ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు - ETV BHARAT headlines

ETV BHARAT HEADLINE NEWS
ETV BHARAT HEADLINE NEWS
author img

By

Published : Aug 24, 2021, 6:08 AM IST

Updated : Aug 24, 2021, 10:31 PM IST

22:23 August 24

ఈటీవీ భారత్​ ప్రధాన అంశాలు

  • అభివృద్ధికి నిధులు విడుదల

రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ ఏడాది మొదటి త్రైమాసికానికి సంబంధించిన నిధులు విడుదలయ్యాయి.

  • కొత్తగా 389 కొవిడ్​ కేసులు

 తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు మారుతోంది. ఒకరోజు తగ్గినట్లే కనిపిస్తున్నా... మరుసటి రోజుకు వచ్చేసరికి నమోదులో కాస్త పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా మరో 389 కేసులు నమోదయ్యాయి.

  • కరోనాతో కలిసి జీవించడమే..

భారత్​లో కరోనా ఎండెమిక్​గా మారే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అంచనా వేశారు. దేశంలో కరోనా వ్యాప్తి తీరు ప్రస్తుతం ఉన్నట్లుగానే కొనసాగే అవకాశం ఉందన్నారు. కొవాగ్జిన్ టీకాకు డబ్ల్యూహెచ్ఓ ఎప్పుడు అనుమతిస్తుందనే విషయంపై స్పష్టతనిచ్చారు.

  • సమరమే...

టీమ్ఇండియా మహిళలు త్వరలోనే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ ఓ డే నైట్ టెస్టుతో పాటు టీ20, వన్డే సిరీస్​లో తలపడనున్నారు. అందుకోసం జట్టును ప్రకటించింది బీసీసీఐ.

  • బాక్సాఫీస్​ సందడి

ఈ ఏడాది క్రిస్మస్​కు సినిమాల సందడి మామూలుగా ఉండేటట్లు లేదు. ఇప్పటికే మూడు భారీ ప్రాజెక్టులు ఈ సీజన్​లో రిలీజ్​ను ఖరారు చేసుకోగా మరికొన్ని ఇదే బాటలో పయనించనున్నాయి.

20:37 August 24

టాప్​ న్యూస్ ​@ 9 PM

  • అగ్రవర్ణ పేదలకు తీపికబురు

 వార్షికాదాయం ఎనిమిది లక్షల్లోపు ఉన్న అగ్రవర్ణ పేదలందరికీ రాష్ట్రంలో పదిశాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఆర్థికంగా వెనకబడిన తరగతుల వారికి రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకటించింది. 

  • 'సీఎం రాజీనామా చేయాలి'

 మంచిర్యాల జిల్లా దండేపల్లిలో వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన దీక్ష ముగిసింది. ఉద్యోగాల భర్తీ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును షర్మిల విమర్శించారు. నిరుద్యోగుల ఆత్మహత్యలపై స్పందించని సీఎం కేసీఆర్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

  • పెట్రోల్​ ధరపై గుడ్​న్యూస్​

పెట్రోల్​ ధరల వ్యవహారంలో రానున్న నెలల్లో దేశ ప్రజలకు కొంత ఉపశమనం లభించే అవకాశమున్నట్టు తెలిపారు పెట్రోలియంశాఖ మంత్రి హర్​దీప్​ సింగ్​​ పూరీ. పెట్రోల్​ ధర అంశాన్ని ప్రభుత్వం అత్యంత సున్నితంమైనదిగా పరిగణిస్తున్నట్టు స్పష్టం చేశారు.

  • ప్రతీకారదాడులు తప్పవా..?

అమెరికా సైన్యానికి సహకరించిన అఫ్గాన్ పౌరుల బయోమెట్రిక్ సమాచారం తాలిబన్ల(Taliban news) చేతికి చిక్కినట్లు తెలుస్తోంది. 15 లక్షల మందికి పైగా పౌరుల వేలి ముద్రలు, ఐరిస్, ఫేషియల్ స్కానింగ్ డేటా ఇందులో ఉన్నాయి.

  • అదే జట్టుతో..

ఇంగ్లాండ్​తో రెండో టెస్టు గెలిచిన జట్టుతోనే మూడో టెస్టు మ్యాచ్​ ఆడనున్నట్లు టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ తెలిపాడు. జట్టులో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశాడు.

19:53 August 24

టాప్​ న్యూస్ ​@ 8 PM

  • డెడ్​లైన్​ ఫిక్స్​

అఫ్గానిస్థాన్​ నుంచి బలగాలు, ఇతర వ్యక్తుల తరలింపు ప్రక్రియను అమెరికా ఆగస్టు 31లోగా పూర్తి చేయాల్సిందేనని తాలిబన్లు(taliban news) తేల్చిచెప్పారు. గడువు పొడిగించాలని అగ్రరాజ్యం కోరుతోందన్న వార్తల నేపథ్యంలో ఈమేరకు ప్రకటన చేశారు.

  • ఎంసెట్​ ఫలితాలు

తెలంగాణ ఎంసెట్‌(TS EAMCET RESULTS) ఇంజినీరింగ్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(SABITHA INDRA REDDY) ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్ ఎంసెట్ నిర్వహించారు. 

  • కెప్ట్​న్​ను తప్పించాల్సిందే..

పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​పై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్​లోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు. తమకిచ్చిన హామీలను కెప్టెన్​ నెరవేర్చలేదని ఆరోపించారు. కెప్టెన్​ను సీఎం పదవి నుంచి తప్పించాలని, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. 

  • ఏంటి పరిస్థితి

 భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరగబోయే లీడ్స్ పిచ్​, అక్కడి వాతావరణం గురించి తెలుసుకుందాం.

  • సినిమాల్లోకి రాకముందు..

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ నటించిన 'కాలాపత్తర్' సినిమా విడుదలై 42 ఏళ్లు పూర్తయ్యాయి. మైనింగ్​ మాఫియా నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం అమితాబ్ నటనా జీవితంలో క్లాసిక్​గా నిలిచిపోయింది.

18:46 August 24

టాప్​ న్యూస్ ​@ 7 PM

  • భవిష్యత్తులో పేదలబంధు..

మరో 20ఏళ్లు అధికారం తమదేనని గులాబీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. భవిష్యత్తులో బీసీ, మైనార్టీ, అగ్రవర్గణ పేదల బంధు తెస్తామని తీపి కబురు చెప్పారు.

  • బహుజన బిడ్డలే భవిష్యత్తు పాలకులు

 భవిష్యత్తులో బహుజన బిడ్డలే పాలకులవుతారని...... బీఎస్​పీ తెలంగాణ సమన్వయ కర్త ఆర్​ఎస్​ ప్రవీణ్‌కుమార్‌ పునరుద్ఘాటించారు. హనుమకొండలో బీఎస్పీ వరంగల్‌ ఉమ్మడి జిల్లాల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తమ రక్తంలో మాట తప్పే, మడమ తిప్పే లక్షణం లేదన్నారు. 

  • అలా ఎలా అమ్మేస్తారు..?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. 70ఏళ్లుగా కూడబెట్టుకుంటున్న ఆస్తులను జాతీయ మానిటైజేషన్​ పైప్​లైన్​ పేరుతో కేంద్రం అమ్మేస్తోందని ఆరోపించారు.ఇదే జరిగితే ఎవరికీ ఉద్యోగాలు ఉండవని విమర్శించారు.

  • చింపాంజితో లవ్​లో పడిన మహిళ

ప్రపంచంలోని కొన్ని వింత సంఘటనలు చూసినా, విన్నా.. ఒక్కోసారి నమ్మలేం.  తాజాగా బెల్జియంలో అలాంటి సంఘటనే వెలుగు చూసింది. చింపాంజితో ఓ మహిళ ప్రేమలో పడింది. ఈ విషయం గమనించిన జూ సిబ్బంది.. ఆమెను మళ్లీ అక్కడకు రాకుండా నిషేధం విధించారు.

  • అలా ఎలా..?

 సీనియర్ నటి ఇంద్రజ.. కోర్టులో ఓ స్టార్ హీరో తన తరఫున వాదించడం గురించి తెలిపారు. ఈటీవీలో ప్రసారమవుతోన్న ఆలీతో సరదాగా షోలో ఈ విషయాన్ని వెల్లడించారు.

17:52 August 24

టాప్​ న్యూస్ ​@ 6 PM

  • రాజకీయ క్షేత్రంలో తిరుగులేని విజయాలు

 సెప్టెంబర్‌ 2న సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా దిల్లీలో తెరాస కార్యాలయం భూమి పూజ నిర్వహించనున్నట్లు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. తెరాస అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో తెరాస రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది.

  • నీళ్లు వారికి... నిధులు వీరికి

 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, నాయకుడిగా నాలుగుకోట్ల మంది తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడటానికి కారణం మల్కాజిగిరి ప్రజలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా సీఎం కేసీఆర్ దత్తత గ్రామం మూడుచింతలపల్లిలో కాంగ్రెస్ చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా దీక్షలో ఆయన పాల్గొన్నారు.

  • డెడ్​లైన్​పై చర్చ

అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ విలియమ్ జే బర్న్స్.. తాలిబన్ అగ్రనేత అబ్దుల్ ఘనీ బరాదర్​తో రహస్యంగా భేటీ(CIA Taliban secret meeting) అయ్యారు. ఈ విషయాన్ని ఓ వార్తా సంస్థ వెల్లడించింది.

  • భయపడినట్టే అయింది..

అఫ్గాన్​ సంక్షోభం నేపథ్యంలో కాబుల్​ విమానాల(Kabul airport) నుంచి ఇతర దేశాలకు తాలిబన్లు(taliban news) కూడా వెళుతున్నారన్న ఆందోళనలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో తమ దేశానికి వచ్చిన అఫ్గాన్​వాసుల్లో ఓ వ్యక్తికి తాలిబన్లతో సంబంధం ఉన్నట్టు అనుమానించారు ఫ్రాన్స్​ అధికారులు. వెంటనే అతడిని అరెస్ట్​ చేశారు. విచారణలో ఆ వ్యక్తి నిజనాన్ని అంగీకరించాడు.

  • అట్టహాసంగా..

టోక్యో పారాలింపిక్స్ (Tokyo Para Olympics) ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఆరంభ వేడుకల్లో (Tokyo Para Olympics opening ceremony) జావెలిన్​ త్రోవర్​ టెక్​ చంద్​(Athlete Tek Chand) తివర్ణ పతాకం చేతబూని జట్టును ముందుకు నడిపించాడు.

16:47 August 24

టాప్​ న్యూస్ ​@ 5 PM

  • మూడోడోసు అవసరమా..?

కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నవారికి బూస్టర్ డోసు అవసరమా? అనే విషయంపై ఇప్పుడే ఏ నిర్ణయానికీ రాలేమని నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్ మధ్యలో కరోనా థర్డ్ వేవ్​ ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేయాలని సూచిస్తున్నారు.

 ఉన్నత విద్యామండలి నూతన ఛైర్మన్‌గా ప్రొఫెసర్ లింబాద్రి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఛైర్మన్‌గా వ్యవహరించిన పాపిరెడ్డి పదవీ కాలం ముగియడంతో... ఈయనను నియమించారు. మంగళవారం ప్రొ.లింబాద్రి బాధ్యతలు స్వీకరించారు.

  • అధినేతల చర్చలు

తాలిబన్ల ఆక్రమణతో అఫ్గాన్​లో తలెత్తిన సంక్షోభంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్చలు జరిపారు. దాదాపు 45 నిమిషాల పాటు ఫోన్​లో మాట్లాడుకున్నారు.

  • బుల్​ జోరు..

స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలను గడించాయి. సెన్సెక్స్ (Sensex Today) 403 పాయింట్లు పెరిగి.. తొలిసారి 55,950 పైన స్థిరపడింది. నిఫ్టీ (Nifty Today) 128 పాయింట్లు బలపడి.. జీవనకాల గరిష్ఠమైన 16,620 మార్క్​ దాటింది.

  • తొలగించిన ఉద్యోగులకు భారీ నజరానా..

గతేడాది కరోనా కారణంగా ఉద్యోగులను తొలగించిన ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు.. వారికి బోనస్​ను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు 2022నాటికి వీరికి ఈ మొత్తాన్ని అందించనున్నట్లు గార్డియన్ పత్రిక కథనం పేర్కొంది.

15:41 August 24

టాప్​ న్యూస్ ​@ 4 PM

  • కేంద్రమంత్రి అరెస్ట్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యల కేసులో కేంద్ర మంత్రి నారాయణ్​ రాణెను ముంబయి పోలీసులు అరెస్ట్​ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం ఏ ఏడాది వచ్చిందో తెలియని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను చెంపదెబ్బ కొట్టేవాడినని రాణె చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన నేపథ్యంలో పోలీసులు ఆయనపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి, మహారాష్ట్రలోని రత్నగిరిలో అరెస్ట్​ చేశారు.

  • నిధులు విడుదల

దళితబంధు పథకం కోసం మరో రూ.200 కోట్లు విడుదలయ్యాయని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్ తెలిపారు. ఇప్పటివరకు ప్రభుత్వం రూ.1200 కోట్లు ఇచ్చిందని వెల్లడించారు. పైలెట్ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం రూ.రెండు వేల కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఇదివరకే ఆదేశాలు జారీ చేశారు.

  • సింహగర్జన ఆగేనా..

తాలిబన్లపై సింహగర్జన చేస్తున్న పంజ్​షేర్​ కోటకు బీటలు పడేలా కనిపిస్తోంది! ఆ ప్రాంత నాయకుడు అహ్మద్ మసూద్​.. తాలిబన్లతో రాజీకి సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. తాలిబన్లను ఎదుర్కోవడానికి సరైన వనరులు లేకపోవడం, అంతర్జాతీయంగా మద్దతు కరవవ్వడం వల్ల ఆయన ఈ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.

  • 'జోకర్​'తో జాగ్రత్త..

జోకర్​ పేరుతో సైబర్​ నేరగాళ్లు వదిలిన ఓ మాల్​వేర్ ప్లేస్టోర్​​ యాప్ యూజర్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. చూస్తుండగానే బ్యాంక్​ ఖాతాలోని నగదును ఖాళీ చేసే ఈ వైరస్​.. మరోసారి ఆండ్రాయిడ్​ యూజర్లను భయపెడుతోంది. తాజాగా 24 యాండ్రాయిడ్​ యాప్స్​లలో ఈ జోకర్​ వైరస్​ను గుర్తించినట్లు సైబర్​ సెక్యూరిటీ సంస్థలు వెల్లడించాయి.

  • ఐశ్వర్య మరోసారి ప్రెగ్నెన్సీ..?

బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ మరోసారి ప్రెగ్నెన్సీతో ఉందంటూ బీటౌన్​లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో నిజమెంత? ఐశ్వర్య ఏం అంటోంది?

14:53 August 24

టాప్​ న్యూస్ ​@ 3 PM

  • అన్ని జాగ్రత్తలు పాటిస్తూ..

17 నెలల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పాఠశాలలను శానిటైజేషన్ చేయించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. పురపాలక పాఠశాలల్లో కూడా వసతులు మెరుగుపరుస్తామని చెప్పారు. విద్యాసంస్థల పునఃప్రారంభ సన్నద్ధతపై కలెక్టర్లు, అధికారులతో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  

  • 'ఆపరేషన్ దేవీ శక్తి'  

అఫ్గాన్​లో చిక్కుకున్న భారతీయులను(indians in afghanistan) స్వదేశానికి తరలించే మిషన్​కు 'ఆపరేషన్ దేవీ శక్తి అని' అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

  • ఇన్ఫోసిస్​ కొత్త రికార్డు

టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ 100 బిలియన్​ డాలర్ల క్లబ్​లో చేరింది. కంపెనీ మార్కెట్ విలువ ​మంగళవారం తొలిసారి ఈ మార్క్​ను తాకింది. ఈ స్థాయికి చేరుకున్న నాలుగో భారతీయ కంపెనీగా నిలిచింది.

  • ఇదేం కెప్టెన్సీ..

 కెప్టెన్సీ అనేది పాపులారిటీ కాదంటూ ఇంగ్లాండ్​ సారథి జో రూట్​పై తీవ్రంగా స్పందించాడు మాజీ కెప్టెన్ నాసర్​ హుస్సేన్. లార్డ్స్​ టెస్టు చివరి రోజు అతడు నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యాడని పేర్కొన్నాడు. ఎప్పుడు ఎలా ఆడాలనేది ఇంగ్లాండ్​ టీమ్​కు తెలియట్లేదని విమర్శించాడు.

టాలీవుడ్​తో పాటు హాలీవుడ్​, బాలీవుడ్​కు సంబంధించి పలు సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. యువహీరో లక్ష్య మాస్​లుక్​తో ఫస్ట్​లుక్​ విడుదల చేయగా.. గోపీచంద్ నటించిన సీటీమార్​ రిలీజ్​ తేదీని చిత్రబృందం ప్రకటించింది.

13:09 August 24

టాప్​ న్యూస్ ​@ 1 PM

  • మూడుచింతలపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష

దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షలో భాగంగా మూడుచింతలపల్లిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి దీక్ష ప్రారంభించారు. శామీర్​ పేట కట్టమైసమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం మూడుచింతలపల్లికి భారీ ఎత్తున కార్యకర్తలతో చేరుకున్నారు.

  • అఫ్గాన్​ నుంచి భారత్​ చేరుకున్న మరో 78 మంది

అఫ్గాన్​ (Afghan news) నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం మరో 78 మంది దుశాంబే నుంచి భారత్​కు వచ్చారు. వీరిలో అఫ్గాన్ సిక్కులు, హిందువులు కూడా ఉన్నారు. సిక్కుల పవిత్ర గ్రంథం శ్రీ గురు గ్రంథ్ సాహిబ్​ ప్రతులను కూడా వీరు భారత్​కు తీసుకొచ్చారు.

  • 'సీఎంకు చెంపదెబ్బ'పై దుమారం..

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేపై కేంద్రమంత్రి నారాయణ్​ రాణె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై శివసేన కార్యకర్తలు ఫిర్యాదు చేయగా.. రాణెపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాణె వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన శివసేన కార్యకర్తలు పలుచోట్ల ఆందోళనకు దిగారు. మరోవైపు.. రాణె తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.

  • డబ్బులు లేక కుటుంబానికి దూరంగా..

ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా'(Alitho Saradaga) షోకు ఈ వారం హీరో మంచు విష్ణు అతిథిగా విచ్చేశారు. తన కెరీర్​, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గతేడాది లాక్​డౌన్​ సమయంలో కుటుంబానికి దూరంగా ఉండటం.. అప్పుడు ఆయన పడిన ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు.

  • ప్రీమియం​​ వీడియోలను ఫ్రీగా డౌన్​లోడ్​ చేసుకోండిలా!

యూట్యూబ్​ మాధ్యమాన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్నారు. దీని ద్వారా తమకు ఇష్టమైన వీడియోలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే అందులో తమకు నచ్చిన వీడియోను పదేపదే చూసేందుకు దాన్ని డౌన్​లోడ్​ చేసుకోవాలని అనుకుంటారు. అయితే అవి ప్రీమియం వీడియోలు అయితే డౌన్​లోడ్​ చేయడం వీలు కాదు. వాటిని ఫ్రీగా ఎలా డౌన్​లోడ్​ చేసుకోవాలో తెలుసుకోవాంటే ఇది చదివేయండి.

11:59 August 24

టాప్​ న్యూస్ ​@ 12 PM

  • నన్ను ఓడించే శక్తి.. తెరాసకు లేదు

ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేయకపోతే దళిత బంధు పథకం వచ్చేది కాదని భాజపా నేత ఈటల రాజేందర్​ అన్నారు. అధికార పార్టీ ప్రజలను మభ్యపెట్టినా.. ప్రజలు మద్దతు ఇచ్చేది తనకేనని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్​ జిల్లా కాట్రపల్లిలో వివిధ కుల సంఘాల ప్రతినిధులతో ఈటల సమావేశం అయ్యారు. పలువురు భాజపాలో చేరారు.

  • ఇక వాట్సాప్‌లోనూ టీకా 'స్లాట్‌ బుకింగ్‌'

కొవిడ్ మూడోవేవ్(Thirdwave of Corona) వార్తల నేపథ్యంలో వీలైనంత త్వరగా.. ప్రజలందరికీ టీకాలు(Corona Vaccine) అందించేందుకు కేంద్రం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వాట్సాప్​లోనూ టీకా స్లాట్ బుకింగ్(Vaccine Registration) చేసుకునే వీలు కల్పిస్తోంది. మరి వాట్సాప్​లో టీకాను ఎలా బుక్​ చేసుకోవాలంటే..?

  • తాలిబన్లను నడిపిస్తోంది పాకిస్థానే

అఫ్గాన్​లో తాలిబన్ల(Afghanistan Taliban) దురాక్రమణకు పాకిస్థానే కారణమని ఆరోపించారు అఫ్గాన్​కు చెందిన పాప్​ సింగర్​ అర్యాన సయూద్​(Afghanistan Pop Star Aryana Sayeed). తాలిబన్లకు నిధులు సమకూర్చటం సహా శిక్షణ కూడా పాకిస్థాన్ అందిస్తోందని చెప్పారు. అఫ్గాన్​కు భారత్​ నిజమైన మిత్రదేశం అని పేర్కొన్నారు.

  • అమ్మాయిలూ ఈ విషయంలో మీరస్సలే వెనకబడొద్దు?

కేవలం చదువు, విజ్ఞానం పరంగానే కాకుండా... టెక్నికల్ స్కిల్స్​లోనూ అమ్మాయిలు ముందుంటే అన్ని రంగాల్లోనూ దూసుకుపోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.

  • పాక్​- అఫ్గాన్​ వన్డే సిరీస్​ వాయిదా..

పాకిస్థాన్​- అఫ్గానిస్థాన్​ (Pakistan vs Afghanistan Series) మధ్య తొలిసారి నిర్వహించతలపెట్టిన ద్వైపాక్షిక సిరీస్​ నిరవధిక వాయిదా పడింది. అఫ్గాన్​లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులతో పాటు ఆ దేశ క్రికెటర్ల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. సిరీస్​ను తిరిగి 2022లో నిర్వహించనున్నట్లు ఇరుదేశాల బోర్డులు ప్రకటించాయి.

10:56 August 24

టాప్​ న్యూస్ ​@ 11AM

  • నగరమా? నరకమా? 

సోమవారం హైదరాబాద్​లో కురిసిన భారీ వర్షానికి నగరవాసులంతా తడిసి ముద్దయిపోయారు. రహదారులపై వరద నీరు పొంగి పొర్లడంతో... ట్రాఫిక్ స్తంభించిపోయింది. అంబులెన్స్​లు వేల సంఖ్యలో వాహనాలన్నీ నాలుగు గంటలపాటు రోడ్లపైనే ఉండాల్సి వచ్చింది. 

  • నోరు.. పేరు.. ఉన్నోడిదే జాగీరు..

ఇది హైదరాబాద్​ మహా నగరం.. అడుగు స్థలమూ రూ.లక్షల్లో ధర పలుకుతోంది. ఈ నేపథ్యంలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. ఆక్రమణదారులు గద్దల్లా వాలిపోతున్నారు. చట్టాల్లోని లొసుగుల్ని ఆధారం చేసుకుని పేట్రేగిపోతున్నారు. అమాయకులకు వాటిని అంటగట్టి రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. అధికారులు, నేతల కనుసన్నల్లో సాగుతోందన్న ఆరోపణలూ లేకపోలేదు.

  • ఆగస్టు 31 నాటికి మా వాళ్లను తరలిస్తాం

అఫ్గానిస్థాన్​ నుంచి తమ పౌరుల తరలింపు ప్రక్రియను ఆగస్టు 31వరకు పూర్తి చేయడంపైనే తాము దృష్టి సారించామని అమెరికా అధికారులు తెలిపారు. అయితే.. ఈ ప్రక్రియను ఎప్పుడు ముగించాలన్నదానిపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెనే తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మరోవైపు.. తరలింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు తాలిబన్లతో తాము రోజువారీగా చర్చిస్తున్నామని పేర్కొన్నారు.

  • ఆటగాళ్లపై ఫ్యాన్స్​ దాడి

ఆటలో భాగంగా ప్లేయర్ల మధ్య వివాదాలు, స్లెడ్జింగ్, మాటలాతుటాలు సహజమే. కానీ, ఆటగాళ్లపై అభిమానులు దాడికి దిగిన ఘటన.. ఫ్రాన్స్​లోని ఓ ఫుట్​బాల్​ మ్యాచ్​లో (Nice vs Marseille) జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

  • రద్దయిన ఎల్‌ఐసీ పాలసీలకు జీవం

ల్యాప్స్​ అయిన పాలసీలను పునరుద్దరించుకునేందుకు (campaign for revival of lapsed policies) భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్​ఐసీ) మరో అవకాశం ఇచ్చింది. స్పెషల్​ రివైవల్​ క్యాంపెయిన్​ (Special Revival Campaign) పేరుతో తీసుకొచ్చిన ఈ సదుపాయాన్ని రెండు నెలల పాటు వినియోగించుకునేందుకు వీలుంది. ఈ ఆఫర్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

09:58 August 24

టాప్​ న్యూస్ ​@ 10AM

  • బడికి పంపడం తల్లిదండ్రుల ఇష్టమే!

సెప్టెంబర్​ ఒకటో తేదీ నుంచి అంగన్‌వాడీలు సహా అన్ని విద్యాసంస్థలను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యక్ష బోధన ప్రారంభమవుతుందని ప్రభుత్వం చెప్పినా... పిల్లలను తప్పక తరగతులకు పంపాలా?.. లేదా? అన్న విషయాన్ని వెల్లడించలేదు.

  • వింత ఆచారం.. తేళ్లతో భక్తుల పూజలు!

పూలు, పత్రి, పంచామృతాలతో దేవుళ్లకు అభిషేకాలు నిర్వహించడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఓ చోట మాత్రం.. స్వామివారికి తేళ్లతో అభిషేకం అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం భక్తులు వాటిని చేతులతో పట్టుకుని.. శరీరమంతా పెట్టుకుంటూ విన్యాసాలు చేశారు. ఇదెక్కడో తెలుసుకోవాలంటే... ఈ కథనం చదివేయాల్సిందే.

  • దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య (Corona Virus India) స్వల్పంగా తగ్గింది. కొత్తగా 25,467 మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 354 మంది కొవిడ్ బారినపడి మరణించారు.

  • అపరిచితుడు రీమేక్​పై దర్శకుడు శంకర్​కు షాక్​..

అన్నియన్​ రీమేక్​ వివాదంపై మద్రాస్​ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు నిర్మాత రవిచంద్రన్​ ప్రకటించారు. దర్శకుడు శంకర్, హిందీ రీమేక్​కు నిర్మాతైన జయంతీలాల్​ గాదాలపై కేసు వేయనున్నట్లు తెలిపారు.

  • భారత పారా అథ్లెట్లకు 'సైకత' శుభాకాంక్షలు

ఒడిశా పూరీ బీచ్​లో భారత పారా అథ్లెట్లకు తన సైకత శిల్పంతో మద్దతు తెలిపారు ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik)​. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ.. భారత్​ గెలుపుకోసం ప్రార్థించాలని పేర్కొన్నారు.

08:54 August 24

టాప్​ న్యూస్ ​@ 9AM

  • రాష్ట్రంలో 67,820 ఉద్యోగ ఖాళీలు

రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలను ఆర్థిక శాఖ నిర్ధరించింది. మొత్తం 67వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వానికి సమర్పించేందుకు తుది నివేదిక సిద్ధం చేసింది. పూర్తి జాబితాను ఈ నెలలో జరిగే మంత్రిమండలి సమావేశంలో సమర్పించనుంది. కేబినెట్​ ఆమోదంతో నోటిఫికేషన్​ వచ్చే అవకాశం ఉంది.

  • 363 మంది శాసనకర్తలపై నేరాభియోగాలు..

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8 కింద దేశవ్యాప్తంగా 363 ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు నమోదైనట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ సంస్థ (ఏడీఆర్‌) (ADR report) వెల్లడించింది. తొలి మూడు స్థానాల్లో భాజపా, కాంగ్రెస్‌, తృణమూల్‌ ఉన్నట్లు తెలిపింది.

  • తాలిబన్లకు పంజ్‌షేర్‌ నుంచి సింహగర్జన..!

కాబుల్‌ సరిహద్దులకు తాలిబన్లు చేరుతున్నారని తెలియగానే అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇక ఉపాధ్యక్షుడు అమ్రుల్లా హెలికాప్టర్‌లో పంజ్‌షేర్‌ చేరుకొన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నది పంజ్​షేర్​ సింహంగా పేరున్న అహ్మద్ షా మసూద్ ​తనయుడు అహ్మద్ మసూద్​. ఆ తర్వాత అహ్మద్‌ మసూద్‌తో​అమ్రుల్లా భేటీ అయిన ఫొటోలు బయటకు వచ్చాయి. తాలిబన్ల గుండెల్లో రాయిపడినట్లైంది! కాబుల్‌ అంత తేలిగ్గా పంజ్‌షేర్‌ దక్కదని వారికి అర్థమైంది!

  • సంసిద్ధతే.. విపత్తులకు పరిష్కారం!

ఏటా ప్రకృతి విపత్తులు(Natural Disasters) పెరుగుతూనే ఉన్నాయి. వేల సంఖ్యలో ప్రజల ప్రాణాల్ని హరిస్తున్నాయి. వాటిని ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వాలు, అధికార యంత్రాంగాల తీరు మాత్రం ఏమాత్రం మారడం లేదు. పట్టణాలు, నగరాలను భారీ వర్షాలతో ముంచెత్తుతున్న వరదలను ఎదుర్కొనేందుకు, వరద నీటిని దారిమళ్లించేందుకు చేపట్టాల్సిన నిర్మాణాలు నత్తనడకన సాగుతుండటం యంత్రాంగం ఉదాసీనతకు నిదర్శనంగా నిలుస్తోంది.

  • హీరోను వ్యక్తిగతంగా బెదిరించడం తగదు

ఓటీటీ వేదికగా సినిమాలను విడుదల చేయాలని నిర్ణయించిన హీరో, నిర్మాతను బెదిరించడం తగదని యాక్టివ్​ తెలుగు ఫిల్మ్​ ప్రొడ్యూసర్​ గిల్డ్​ ఓ ప్రకటన చేసింది. తమ సినిమాపై సర్వహక్కులూ నిర్మాతకు ఉంటాయని స్పష్టం చేసింది.

07:57 August 24

టాప్​ న్యూస్ ​@ 8AM

  • వనరులు పుష్కలం.. ప్రగతి శూన్యం

ఆర్యులకు నెలవైన అఫ్గానిస్థాన్‌ ఆర్యానా, గాంధార, కాంభోజ దేశంగా, ఖొరసాన్‌గా చరిత్రలో ప్రసిద్ధికెక్కింది. అక్కడ ఖనిజాల తవ్వకాలకు వేల సంవత్సరాల చరిత్ర ఉందనడానికి అనేక ఆధారాలున్నాయి. చరిత్ర ప్రస్తుతించిన ఎందరో రాజుల కంఠాభరణాలుగా మారిన ఖరీదైన పచ్చలు, నీలమణులు, మాణిక్యాలు, వైడూర్యాలు అఫ్గాన్‌ గనుల నుంచి వచ్చినవే.

  • కరోనా, డెంగీ కలవరం..

అసలే కరోనా కాలం. ఆపై జ్వరాల దెబ్బ. ముఖ్యంగా డెంగీ విజృంభిస్తోంది. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరు ఏదో ఒక జ్వరంతో బాధపడుతున్నవారే. వీటి లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటుండటం మరింత గందరగోళానికి తావిస్తోంది. చికిత్సలు వేర్వేరనే విషయం తెలియక కొందరు నొప్పి మాత్రలనూ ఆశ్రయిస్తున్నారు. ఇది మరింత ప్రమాదకరంగానూ పరిణమిస్తోంది.

  • ఒక ఇండియా.. 4 ఈస్ట్‌ ఇండియాలు!

1608 ఆగస్టు 24న మొదటిసారిగా బ్రిటిష్​వారు మన గడ్డపై అడుగుపెట్టారు. నాడు ఈస్ట్‌ ఇండియా కంపెనీ (East India company) ప్రతినిధి బృందం గుజరాత్‌లోని సూరత్‌ వద్ద భారత్‌లోకి ప్రవేశించింది. అది మొదలుగా తెల్లవారి అడుగులు మనల్ని మడుగులొత్తించే దిశగా సాగాయి.

  • తెలుగు పాటకు సరికొత్త రంగులద్దిన రచయిత

అక్షరాలు అనే తూటాలను పాటలుగా మలచి.. అద్భుతమైన లిరిక్స్​ను తెలుగు చిత్రసీమకు అందిస్తున్న ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి పుట్టినరోజు నేడు(ఆగస్టు 24). ఈ సందర్భంగా ఆయన కెరీర్​పై ప్రత్యేక కథనం మీకోసం.

  • 'విదేశీ నాణేలు కూడా ముద్రిస్తాం'

భారత ప్రభుత్వ మింట్‌కు(ఐజీఎం) నేతృత్వం వహించే అరుదైన అవకాశాన్ని తెలుగుతేజం వి.ఎన్‌.ఆర్‌.నాయుడు దక్కించుకున్నారు. ఆయన ఈ నెల 9న ఐజీఎం చీఫ్‌ జనరల్‌ మేనేజర్​గా(సీజీఎం) బాధ్యతలు చేపట్టారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ఇండియన్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ సర్వీస్‌(ఐఓఎఫ్‌ఎస్‌) అధికారిగా ఎంపికై, 50 ఏళ్ల వయస్సులో ఐజీఎం- సీజీఎం స్థాయికి ఎదిగారు.

06:55 August 24

టాప్​ న్యూస్ ​@ 7AM

  • 40 లక్షలుంటేనే హైదరాబాద్​లో ఫ్లాటు!

హైదరాబాద్‌లో ఫ్లాటు కొనాలంటే కనీసం 40 లక్షల రూపాయలు వెచ్చించాల్సిందేనని చెబుతోంది నెట్​ఫ్రాంక్ అధ్యయనం. వెయ్యి చదరపు అడుగుల ఇంటి కనీస ధర 40 లక్షలు ఉన్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది. ఇటీవల జరిగిన అమ్మకాల్లో 88 శాతం రూ.అరకోటి పైన పలికినవే ఉన్నట్లు పేర్కొంది.

  • తాలిబన్లపై ఎగిరిన తిరుగుబాటు జెండా

అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. బగ్లాన్‌ ప్రావిన్సులో తాలిబన్లపై స్థానిక సాయుధ ప్రజలు తాజాగా తిరుగుబాటు జెండా ఎగరేశారు. మూడు జిల్లాలను స్వాధీనం చేసుకున్నారు. 

  • భర్త చికెన్ తిన్నాడని.. భార్య సూసైడ్!

తన భర్త చికెన్​ తిన్నాడని ఓ మహిళ ఆగ్రహానికి గురైంది. కోపం తట్టుకోలేక ఒంటిపై కిరోసిన్​ పోసుకుని నిప్పంటించుకుంది.

  • ఇరకాటంలో సిద్ధూ!

కశ్మీర్ ప్రత్యేక దేశం అంటూ పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సలహాదారులు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్​లోని కీలక నేతలే సలహాదారుల వ్యాఖ్యల పట్ల తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక, ఈ వ్యవహారంపై మండిపడిన భాజపా.. సిద్ధూ నుంచే ఆయన సలహాదారులు ప్రేరణ పొందారా అని ఎద్దేవా చేసింది. ఘటనపై రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేసింది.

  • విశ్వ క్రీడా సంబరం మళ్లీ మొదలైంది

మరో విశ్వ క్రీడా సంబరానికి తెరలేచింది. టోక్యో వేదికగా పారాలింపిక్స్​ నేటి(మంగళవారం) నుంచి ప్రారంభమయ్యాయి. వైకల్యం శరీరానికే కాని.. తమ సంకల్పానికి కాదని చాటుతూ ప్రపంచం నలుమూలల నుంచి 4500 మంది పారా అథ్లెట్లు తమ సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. రెండంకెల పతకాలే లక్ష్యంగా భారత్​ నుంచి 54 మంది ఈ క్రీడల్లో పాల్గొంటున్నారు.

05:06 August 24

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

  • 1 నుంచి ప్రత్యక్ష బోధనలు..

అంగన్​వాడీలు సహా రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలను వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పున:ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణలోకి వచ్చిందన్న వైద్యారోగ్యశాఖ నివేదిక ఆధారంగా, విద్యార్థుల భవిష్యత్​ను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.

  • నేడు తెరాస కీలక సమావేశం...

దళిత బంధు పథకం, పార్టీ సంస్థాగత నిర్మాణం, హుజూరాబాద్ ఎన్నిక తదితర అంశాలపైచర్చించేందుకు నేడు తెరాస కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో జరగనున్న భేటీలో దళిత బంధు ప్రాధాన్యత, పథకం రూపకల్పన వెనక ఉద్దేశ్యాలను సీఎం కేసీఆర్​.. పార్టీ శ్రేణులకు వివరించనున్నారు.

  • నేటి నుంచే 48 గంటల దీక్ష

రాష్ట్రంలో ఏడేళ్లలో దళిత, గిరిజనులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌..... ఆయా వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు పోరుబాట సాగిస్తోంది. ఇప్పటికే రెండో చోట్ల సభలు నిర్వహించిన పార్టీ... మేడ్చల్‌ జిల్లా మూడు చింతలపల్లిలో రెండు రోజుల దీక్ష చేపడుతోంది.

  • ఘోర రోడ్డు ప్రమాదం...

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. చింతపల్లి హైవే వద్ద ఆగి ఉన్న లారీని ఓ ట్రావెల్స్‌ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15 మంది ప్రయాణికులు గాయపడగా.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

  • ఒక అమ్మాయే... ముగ్గురిలా...

తమ్ముడు అంటూ పరిచయం పెంచుకుంది. చివరికి అతడి మరణానికి కారకురాలైంది. ఒకే అమ్మాయి ముగ్గురిలా ఫోన్లో మాట్లాడి.. మోసగించి.... చివరకు కటాకటాలపలైంది. వరంగల్ జిల్లాలో జరిగిన ఈ ఘటనను చేధించేందుకు పోలీసులు 10 రోజులు కష్టపడ్డారు. కిలాడి లేడీ మోసం చేసిన తీరు చూసి అవాక్కయ్యారు.

  • దిల్లీలో అఫ్గాన్​వాసుల ప్రదర్శన...

దేశ రాజధాని దిల్లీలోని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్(UNHCR delhi) కార్యాలయం వద్ద.. అఫ్గానిస్థాన్​​ శరణార్థులు(afghan refugees in india) పెద్దఎత్తున ప్రదర్శన నిర్వహించారు. అఫ్గాన్​ వాసులందరికి శరణార్థుల హోదా లేదా కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

  • ఇంటిపైకప్పు కూలి ఇద్దరు మృతి..

పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా ఇంటిపైకప్పు కూలి ఇద్దరు మృతిచెందారు. 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

  • అమెరికాదే పూర్తి బాధ్యత...

అఫ్గానిస్థాన్​ ప్రస్తుత పరిస్థితులకు(Afghan crisis) పూర్తిగా అమెరికానే బాధ్యత వహించాలంటూ అగ్రరాజ్యంపై మరోసారి విమర్శలు చేసింది చైనా. అమెరికా.. అఫ్గాన్​ను అలా మధ్యలో అర్ధాంతరంగా వదిలేయడం సరికాదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ వ్యాఖ్యానించారు.

  • కోహ్లీ సన్నిహుతుడే కొత్త కోచ్​...

టీమ్​ఇండియా ప్రధాన కోచ్​ పదవికి ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది. అతడు ప్రస్తుత హెడ్ కోచ్ రవిశాస్త్రి, సారథి విరాట్​ కోహ్లీకి అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది.

  • అకట్టుకున్నా.. అనుకున్నది వీళ్లను కాదు..

'ఫిదా'లో వరుణ్ తేజ్, 'ఉప్పెన'లో వైష్ణవ్ తేజ్.. వారి వారి నటనతో ప్రేక్షకుల్ని ఆక్టటుకున్నారు. కానీ ఈ సినిమాల్లో హీరో పాత్ర కోసం మొదటగా అనుకుంది వీరిని కాదు.

Last Updated : Aug 24, 2021, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.