్వం వహిస్తున్నారు. 

  • 66 కిలోల డ్రగ్స్ సీజ్

గుజరాత్​లోని ద్వారకాలో భారీగా డ్రగ్స్​ పట్టుబడ్డాయి. ద్వారకా-ఖంబాలియా రహదారిపై వెళ్తున్న ఓ కారు నుంచి 66 కేజీల మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.350 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

  • ఊరమాస్​ లుక్​లో అనసూయ

'పుష్ప' సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్​ వచ్చింది. ఈ చిత్రంలోని అనసూయ లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. దక్షాయనిగా ఆమె పాత్రను పరిచయం చేస్తూ కొత్త పోస్టర్​ను రిలీజ్​ చేసింది. ఇందులో మాస్​గా ఉన్న ఆమె లుక్​ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

10:31 November 10

టాప్ ​న్యూస్ ​@10AM

  • ఆర్జిత సేవల టికెట్ల ధరలు పెంపు

వేములవాడ రాజన్న ఆలయం(Vemulawada Rajanna Temple)లో ఆర్జిత సేవల టికెట్ల ధరల( ticket prices )ను పెంచారు. ధరలు పెంచుతూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

  • బట్టల షాప్​కెళ్లిన పల్సర్​ బైక్​

ఓ వస్త్ర దుకాణంలో అందరూ తిరిగ్గా కూర్చోని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఓ బైక్​ దుకాణంలోకి దూసుకొచ్చింది. ఉన్నట్టుండి బండి దుకాణంలోకి పిడుగులా వచ్చి పడేసరికి ఏం జరిగిందో అర్థంగాక వారికి వెన్నులో వణికుపుట్టింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

  • పెరిగిన పసిడి ధరలు

బంగారం ధర(Gold Price today) బుధవారం స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల మేలిమి పుత్తడిపై రూ.230 ఎగసింది. పసడి బాటలో పయనించిన వెండి(Silver price today).. కిలోకు రూ.61 పెరిగింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి.

  • చివరి రోజు కోహ్లీ ఏం చేశాడో తెలుసా?

టీ20 ప్రపంచకప్​(t20 world cup 2021)లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్​తో తన టీ20 కెప్టెన్సీకి ముగింపు పలికాడు విరాట్ కోహ్లీ(virat kohli captaincy news). అయితే ఈ మ్యాచ్​ రోజు విరాట్ ఏం చేశాడనే విషయాలను ఓ వీడియోగా రూపొందించి విడుదల చేసింది ఐసీసీ. ఇది కాస్తా నెట్టింట వైరల్​గా మారింది.

09:01 November 10

టాప్ ​న్యూస్ ​@9AM

  • దోషికి మరణశిక్ష విధించలేం'

బాధితురాలు చిన్నారి అని దోషికి (death penalty in india) మరణశిక్ష విధించలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కింది కోర్టులు దోషికి విధించిన మరణ శిక్షను 80 ఏళ్ల ఖైదుగా మార్పు చేసింది.

  • 21 రోజుల ఆదాయం ఎంతంటే?

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి 21 రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయ సిబ్బంది లెక్కించారు. స్వామి వారి హుండీ ఆదాయం రూ. 89 లక్షల 95 వేల 568 రూపాయలుగా అధికారులు లెక్కించారు. 188 గ్రా. మిశ్రమ బంగారం, 3కిలోల మిశ్రమ వెండి కానుకలుగా భక్తులు సమర్పించారు.

  • గొంతులో ఇరుక్కుపోయిన మాంసం ముక్క

మహబూబ్​నగర్​ జిల్లా కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని చేదు గుట్ట తండాలో అపశ్రుతి చోటుచేసుకుంది. శుభకార్యంలో జరిగిన విందులో భోజనం చేస్తుండగా గొంతులో మాంసం ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి చెందాడు.

  • మనుకు స్వర్ణం.. రాహీకి రజతం

ప్రెసిడెంట్స్‌ కప్‌ షూటింగ్‌ టోర్నమెంట్లో(Presidents Cup Shooting 2021) భారత స్టార్‌ షూటర్లు మను బాకర్‌(manu bhaker news), రాహీ సర్నోబత్‌ సత్తా చాటారు. మను స్వర్ణంతో మెరవగా.. రాహీకి రజతం దక్కింది.

  • విష్ణుప్రియ.. అభిమానుల గుండె లయ!

యాంకర్​గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ.. సోషల్​మీడియాలోనూ చురుగ్గా ఉంటుంది. తన హాట్​ అందాలతో కుర్రోళ్లను కవ్విస్తుంటుంది. నేడు(నవంబరు 10) ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్కేద్దాం..

07:49 November 10

టాప్ ​న్యూస్ ​@8AM

  • సీఎం కార్యాలయానికి ఛార్జీల పెంపు దస్త్రం

టీఎస్​ఆర్టీసీ ఛార్జీల పెంపుదల దస్త్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. ఇటీవల సంస్థ యాజమాన్యం బస్సు ఛార్జీలు పెంచాలని నిర్ణయించింది. దీనిపై త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

  • ఆరోగ్య బీమాకు జీఎస్‌టీ సుస్తీ

కరోనా మహమ్మారితో(Corona virus) ఆరోగ్య బీమా(Health insurance ) అవసరం ఎంతో పెరిగింది. అయితే.. ఆరోగ్య బీమాపై జీఎస్​టీ 18శాతం చెల్లించాల్సి రావటం పాలసీదార్లకు భారంగా మారుతోంది. దీంతో మధ్య తరగతి, విశ్రాంత ఉద్యోగులు తక్కువ మొత్తానికే పరిమితమవుతున్నారు. జీఎస్​టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు.

  • ఆహారాన్నిబట్టే పేగు బ్యాక్టీరియా

ఆహార అలవాట్లకు అనుగుణంగానే శరీరంలో (Gut microbiota composition) సూక్ష్మజీవులు ఉంటాయని తాజా పరిశోధన వెల్లడించింది. ఈ కారణంగానే భారతీయులు, పశ్చిమ దేశీయుల పేగుల్లోని సూక్ష్మజీవులు భిన్నంగా ఉంటున్నట్టు కనుగొన్నారు.

  • టీ20 కెప్టెన్​గా రోహిత్​

కొత్త కెప్టెన్‌(rohit sharma new captain)ను ఎంపిక చేయాలనుకుంటే సాధారణంగా జట్టుకు సుదీర్ఘంగా సేవలు అందించగలిగే ఆటగాడికి అవకాశమిస్తారు! కానీ కోహ్లీ కంటే సీనియర్‌, కెరీర్‌ చివర్లో ఉన్న రోహిత్‌ శర్మ వైపే బీసీసీఐ మొగ్గు చూపింది.. ఎందుకు?

  • ఆరోజు రాత్రంతా నిద్రపోలేదు

పుష్పకవిమానం'(anand deverakonda pushpaka vimanam) సినిమా కడుపుబ్బా నవ్విస్తుందని, ఇందులో ఆసక్తిరేకెత్తించే మలపులు ఉంటాయని చెప్పింది నటి​ శాన్వీ మేఘన(saanvi meghana). ఇంకా ఈ చిత్రం గురించి పలు విషయాలు చెప్పిన ఈ భామ.. అల్లు అర్జున్​ తన ఫేవరెట్​ హీరో అని తెలిపింది.

06:47 November 10

టాప్ ​న్యూస్ ​@7AM

  • దిగులే దిగుబడి!

సాగు ఖర్చులు పెరిగాయి. పంటలు గిట్టుబాటు కాలేదు. పత్తి మినహా మిగతా వాటికి ధర, డిమాండు కరవైంది. ఈ వానాకాలం సీజన్‌ అన్నదాతలకు కలిసిరాలేదు. డీజిల్‌ ధరల పెరుగుదల ప్రభావం అన్నింటిపైనా తీవ్రంగా పడింది. సాగు ఖర్చులు, మార్కెట్లలో వాటికి లభిస్తున్న ధరలపై ‘ఈనాడు-ఈటీవీ భారత్​’ క్షేత్రస్థాయి పరిశీలనలో రైతులు తమ కష్టాలు వివరించారు.

  • విస్తరిస్తున్న పరిశోధనలు

ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో కనిపెడుతున్న కొత్త అంశాలను ప్రతి వైద్యుడూ ఆపోసన పడుతూ తన చికిత్సా పద్ధతులకు నిరంతరం పదునుపెట్టుకుంటూ ఉండాలి. పరిశోధనలో వెల్లడయ్యే అంశాలను స్పష్టంగా వ్యక్తీకరించే సామర్థ్యాన్ని సంతరించుకోవాలి. వైద్య, ప్రయోగాత్మక పరిశోధనలు ప్రధానంగా లేబొరేటరీలలో జరుగుతాయి.

  • మలాలా వివాహం

నోబెల్​ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్​జాయ్​ వివాహం(Malala Yousafzai marriage) నిరాడంబరంగా జరిగింది. వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు తన భాగస్వామి అస్సర్​తో(malala yousafzai husband) కలిసి సామాజిక మాధ్యమాల వేదికగా(malala yousafzai marriage pics) వెల్లడించారు మలాలా.

  • ​ ఆధిపత్యమా?.. ప్రతీకారమా?

కుందేలుతో సింహం ఢీకొంటే ఏముంటుంది! అదే సింహం మరో సింహంతో తలపడితే! ఆ మజానే వేరు కదా! ఇప్పుడు అలాంటి పోరుకే వేళైంది! 2019 వన్డే ప్రపంచకప్‌(2019 world cup winner) జగజ్జేత ఇంగ్లాండ్‌ ఒకవైపు.. టెస్టుల్లో ప్రపంచ ఛాంపియన్‌ న్యూజిలాండ్‌ ఇంకోవైపు! టీ20 ప్రపంచకప్‌(t20 world cup 2021 semi final) సెమీఫైనల్లో సై అంటున్నాయి. బలాబలాలు చూస్తే ఏ జట్టుకా జట్టే బలీయం! అయితే చరిత్ర మాత్రం ఇంగ్లీష్‌ జట్టువైపే ఉంది. 2016 టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో, 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌పై గెలిచింది. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో కివీస్‌ పైచేయి సాధిస్తుందా.. ఇంగ్లాండ్‌పై ప్రతీకారం తీర్చుకుంటుందా!

  • ఇకపై చేయను: కార్తికేయ

'రాజావిక్రమార్క' సినిమా రెండున్నర గంటల పాటు కొత్త ప్రపంచంలోకి తీసుకెళుతుందని చెప్పారు హీరో కార్తికేయ(Rajavikramarka movie release date) . ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర విశేషాలు సహా కెరీర్​ గురించి పలు ఆసక్తికర సంగతులను చెప్పారు. ఈ మూవీకి 'రాజావిక్రమార్క' టైటిల్​ ఎందుకు పెట్టారు? తన పాత్ర కోసం ఎలా సన్నద్ధమయ్యారు? తన నుంచి రాబోయే కొత్త చిత్రాల వివరాలు? సహా పలు విషయాలను తెలిపారు. అవన్నీ ఆయన మాటల్లోనే..

04:46 November 10

టాప్ ​న్యూస్ ​@6AM

  • రాష్ట్రంలో మరో 13 డయాగ్నొస్టిక్‌ కేంద్రాలు

రాష్ట్రంలోని ‘తెలంగాణ నిర్ధారణ కేంద్రాల (టి-డయాగ్నొస్టిక్స్‌)’ పథకాన్ని అన్ని జిల్లాలకూ విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 20 జిల్లాల్లో నిర్ధారణ పరీక్షల కేంద్రాలను నెలకొల్పగా.. మరో 13 చోట్ల నెలకొల్పేందుకు తాజాగా ఆదేశాలిచ్చింది.

  • 'దోచుకున్న వారిని జైలుకు పంపుతాం'

ప్రజల సొమ్ము దోచుకుంటున్న వారి ఆగడాలను.. కేంద్రం గమనిస్తోందని... సమయం వచ్చినప్పుడు వారిని జైలులో పెడుతుందని... భాజపా రాష్ట్ర ఇంఛార్జి తరుణ్‌ఛుగ్​ హెచ్చరించారు. ట్యాంక్‌ బండ్‌ వద్ద దళిత మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన... డప్పుల మోత కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 

  • '80 లక్షల ఓట్లు.. 78 సీట్లే లక్ష్యం'

పార్టీ నియమనిబంధనలు ఉల్లంఘించి పార్టీకి నష్టం కలిగించేట్లు మీడియా ముందుకు వెళ్లినట్లు అయితే చర్యలు తప్పవని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానికం ఠాగూర్‌ హెచ్చరించారు (Manickam Tagore ). కొంపల్లిలో జరిగిన పార్టీ శిక్షణా కార్యక్రమంలో ఆయన క్షేత్ర స్థాయిలో పార్టీ నాయకులు నిర్వర్తించాల్సిన బాధ్యతలపై ప్రసంగించారు.

  • కిష్టరాయిన్‌పల్లి జలాశయం నిర్వాసితుల నిరసన

నల్గొండ జిల్లా (nalgonda district) కిష్టరాయిన్‌పల్లి జలాశయం నిర్వాసితులు మరోసారి ఆందోళన బాటపట్టారు (kishtarayanapalli reservoir residents). పరిహారం చెల్లించకుండా బలవంతంగా చేపడుతున్న పనులు అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. నాంపల్లి మండలం లక్ష్మణాపురం గ్రామస్థులు... సాగునీటి ప్రాజెక్టుల్లో ఇళ్లు, భూములు కోల్పోయారు.

  • తదుపరి నౌకాదళ అధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ హరికుమార్‌

భారత నౌకదళ తదుపరి అధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ ఆర్‌. హరికుమార్‌ను రక్షణ శాఖ నియమించింది. ప్రస్తుతం ఆయన పశ్చిమ నౌకాదళ కమాండ్‌కు ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్ ఇన్‌ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

  • నిర్మాణంలో ఒప్పంద పత్రమే కీలకం

గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలే పరమావధిగా కేంద్రం 2016లో 'రెరా' చట్టాన్ని రూపొందించింది. రెరా చట్టం సెక్షన్‌ 13 బిల్డర్‌ కొనుగోలుదారుల ఒప్పంద పత్రంలో ఏయే అంశాలుండాలో విపులంగా విశదీకరించింది.ఉల్లంఘనలకు శిక్షల్నీ ప్రస్తావించింది.

  • ప్రముఖ నటుడుకు జెఫ్‌ బెజోస్‌ వార్నింగ్​..! 

హాలీవుడ్‌ అగ్ర హీరో నటుడు లియోనార్డో డికాప్రియోను అమెజాన్​ అధినేత జెఫ్​ బెజోస్​ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక్కడకు రా... చూసుకుందాం అంటూ వార్నింగ్​ ఇచ్చారు. ఇంతకు వారి మధ్య ఏం జరిగింది?

  • వ్యాక్సిన్​ వేసుకుని కోటీశ్వరురాలయ్యింది..

ఆస్ట్రేలియాలో (Vaccine Lottery Australia) వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి నిర్వహించిన లాటరీలో పాల్గొన్న ఓ 25ఏళ్ల యువతి లక్కీ డ్రా సొంతం చేసుకొని ఒకేసారి కోటీశ్వరురాలు అయ్యింది. తాజాగా తీసిన లాటరీలో జాన్నే ఝు అనే సిడ్నీ యువతి రూ.5.4కోట్ల నగదు బహుమతి గెలుచుకుంది.

  • 'మరో 50 ఏళ్లు.. భారత స్టాక్‌ మార్కెట్ల పరుగే'

భారతీయ స్టాక్​మార్కెట్​లు వచ్చే 50 ఏళ్ల వరకూ దూకుడును ప్రదర్శిస్తాయని ప్రముఖ మదుపరి మార్క్​ మొబియస్​ తెలిపారు. గతంలో చైనా మార్కెట్​లో ఉన్న పరిస్థితి నేడు భారత మార్కెట్​లో కనిపిస్తోందని అన్నారు.

  • ఫైనల్​ మ్యాచ్​కు వందశాతం

నవంబర్ 14న జరగనున్న టీ20 ప్రపంచకప్​ ఫైనల్​ మ్యాచ్(T20 world cup final 2021) కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే.. ఫైనల్​ మ్యాచ్​ 100 శాతం సీటింగ్​ సామర్థ్యంతో నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది.

Last Updated : Nov 10, 2021, 10:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.