ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

top news
top news
author img

By

Published : Nov 9, 2021, 6:03 AM IST

Updated : Nov 9, 2021, 10:04 PM IST

21:56 November 09

టాప్ ​న్యూస్ ​@10PM

  •  మంత్రికి అదనపు బాధ్యతలు

వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు (Telangana Health Minister) అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దనున్న వైద్యారోగ్యశాఖను ఆయనకు అదనంగా అప్పగించారు. ఈ మేరకు సంబంధిత దస్త్రంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతకం చేశారు.  

  • అల్లు అర్జున్​కు లీగల్​ నోటీసులు..!

సైలిష్​​ స్టార్​ అల్లు అర్జున్(stylish star allu arjun)​కు లీగల్​ నోటీసులు(Allu Arjun - TSRTC Notice) వెళ్లాయి. సినిమాలు, షూటింగ్​లతో ఎప్పుడూ బిజీగా ఉండే అల్లు అర్జున్​కు లీగల్​ నోటీసులు(Allu Arjun - TSRTC Notice) రావటమేంటి..? అందరి పట్ల ఎంతో హుందాగా ప్రవర్తించే ఈ సైలిష్​స్టార్​(stylish star allu arjun)కు నోటీసులు ఎవరు పంపారు..? తన స్పీచు(allu arjun speech)లతో అభిమానులకు ఎన్నో మంచి విషయాలు చెప్పే బన్నీ.. అంత పెద్ద ఏం తప్పు చేశాడు..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే..

  • ఆ జాబితాలో మోదీకి రెండో స్థానం

ట్విట్టర్​లో 2021గానూ ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు మోదీ. టీమ్​ఇండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెందూల్కర్(sachin tendulkar recent news)​ 35వ స్థానం దక్కించుకున్నారు.

  •  ఆయనకు మరణించాక పద్మవిభూషణ్‌..!

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మరణానంతరం పద్మవిభూషణ్‌ అవార్డు వరించింది. ఎస్పీబీ తరఫున ఆయన తనయుడు చరణ్‌ మంగళవారం ఈ అవార్డుని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా స్వీకరించారు.

  • రోహిత్​కే  పగ్గాలు..!

న్యూజిలాండ్​తో సిరీస్​ కోసం టీ20 స్క్వాడ్​ను ప్రకటించింది బీసీసీఐ. కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్​ శర్మకు అప్పగించింది.

20:47 November 09

టాప్ ​న్యూస్ ​@9PM

  • మంత్రి హరీశ్‌రావుకు వైద్యారోగ్యశాఖ బాధ్యతలు

మంత్రి హరీశ్‌రావుకు వైద్యారోగ్యశాఖ బాధ్యతలు అప్పగించింది.  ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌రావుకు అదనపు బాధ్యతలను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం.

  •  అల్లు అర్జున్​కు లీగల్​ నోటీసులు.. !

సైలిష్​​ స్టార్​ అల్లు అర్జున్(stylish star allu arjun)​కు లీగల్​ నోటీసులు వెళ్లాయి. సినిమాలు, షూటింగ్​లతో ఎప్పుడూ బిజీగా ఉండే అల్లు అర్జున్​కు లీగల్​ నోటీసులు రావటమేంటి..? అందరి పట్ల ఎంతో హుందాగా ప్రవర్తించే ఈ సైలిష్​స్టార్​(stylish star allu arjun)కు నోటీసులు ఎవరు పంపారు..? తన స్పీచు(allu arjun speech)లతో అభిమానులకు ఎన్నో మంచి విషయాలు చెప్పే బన్నీ.. అంత పెద్ద ఏం తప్పు చేశాడు..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే..

  •  ఈటల రాజేందర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్..!

ఈటల రాజేందర్​ రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన హుజూరాబాద్​ ఉపఎన్నిల్లో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​పై ఈటల విజయం సాధించారు.

  • రెడ్​ అలర్ట్​- రెండు రోజుల పాటు సెలవు

భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న తమిళనాడు రాష్ట్రాన్ని మరో రెండు రోజులు వర్షాలు ముంచెత్తనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది తమిళనాడు ప్రభుత్వం.

  • ఆయనకు మరణానంతరం పద్మవిభూషణ్‌

19:51 November 09

టాప్ ​న్యూస్ ​@8PM

  • ' మేమెప్పుడూ చెప్పలే'

తాను కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిలో ఇప్పుడే మాట్లాడానని.. వరి వేయొద్దని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని ఎంపీ ధర్మపురి అర్వింద్​ స్పష్టం చేశారు. దళిత బంధు, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్​, నిరుద్యోగ భృతిపై వంటి హామీల నుంచి ప్రజలను డైవర్ట్​ చేసేందుకే కేంద్రంపై సీఎం కేసీఆర్​ నిందలు వేస్తున్నారని అర్వింద్​ ఆరోపించారు.

  • ' హైడ్రోజన్ బాంబు లాంటి వార్త చెప్తా'

1993 ముంబయి పేలుళ్ల కేసు దోషులతో తనకు సంబంధం ఉందని దేవేంద్ర ఫడణవీస్ చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్(nawab malik fadnavis)​. తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పఢణవీస్​కు సంబంధించి హైడ్రోజన్ బాంబు లాంటి విషయం బయటపెడతానన్నారు(nawab malik devendra fadnavis ).

  • ఎనిమిదికి చేరిన మృతులు

భోపాల్‌లోని కమలా నెహ్రూ ఆస్పత్రిలోని చిన్నారుల వార్డులో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. మృతుల తల్లిదండ్రులకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు.

  • ఆయన​ కూతురికి అంతర్జాతీయ అవార్డు

దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్​ ఏఆర్​ రెహమాన్ కూతురు (AR Rahman's Daughter) ఖతీజా రెహమాన్.. తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటోంది. ఆమె రూపొందించిన ఓ పాటకు అంతర్జాతీయ అవార్డు లభించింది.

18:35 November 09

టాప్ ​న్యూస్ ​@7PM

  •  మళ్లీ వాయిదా

తెరాస ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించతలపెట్టిన విజయగర్జన సభ(TRS Vijaya Garjana News) మరోసారి వాయిదా పడింది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో రింగు రోడ్డు పక్కన ఈనెల 29న జరగాల్సిన ఈ సభ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. 

  • హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో..!

రాష్ట్రంలో నిర్వహించే ఎమ్మెల్యేల కోటా, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల(mlc elections in telangana 2021)కు సంబంధించి.. హైదరాబాద్‌ మినహా అన్ని ఉమ్మడి జిల్లాల్లో నేటి నుంచే ఎన్నికల నియమావళి(election code in telangana) అమల్లోకి రానుంది. ఎలాంటి పబ్లిక్‌ మీటింగులు, రాజకీయ సమావేశాలు నిర్వహించేందుకు అనుమతి ఉండదని సీఈఓ శశాంక్​ గోయల్​ స్పష్టం చేశారు.

  •  ట్విట్టర్​లో మోదీకి రెండో స్థానం

  • విశ్వక్‌ సేన్‌ పెళ్లి కష్టాలు..!'

'పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయిస్తారు' అనేది పెద్దల మాట. అంటే మన భాగస్వామి ఎవరో ముందే రాసిపెట్టుంటుందన్న మాట. ఈ కాన్సెప్ట్‌తోనే త్వరలో సందడి చేయనున్నారు విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen New Movie). ఆయన హీరోగా పెళ్లి నేపథ్యంలో దర్శకుడు అశ్వత్‌ మరిముత్తు ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. తాజాగా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ని చిత్ర బృందం పంచుకుంది.

  • ఆ మ్యాచ్​కు అదిరిపోయే 'వ్యూస్'.. !

భారత్​లో క్రికెట్​ దైవంతో సమానం. ఇక టీమ్​ఇండియా​- పాకిస్థాన్ మ్యాచ్​(IND vs PAK T20) కోసం అభిమానులు ఎంతలా వేచి చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే టీ20 ప్రపంచకప్​ టోర్నీలో జరిగిన భారత్- పాకిస్థాన్​ మ్యాచ్​కు వచ్చిన వ్యూస్​(IND vs PAK T20 viewership) చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. టీ20 చరిత్రలోనే ఏ మ్యాచ్​కు రానన్ని వ్యూస్​ ఈ మ్యాచ్​కు రావడం విశేషం.

17:42 November 09

టాప్ ​న్యూస్ ​@6PM

  •  నేటినుంచే కోడ్ అమలు

  •  సీఎం టూర్​ రద్దు

తెరాస ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించతలపెట్టిన విజయగర్జన సభ(TRS Vijaya Garjana News) మరోసారి వాయిదా పడింది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో రింగు రోడ్డు పక్కన ఈనెల 29న జరగాల్సిన ఈ సభ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది

  • 'తల నరుక్కోవడానికైనా సిద్ధం'

మూడు ఎకరాలు ఇవ్వని.. అంబేడ్కర్​ విగ్రహం పెట్టని ముఖ్యమంత్రి దళితులకు క్షమాపణ చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్​ చెప్పారు. కేసీఆర్​ ప్రెస్​మీట్​లో తనపై చేసిన వ్యాఖ్యలపైనా సంజయ్​ స్పందించారు. తెలంగాణ ప్రజల కోసం తన తల నరుక్కోవడానికి సిద్ధమన్నారు.

  • ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతోంది..!

ధాన్యం కొనుగోలు విషయంలో అధికార పార్టీకి, భాజపా నేతలకు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్​పై భాజపా నేతలు చేసిన వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్​రెడ్డి మండిపడ్డారు. ధాన్యం సమస్యకు పరిష్కారం చూపమంటే ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • 'ఆ పేలుళ్ల​ దోషితో ఆయనకు సంబంధాలున్నాయి'

మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌కు(Nawab Malik Latest News) చీకటి సామ్రాజ్యం(అండర్ వరల్డ్)తో సంబంధాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌(Fadnavis News). 1993లో ముంబయి పేలుళ్ల కేసులో దోషిగా తేలిన అండర్‌ వరల్డ్ వ్యక్తితో మాలిక్ ఆస్తి ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు.

16:46 November 09

టాప్ ​న్యూస్ ​@5PM

  • మెట్రో ప్రయాణికులకు గుడ్​న్యూస్​

హైదరాబాద్‌ మెట్రో(metro timings hyderabad) ప్రయాణికులకు శుభవార్త. రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచే తొలి మెట్రో రైలు(metro timings hyderabad) ప్రారంభం కానుంది. 

  • 'థర్డ్​ వేవ్' అలర్ట్.. శరవేగంగా వాటి నిర్మాణం!

కరోనా రెండో దశ నేర్పిన పాఠాలను దృష్టిలో ఉంచుకొని.. మూడో వేవ్​కు సిద్ధమవుతోంది గుజరాత్​లోని రాజ్​కోట్ యంత్రాంగం. అత్యవసర సందర్భాల్లో అవసరమయ్యేలా పోర్టబుల్ ఆస్పత్రులను (Temporary Hospitals Covid) నిర్మిస్తోంది. పూర్తి స్థాయి ఆస్పత్రులలో ఉండే వసతులను.. ఇందులో (Portable Hospital Unit) ఏర్పాటు చేస్తోంది.

  • పరువు కోసం ఐదుగురు..!

సమాజంలో పరువు పోతుందన్న భయంతో ఓ కుటుంబం విషం తీసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కర్ణాటకలోని కోలార్​లో ఈ ఘటన జరిగింది.

  • 'బాలీవుడ్ హీరో నా చిత్రంలో నటిస్తారేమో'

'శ్యామ్​సింగ్​రాయ్'(Shyam singharoy movie)​ సినిమా అన్ని భాషల వారికి నచ్చుతుందని అన్నారు హీరో నాని. ఈ చిత్రంలోని క్యారెక్టర్‌కు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు(shyam singharoy movie cast). ఇంకా ఈ సినిమా గురించి పలు ఆసక్తికర సంగతులను తెలిపారు. అవన్నీ ఆయన మాటల్లోనే..

  •  ఐదేళ్లు..ఆయన ఘనతలివే..!

ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్‌ జట్లలో ఒకటైన టీమ్​ఇండియాకు ఐదేళ్లు మార్గనిర్దేశం చేసిన కోచ్‌ రవిశాస్త్రి(Ravi Shastri News) శకం ముగిసింది. టీ20 ప్రపంచకప్‌లో సోమవారం భారత్‌ ఆడిన చివరి మ్యాచ్‌తో కోచ్‌గా శాస్త్రి పాత్రకు తెరపడింది. మరి ఈ ఐదేళ్లలో శాస్త్రి సాధించిన ఘనతలేంటి? ఎత్తుపల్లాలు ఏమిటి? భవిష్యత్తులో రవిశాస్త్రి ఏ పాత్రలో కనిపించబోతున్నారు.

15:52 November 09

టాప్ ​న్యూస్ ​@4PM

  •  'లోపల ఒరిజినల్ అట్లనే ఉంది'

వరి సాగుచేయొద్దంటూ దిల్లీ భాజపా వాళ్లు ఉత్తరాలు రాస్తారని.. సిల్లీ భాజపా (తెలంగాణ భాజపా నేతలను ఉద్దేశించి) వరి సాగుచేయాలంటున్నారని మండిపడ్డారు.. మంత్రి కేటీఆర్​.. కామారెడ్డిలో పర్యటించిన ఆయన కాంగ్రెస్​, భాజపా నేతల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సాఫ్ట్ అయిపోయారు అనుకుంటున్నారేమో.. కానీ లోపల ఒరిజినల్ అట్లనే ఉందన్నారు.

  • 'వారిపై మన ప్రతాపాన్ని చూపిద్దాం'

పార్టీలో ఒకరిపైఒకరు ప్రతాపం చూపించడం కాకుండా.. కలిసికట్టుగా ఉండి ఆ ప్రతాపాన్ని తోడు దొంగలైన తెరాస-భాజపాలపై చూపించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC chief Revanth Reddy) కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు సూచించారు. పార్టీ పటిష్ఠానికి కృషి చేస్తూ.. ప్రజాసమస్యలపై పోరాడదామని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో సోనియమ్మ రాజ్యం తీసుకొచ్చి.. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం అందిద్దామని అన్నారు.

  •  ఆ పాలసీపై మంత్రి శ్రీనివాస్ గౌడ్

నూతన మద్యం పాలసీలో దరఖాస్తుల ధర, లైసెన్స్ ఫీజులను పెంచలేదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. కొత్త మద్యం విధానంతో అన్ని వర్గాలకు లబ్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒకవ్యక్తి ఎన్ని దుకాణాలకైనా పోటీ పడవచ్చని మంత్రి స్పష్టం చేశారు.

  • ఆమె.. 'తులసి' కోటలో విరిసిన 'పద్మం'

దిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో కర్ణాటకకు చెందిన 72ఏళ్ల తులసి గౌడ అనే బామ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పర్యావరణ పరిరక్షణ కోసం చేసిన కృషికి గాను దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం ఆమెను వరించింది. అయితే పాదరక్షలు కూడా ధరించకుండానే ఆమె ఈ కార్యక్రమానికి హాజరుకావడం విశేషం.

  • దానిపై భారత్​ స్పందన ఇదే!

అరుణాచల్​ప్రదేశ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా నిర్మించుకున్న గ్రామం(china village in india).. ఆ దేశ ఆధీనంలోనిదేనని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి(india china news). 1959లో ఆ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుందని, అప్పటి నుంచి నిర్మాణాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నాయి.

14:45 November 09

టాప్ ​న్యూస్ ​@3PM

  •  ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్

తెలంగాణలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్​ను ఈసీ విడుదల చేసింది. నేటి నుంచి ఈనెల 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని వెల్లడించింది. 17వ తేదీన పరిశీలన చేస్తామని స్పష్టం చేసింది. 

  • 'ఒక్కో జవానుపై రూ.11లక్షలు' ఎందుకంటే..!

వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్(Lac Indian Army) అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. చైనాతో పాటు శీతాకాలాన్ని(Indian Army In Winter) కూడా సమర్థంగా ఎదుర్కొనేందుకు సైన్యం ఏర్పాట్లు చేసుకుంటోంది. సరిహద్దు రక్షణకు సైనిక మోహరింపుల్లో ​ ఏమాత్రం వెనకాడటం లేదు. బలగాలకు అవసరమైన ఆయుధాలు, ఇతర పరికరాలను రేయింబవళ్లు సరిహద్దులకు తరలిస్తోంది.

  • 'కాంగ్రెస్ అంటే..  అర్థం తెలుసా..!'

2007-2012 మధ్య రఫేల్​ ఒప్పందం(Rafale Deal News) విషయంలో కాంగ్రెస్​ అవినీతికి పాల్పడిందని భాజపా జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర(Sambit Patra) ఆరోపించారు. 

  • ఏడు దేశాలతో భారత్ కీలక భేటీ-  అందుకేనా?

అఫ్గాన్ అంశమే ప్రధాన అజెండాగా రష్యా, ఇరాన్ సహా సెంట్రల్ ఆసియాలోని ఐదు దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో బుధవారం కీలక భేటీ నిర్వహిస్తోంది భారత్(india meet on afghanistan)​. పాకిస్థాన్​, చైనా మాత్రం సమావేశానికి హాజరయ్యేందుకు నిరాకరించాయి. 

  • 'అతని స్థానంపై అనుమానాలొద్దు'

జట్టులోకి ఎంతమంది యువ ఆటగాళ్లు వచ్చినా.. విరాట్ కోహ్లీ(virat kohli news) స్థానాన్ని భర్తీ చేయలేరని అభిప్రాయపడ్డాడు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(virender sehwag on kohli). కోహ్లీ బ్యాటింగ్​ స్థానంపై ప్రశ్నలు లేవనెత్తడం సరికాదని తెలిపాడు.

13:59 November 09

టాప్ ​న్యూస్ ​@2PM

  • ఎవరూ భయపడరు

సీఎం కేసీఆర్‌(cm kcr news) తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి(kishan reddy latest news) అన్నారు. ధాన్యం సేకరణకు కేంద్రం చేపట్టిన చర్యలను తెలంగాణ ప్రజలకు వివరిస్తామని ఆయన చెప్పారు. ధాన్యం సేకరణ కోసం కేంద్రం పెద్దఎత్తున ఖర్చు చేస్తోందని తెలిపారు. పంజాబ్ తర్వాత అత్యధికంగా తెలంగాణ నుంచే ధాన్యం సేకరిస్తున్నట్లు స్పష్టం చేశారు.

  • దాతలు భాగస్వామ్యమైతే...

ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో దాతలు భాగస్వామ్యమైతే... రాష్ట్రం మరింత ప్రగతిపథంలో పయనిస్తుందని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ (MINISTER KTR LATEST NEWS) తెలిపారు. ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి.... 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కామారెడ్డి జిల్లా బీబీపేట్​లో జడ్పీ పాఠశాల భవన ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కేటీఆర్‌తో పాటు మంత్రులు సబితాఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌లు.... దాత సుభాష్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ఈ భవనాలను ప్రారంభించారు.

  • భారత్‌ తగ్గేదేలే!

  • ఆర్సీబీ కొత్త కోచ్​గా బంగర్

వచ్చే రెండు ఐపీఎల్(ipl 2021 news) సీజన్ల కోసం కొత్త కోచ్​ను నియమించుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(royal challengers bangalore 2022). ప్రస్తుతం ఆ జట్టుకు బ్యాటింగ్ కోచ్​గా ఉన్న సంజయ్ బంగర్​(sanjay bangar rcb coach)కు హెడ్​ కోచ్​గా బాధ్యతలు అప్పగించింది. గత సీజన్​లో కోచ్​గా ఉన్న మైక్ హసెన్​.. జట్టు క్రికెట్ వ్యవహారాల డైరెక్టర్​గా కొనసాగనున్నాడు.

  • కొత్త సినిమా కబుర్లు

కొత్త సినిమా కబుర్లు వచ్చాయి. మెగాస్టార్​ చిరంజీవి నటిస్తున్న 'భోళాశంకర్​'లో హీరోయిన్​గా తమన్నా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. శ్రీవిష్ణు నటించిన 'అర్జున ఫల్గుణ' టీజర్​ విడుదలై ఆకట్టుకుంటోంది. ఇక రాజ్​తరుణ్​ 'అనుభవించు రాజా' సినిమాలోని ఓ సాంగ్​ విడుదలైంది.

13:01 November 09

టాప్ ​న్యూస్ ​@1PM

  • బయట రచ్చ చేయకండి..

హుజూరాబాద్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌కు తక్కువ ఓట్లు వచ్చాయంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదేదో మాట్లాడరని.. మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్‌ కూడా అల్టిమేటం జారీ చేశారని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. ఏమైనా చర్చించాలి అనుకుంటే పార్టీ అంతర్గత సమావేశాల్లోనే చర్చించాలని.. బయట మాట్లాడి పరువు తీయొద్దని సూచించారు.

  • తమిళనాడులో వర్ష విలయం..

ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో తమిళనాడు (Tamil Nadu Rain) అతలాకుతలం అవుతోంది. చెన్నై నగరం జల దిగ్బంధంలో(Chennai Rain) చిక్కుకుంది. వర్షాల కారణంగా ఆ రాష్ట్రంలో ఐదుగురు వ్యక్తులు మరణించగా.. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. 

  • అన్నదమ్ములిద్దరూ బావి గోడపై కూర్చొని..

అన్నదమ్ములిద్దరూ అకస్మాత్తుగా బావిలో పడి (brothers fell in well) మృతి చెందారు. బావి గోడపై కూర్చొని సరదాగా మచ్చటిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఒడిశా సంబల్​పుర్​లో ఈ ఘటన జరిగింది.

  • సూర్య.. బయోపిక్​ల బాస్​.. నటనకు కేరాఫ్​

కోలీవుడ్​ స్టార్ హీరో సూర్య నటించిన కొత్త సినిమా 'జైభీమ్'​. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం అభిమానుల మనసు దోచుకుంది. ఈ మూవీలో జస్టిస్‌ చంద్రు పాత్రలో సూర్య నటన అద్భుతంగా ఉంది.

  • డ్రెస్సింగ్​ రూమ్​లో రవిశాస్త్రి భావోద్వేగ సందేశం

టీమ్ఇండియా కోచ్​గా తన పదవీ కాలం పూర్తి చేసుకున్నాడు రవిశాస్త్రి. టీ20 ప్రపంచకప్​(t20 world cup 2021)​లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్​.. కోచ్​గా అతడికి చివరిది. ఈ మ్యాచ్​లో విజయం సాధించిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్​లో జట్టు సభ్యులకు తన చివరి సందేశాన్ని అందించాడు రవి

11:43 November 09

టాప్ ​న్యూస్ ​@12PM

  • పాఠశాలను ప్రారంభించిన కేటీఆర్​

కామారెడ్డి జిల్లా మంత్రి కేటీఆర్​(minister KTR latest news) పర్యటిస్తున్నారు. అందులో భాగంగా... మంత్రి బీబీపేట్​ జడ్పీ పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. కార్పొరేట్‌ను తలదన్నేలా బీబీపేట్ జడ్పీ ఉన్నత పాఠశాల భవనం నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు.

  • 'తగ్గించిన కోటాను పంపించండి'

రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఎరువులు సరఫరా చేయాలని కోరుతూ కేంద్ర ఎరువుల మంత్రి మాండవీయకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Telangana agriculture Minister Niranjan Reddy) లేఖ రాశారు. అక్టోబర్, నవంబర్​లో తక్కువగా సరఫరా చేశారన్న మంత్రి.. డిసెంబర్ నుంచి మార్చి వరకు సరఫరాలో ఆ కోటాను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

  • ఎస్​బీఐ పీఓ అడ్మిట్​ కార్డ్​లు విడుదల

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) పీఓ ప్రిలిమ్స్​ 2021 పరీక్ష అడ్మిట్​ కార్డులు(Sbi Po Admit Card 2021) విడుదలయ్యాయి. ఎస్​బీఐ అధికారిక వెబ్​సైట్​ నుంచి అభ్యర్థులు హాల్​టికెట్లను పొందవచ్చు.

  • ప్రపంచకప్​లో రాణించాలంటే..

టీ20 ప్రపంచకప్​లో సెమీఫైనల్ చేరకుండానే నిష్క్రమించింది టీమ్ఇండియా. దీంతో వచ్చే ఏడాది జరిగే మెగాటోర్నీపై దృష్టిసారించాలని తెలిపాడు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్. ఈ టోర్నీ ఆస్ట్రేలియాలో జరగబోతున్నందున.. అక్కడి పిచ్​లకు తగినట్లు జట్టులో మార్పులు చేసుకోవాలని సూచించాడు.

  • 'నాటు నాటు' సాంగ్​ ప్రోమో

'ఆర్​ఆర్​ఆర్'(naatu naatu rrr) సినిమా నుంచి 'నాటు నాటు' సాంగ్​ ప్రోమో వచ్చేసింది. ఈ ప్రోమో పాటపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఎన్టీఆర్​, రామ్​చరణ్​ కలిసి నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది.

10:45 November 09

టాప్ ​న్యూస్ ​@11AM

  • నూతన మద్యం దుకాణాలకు షెడ్యూల్

నూతన మద్యం దుకాణాల ఏర్పాటుకు షెడ్యూల్ విడుదల అయింది. నేటి నుంచి ఈ నెల 18 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ల కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ ఉండనుంది. ఆదివారం మినహా మిగిలిన పని దినాల్లో దరఖాస్తుల స్వీకరణ చేయనున్నారు. 

  • నిత్యపెళ్లికొడుకు మోసం..

నల్గొండలో నిత్య పెళ్లికొడుకుపై పోలీసులకు ఫిర్యాదు అందింది. పెళ్లి పేరుతో విలియమ్స్ అనే వ్యక్తి 19 మంది మహిళలను మోసం చేశాడు. నిందితుడు నల్గొండలోని ఓ చర్చిలో పియానో వాయిస్తున్నాడు. ఇదే అదనుగా భావించిన విలియమ్స్... చర్చికి వచ్చే యువతులను, మహిళలను లోబర్చుకున్నాడు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. 19 మందిని మోసం చేశాడు. 

  • వ్యోమగాముల తిరుగు పయనం!

అంతరిక్ష కేంద్రం నుంచి నలుగురు వ్యోమగాములు భూమికి (Astronauts returning from Space) తిరుగు పయనమయ్యారు. స్పేస్ఎక్స్ వ్యోమనౌకలో వీరు భూమి మీదకు (Astronauts return to Earth 2021) చేరుకోనున్నారు. మరోవైపు, నలుగురు వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పంపిస్తోంది నాసా.

  • స్వల్పంగా తగ్గిన పసిడి ధర

బంగారం (Gold Rate Today), వెండి (Silver price today) ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.130 తగ్గగా.. కిలో వెండి ధర రూ.53 దిగొచ్చింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • బంగార్రాజు అదిరిపోయే స్టెప్పులు!

'బంగార్రాజు' సినిమాలోని 'లడ్డుండా' పాట విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ గీతంలో నాగ్​ తన స్టెప్పులతో హూషారెత్తించారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

09:56 November 09

టాప్ ​న్యూస్ ​@10AM

  • మైనర్లపై 4వేల నీలిచిత్రాలు

నీలి చిత్రాల వెబ్​సైట్లపై కేంద్రం ఇప్పటికే కొరడా ఝుళిపిస్తోంది. మైనర్లపై నీలి చిత్రాలు తీసినా, వాటిని చూసినా.. పోలీసులు చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తున్నారు. సాంకేతికతను ఉపయోగించుకొని నిందితుల సమాచారం సేకరిస్తున్నారు. జాతీయ చిన్నారుల హక్కుల పరిరక్షణ కమిషన్, పలు సంస్థల సహకారంతో మైనర్లపై నీలి చిత్రాల వ్యాపారాలు నిర్వహించే వాళ్ల గుట్టు రట్టు చేస్తోంది.

  • దేశంలో మరో 10 వేల కేసులు

భారత్​లో కరోనా కేసులు (India covid cases) స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 10,126 మందికి కరోనా (Corona cases in India) సోకింది. వైరస్​ ధాటికి మరో 332 మంది మరణించారు.

  • ఉద్యోగం ఆశ చూపి అత్యాచారం

ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. బలవంతంగా మద్యం తాగించి, అఘాయిత్యానికి ఒడిగట్టిన కిరాతకుడు.. ఆపై హత్యాయత్నం చేశాడు. దిల్లీలో జరిగిందీ ఘటన.

  • 'బ్రాడ్​మన్​కు అయినా కష్టమే'

టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)​లో అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చింది టీమ్ఇండియా. సెమీస్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. కాగా, కోచ్​గా రవిశాస్త్రి(ravi shastri t20 world cup)కి ఇదే చివరి టోర్నీ. ఈ నేపథ్యంలో అతడి కెరీర్​తో పాటు ప్రపంచకప్​లో వైఫల్యంపై స్పందించాడు రవి. సుదీర్ఘంగా బయోబబుల్​లో ఉండటం వల్ల ఆటగాళ్లు అలసిపోయారని తెలిపాడు.

  • ప్రెగ్నెన్సీపై స్పందించిన కాజల్​ 

గతేడాది అక్టోబరులో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను(gautam kitchlu kajal aggarwal) పెళ్లి చేసుకున్న స్టార్​ హీరోయిన్​ కాజల్.. ప్రస్తుతం గర్భంతో ఉందని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది(kajal agarwal latest news). తాజాగా ఈ విషయమై స్పందించిన ఈ ముద్దుగుమ్మ.. "ఈ విషయం గురించి ఇప్పుడు నేను మాట్లాడాలని అనుకోవట్లేదు. సరైన సమయంలో దీని గురించి స్పందిస్తా" అని చెప్పింది(kajal agarwal updates).

08:56 November 09

టాప్ ​న్యూస్ ​@9AM

  • నేరుగా వాళ్ల పైకి ఫైరింగ్ జరిపారా..?'

దిశ హత్యాచారం నిందితుల ఎన్​కౌంటర్​ కేసులో(Disha encounter case) జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ (Justice sirpurkar commission) విచారణ కొనసాగుతోంది. కమిషన్‌ ఎదుట దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న కానిస్టేబుల్‌ రవి హాజరు కాగా.. కమిషన్ ప్రశ్నలు కురిపించింది.

  • వింటారనుకుంటే మంట పెట్టారు

వారంతా భారత్‌లోని సంపన్నుల పిల్లలు. డబ్బుకు (azadi ka amrit mahotsav) వెరవకుండా కేంబ్రిడ్జ్‌లో చదువుకోవటానికి వచ్చారు. ఈ కుర్రకారు బుర్రల్లో తమ 'తెల్ల'పాఠాలు నింపి.. బానిస దొరలుగా తయారు చేసి.. భారత ప్రజలపై రుద్దాలని చూసింది బ్రిటిష్‌ ప్రభుత్వం! తమ దగ్గర చదువుకున్నవారు మాట వింటారనుకుంది. కానీ వారు కాస్తా (cambridge majlis) తమ ప్రభుత్వానికే మంటపెట్టారు. బ్రిటిష్‌ రాజ్‌ను సమర్థిస్తారనుకుంటే సాయుధులుగా.. సమరయోధులుగా తేలారు. కారణం- కేంబ్రిడ్జ్‌ మజ్లిస్‌!

  • సరఫరా స్తంభిస్తే ఇక్కట్లే?

లాక్‌డౌన్ల వల్ల సరకులకు గిరాకీ పడిపోయినా, ఆంక్షల ఎత్తివేత అనంతరం కొద్దిగా పెరిగింది. అయినా ఆ కాస్త గిరాకీనీ తీర్చలేని పరిస్థితి ఏర్పడిందంటే కారణం- సరఫరా గొలుసులు అస్తవ్యస్తం కావడమే. కరోనా సంక్షోభం నుంచి ఏ దేశమూ తప్పించుకోలేకపోతోంది. సంపన్న దేశాలు సైతం రాగల ఆరు నెలల్లో సరకుల కొరతను తీర్చడమెలా అని మల్లగుల్లాలు పడుతున్నాయి.

  • టీమ్ఇండియాకు కొత్త కెప్టెన్

టీమ్ఇండియా టీ20 కెప్టెన్​(team india t20 captain)గా తన చివరి మ్యాచ్ ఆడేశాడు విరాట్ కోహ్లీ(virat kohli news). దీంతో ఇతడి తర్వాత పొట్టి ఫార్మాట్​లో సారథ్య బాధ్యతలు ఎవరికి అప్పజెప్పుతారా? అన్న ప్రశ్న ప్రతి అభిమానిలోనూ మెదులుతోంది. ఇందుకోసం రోహిత్ పేరు ఎక్కువగా వినిపిస్తున్నా.. అది తాత్కాలికమే! అని విశ్లేషకులు అంటున్నారు.

  • పునీత్ స్ఫూర్తితో.. నేత్రదానం

దివంగత కన్నడ పవర్​స్టార్ పునీత్ రాజ్​కుమార్ స్ఫూర్తితో నేత్రదానం(eye donation) చేసేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కర్ణాటకలోని ఓ ఆస్పత్రిలో నేత్రదానం చేసేందుకు ఒక్కవారంలో 400 మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం.

07:57 November 09

టాప్ ​న్యూస్ ​@8AM

  • మహిళకు రూ.24 లక్షలు టోకరా

సాధారణంగా సిమ్‌ బ్లాక్‌ అయితే సాంకేతిక సమస్యగా భావిస్తాం. కొద్దిసేపటికి సెట్‌ అవుతుందని అనుకుంటాం. ఆ కొద్దిపాటి వ్యవధిలోనే కేటుగాళ్లు మనకు తెలియకుండానే బ్యాంక్‌ ఖాతాల్లోకి దూరిపోతారు. రూ.లక్షల్లో స్వాహా చేస్తారు. ఇలా ఓ మహిళ ఖాతా నుంచి రూ.24.14 లక్షలు కొట్టేసిన సంఘటన సైబరాబాద్‌ పరిధిలో చోటు చేసుకుంది.

  • టీకాలతోనే అధికంగా యాంటీబాడీలు

కరోనా బారిన పడినవారిలో సహజంగా ఉత్పత్తయ్యే యాంటీబాడీల(Covid Antibodies) కంటే ఫైజర్​, ఆస్ట్రాజెనికా టీకాలు తీసుకున్నవారిలోనే ఇవి ఎక్కువగా ఉంటున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. డెల్టా వేరియంట్‌నూ ఇవి సమర్థంగా అడ్డుకుంటున్నట్టు వెల్లడైంది.

  • నెత్తురోడిన రహదారులు

వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో (road accident in india) దేశంలో రహదారులు రక్తసిక్తమయ్యాయి. చిన్నారులతో సహా పలువురు మృతి చెందారు. మహారాష్ట్ర, నాసిక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలికలతో సహా ఓ యువకుడు మృతి చెందాడు. జమ్ముకశ్మీర్​లో పిల్లలతో ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి లోయలో పడిపోయింది.

  • టీమ్ఇండియాకు సవాళ్లెన్నో!

టీ20 ప్రపంచకప్​(t20 world cu 2021)లో సెమీ ఫైనల్ చేరకుండానే ఇంటిముఖం పట్టి అసంఖ్యాక వీరాభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది టీమ్ఇండియా. ఇక ముందైనా ఆటగాళ్ల అలసట, జట్టు కూర్పు, ఐపీఎల్ నిర్వహణ వంటి విషయాల్లో బీసీసీఐ(bcci news) మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • ఆ ముగ్గురు కలిసి మరోసారి!

ఇప్పటికే 'సూర్యవంశీ' సినిమాలో కలిసి నటించిన అక్షయ్​కుమార్​, అజయ్​దేవగణ్​, రణ్​వీర్​ సింగ్​.. మరోసారి కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ ముగ్గురు స్టార్​ హీరోలను 'సింగం 3'లో చూపించేందుకు సన్నాహాలు చేస్తున్నారట దర్శకుడు రోహిత్​శెట్టి.

06:56 November 09

టాప్ ​న్యూస్ ​@ 7AM

  • ఎన్నికలకు నేడే నోటిఫికేషన్

శాసనసభ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది (MLA quota MLC elections). ఆరు స్థానాలను తెరాస అభ్యర్థులే కైవసం చేసుకోవడం లాంఛనమే కావడంతో... ఎమ్మెల్సీ పదవుల కోసం గులాబీ పార్టీలో భారీ పోటీ నెలకొంది. అభ్యర్థుల ఖరారుపై ఆచితూచి వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్... ఒకటి రెండు రోజుల్లో ప్రధాన ఆశావహులను పిలిచి నచ్చచెప్పాలని భావిస్తున్నారు. తాజా మాజీలు సహా దాదాపు యాభై మందికి నేతలు... కేసీఆర్, కేటీఆర్​ను మెప్పించేందుకు విశ్వయత్నాలు చేస్తున్నారు.

  • జిల్లాల్లోనే కొవిడ్ మరణ ధ్రువపత్రాలు.

కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారాన్ని చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. మరణ ధ్రువపత్రాల(Corona Death certificates) జారీకి జిల్లా స్థాయిలో త్రిసభ్య కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కలెక్టర్ ఛైర్మన్​గా, డీఎంహెచ్​వో, జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ సభ్యులుగా ఉంటారని వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

  • వారి పెళ్లికి అనుకోని అతిథిగా సీఎం.!

వివాహ వేడుకకు స్థానిక నేతలు హాజరైతేనే ఎంతో గొప్పగా భావిస్తాం. అలాంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరైతే..? అదీ జోరు వానల మధ్యలో.. ఎలా ఉంటుంది? ఇలాంటి అనుభవమే తమిళనాడులోని చెన్నైలో ఓ జంటకు ఎదురైంది.

  • కోహ్లీ ఆలోచనేంటి?

టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)​లో భారత జట్టు పోరు ముగిసింది. కనీసం సెమీఫైనల్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. కోహ్లీ టీ20 కెప్టెన్(virat kohli captaincy news)​గా తన చివరి మ్యాచ్ ఆడేశాడు. ఇక తర్వాత పరిస్థితేంటి? అన్నది ప్రతి అభిమానిలో మెదులుతున్న ప్రశ్న.

  • 'అందుకే చిరంజీవి సినిమా టైటిల్​ '

యువ హీరో కార్తికేయ(raja vikramarka karthikeya) నటించిన కొత్త సినిమా 'రాజా విక్రమార్క' ఉత్కంఠభరితంగా ఉంటుందని అన్నారు చిత్ర దర్శకుడు శ్రీ సరిపల్లి(raja vikramarka new movie). ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు సహా కెరీర్​ గురించి పలు ఆసక్తికర సంగతులను తెలిపారు సరిపల్లి. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

03:59 November 09

టాప్ ​న్యూస్ ​@ 6AM

  • ఏంటీ వైఖరి..?

తెలంగాణ పండించే మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందో... లేదో స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పండించిన ధాన్యమంతటినీ కొనుగోలు చేయాలన్న డిమాండ్​తో శుక్రవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రైతుల పక్షాన తెరాస ధర్నాలు చేస్తుందన్న సీఎం... ఈ విషయంలో కేంద్రాన్ని, భాజపాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

  • ఎవరా ఆరుగురు..?

శాసనసభ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది (MLA quota MLC elections). ఆరు స్థానాలను తెరాస అభ్యర్థులే కైవసం చేసుకోవడం లాంఛనమే కావడంతో... ఎమ్మెల్సీ పదవుల కోసం గులాబీ పార్టీలో భారీ పోటీ నెలకొంది.

  • 'ప్లాస్టిక్‌ రహితంగా మేడారం జాతర'

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు కేటాయించింది (medaram jatara). వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు నాలుగు రోజులపాటు జరిగే జాతరను ప్లాస్టిక్ రహితంగా జరుపుకుందామని పిలుపునిచ్చింది.

  • ముందస్తు చర్యలు కొరవడి

తమిళనాడులో భారీవర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి భారీ వర్షాలు. చెన్నై సహా కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూర్‌ జిల్లాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరు జిల్లాలను కుండపోత వానలు, వరదలు కుదిపేశాయి. ఇటీవల భారత్‌, చైనా, ఐరోపా దేశాల్లో సంభవించిన వరదలు, కెనడా, అమెరికాల్లో వడగాడ్పులు ప్రపంచ దేశాలను ఆలోచనలోకి నెట్టాయి.

  • కౌంటర్ దాఖలు చేయండి..!

కృష్ణా జలాల కేటాయింపునకు సంబంధించి కర్ణాటక దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌పై (ఐఏ) కౌంటర్లు దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్రలను సుప్రీంకోర్టు ఆదేశించింది (supreme court ordered that a counter file on Krishna waters).

  • చిన్నారుల వార్డులో చెలరేగిన మంటలు

మధ్యప్రదేశ్​ భోపాల్​లోని కమలా నెహ్రూ ఆసుపత్రిలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మరణించినట్టు ఆ రాష్ట్ర మంత్రి విశ్వాస్​ సారంగ్​ తెలిపారు.

  • టర్కీపైనా ఆంక్షల కొరడా

నగదు అక్రమ చలామణీ, ఉగ్రమూకలకు నిధులు సమకూర్చడం వంటివి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సమగ్రతను దెబ్బతీస్తాయి. అటువంటి పరిస్థితులు ఏర్పడకుండా నివారించడంలో ఎఫ్‌ఏటీఎఫ్‌ కీలకంగా వ్యవహరిస్తోంది. ఆ సంస్థ తాజాగా రూపొందించిన గ్రే జాబితాలో పాక్‌ సహా మొత్తం 23 దేశాలున్నాయి. టర్కీ, మాలి, జోర్డాన్‌లను అందులో కొత్తగా చేర్చారు. 

  • జైకొవ్​-డి టీకా ఒక డోసు ధర ఎంతంటే..

పిల్లల కోసం జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన కరోనా టీకా జైకొవ్​-డి(Zycov-D Zydus Cadila) ఒక డోసు ధర రూ. 265గా నిర్ణయించింది ఆ సంస్థ. అయితే, సూది అవసరం లేకుండా ఇంజెక్టర్​ సాయంతో టీకా ఇవ్వనుంది. ఇంజెక్టర్​ ధర రూ.93 కలిపి.. జైకొవ్​-డి ఒక డోసు ధర రూ.358 అవుతుందని పేర్కొంది.

  • చివరి మ్యాచ్​లో భారత్ విజయం

టీ20 ప్రపంచకప్​ను టీమ్ఇండియా​ విజయంతో పూర్తిచేసింది. నమీబియాపై 9వికెట్ల తేడాతో గెలిచింది.

  • 'ఆర్ఆర్ఆర్' డైలాగ్ రివీల్ చేసిన రాజమౌళి

మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని డైలాగ్​ను డైరెక్టర్ రాజమౌళి రివీల్ చేశారు. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటంటే?

Last Updated : Nov 9, 2021, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.