ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు - telangana updates

ETV BHARAT HEADLINE NEWS
ETV BHARAT HEADLINE NEWS
author img

By

Published : Aug 20, 2021, 6:23 AM IST

Updated : Aug 20, 2021, 9:59 PM IST

21:49 August 20

టాప్​ న్యూస్​ @10PM

  • కరోనా కేసులు తగ్గుముఖం

రాష్ట్రంలో గడిచిన 24గంటల వ్యవధిలో కొత్తగా 359 కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి బారిన పడి ఇద్దరు మరణించారు. కరోనా నుంచి కొత్తగా 494 మంది కోలుకున్నారు.

  • ఆ సమయంలో భారతీయులపై తాలిబన్ల కాల్పులు!

తాలిబన్ల భీకర కాల్పుల మధ్య దిక్కుతోచని స్థితిలో ఉన్నవారిని సాహసించి స్వదేశాలకు తరలించింది భారత వాయుసేన. భారత్​ వచ్చే క్రమంలో మన దేశస్థులు ఎక్కే విమానంపై తాలిబన్లు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. అయితే ఆ సమయంలో అక్కడి నుంచి ఎలా బయటపడ్డారనే విషయాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం..

  • 'నో కాస్ట్' ఈఎంఐ అసలు రహస్యం ఇది!

నో కాస్ట్ ఈఎంఐ.. ఆన్​లైన్ షాపింగ్ చేసే ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో దీని గురించి వినే ఉంటారు. ఫోన్, టీవీ సహా ఇతర వస్తువులను కొనేటప్పుడు.. నో కాస్ట్ ఈఎంఐ కొంటే ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని ఈ-కామర్స్ కంపెనీలు చెబుతుంటాయి. మరి నిజంగానే వడ్డీ భారం ఉండదా? లేదా కేవలం ఇది విక్రయాలు పెంచే ట్రిక్ మాత్రమేనా?

  • దోమలు కుడితే ఎయిడ్స్​ వస్తుందా?

హెచ్​ఐవీ ఎయిడ్స్ దోమల నుంచి వ్యాపిస్తుందా? అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. అయితే.. దీనికి ప్రముఖ వైద్య నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారో తెలుసుకుందాం.

  • ఆ ముగ్గురు హీరోల మధ్యే పోటీ!

సౌత్​ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(SIIMA awards) వేడుకలు త్వరలోనే జరగనున్నాయి. సైమా తాజాగా 2020 నామినేషన్లని ప్రకటించింది. ఈ నామినేషన్లలో ముగ్గురు హీరోల చిత్రాల మధ్య పోటీ పెద్దఎత్తున ఉందని పేర్కొంది.

20:54 August 20

టాప్​ న్యూస్​ @9PM

  • పిల్లల టీకాకు అనుమతి 

కరోనా కట్టడికి దేశంలో మరో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. గుజరాత్‌కు చెందిన ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన మూడు డోసుల జైకోవ్‌-డి టీకా అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతి మంజూరు చేసింది. 

  • 'తెరాసకు డిపాజిట్​ కూడా దక్కదు'

ఒక్క వ్యక్తిని ఓడించేందుకు అనేక కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్​ ఆరోపించారు. హుజూరాబాద్‌లో ఎన్ని అప్రజాస్వామిక పద్ధతులను ప్రయోగించినా గెలుపు తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కిషన్‌ రెడ్డి జన ఆశీర్వాద సభలో కమలాపూర్‌లో ఈటల పర్యటించారు.

  • చిన్నారి చెంతకు 'తల్లి జ్ఞాపకాలు' 

కరోనా.. ఆ చిన్నారి తల్లిని బలిదీసుకుంది. అమ్మతో గడిపిన క్షణాలు కూడా ఫోన్​ రూపంలో దూరమై మరింత క్షోభ పెట్టాయి. ఇన్ని రోజులూ తల్లిని మనసులోనే దాచుకున్న ఆ బాలిక పెదవులపై చిరునవ్వు తీసుకొచ్చారు కర్ణాటక పోలీసులు. ఎట్టకేలకు పోగొట్టుకున్న తల్లి మొబైల్ ఫోన్​ను ఆమెకు అందించారు.

  • 'స్థిరత్వమే మా బలం'

యూఏఈ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్​పై స్పందించాడు ఇంగ్లాండ్​ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. నిలకడైన ఆటతీరే తమ జట్టుకు అతిపెద్ద బలమని పేర్కొన్నాడు. దీనికి వేగాన్ని జోడించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు.

  • భారీ మొత్తానికి.. 

కేజీఎఫ్​ 2 శాటిలైట్​ హక్కుల్ని ప్రముఖ సంస్థ 'జీ' భారీ మొత్తానికి కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని యశ్​ ​వెల్లడించారు. ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంజయ్‌ దత్‌, రావు రమేశ్‌, రవీనా టాండన్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

19:41 August 20

టాప్​ న్యూస్​ @8PM

  • ఉపఎన్నికపై దిశానిర్దేశం 

హుజూరాబాద్ ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో సమాలోచనలు జరిపారు. నియోజకవర్గంలో పరిస్థితులపై ఆరా తీశారు.   

  • 'నీతికి, నిజాయితీకి ప్రతిరూపం'  

నీతికి, నిజాయితీకి ఈటల రాజేందర్​ ప్రతిరూపమని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా హనుమకొండ జిల్లా కమలాపూర్​లో యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో ఈటల రాజేందర్​ పాల్గొన్నారు.

  • 'కలిసి ముందుకు సాగుదాం'

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ పలు పార్టీల నేతలతో వర్చువల్​గా సమావేశమయ్యారు. ఈ భేటీకి ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​, సీపీఎం నుంచి సీతారాం ఏచూరి, బంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు.

  • యూఎస్​ ఓపెన్​కు మరో స్టార్ టెన్నిస్​ ప్లేయర్​ దూరం

మరో స్టార్​ టెన్నిస్​ ప్లేయర్​ యూఎస్​ ఓపెన్ (US Open 2021) నుంచి వైదొలిగాడు. పాదానికి గాయం కారణంగా యూఎస్​ ఓపెన్​తో పాటు సీజన్​ మొత్తానికి దూరమవుతున్నట్లు ప్రకటించాడు​. ఇంతకి అతడు ఎవరంటే..

  • బర్త్​డే సర్​ప్రైజ్​.. 

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు సర్​ప్రైజ్​ ఇవ్వనుంది చిత్రబృందం. శనివారం సాయంత్రం చిరు కొత్త సినిమాకు సంబంధించి ఫస్ట్​లుక్ విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

18:54 August 20

టాప్​ న్యూస్​ @7PM

  • సీఎం కేసీఆర్​ సమీక్ష

నదీజలాల్లో రాష్ట్రానికి న్యాయమైన వాటా కోసం నదీ యాజమాన్య బోర్డుల సమావేశాల్లో బలమైన వాణి వినిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు (cm kcr review on krmb) స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో ప్రగతిభవన్​లో సమావేశం నిర్వహించారు. ఈ నెల 27న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం (krmb meeting) జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం సమీక్ష నిర్వహించారు.  

  • ప్రపంచంలోనే డేంజరస్ స్కైవే

ఉత్తరాఖండ్​లోని చారిత్రక గర్తాండ్​ స్కైవేను(Gartang Gali) 59ఏళ తర్వాత తిరిగి తెరిచింది ప్రభుత్వం. 11వేల అడుగుల ఎత్తులో కొండకు ఆనుకుని ఉండే ఈ మార్గాన్ని చూస్తే పర్యటకులు వినూత్న అనుభూతి పొందుతారు. ప్రస్తుతం కొవిడ్ నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే సందర్శకులను అనుమతిస్తున్నారు.

  • విధ్వంసమా? నవోదయమా? 

ఆగస్టు 31, 2021.. అఫ్గానిస్థాన్​ చరిత్రలో ఈ తేదీ అత్యంత కీలకంగా మారే అవకాశముంది. ఆగస్టు 31 తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుపై ఓ నిర్ణయం తీసుకోవాలని తాలిబన్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు ఓ కారణం ఉంది.

  • నాగ్​పుర్​లో మాయమై.. తాలిబన్లతో కలిసి ప్రత్యక్షమై..

భారత్​లో పదేళ్ల పాటు అక్రమంగా నివసించిన ఓ వ్యక్తి అనూహ్యంగా అఫ్గానిస్థాన్​లోని తాలిబన్లతో కలిసి ప్రత్యక్షమయ్యాడు. ఇంతకీ ఎవరు అతను? అసలు భారత్​లో ఎందుకున్నాడు?

  • నిరాశే మిగిలింది..

భారత్, ఇంగ్లాండ్​ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్​లో భాగంగా తొలి రెండు టెస్టుల్లో అశ్విన్​కు చోటు దక్కలేదు. అయితే.. తాను ఆడకపోవడానికి కారణమేంటో తన యూట్యూబ్ ఛానల్​ ద్వారా తెలిపాడు అశ్విన్.

17:44 August 20

టాప్​ న్యూస్​ @6PM

  • జగదీశ్​ రెడ్డి సవాల్​ 

భాజపా, తెరాస మేనిఫెస్టోలపై చర్చకు కిషన్‌ రెడ్డి సిద్ధమా అంటూ విద్యుత్​ శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి సవాల్​ విసిరారు. మిషన్‌ భగీరథ చక్కని పథకమని.. నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ చెప్పినా కేంద్రం నిధులు ఇవ్వలేదని మంత్రి గుర్తుచేశారు.

  • భారత్​లో మరో టీకాకు అనుమతి!

భారత్​లో మరో టీకా వినియోగానికి అతి త్వరలోనే అనుమతి లభించే అవకాశముంది. జైడస్​ క్యాడిలా మూడు డోసుల టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాలని కొవిడ్ టీకాలపై ఏర్పాటైన నిపుణుల కమిటీ కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ-డీసీజీఐకి సిఫార్సు చేసింది. దీనిపై డీసీజీఐ అతి త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.

  • తాలిబన్ల ఊచకోత

తాలిబన్లు(Taliban news) తమ సహజ బుద్ధిని బయటపెట్టారు. ఓవైపు శాంతి జపం చేస్తూనే మరోవైపు ప్రజలపై ఊచకోతకు దిగుతున్నారు. ఓ గ్రామంలోని మైనారిటీలను తాలిబన్​ ఫైటర్లు చిత్రహింసలు పెట్టి ఉసురు తీశారు. తాలిబన్ల పాలనపై ఆందోళన పడుతున్న దేశ ప్రజలకు ఈ వార్త వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

  • వృథాగా లక్షల కోట్లు 

అఫ్గానిస్థాన్​ యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికా లక్ష కోట్ల డాలర్లను వెచ్చించిందని ది స్పెషల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఫర్‌ అఫ్గానిస్థాన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ (సిగర్‌) రిపోర్టు తెలిపింది. చాలా ముఖ్యమైన సుమారు 10 ప్రాజెక్టులకు ఈ మొత్తాన్ని వృథాగా ఖర్చు చేసినట్లు ఈ నివేదికలో పేర్కొంది.

  • హీరోగా బండ్ల గణేష్​!

బండ్ల గణేష్​ ఓ కొత్త అవతారంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఓ తమిళ హిట్ చిత్రం​ రీమేక్​తో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

16:54 August 20

టాప్​ న్యూస్​ @5PM

  • 'చివరి వ్యక్తి వరకు టీకా ఇస్తాం'  

దేశంలో చివరి వ్యక్తి వరకు కరోనా టీకా ఇస్తామని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా ఆయన హన్మకొండకు చేరుకున్నారు.

  • తాలిబన్లను ఉద్దేశించి మోదీ కీలక వ్యాఖ్యలు!

గుజరాత్​లోని సోమనాథ్​లో కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సోమనాథ్​ ఆలయంపై గతంలో జరిగిన దాడులను గుర్తు చేస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. విధ్వంసక, తీవ్రవాద శక్తుల ఆధిపత్యం కొంతకాలమేనని, వారి ఉనికి శాశ్వతం కాదని తెలిపారు. అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో వారి పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ.

  • అంతా ఆ వేరియంట్​ వల్లే.. 

టీకా తీసుకున్న తర్వాత కూడా వైరస్​ బారినపడుతున్న కేసులు ఈ మధ్య కాలంలో వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనికి కరోనా కొత్త వేరియంట్​ ఏదైనా కారణమా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే భారత్​తో సహా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న డెల్టా వేరియంట్​.. ఈ బ్రేక్​త్రూ(Breakthrough Infections) కేసులకు కారణమని పరిశోధనల్లో తేలింది.

  • అమెరికా రెస్క్యూ ఆపరేషన్​

ఇచ్చిన మాట కోసం తాలిబన్ల కళ్లుగప్పి(Afghan Crisis) అఫ్గాన్​ పోలీస్​ ఉన్నతాధికారిని కాపాడింది అమెరికా సైన్యం. బుధవారం ప్రత్యేక ఆపరేషన్​ నిర్వహించి అతనితో పాటు కుటుంబసభ్యులనూ హెలికాప్టర్లో కాబుల్​ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ రెస్క్యూ ఆపరేషన్​ గురించి తెలిస్తే ఎవరికైనా ఇది సినిమానా లేక యదార్థమా అనే సందేహం వస్తుంది. ఆ కథేంటో చూడండి.

  • మాల్దీవుల్లో కరీనా 

మాల్దీవుల్లో పర్యటిస్తున్న బాలీవుడ్​ నటి కరీనా కపూర్​ ఖాన్​.. ఆమె రెండో కుమారుడు జేహ్​ ఫొటోను షేర్​ చేసింది. కరీనా.. ఆమె రెండో కుమారుడి ఫొటోలు షేర్​ చేయడం అరుదు కావడం వల్ల అభిమానులు ఈ చిత్రాన్ని చూసి మురిసిపోతున్నారు.

15:44 August 20

టాప్​ న్యూస్​ @4PM

  • రక్తం చిందించిన షియాలు 

హైదరాబాద్ పాతబస్తీలో బీబీ-కా-ఆలం ఊరేగింపు మొదలైంది. భారీ సంఖ్యలో షియా ముస్లిం సోదరులు రక్తాన్ని చిందిస్తూ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • పిల్లల కోసం సింగిల్ డోస్ టీకా!

చిన్నారులపై కరోనా సింగిల్ డోసు టీకా క్లినికల్ ప్రయోగాల కోసం సీడీసీఎస్​ఓకు దరఖాస్తు చేసింది జాన్సన్ అండ్ జాన్సన్. వైరస్​ను కట్టడి చేయాలంటే చిన్నారులు సహా అందరికీ వెంటనే వ్యాక్సినేషన్ చేయడం అత్యవసరమని సంస్థ పేర్కొంది.

  • మార్కెట్లు డీలా

వారాంతపు సెషన్​ను స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్​ 300 పాయింట్ల నష్టంతో 55,329 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 118 పాయింట్లు కోల్పోయింది.

  • ఓ ఇంటివాడైన టీమ్ఇండియా పేసర్

టీమ్ఇండియా పేసర్, సన్​రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ సందీశ్ శర్మ ఓ ఇంటివాడయ్యాడు. చిన్ననాటి స్నేహితురాలు తాషా సాత్విక్​తో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు.

  • సమంతకు అంతర్జాతీయ అవార్డు

తొలిసారి వెబ్ సిరీస్​లో నటించి అదరగొట్టిన సమంతను అంతర్జాతీయ అవార్డు వరించించింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్​బోర్న్​లో ఆమెకు అవార్డు దక్కింది.

14:35 August 20

టాప్​ న్యూస్​ @3PM

  • ఘోరప్రమాదం 

మహారాష్ట్ర బుల్డానాలో జరిగిన ఘోర ప్రమాదంలో 13 మంది మరణించారు. ఐరన్​ లోడుతో ప్రయాణిస్తున్న ఓ టిప్పర్.. సింధ్​ఖేద్రాజా మండలం తాలేగావ్​-దూసర్​బిడ్​ ప్రాంతంలో సమృద్ధి హైవేపై ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది.

  • 'నా కల నెరవేరింది'

అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ చొరవ చూపిందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణ అన్నారు. హైదరాబాద్​లో​ని తెలంగాణ హైకోర్టు సీజే నివాసంలో నిర్వహించిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ కేంద్రం ట్రస్ట్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

  • వరంగల్​కు చేరిన జన ఆశీర్వాద యాత్ర 

వరంగల్​ భద్రకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి దర్శించుకున్నారు. ఆయన చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర వరంగల్​కు చేరుకుంది. ఆయనకు భాజపా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

  • ఆఫీస్​లోకి మహిళలకు నో ఎంట్రీ

దేశం తాలిబన్ల(Taliban) చేతిలోకి వెళితే తమ హక్కులను కాలరాస్తారని అఫ్గానిస్థాన్​(Afghanistan Taliban) మహిళలు ముందు నుంచి భయపడుతున్నట్లుగానే జరుగుతోంది. అక్కడి మహిళా జర్నలిస్టులు విధుల్లో చేరేందుకు తాలిబన్లు నిరాకరించారు. ప్రభుత్వం మారిందని, మహిళ పని చేసేందుకు వీలులేదని తేల్చి చెబుతున్నారు.

  • అన్నకు ప్రేమతో.. 

రక్షాబంధన్​కు గుర్తుగా తన అన్నకు ప్రముఖ నటి నిహారిక కొణిదెల ఓ స్పెషల్​ గిఫ్ట్​ ఇచ్చారు. 'బ్రో' సినిమా నుంచి విడుదలైన 'అన్నయ్యా నువ్వు పిలిస్తే' లిరికల్​ సాంగ్​ను తన సోదరుడు, హీరో వరుణ్​ తేజ్​కు నిహారిక అంకితం ఇచ్చారు.

14:13 August 20

టాప్​టెన్​ న్యూస్​@2pm

'తెలంగాణ తల్లి.. కేసీఆర్​ కుటుంబం చేతిలో బందీ'

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నిరుపేదలకు డబుల్​ బెడ్​ రూమ్​ ఇళ్ల హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా కిషన్​ రెడ్డి.. మహబూబాబాద్​ జిల్లాలోని వర్థన్నపేటకు చేరుకున్నారు.

నలుగురు పిల్లల తల్లితో యువకుడి 'ప్రేమ వివాహం'

ఆమె వయసు 41 ఏళ్లు. నలుగురు పిల్లలు. అయితేనేం.. 21 ఏళ్ల యువకుడిని ప్రేమించింది. వారి ప్రేమ వ్యవహారం ఎట్టకేలకు కుటుంబసభ్యులకు, గ్రామస్థులకు తెలిసింది. దీంతో ఇద్దరికీ వివాహం చేశారు. ఈ షాకింగ్ ఘటన బిహార్​లో జరిగింది.

చైనాలో ఇక 'ఒక్కరు వద్దు.. ముగ్గురే ముద్దు'

ముగ్గురు పిల్లల విధానానికి చైనా అధికారిక ఆమోదం తెలిపింది. ఇక నుంచి అక్కడి దంపతులు ముగ్గురిని కనొచ్చు. దేశంలో జననాల రేటు ఆందోళనకర స్థాయిలో తగ్గిన నేపథ్యంలో జనాభా, కుటుంబ నియంత్రణ చట్టానికి సవరణ చేసి ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. తల్లిదండ్రులపై భారం పడకుండా వారికి మద్దతుగా నిలిచేలా చట్టానికి మార్పులు చేసింది. ఆర్థిక సహకారం, పన్ను రాయితీ, విద్య, ఉద్యోగం, సొంతిల్లు వంటి విషయాల్లో ప్రభుత్వం సాయం చేయనుంది.

పీవీ సింధుకు యోగి భారీ గిఫ్ట్

టోక్యో ఒలింపిక్స్​లో అద్భుత ప్రదర్శన చేసి, దేశ గుర్తింపు పెంచిన క్రీడాకారులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. లఖ్​నవూలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి, రూ.కోటి చెక్కులు అందజేసింది. ఈ ఈవెంట్​లో నీరజ్ చోప్డా, రవికుమార్ దహియా, పురుషుల, మహిళల హాకీ జట్ల ప్లేయర్స్ పాల్గొన్నారు.

 ఆ హీరోల జోరుకు సలాం!

ప్రస్తుతం టాలీవుడ్ అగ్రహీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడం గగనంగా మారిపోయింది. చాలా అరుదుగా వారి నుంచి సంవత్సరానికి రెండు చిత్రాలు విడుదల అవుతున్నాయి. కానీ కొంతకాలం క్రితం వరకు మన హీరో, హీరోయిన్లు ఏటా 10కి పైగా సినిమాలతో జోరు చూపించారు. పోటాపోటీగా బాక్సాఫీస్ వద్ద వారి సత్తా చూపారు. అలా ఏడాదికి అత్యధికంగా ఎవరు ఎన్ని సినిమాలు చేశారో చూద్దాం.

12:43 August 20

టాప్​టెన్​ న్యూస్​@ 1pm

  • తొలినగరంగా హైదరాబాద్

హైదరాబాద్‌కు స్వచ్ఛభారత్‌ మిషన్‌ వాటర్‌ ప్లస్‌ ధ్రువపత్రం లభించింది. తెలంగాణలో వాటర్‌ ప్లస్‌ ధ్రువపత్రం అందుకున్న తొలి నగరంగా హైదరాబాద్‌ నిలిచింది. 

  • తలకొరివి పెట్టనన్న కుమారుడు

కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు ఆ తండ్రి. ఎన్ని ఇబ్బందులెదురైనా కష్టం వారి కాళ్లను కూడా తాకకుండా చూసుకున్నాడు. భార్యా ఇద్దరు పిల్లలతో ఉన్నదాంట్లో ఆనందంగా బతికాడు. కానీ.. కాలం కన్నెర్ర చేసింది. కరోనా మహమ్మారి రూపంలో వచ్చి ఉన్న ఉపాధి పోగొట్టింది. కట్టుకున్న భార్యను, కన్నబిడ్డల్ని పోషించుకోవడానికి అప్పులు చేశాడు. వాటిని చెల్లించలేక అర్ధాంతరంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్ననాటి నుంచి తన కోసం ఎన్నో కష్టాలు పడి.. గుండెలమీద పెట్టుకుని పెంచిన కన్నతండ్రికి అంత్యక్రియలు చేయడానికి కుమారుడు నిరాకరించాడు. చేసేదేం లేక పదేళ్ల కుమార్తెతో దహనసంస్కారాలు నిర్వహించారు. "ఎందుకిలా చేశావ్ నాన్న.. నన్నెందుకు వదిలేసి వెళ్లావ్" అంటూ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించేటప్పుడు ఆ చిన్నారి పెట్టిన కంటతడి చూసి బంధువులు, స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు.

  • యాచించిన చేతులతోనే..

సేవ చేసేందుకు మనసుంటే చాలు... తమ వృత్తి అడ్డుకాదని నిరూపించిందో వృద్ధ యాచకురాలు. ప్రతిరోజూ భిక్షాటన చేస్తూ... దాచుకున్న 2 వేల రూపాయలతో దాదాపు 25 మందికి ఓ పూట భోజనాన్ని పెట్టింది.

  • 'మోదీ' శంకుస్థాపన

గుజరాత్​లోని చారిత్రక సోమనాథ్​లో రూ.83 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మతపరమైన పర్యటకాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. చరిత్ర నుంచి ఎంతో నేర్చుకోవాలని సూచించారు.

  • తిమింగలం వాంతితో దందా!

రూ.23 కోట్ల విలువైన అంబర్ ​​గ్రీస్​ను( తిమింగలం వాంతి) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని తమిళనాడు నుంచి శ్రీలంకకు స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు.

11:47 August 20

టాప్​టెన్​ న్యూస్​@ 12pm

'కేసీఆర్.. రాష్ట్రాన్ని దివాళా తీశారు'

ఏడేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రాన్ని దివాళా తీశారని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి(Union Minister Kishan reddy) ఆరోపించారు. కాంట్రాక్టుల పేరుతో వేల కోట్లు దోచుకున్నారన్న ఆయన.. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులను దుర్వినియోగం చేశారని విమర్శించారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మాట్లాడారు.

వైతెపాకు ఇందిరాశోభన్ రాజీనామా

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీకి(YSRTP) ఇందిరా శోభన్‌(indira shoban) రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం, పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ లేఖను అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు(ys sharmila) అందజేశారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు.

ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లా పాంపొరా ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో(Pulwama encounter) ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలం నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి బలగాలు. ఉగ్రవాదుల కోసం ఆపరేషన్​ కొనసాగుతున్నట్లు తెలిపాయి.

ఒకే ఇన్నింగ్స్​లో త్రిమూర్తుల శతకాలు..

టీమ్ఇండియా త్రిమూర్తులు సచిన్, గంగూలీ, ద్రవిడ్.. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నారంటే ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారు. అలాంటి వీరు ఓ మ్యాచ్​లో ఒకే ఇన్నింగ్స్​లో సెంచరీలతో చెలరేగారు. ఈ మ్యాచ్​కు 19 ఏళ్లయిన సందర్భంగా ఆ అపురూప జ్ఞాపకాన్ని మరోసారి గుర్తు చేసుకుందాం.

'కేజీఎఫ్​'ను మించిపోయేలా ప్రభాస్ 'సలార్​'!

'కేజీఎఫ్​' చిత్రంతో హీరోయిజాన్ని మరో స్థాయిలో చూపించారు దర్శకుడు ప్రశాంత్​ నీల్​. హీరో యశ్​కు ఎలివేషన్స్​ ఇవ్వడం సహా భారీ ప్రొడక్షన్​ వాల్యూతో రూపొందించిన సినిమా ఇది. ఇప్పుడు దానికి రెండింతలు ఎక్కువ యాక్షన్​, ఎలివేషన్స్​తో 'సలార్​' చిత్రాన్ని తీస్తున్నారట.

11:08 August 20

టాప్​టెన్​ న్యూస్​@ 11AM

యువతిపై కాబోయేవాడి పెట్రోల్ దాడి

పెళ్లి గురించి, కాబోయే వాడి గురించి ఆ యువతి కోటి కలలు కన్నది. తల్లిదండ్రులు తీసుకొచ్చిన సంబంధానికి నో చెప్పకుండా ఒప్పేసుకుంది. అమ్మాయి నచ్చింది.. ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే తరువాయని ఆ యువకుడు తన అమ్మానాన్నలకు చెప్పాడు. ఇరు కుటుంబాలు ఓకే అనుకున్నారు. ఇద్దరికి పెళ్లి నిశ్చయించారు.

పారిశుద్ధ్య కార్మికురాలి ఇంట్లో కిషన్​రెడ్డి టిఫిన్

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర.. రెండో రోజు ప్రారంభమైంది. సూర్యాపేటలో తొలిరోజు యాత్రను ముగించుకున్న ఆయన... అక్కడే బస చేశారు. శుక్రవారం ఉదయం కల్నల్ సంతోష్​ బాబు విగ్రహానికి నివాళులు అర్పించి... రెండో రోజు యాత్రను ప్రారంభించారు.

దేశంలో 36 వేల కొత్త కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య (Coronavirus India) స్వల్పంగా పెరిగింది. కొత్తగా 36,571మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 540 మంది కొవిడ్​ బారిన పడి మరణించారు.

ఒక్కరోజే 7.23 లక్షల కరోనా కేసులు

డెల్టా వేరియంట్ల(Delta variant) విజృంభణతో ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. వ్యాక్సినేషన్(Corona vaccination)​ ముమ్మరంగా సాగుతున్నా కొత్త కేసులు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో 1.5లక్షలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. జపాన్​లోని కీలక ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో లాక్​డౌన్​ సెప్టెంబర్​ చివరి వరకు పొడిగించారు.

వైష్ణవ్​తేజ్ 'కొండపొలం'.. సెట్​లోకి అలియా ఎంట్రీ

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో కొండపొలం, రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ, మెరిసే మెరిసే, తరగతి గది దాటి, వివాహ భోజనంబు చిత్రాల సంగతులు ఉన్నాయి.

09:56 August 20

టాప్​టెన్​ న్యూస్​@ 10AM

  • kishan Reddy: కల్నల్​ సంతోష్​ బాబుకు నివాళి అర్పించి.. యాత్ర ప్రారంభించి

  • SRSP Project: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద

రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్‌ జలాశయానికి వరద వస్తోంది. గురువారం 36వేలకు పైగా క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.... సాయంత్రానికి 61వేలకు పైగా చేరింది. వరద మరింత పోటెత్తడంతో రాత్రి 7 వరద గేట్లు ఎత్తి..... దిగువకు విడుదల చేశారు.

  • Srisailam Project incident : శ్రీశైలం జలవిద్యుత్ కేంద్ర అగ్నిప్రమాద ఘటనకు ఏడాది

ప్రాణనష్టం, భారీగా ఆస్తినష్టంతో పాటు... జెన్ కో చరిత్రలోనే తీవ్ర విషాదాన్ని నింపిన శ్రీశైలం జలవిద్యుత్ కేంద్ర అగ్నిప్రమాద ఘటన(Srisailam Project incident)కు ఆగస్టు 20నాటికి ఏడాది అయింది. ప్లాంటులో బ్యాటరీలు మార్చుతుండగా జరిగిన విద్యుదాఘాతం... భారీ అగ్నిప్రమాదానికి దారితీసింది. 9 మంది ప్రాణాలను బలిగొంది. 

  • ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎంతంటే?

ఏపీ, తెలంగాణలో బంగారం ధర (Gold Rate Today) స్వల్పంగా పెరిగింది. వెండి ధర మరింత తగ్గింది. రెండు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి.

  • Stock market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్ 410 డౌన్​

స్టాక్ మార్కెట్లు వారాంతంలో భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 410 పాయింట్లకుపైగా నష్టంతో.. 55,219 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 149 పాయింట్లకుపైగా కోల్పోయి.. 16,419 వద్ద కొనసాగుతోంది. రికార్డు స్థాయిల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు దిగుతుండటం సహా పలు పరిణామాలు నష్టాలకు  ప్రధాన కారణంగా  తెలుస్తోంది.

08:43 August 20

టాప్​టెన్​ న్యూస్​@ 9AM

  • Krishna Water Dispute : కృష్ణా బోర్డు సమావేశంలో తెరపైకి మూడు కీలకాంశాలు

తెలుగు రాష్ట్రాల మధ్య ఏడాది కాలంగా వివాదం(Krishna Water Dispute)గా ఉన్న పలు కీలకాంశాలను ఈనెల 27న జరగనున్న బోర్డు సమావేశంలో ముందుకు తీసుకురానున్నాయి ఉభయ రాష్ట్రాలు. ఇందులో ముఖ్యంగా క్యారీ ఓవర్, వరద నీటి వినియోగం, నీటి పంపిణి వంటి మూడు అంశాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది.

  • రాజీవ్​ గాంధీకి రాహుల్, మోదీ​ నివాళులు

మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ, సీనియర్​ నేతలు గులాం నబీ ఆజాద్​, అధిర్​ రంజన్​ చౌదరీ. ప్రధాని నరేంద్ర మోదీ కూడా.. రాజీవ్​ను గుర్తుచేసుకున్నారు.

  • Afghanistan Hero: ఆయనంటే వెన్నులో వణుకు..!

అఫ్గానిస్థాన్​ మొత్తాన్నీ.. హస్తగతం చేసుకున్న తాలిబన్లు అదే దేశంలోని ఒక ప్రాంతంలో మాత్రం అడుగుపెట్టలేకపోతున్నారు. ఆ ప్రాంతాన్ని చేజిక్కించుకోవాలని 20ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నా.. ఇప్పటివరకు టచ్​ చేయలేకపోయారు. ఆ ప్రాంత నాయకుడు(Afghanistan Hero) అంటే భయంతో వణికిపోతున్నారు తాలిబన్లు. ఇంతకీ ఎవరాయన? ఆ ప్రాంతం ఏంటి?

  • అందం కోసం దాని మాటే వింటా: అదితీరావ్​

షూటింగ్​లు లేనప్పుడు, ఏ మాత్రం తీరిక దొరికినా ఫేస్​ప్యాక్​ను ముఖంపై రాసుకుంటానని హీరోయిన్ అదితీ రావ్ హైదరీ చెబుతోంది. చర్మం చెప్పిన మాట వింటానని, తినే ఆహారంలోనూ చర్మానికి మేలు చేసే వాటినే ఎంచుకుంటానని పేర్కొంది.

  • ఆహా ఏమి రుచి.. విరాట్-అనుష్క తిన్నారు మైమరచి

టెస్టు సిరీస్​లో భాగంగా ఇంగ్లాండ్​లో ఉన్న కోహ్లీ.. భార్య అనుష్క శర్మతో కలిసి లండన్​ వీధుల్లో తిరుగుతూ, అదిరిపోయే ఆహారాన్ని రూచిచూస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలను అనుష్క.. ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.

07:53 August 20

టాప్​టెన్​ న్యూస్​@ 8AM

  • రోడ్డు ప్రమాదం.. ఏడుగురికి తీవ్రగాయాలు..

       రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం పెద్దషాపూర్‌ వద్ద ఈ రోజు వేకువజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు వస్తున్న ఓ మినీ వ్యాన్ డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్​లో ప్రయాణిస్తున్న ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడగా... మరో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. 

  • ఆంధ్రాకు70.. తెలంగాణకు 30

కృష్ణా బేసిన్‌లో ప్రస్తుత నీటి సంవత్సరంలో ఏపీ, తెలంగాణలకు 70:30 నిష్పత్తిలో జలాలను పంచాలని ఆంధ్రప్రదేశ్‌ కోరింది. కృష్ణా జల వివాద ట్రైబ్యునల్‌-2 తీర్పు వచ్చేవరకూ ఇదే నిష్పత్తిలో కొనసాగాలని పేర్కొంది. నాగార్జున సాగర్‌ ఎడమ విద్యుత్తు కేంద్రం, పులిచింతలలో ఉత్పత్తి చేసే విద్యుత్తులో తమకూ వాటా ఉందని పేర్కొంది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ జల వనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి లేఖ రాశారు. గత ఏడాది వరకూ 66:34 నిష్పత్తిలో వినియోగం జరగ్గా, ఈ ఏడాది 50:50 నిష్పత్తిలో కేటాయించాలని తెలంగాణ కోరింది. ఈ అంశాన్ని ఈ నెల 27న జరిగే బోర్డు సమావేశంలో ఎజెండాగా చేర్చారు. ఈ నేపథ్యంలో ఏపీ రాసిన లేఖకు ప్రాధాన్యం ఏర్పడింది.

  • గర్భిణులకు టీకా.. దుష్ప్రభావాలు ఉన్నాయా?

గర్భిణులకు భారత్​లో వ్యాక్సినేషన్​ ప్రారంభమైంది. మరి వారిపై టీకా.. ఎలాంటి ప్రభావం చూపుతోంది. అమెరికాలోని వాషింగ్టన్​ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు.. 17 వేలమందికిపైగా మహిళలపై ఓ అధ్యయనం నిర్వహించారు. అందులో ఏం తేలిందంటే?

  • అఫ్గాన్​ ప్రజల తిరుగుబాటు!

అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లకు(Taliban news) అఫ్గానిస్థాన్​ ప్రజల నుంచి ధిక్కార స్వరం ఎదురవుతోంది. స్వాతంత్య్ర దినాన జాతీయ పతాకంతో వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు. పలు రాష్ట్రాల్లో నిరసనకారులపై జరిగిన కాల్పుల్లో పలువురికి గాయాలు కాగా, అసదాబాద్‌లో కొందరు మృతి చెందారు.

  • అదిరే కాంబినేషన్లు!

సినిమాలో హీరోయిజం పండాలంటే, హీరోకు ప్రత్యర్థిగా కనిపించే విలన్‌ దీటుగా ఉండాల్సిందే. అందుకోసం పర భాషా నటులపై మక్కువ చూపిస్తున్నారు తెలుగు దర్శకనిర్మాతలు. స్టార్ కథానాయకుల సరసన దీటుగా నిలబడేందుకు వారిని ప్రయత్నిస్తున్నారు.

06:48 August 20

టాప్​టెన్​ న్యూస్​@ 7AM

  • త్యాగం, స్ఫూర్తికి ప్రతీక మొహర్రం

మంచితనం, అంకితభావం, త్యాగాల స్ఫూర్తిని మొహర్రం గుర్తు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అన్నారు. మానవతావాదాన్ని ప్రతిబింబించే మొహర్రంలోని త్యాగనిరతి అనుకరించదగ్గది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

  • ధనమూలమిదం జగత్‌

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతికి అడ్డుకట్ట పడటం లేదు. సక్రమమైనా... అక్రమమైనా ఆ కార్యాలయాల్లో అంతా ధనమూలమిదం జగత్‌. చాలాచోట్ల అదనంగా డబ్బులిస్తేనే రిజిస్ట్రేషన్‌ అయ్యే పరిస్థితి ఉంది. దస్తావేజు లేఖరులు లేనిదే పని జరగట్లేదు. మధ్యవర్తులు, లంచాల ప్రమేయం లేకుండా చేయాలని ప్రభుత్వం తెచ్చిన విధానం ఆచరణ సాధ్యం కాకపోవడంతో పరిస్థితి మొదటికొచ్చింది.

  • సోనియా నేతృత్వంలో..

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నేడు వర్చువల్​ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​, బంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా తదితరులు హాజరుకానున్నారు.

  • హోండా నుంచి కొత్త బైక్‌..

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా నుంచి కొత్త బైక్ వచ్చింది. సీబీ200ఎక్స్​ పేరుతో కొత్త మోడల్​ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మరి ఆ బైక్ ధర, ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.

  • లేదంటే కాలో చెయ్యి విరిగేది

'బజార్​ రౌడీ'గా థియేటర్లలోకి వచ్చిన హీరో సంపూర్ణేశ్​బాబు.. షూటింగ్​లోని అనుభవాల్ని పంచుకున్నారు. గాయపడిన ఓ సందర్భం గురించి చెప్పారు. తాను చేస్తున్న తర్వాతి సినిమా గురించి తెలిపారు.

04:59 August 20

టాప్​టెన్​ న్యూస్​@ 6AM

  • రెండో రోజు ఆశీర్వాదం కోసం..

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర.. తొలి రోజు విజయవంతంగా ముగిసింది. జన ఆశీర్వాద యాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పలికారు. కోదాడ, సూర్యాపేటలో సాగిన యాత్రలో... కేంద్ర సంక్షేమ పథకాలను వివరిస్తూనే కేసీఆర్ సర్కారుపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తొలిరోజు యాత్రను ముగించుకున్న కిషన్‌రెడ్డి... సూర్యాపేటలోనే బస చేశారు. ఇవాళ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోకి యాత్ర ప్రవేశించనుంది.

  • దండోరాకు రాహూల్​..

దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలకు... రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ రాహుల్ గాంధీని ఆహ్వానిస్తోంది. ఇంద్రవెల్లిలో సమర శంఖం పూరించిన పీసీసీ... రాహుల్ సభతో వచ్చే నెల 17న ముగించనుంది. ముగింపు భారీ బహిరంగసభను.. వరంగల్ సెంటిమెంట్‌తో నిర్వహించేలా రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

  • అంతా ఉత్త ముచ్చటనే...

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన అత్యాచార ఆరోపణల కేసులను... పోలీసులు చాకచక్యంగా చేధించారు. సీసీ కెమెరాలు, సాంకేతికత, వైద్య నివేదికల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు... రెండు కేసుల్లోనూ అత్యాచారం జరగలేదని తేల్చారు. గాంధీ ఆస్పత్రి ఘటనలో ఫిర్యాదు చేసిన మహిళ మానసికస్థితి సరిగ్గా లేదని స్పష్టం చేశారు. సంతోష్‌నగర్ కేసులో... యువతి తన ప్రియుడి సానుభూతి పొందాలనే... సామూహిక అత్యాచార నాటకం ఆడినట్లు దర్యాప్తులో తేల్చారు.

  • సర్పాల సదాశివుడు...

పాము కనిపిస్తే ఏం చేస్తాం? భయపడి పారిపోతాం. ప్రాణానికి ప్రమాదమని భావిస్తే ఏకంగా చంపేస్తాం. చెట్టుపై నుంచి తనపైపడ్డ పాముని చూసి అతడూ.. అలాగే భయపడ్డాడు. ప్రాణభయంతో చంపేశాడు. ఆ తర్వాత అది విషంలేని పామని తెలిసి చాలాబాధపడ్డాడు. అప్పటినుంచి పాముల్నిచంపబోనని స్నేహితులకు మాటిచ్చాడు. ఇప్పటివరకు ఒక్కపామును చంపలేదు సరికదా... 4 వేలకు పైగా పాముల్నిరక్షించి అడవుల్లో వదిలాడు. 

  • గ్రాండ్​ రెస్పాన్స్​...

భాగ్యనగరంలోని ప్రకృతి ప్రేమికులు పరవశించిపోతున్నారు. నర్సరీ మేళాలోని మొక్కల కనువిందుతో.... సందర్శకులు మధురానుభూతి పొందుతున్నారు. హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న... జాతీయ ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శన సందర్శకులను కట్టిపడేస్తుంది. దేశవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలు, అంకుర కేంద్రాల స్టాళ్లు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. చక్కటి ఆహ్లాదం,ఆనందం, విజ్ఞానం పంచుతున్న ప్రదర్శనకు సందర్శకుల తాకిడి పెరిగింది.

  • చాఫ్​తో ఇక సేఫ్​...

శత్రుక్షిపణులకు భారత యుద్ధ విమానాలు చిక్కకుండా చూసే చాఫ్​ సాంకేతికతను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ) అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీపై జరిగిన ప్రయోగ పరీక్షలు విజయవంతమయ్యాయని.. దీన్ని వాయుసేనలో ప్రవేశపెడుతున్నట్లు డీఆర్​డీఓ తెలిపింది.

  • మేడపై శబ్దం ఏంటా అని వెళితే..

తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్న నేపథ్యంలో అఫ్గానిస్థాన్ నుంచి బయటపడేందుకు అక్కడి ప్రజలు శతవిధాల ప్రయత్నించారు. విమానాలు ఎక్కి వేలాది మంది దేశాన్ని విడిచి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ప్రమాదకరంగా రెక్కలతో పాటు విమాన పైభాగాన ఉంటూ ప్రయాణించి కింద పడ్డారు. చాలా మందికి వారు ఎక్కడ పడ్డారో తెలియదు. కానీ వారు పడింది కాబుల్​ విమానాశ్రయానికి 4 కిమీ దూరంలో ఉంటున్న సలేక్‌ అనే వ్యక్తి ఇంటి పైన.

  • అమెరికా క్యాపిటల్ వద్ద ఉద్రిక్తత

అమెరికాలోని క్యాపిటల్​ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్​ వద్ద ఓ వాహనాన్ని గుర్తించిన అధికారులు అందులో భారీగా పేలుడు పదార్థాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు.

'సెమీకండక్టర్ల' విభాగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు మనదేశం కృషి చేయకపోతే 'చిప్‌'ల కొరత మాదిరి సవాళ్లు భవిష్యత్తులో మరిన్ని ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అంశాన్ని గుర్తించడంతోనే చైనా సెమీకండక్టర్ల పరిశ్రమపై పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే.. దేశీయంగా టాటా గ్రూపు సెమీకండక్టర్ల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది.

  • ప్రియ, పూర్ణ మాస్​ డాన్స్​..

వచ్చే వారం ఢీ షో ప్రేక్షకులను ఉర్రూతలూగించడం ఖాయం. తీన్మార్​ డప్పుకు లంగాఓణిలో ప్రియమణి, పూర్ణ వేసిన మాస్​ డ్యాన్స్​.. కార్యక్రమం మొత్తానికే హైలెట్​గా నిలిచింది. ఈ ప్రోమోను మీరు చూసేయండి..

Last Updated : Aug 20, 2021, 9:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.