ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

ETV BHARAT HEADLINE NEWS
ETV BHARAT HEADLINE NEWS
author img

By

Published : Aug 21, 2021, 6:20 AM IST

Updated : Aug 21, 2021, 10:05 PM IST

22:02 August 21

టాప్​ న్యూస్​ @10PM

  • సహోదరత్వానికి ప్రతీక 'రక్షా బంధన్'​.. 

రేపు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రజలకు పలువురు ప్రముఖులు​ శుభాకాంక్షలు తెలిపారు. సహోదరత్వానికి, భారతీయ సంప్రదాయ ఔన్నత్యానికి రక్షాబంధన్​ ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్​ తమిళిసై, సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. ఆనందోత్సాహాలతో ఈ పండుగ జరుపుకోవాలని మంత్రి సత్యవతి, టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆకాంక్షించారు.

  • ప్రతి ఆదివారం 10 నిమిషాలు

హైదరాబాద్​లో సీజనల్​ వ్యాధుల నివారణ కోసం జీహెచ్​ఎంసీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు దోమల నివారణ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది. 10 వారాల పాటు ఈ కార్యక్రమాలు సాగనున్నాయి.

  • 'పెండింగ్​ చలానాలున్నా వాహనం జప్తు చేయొద్దు'

పెండింగ్​ చలానాలున్న కారణంగా తన వాహనాన్ని జప్తు చేశారంటూ ఓ న్యాయవాది దాఖలుచేసిన రిట్​ పిటిషన్​పై విచారణ సందర్భంగా హైకోర్టు కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. చట్ట ప్రకారం వాహనం సీజ్‌ చేయకూడదని పేర్కొంది.

  • ఆ రాష్ట్రంలో స్కూల్స్​ రీఓపెన్​

లాక్​డౌన్​ను సెప్టెంబర్​ 6వ తేదీ వరకు పొడిగిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగాక లాక్​డౌన్​లో మరిన్ని సడలింపులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా సినిమా థియేటర్లు, పాఠశాలలు పునః ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది.

  • మాజీ సీఎం కల్యాణ్​ సింగ్​ కన్నుమూత

ఉత్తర్​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్​ నేత కల్యాణ్​ సింగ్​ శనివారం రాత్రి కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన లఖ్​నవూలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

20:53 August 21

టాప్​ న్యూస్​ @9PM

  • 'జీతాలు ఇవ్వలేని కేసీఆర్ దళితబంధు ఎలా ఇస్తారు..?'

ముఖ్యమంత్రి కేసీఆర్​పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని కేసీఆర్ దళితబంధు ఎలా ఇస్తారో చెప్పాలని డిమాండ్​ చేశారు. ఎన్నికల కోసమే కేసీఆర్ పనిచేస్తారని ఆరోపించారు.

  • ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు

జమ్ముకశ్మీర్‌ను ప్రస్తుత అఫ్గానిస్థాన్‌తో పోలుస్తూ పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించి కేంద్రం తన తప్పును దిద్దుకోవాలని సూచించారు. లేకపోతే అఫ్గన్​లో నుంచి అమెరికా పారిపోయిన పరిస్థితే కేంద్రానికి కూడా పడుతుందని తెలిపారు.

  • ఆకలి మరచి.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..

కాబుల్​ విమానాశ్రయం వద్ద దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. అఫ్గానిస్థాన్​ వదిలెళ్లడానికి ఎయిర్​పోర్టు బయట చిన్నారులతో కలిసి గంటలకొద్దీ పడిగాపులు కాస్తున్నారు ప్రజలు. ఆకలిదప్పికలు మరచి, ప్రాణాలు దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు.

  • 550సార్లు విడుదలైన సినిమా..

ఓ సినిమా 100 రోజులు ఆడితే బ్లాక్​బస్టర్​ అంటాం. అలాంటిది.. ఏకంగా 75 సార్లు 100 రోజులు ఆడితే? మొత్త మీద 550 సార్లు రీరిలీజ్​ అయితే? ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కన్నడ ప్రజల్లో క్రేజ్​ మామూలుగా లేదు మరి!

  • రాజస్థాన్​కు షాక్​..

రాజస్థాన్​ రాయల్స్​ ఓపెనర్​ జాస్​ బట్లర్ ఐపీఎల్​ రెండో దశ నుంచి​ తప్పుకున్నాడు. ఆ సమయంలో బట్లర్​ భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. అప్పుడు ఆమెకు తోడుగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడతడు.

19:51 August 21

టాప్​ న్యూస్​ @8PM

  • కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్​ డ్రైవ్

సోమవారం నుంచి గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రత్యేక డ్రైవ్‌(covid vaccination special drive) చేపట్టనున్నారు. వందశాతం వ్యాక్సిన్‌ లక్ష్యంగా చేపట్టనున్న ప్రత్యేక కార్యక్రమ నిర్వహణపై సీఎస్​ సోమేశ్‌కుమార్‌ సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక డ్రైవ్ కోసం 175 సంచార టీకా వాహనాలు ఏర్పాటు చేయనున్నారు.

  • 'ఈటల​ వల్లే దళిత బంధు'

దళిత బంధుకు రూ.1.70 లక్షల కోట్లు పెద్ద విషయం కాదన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) .. ఆయుష్మాన్‌ భారత్, ఫసల్‌ బీమా, ఆవాస్‌ యోజన పథకాలకు ఎందుకు ఇన్‌స్టాల్​మెంట్స్‌ కట్టడం లేదని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్​ (MP ARVIND) ప్రశ్నించారు. కేసీఆర్‌ పతనం చూసేంత వరకు నిద్రపోయేది లేదని.. 2023లో తెరాసను ఓడించడమే తమ కర్తవ్యమని స్పష్టం చేశారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.

  • ఆ ఉద్యోగులకు కేంద్రం గుడ్​ న్యూస్​

కొవిడ్ సంక్షోభంలో ఉద్యోగం కోల్పోయి.. తిరిగి విధుల్లో చేరిన ఈపీఎఫ్​ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థలో జమ చేసే యాజమాన్యాల, ఉద్యోగుల షేర్​ను ప్రభుత్వమే చెల్లించనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు.

  • భారత్​లో చిన్నారులకు తీవ్ర ముప్పు

తుపానులు, వడగాలుల వంటి ప్రకృతి విపత్తులతో భారత్​లో చిన్నారులకు తీవ్ర ముప్పు పొంచి ఉందని యూనిసెఫె వెల్లడించింది. ఈ మేరకు పర్యావరణ మార్పులతో అధిక ప్రభావానికి గురయ్యే దేశాలకు ర్యాంకులను కేటాయించింది.

  • హీరో నానికి క్షమాపణలు​!

హీరో నాని నటించిన 'టక్​జగదీశ్'​ సినిమా విడుదలపై ఎగ్జిబిటర్లు అన్న మాటలకు స్పందించిన తెలంగాణ థియేటర్స్​ అసోసియేషన్​ ఆయనకు క్షమాపణలు చెప్పింది. తమ లక్ష్యం ఓటీటీ నుంచి థియేటర్లను కాపాడటమేనని చెప్పింది.

18:49 August 21

టాప్​ న్యూస్​ @7PM

  • అఫ్గాన్​లో కో- ఎడ్యుకేషన్​ బంద్!​

మహిళా హక్కులను గౌరవిస్తామని చెప్పిన తాలిబన్లు అందుకు విరుద్ధ నిర్ణయాలనే అమలు చేస్తున్నారు. అఫ్గానిస్థాన్​లోని ఓ రాష్ట్రంలో కో- ఎడ్యుకేషన్​(taliban banning education)కు చరమగీతం పాడుతున్నట్లు ప్రకటించారు.

  • తాలిబన్లతో చేతులు కలిపిన 'ఘనీ'!

అష్రఫ్​ ఘనీ సోదరుడు అష్మత్ ఘనీ అహ్మద్‌జాయ్‌ తాలిబన్లతో కలిసిపోయారని తెలుస్తోంది. ఇటీవల తాలిబన్లు అఫ్గనిస్థాన్​ను వశపరుచుకున్న నేపథ్యంలో అధ్యక్షుడుగా ఉన్న అష్రఫ్​ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారు.

  • 'వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ ఇక్కడి నుంచే వచ్చారు'

పార్టీ కోసం కష్టపడే వాళ్లకే టికెట్లిస్తామని టీపీసీసీ చీఫ్​ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కష్టపడి పని చేసే వారికి బీ ఫామ్​లు ఇంటికి తీసుకొచ్చి ఇస్తామన్నారు. రాజకీయాలు చేస్తా అంటే టికెట్లు రావని, సైనికుడిగా కొట్లాడితే టికెట్లు వాటంతట అవే వస్తాయని వివరించారు. శంషాబాద్‌లో నిర్వహించిన యువజన కాంగ్రెస్ సమావేశంలో రేవంత్‌తో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్‌ తదితరులు హాజరయ్యారు.

  • నడిరోడ్డుపై యువతుల వీరంగం

హరియాణాలోని రోహ్​తక్​లో రెండు వర్గాలకు చెందిన యువతులు నడిరోడ్డు మీద వీరంగం సృష్టించారు. ఒకరి చెంపలను మరొకరు చెళ్లుమనిపించారు. పక్కన ఉన్న వారు ఆపేందుకు ప్రయత్నించినా.. ఎవరూ తగ్గలేదు. ఒకరిపై ఒకరు పిడుగుద్దులతో విరుచుకుపడ్డారు.  

  • 'టీమిండియా సక్సెస్​ సీక్రెట్​ ఇదే'

టీమ్​ఇండియా బలంగా ఉండటానికి గల కారణాన్ని వివరించాడు మాజీ క్రికెటర్‌ పార్థివ్‌ పటేల్​. ప్లేయర్స్.. ఇతర భాషలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినా అంతా ఏకతాటిపై ఉన్నారని అన్నాడు.

17:49 August 21

టాప్​ న్యూస్​ @6PM

  • మెగాస్టార్​ 153వ చిత్రం టైటిల్​ ఇదే..

అగ్ర కథానాయకుడు చిరంజీవి వరుస సినిమాలతో జోష్‌ మీదున్నారు. యువ కథానాయకులకు దీటుగా షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' షూటింగ్‌ పూర్తి చేసేశారు.

  • ఘనీ కంటే ఘనుడు..

  • మైనర్ ప్రసవం​- డీఎన్​ఏ పరీక్షకు ఏడుగురు!

ఉత్తర్​ ప్రదేశ్​లో ఓ మైనర్​ ఇటీవలే శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత.. బిడ్డకు తండ్రి ఎవరు అనేది తెలుసుకోవడానికి.. ఏడుగురికి డీఎన్​ఏ పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. వీరంతా మైనర్​పై సామాహిక అత్యాచారం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

  • వారసత్వం కొనసాగించారు..

ఒకే కాన్పులో ఇద్దరు, ముగ్గురు, నలుగురు చొప్పున పిల్లలకు జన్మనిచ్చిన సంఘటనలు అరుదుగా చూస్తుంటాం. కానీ వారు పెరిగి పెద్దయ్యాక.. వారికి కూడా ఇలాగే జరుగుతుందని చెప్పలేం. కానీ కరీంనగర్​కు చెందిన అక్కాచెల్లెల్లు కవలలుగా పుట్టి.. వారి కాన్పుల్లోనూ వారసత్వాన్ని కొనసాగించారు. 3నెలల కిందట ఒకరు ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిస్తే.. మరొకరు నలుగురికి జన్మనిచ్చారు.

  • రివార్డు ఏ మూలకు సరిపోతుంది?

ఏపీకి చెందిన మాజీ మంత్రి వివేకా హత్య కేసులో తగిన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. సత్వర విచారణలో భాగంగానే సీబీఐ రివార్డు ప్రకటించి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కేసులో సమాచారం ఇచ్చే వారికి ప్రాణ భయం తప్పక ఉంటుందని అన్నారు.

16:52 August 21

టాప్​న్యూస్​@ 5PM

  • కంటతడిపెట్టిన కిషన్​రెడ్డి

దేశానికి రాజైన అంబర్​పేటకు బిడ్డనేనని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర హైదరాబాద్​లోని అంబర్​పేటకు చేరుకుంది. అంబర్​పేటకు చేరగానే రోజుల తరువాత బిడ్డ తల్లి దగ్గరికి వచ్చినట్లు ఉందని కిషన్​ రెడ్డి అన్నారు.

  • బుల్లెట్​ బండి పాటకు నర్సు స్టెప్పులు.. నెటిజన్లు ఫిదా!

సామాజిక మాధ్యమాల్లో బుల్లెట్​ బండి పాట నెటిజన్లను తెగ ఫిదా చేస్తోంది. నాలుగైదు రోజులుగా మంచిర్యాల జిల్లాకు చెందిన నవవధువు 'నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా.. వచ్చేత్తప్పా..' అంటూ చేసిన డ్యాన్స్​ ఇప్పటికే ట్రెండ్​ సెట్​ చేయగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆ పాటకే ఓ నర్సు చేసిన డ్యాన్స్​ మరోసారి వైరల్​ అవుతోంది.

  • జిమ్​లో సీఎం వర్క్​అవుట్లు.. ​

ఓ ముఖ్యమంత్రి జిమ్​లో వర్క్​అవుట్లు చేయడం ఎప్పుడైనా చూశారా? ఆ అవకాశం కల్పించారు తమిళనాడు సీఎం స్టాలిన్. ఆయన జిమ్​లో వర్క్​అవుట్లు చేస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

  • 'బుల్లెట్‌ బండి' పాట వెనుక ఆ గాయని!

'బుల్లెట్టు బండి' పాట కొద్దిరోజులుగా ట్రెండింగ్​లో దూసుకుపోతోంది. ఇటీవల ఓ నవవధువు చేసిన డ్యాన్స్ దానికి కారణం. ఇంతలా వైరల్​ అయిన ఆ పాట ఒరిజినల్​ సాంగ్​ పాడింది ఎవరో తెలుసా?

  • సెప్టెంబర్​ నుంచి జైకోవ్​-డి టీకా!

జైకొవ్‌-డి టీకా(Zycov-D Vaccine) ధరపై వచ్చేవారం స్పష్టత ఇస్తామని జైడస్‌ గ్రూప్‌ ఎండీ శార్విల్‌ పటేల్‌ తెలిపారు. సెప్టెంబరు మధ్య నుంచి టీకా సరఫరా ప్రారంభిస్తామని, అక్టోబరు నుంచి నెలకు కోటి డోసులను ఉత్పత్తి చేసేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు.

15:47 August 21

టాప్​న్యూస్​@ 4PM

  • దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై..

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై(disha encounter case) కమిషన్‌ కార్యాలయంలో త్రిసభ్య కమిషన్‌ విచారణ చేపట్టింది. వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా అఫిడవిట్ల వివరాలు అడిగి తెలుసుకుంది. ప్రభుత్వం తరఫున సాక్షిగా హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా హాజరయ్యారు.

  • తాలిబన్లలకు మద్దతుగా పోస్టులు.. 

తాలిబన్లలకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన 14 మందిని అసోం పోలీసులు అరెస్టు చేశారు. దేశభద్రతకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని అసోం పోలీసులు తేల్చిచెప్పారు.

  • తాలిబన్లకు కశ్మీర్ ఐజీపీ స్ట్రాంగ్​ వార్నింగ్​

తాలిబన్లకు గట్టి హెచ్చరికలు పంపారు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్. లోయలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా బలగాలు నిత్యం అప్రమత్తంగా ఉన్నాయని పేర్కొన్నారు. తాలిబన్లు సమస్యను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.

  • 'అఫ్గాన్​తో పాక్ వ్యూహాత్మక అడుగులు'

అఫ్గాన్​పై భారత్ ప్రభావం తగ్గించేందు పాకిస్థాన్ వ్యూహత్మక నిర్ణయాలు (Pak taliban) తీసుకుంటున్నట్లు అమెరికా నిఘా వర్గాల నివేదిక తెలిపింది. అందుకే తాలిబన్లతో శాంతి చర్చలు కొనసాగించనున్నట్లు పేర్కొంది. అఫ్గాన్​లో యుద్ధం వస్తే ఆ ప్రభావం తమపై తీవ్రంగా ఉంటుందని పాక్ ఆందోళన చెందుతున్నట్లు నివేదిక అభిప్రాయపడింది.

  • మీరు ఎంతమందైనా.. నేను మాత్రం ఒక్కడినే!

కావాలనే 'పాగల్'​ సినిమాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని హీరో విశ్వక్​సేన్​ పేర్కొన్నారు. తాజాగా నిర్వహించిన మూవీ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎవరెన్ని ప్రచారాలు చేసిన సినిమా విజయవంతం చేసిన ఘనత ప్రేక్షకులదేనని వెల్లడించారు. ​

14:51 August 21

టాప్​న్యూస్​@ 3PM

  • 'వచ్చే ఎన్నికల్లో గెలిచేది భాజపే'

కుటుంబ పాలన పోవాలంటే రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా యాదాద్రిలో పర్యటించిన ఆయన... రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భాజపానే అంటూ ధీమా వ్యక్తం చేశారు.

  • 100 మందికి పైగా పాక్ ఉగ్రవాదులు విడుదల

అఫ్గానిస్థాన్​లోని ప్రజలపై అరాచకత్వాన్ని ప్రదర్శిస్తున్న తాలిబన్లు.. సాటి ఉగ్రవాదులపై మాత్రం ప్రేమ కనబరుస్తున్నారు. అఫ్గాన్​ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న వంద మందికి పైగా ఉగ్రవాదులను తాలిబన్లు విడుదల చేశారు. విడుదలైన వారిలో తెహ్రీక్‌ తాలిబన్‌ ఉగ్రవాదులు సైతం ఉన్నారు.

  • పెళ్లిళ్లకు భారీ డిమాండ్.. 

ముందు తమకంటే.. తమకు ముందు వివాహం జరిపించాలని రెండు కుటుంబాలు ఘర్షణకు దిగాయి. పెళ్లిళ్లకు డిమాండ్​తో.. ఆలయానికి జంటలు భారీగా తరలివచ్చాయి. దీంతో ఆలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

  • వేలంలో నీరజ్ జావెలిన్, సింధు రాకెట్​, లవ్లీనా గ్లోవ్స్

టోక్యో ఒలింపిక్స్​లో పతకాలు సాధించిన భారత అథ్లెట్ల క్రీడా వస్తువులను వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే నీరజ్​ చోప్డా జావెలిన్​, లవ్లీనా బాక్సింగ్ గ్లోవ్స్​, పీవీ సింధు రాకెట్​ను ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) ​తీసుకున్నట్లు సమాచారం. ఆగస్టు 16న మోదీ నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో ఈ ప్రతిపాదన తెచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించారు.

  • 'ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తూనే.. వృద్ధికి ఊతమిస్తాం'

కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ద్రవ్యోల్బణం, వృద్ధి అంచనాలపై కీలక వ్యాఖ్యలు చేసింది ఆర్​బీఐ. ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తూనే.. వృద్ధికి ఊతమివ్వాల్సిన అవసరం ఉందన్నారు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​.

13:42 August 21

టాప్​న్యూస్​@ 2PM

  • KISHAN REDDY: ఉచిత రేషన్ బియ్యం పంపిణీ అమలుపై ఆరా

జన ఆశీర్వాద యాత్రలో భాగంగా భువనగిరిలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి పర్యటిస్తున్నారు. కేంద్రం చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. ప్రగతినగర్​లోని రేషన్​ దుకాణాన్ని సందర్శించి ఉచిత బియ్యం పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు.

  • WEATHER REPORT: రాగల మూడ్రోజులు.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

రాగల మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

  • బస్సు వెళ్తుండగా విరిగిపడిన కొండ.. ఆ తర్వాత?

ఉత్తరాఖండ్​లోని నైనిటాల్​లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాలకు వీర్​ భట్టీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. అదే సమయంలో కేఎంఓయూకు చెందిన బస్సు అల్మోరా నుంచి హల్దివానికి వెళ్తోంది. బస్సుకు అడుగుల దూరంలోనే ఈ ఘటన జరగటం వల్ల ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బస్సులో 14 మంది ప్రయాణికులు ఉన్నారు. కొండచరియలు విరుగిపడుతున్న క్రమంలో.. బస్సు కిటికీల్లోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.

  • తాలిబన్లు కిడ్నాప్ చేసిన వారిలో భారతీయులు!

అఫ్గాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. కాబుల్ విమానాశ్రయ సమీపం నుంచి 150 మంది పౌరులను తాలిబన్లు కిడ్నాప్‌ చేసినట్లు సమాచారం. అఫ్గాన్‌ నుంచి ఇతర దేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నవారిని నిర్బంధించినట్లు తెలుస్తోంది. వారిలో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో భారత విదేశాంగ వెంటనే అప్రమత్తమైంది. మరోవైపు ఈ వార్తలను తాలిబన్‌ ప్రతినిధి అహ్మదుల్లా వాసిక్ ఖండించాడు.

  • Taliban news: రుచిగా వండలేదని మహిళ ఒంటికి నిప్పంటించిన తాలిబన్లు!

తాలిబన్ల అరాచకాలు(Afghan Taliban) తట్టుకోలేక అఫ్గాన్ ప్రజలు ఆర్తనాదాలు పెడుతున్నారు. ఆహారం రుచిగా వండలేదనే కారణంతో ఓ మహిళ ఒంటికి వారు నిప్పంటించినట్లు అప్గాన్​ మాజీ జడ్జి తెలిపారు. జిహాదీలను పెళ్లి చేసుకోవాలని యువతులను బలవంతం చేస్తున్నారని, మహిళలను శవపేటికల్లో బంధించి ఇతర దేశాలకు తరలించి సెక్స్ బానిసలుగా మారుస్తున్నారని వెల్లడించారు.

11:58 August 21

టాప్​న్యూస్​@ 1PM

  • నిధులు విడుదల

గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు(funds) విడుదల చేసింది. 15వ ఆర్థికసంఘం నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంటును విడుదల చేసింది. ఇందులో గ్రామపంచాయతీలకు రూ.182.49 కోట్లు ఇచ్చింది.

  • అఫ్గానిస్థాన్‌ - శ్రీకాకుళం జర్నీ

అఫ్గానిస్థాన్‌ నుంచి తిరిగొచ్చిన శ్రీకాకుళం జిల్లా వాసుల మనోగతం.. అక్కడి నుంచి మన దేశానికి చెందిన అధికారుల తరలింపు సమయంలో వారు అనుభవించిన నరకయాతన, ఆందోళన వారి మాటల్లోనే..

  • తెలుగు యువకుల సత్తా

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్వహించిన ‘బ్రేక్‌ ది ఐస్‌ లూనార్‌ ఛాలెంజ్‌’లో తెలుగు యువకుల సత్తా చాటారు. పోటీలో విజయం సాధించి నగదు బహుమతితో పాటు రెండేళ్ల పాటు నాసాలో పనిచేసే అవకాశాన్ని సాధించారు.

  • సైనికుల ఒడిలో 'అఫ్గాన్'​ పసికందులు

తాలిబన్ల ఆక్రమణలతో అఫ్గానిస్థాన్‌లో (Afghanistan Taliban) కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ముష్కరుల అరాచక పాలన ఎరిగిన అఫ్గాన్‌ వాసులు ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలని కాబుల్‌ విమానాశ్రయానికి పోటెత్తుతున్నారు. 

  • త్వరలోనే 'మా' కల నెరవేరనుంది

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ 'మా' కల త్వరలో నెరవేరనుందని నటుడు మంచు విష్ణు అన్నారు. మరికొన్ని రోజుల్లో జరగనున్న 'మా' ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న ఆయన తాజాగా ట్విటర్‌లో ఓ వీడియో షేర్‌ చేశారు.

11:57 August 21

టాప్​న్యూస్​@ 12PM

  • కొండా సురేఖ దాదాపు ఖరారు!

హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కొండా సురేఖ దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది.

  • కొవిడ్​ను ఎదుర్కోవడానికి ఆ గ్రామం రెడీ.!

కరోనా రెండు, మూడు దశలు ప్రపంచాన్ని అతలాకుతలం చేశాయి. ఎంతో మంది ప్రాణాల్ని బలితీసుకున్నాయి. కానీ ఆ గ్రామస్థులు మాత్రం భయపడలేదు. కొవిడ్​ను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. 

  • కుండపోత వర్షం

దేశంలో పలు చోట్ల కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం 8:30 గంటల వరకు దిల్లీలోని సఫ్దార్​జంగ్​ ప్రాంతంలో రికార్డు స్థాయిలో 13.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు 

  • ఆ స్టేడియానికి నీరజ్ చోప్డా​ పేరు!

టోక్యో ఒలింపిక్స్ గోల్డ్​ మెడలిస్ట్​ నీరజ్ చోప్డా (Neeraj Chopra) మరో అరుదైన గౌరవం దక్కించుకోనున్నాడు. పుణెలో ఆర్మీ స్టేడియానికి అతడి పేరు పెట్టనున్నారు! ఆగస్టు 23న ఈ కార్యక్రమం జరగనుంది.

  • చిరు బర్త్​డే అప్డేట్స్

అగ్రకథానాయకుడు చిరంజీవి పుట్టినరోజున అప్డేట్లు క్యూ కట్టనున్నాయి. ఇప్పటికే కొన్నింటిపై ప్రకటన రాగా, ఆ సినిమాల టైటిల్స్ ఇవే అంటూ కొన్ని సోషల్ మీడియాలో హల్​చల్ చేస్తున్నాయి. వీటిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

11:27 August 21

టాప్​న్యూస్​@ 11AM

  • 'పర్యాటక రంగాన్ని పునః ప్రారంభిస్తాం'

తన సేవలను గుర్తించి ప్రధాని మోదీ కేబినెట్​ మంత్రిగా పదోన్నతి కల్పించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో పర్యాటక శాఖను బలోపేతం చేస్తామని వెల్లడించారు.

  • కానిస్టేబుల్ సస్పెన్షన్

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. గుంటూరులో పదో తరగతి చదివే బాలిక పట్ల కానిస్టేబుల్ రమేశ్ అసభ్యంగా ప్రవర్తించారని దిశా స్టేషన్‌లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 

  • దేశంలో కరోనా కేసులు 

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య (Coronavirus India) స్వల్పంగా తగ్గింది. కొత్తగా 34,457మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 375 మంది కొవిడ్​ బారిన పడి మరణించారు.

  • పట్టాలెక్కని పీహెచ్​సీ

నగరానికి చేరువలో ఉన్న శంషాబాద్‌ జనాభా సుమారు లక్ష. ఇక్కడ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ ఉంది. దీన్ని వంద పడకలకు అప్‌గ్రేడ్‌ చేయాలని పదేళ్లుగా చేస్తున్న ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది.

  • బ్రేక్​ టైమ్​లో గన్​తో..

షూటింగ్​ విరామ సమయంలో గన్​తో బుల్లెట్ల వర్షం కురిపిస్తూ కనిపించారు పవన్​. ఆ వీడియోను చిత్రబృందం షేర్ చేసింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న థియేటర్లలోకి రానుంది.

09:51 August 21

టాప్​న్యూస్​@ 10AM

  • 'కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు'

కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను ఇతర పథకాలకు మళ్లించి.. తామే రాష్ట్రానికి సేవ చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

  • తాలిబన్ల చెరలో నెల్లూరు వాసులు

ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు యవకులు..తాము పనిచేస్తున్న సంస్థ తరఫున 18 ఏళ్ల క్రితం అఫ్గానిస్థాన్‌లో రోడ్లు వేసే పనుల్లో కుదిరారు. అనుకోకుండా తాలిబన్లకు చిక్కి..మరణం అంచుల దాకా వెళ్లి అదృష్టవశాత్తు బయటపడ్డారు.

  • సృజన కేంద్రాలు

కరోనా ఆంక్షల కారణంగా ఐటీ తదితర కంపెనీలు ఉద్యోగులకు 'ఎక్కడి నుంచైనా పని' విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఫలితంగా దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాలు ప్రతిభా కేంద్రాలుగా, ఉపాధి ప్రాంతాలుగా అవతరిస్తున్నాయి.

  • అఫ్గాన్‌ సంపదపై డ్రాగన్‌ కన్ను

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు చేజిక్కించున్న క్రమంలో చైనా భారీగా లాభపడే అవకాశం ఉంది. అఫ్గాన్‌ సరిహద్దు ప్రావిన్స్‌ బదక్షాన్‌లోని నజాక్‌ ప్రాంతంలో ఇరుదేశాలను కలుపుతూ.. 50 కిలోమీటర్ల రహదారి సిద్ధమవుతోంది.

  • నటి చిత్ర ఆకస్మిక మరణం

దక్షిణాదిలో అన్ని భాషల్లో నటించి, గుర్తింపు తెచ్చుకున్న నటి చిత్ర గుండెపోటుతో మరణించారు. ఈమె మృతిపట్ల పలువురు నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు.

09:02 August 21

టాప్​న్యూస్​@ 9AM

  • చెత్తకుప్పలో పసికందు మృతదేహం

నిజామాబాద్‌లో చెత్తకుప్పలో పసికందు మృతదేహాన్ని గుర్తించారు. పసికందు మృతదేహం స్థానికులు గుర్తించిన పోలీసులకు సమాచారమిచ్చారు.  సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అవంతిపొరాలోని త్రాల్​లో ముగ్గురు ముష్కరుల్ని మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

  • పెరిగిన డ్రై ఫ్రూట్స్ ధరలు

ఎండు పండ్ల ధరలపై అఫ్గానిస్థాన్‌ ప్రభావం పడనుంది. తాలిబన్ల వశమైన ఆ దేశం నుంచి ఎగుమతులను ప్రస్తుతానికి నిషేధించారు. మన దేశానికి వాల్‌నట్స్‌, అప్రికాట్‌, అంజీర్‌, పైన్‌నట్స్‌ ఈ దేశం నుంచి దిగుమతి అవుతాయి.

  • థర్డ్​ వేవ్​కు అడ్డుకట్ట!

కరోనా మహమ్మారి(Coronavirus) మరోసారి విజృంభిస్తే దాని తీవ్రతలో హెచ్చుతగ్గులున్నా- ప్రజారోగ్య వ్యవస్థపై మళ్లీ ఒత్తిడి పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో మూడో ఉద్ధృతిని(Third wave in India) సమర్థంగా ఎదుర్కోవడానికి పాలకులు కొన్ని కీలక చర్యలు చేపట్టాల్సి ఉంది.

  • న్యాయవ్యవస్థలో నారీశక్తి

భారత సర్వోన్నత న్యాయస్థానానికి ఒక నారీమణి నేతృత్వం వహించాలనే ఆకాంక్షలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం తాజా నిర్ణయాలు అద్దంపట్టాయి. 

07:53 August 21

టాప్​న్యూస్​@ 8AM

  • లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న కిషన్​రెడ్డి

జన ఆశీర్వాదయాత్రలో భాగంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్మాణాన్ని కిషన్ రెడ్డి పరిశీలించారు.

  • మూడు జిల్లాల్లోనే.. మూడోవంతు పరిశ్రమలు

పారిశ్రామిక వికేంద్రీకరణ లక్ష్యంతో టీఎస్​ఐపాస్​ విధానానికి శ్రీకారం చుట్టింది. 33 జిల్లాల్లో పరిశ్రమలు స్థాపించేలా మౌలిక వసతులను విస్తరించింది. కానీ పారిశ్రామిక వేత్తలు మారుమూల జిల్లాల వైపు మొగ్గుచూపడం లేదనేది స్పష్టం అయింది. నగరాలు, పట్టణాలకు సమీపంలోనే పారిశ్రామిక వర్గాలు పరిశ్రమలు స్థాపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

  • అఫ్గాన్‌లో తాలిబన్ల ప్రతీకారేచ్ఛ

అఫ్గానిస్థాన్​ను(Afghan crisis) హస్తగతం చేసుకున్న తాలిబన్లు(Taliban) ప్రతీకారానికి దిగబోమని చెప్పి మాట తప్పారు. గత ప్రభుత్వానికి సహకరించిన వారికోసం అన్వేషణ ప్రారంభించారు. ఇంటింటికీ తిరుగుతూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఓ జర్నలిస్టు బంధువు ప్రాణాలు బలితీసుకున్నారు. 

  • ఎక్కువగా ఏ పోస్టును చూశారో తెలుసా?

భారత్​కు చెందిన వ్యక్తిత్వ వికాస నిపుణుడు గౌర్‌ గోపాల్‌ దాస్‌.. ఫేస్​బుక్​లో పెట్టిన పోస్టుకు విశేష ఆదరణ లభించింది. ఈ పోస్టుకు ఏకంగా 80.6 మిలియన్ల వ్యూస్‌ లభించాయి.

  • ఆ సినిమా హీరోకు రూ.223 కోట్లు

హాలీవుడ్​లో తీస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా కోసం హీరోహీరోయిన్లకు కళ్లు చెదిరే మొత్తం రెమ్యునరేషన్​గా ఇస్తున్నట్లు సమాచారం. ఇంతకీ దాని సంగతేంటి? ఆ నటులు ఎవరు?

07:17 August 21

టాప్​న్యూస్​@ 7AM

సాయం చేయడమే తప్పా..!

రేపిస్టు అని వార్తలు, కథనాలు రావటం తననేంతో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశాడు గాంధీ ఆసుపత్రి రేడియోగ్రాఫర్‌ ఉమామహేశ్వర్‌. దూరపు బంధువులని సాయం చేసినందుకు ఇలా ఎలా నాపై ఇంతటి ఘోరమైన ముద్ర వేస్తారని కన్నీరుమున్నీరయ్యారు. నిజాన్ని తెలుసుకుని తనను వదలి పోలీసులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు.

కాంగ్రెస్​ సమాయత్తం!

వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలకు(Assembly election 2022) పార్టీని సమయాత్తం చేసేందుకు కాంగ్రెస్​(congress party) చర్యలు చేపట్టింది. కొన్ని రాష్ట్రాల్లో ఒంటరిగా, మిగతా వాటిల్లో ప్రతిపక్షాలతో కలిసి భాజపాను ఓడించే లక్ష్యంతో పావులు కదుపుతోంది. ఇందుకోసం భారీ మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. అది పాత, కొత్త తరం నాయకుల సంగమంతో ఉంటుందని ఓ సీనియర్​ నాయకుడు చెప్పారు. ప్రియాంక గాంధీ మరింత విస్తృతమైన బాధ్యతలు చేపట్టాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు

భూమివైపు వేగంగా దూసుకొస్తున్న గ్రహశకలం!

నేడు భూమికి చేరువగా గ్రహశకలం రానున్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా' తెలిపింది. గంటకు 94వేల కిలోమీటర్ల వేగంతో ఈ గ్రహశకలం దూసుకొస్తున్నట్లు పేర్కొంది. దీన్ని ప్రమాదకరమైన అంతరిక్షశిలగా అభివర్ణించింది.

గందరగోళంలో అఫ్గాన్​ క్రికెట్.. భవిష్యత్ ఏంటో?

టీ20 ర్యాంకింగ్స్‌లో ఆ జట్టుది ఏడో స్థానం. శ్రీలంక, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ ఆ జట్టు కంటే కిందే. టీ20లో వరుసగా 12 విజయాలు సాధించిన ఏకైక జట్టు అదే. పొట్టి క్రికెట్లో అత్యధిక స్కోరు (278/3) ఘనత వాళ్లదే. వన్డే ఆల్‌రౌండర్లలో 2, 4 స్థానాలు వారివే. టీ20 బౌలింగ్‌లో 3, 5 ర్యాంకులు వారి సొంతమే. పై గణాంకాల ప్రకారం ఇదేదో అగ్రశ్రేణి జట్టు అనుకోవచ్చు. కానీ ఈ ఘనతలు అఫ్గానిస్థాన్‌ ఆటగాళ్ల సొంతం. ఇంత ప్రతిభ ఉన్న క్రికెటర్ల భవితవ్యం ఇప్పుడు ప్రమాదంలో పడింది.

పూజా హెగ్డేపై నటి రోజా భర్త విమర్శలు

హీరోయిన్ పూజాహెగ్డే తీరు ఈ మధ్య చాలా మారిపోయిందని సీనియర్ నటి రోజా భర్త విమర్శలు చేశారు. ఇంతకీ ఆమె ఏం చేసింది? ఆయన ఎందుకలా అన్నారు?

04:10 August 21

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

ఉపఎన్నికకు సీఎం దిశానిర్దేశం..

హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజల్లోకి మరింతగా వెళ్లాలని, ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఉపఎన్నికపై మంత్రులు, నేతలతో సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రులు హరీశ్​ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ సహా ఇతర నేతలతో ముఖ్యమంత్రి ప్రగతిభవన్​లో సమావేశమయ్యారు.

న్యాయమైన వాటాకు కృషి చేయండి..

నదీజలాల్లో రాష్ట్రానికి న్యాయమైన వాటా కోసం... నదీ యాజమాన్య బోర్డుల సమావేశాల్లో బలమైన వాణి వినిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ ఏడాది నుంచి కృష్ణా జలాల్లో 50 శాతం జలాలు కావాలన్న విషయమై.. అన్ని ఆధారాలతో భేటీ ముందు ఉంచాలని దిశానిర్దేశం చేశారు. మల్లన్నసాగర్ పనుల పురోగతిపైనా... సీఎం కేసీఆర్ ఆరా తీశారు. త్వరలోనే క్షేత్రస్థాయిలో పనులను... ముఖ్యమంత్రి పరిశీలించే అవకాశం ఉంది.

మూడో రోజుకు కిషన్​రెడ్డి యాత్ర...

జన ఆశీర్వాద యాత్ర.. రెండో రోజు విజయవంతంగా సాగింది. సూర్యాపేట నుంచి ప్రారంభమైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి యాత్ర.. మహబూబాబాద్, వరంగల్‌, జనగామ జిల్లాల మేదుగా... యాదాద్రి చేరుకుంది. ఇవాళ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం... యాత్ర ఘట్‌కేసర్‌, ఉప్పల్‌ మీదుగా హైదరాబాద్‌ చేరుకోనుంది. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభతో... యాత్ర ముగియనుంది.

సాయం చేయటమే తప్పా...

మండిపోతున్న గ్యాస్​ బండలు..

గ్యాస్​ బండ మండిపోతోంది. కేవలం తొమ్మిది నెలల్లోనే సిలిండర్​పై ఏకంగా సుమారు రూ.265.50 పెరిగింది. పెరిగిన ధరలతో రాష్ట్రంలోని వినియోగదారులు సుమారు రూ.150 కోట్లకుపైగా అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది.

కొత్తగా వందే భారత్​ రైళ్లు...

స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న 'వందే భారత్' రైళ్లు మరిన్ని సౌకర్యాలతో ముందుకు రానున్నాయి. అత్యవసర ద్వారాలు, మెరుగైన సీటింగ్ వసతులు, అధునాతన కోచ్ పర్యవేక్షణ వ్యవస్థలు.. వంటి హంగులతో ఈ రైళ్ల కొత్త కోచ్ లను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

కేరళలో కేసుల కొనసాగింపు..

కేరళలో కరోనా(Corona cases) ఉద్ధృతి కొనసాగుతోంది. అక్కడ కొత్తగా 20,224 కేసులు వెలుగుచూశాయి. ఇక మహారాష్ట్రలో ఒక్కరోజే 4వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదవగా.. తమిళనాడులో 1,667 మందికి వైరస్​ సోకింది.

విమాన హైజాక్​ ఘటనలాగే ఉన్నాయి...

కాబుల్​ విమానాశ్రయంలోని ప్రస్తుత పరిస్థితులు.. 'కాందహార్​ విమాన హైజాక్​ ఘటన'ను తలపిస్తున్నాయని కెప్టెన్ దేవీ శరణ్​ పేర్కొన్నారు. వేలాది మంది అఫ్గాన్ నుంచి బయటపడాలని చూస్తున్నారని చెప్పారు.

బీసీసీ పెద్దలతో కోహ్లీ మీటింగ్​...

త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్​ గెలవడమే లక్ష్యంగా కోహ్లీ.. బీసీసీఐ పెద్దలతో సమావేశమైనట్లు సమాచారం. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, సెక్రటరీ జేషా, ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారని తెలిసింది.

హ్యాపీ బర్త్​డే భూమిక...

టాలీవుడ్​ సీనియర్​ హీరోయిన్​ భూమిక చావ్లా.. శనివారం 43వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆమె గురించి ప్రత్యేక కథనం మీకోసం..

Last Updated : Aug 21, 2021, 10:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.