ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు - headline news

ETV BHARAT HEADLINE NEWS
ETV BHARAT HEADLINE NEWS
author img

By

Published : Aug 19, 2021, 6:18 AM IST

Updated : Aug 19, 2021, 10:38 PM IST

21:50 August 19

టాప్​ న్యూస్​ @9PM

  • 'టీ అమ్ముకున్న వ్యక్తి ప్రధాని... మామూలు కార్యకర్త కేంద్రమంత్రి'

సాధారణ కార్యకర్త కూడా ఉన్నత పదవులు అలంకరించడం కేవలం భాజపాలోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి కిషన్​రెడ్డిలను పొగుడుతూనే మరోవైపు సీఎంపై కేసీఆర్​పై నిప్పులు చెరిగారు. కోదాడలో జన ఆశీర్వాద యాత్ర సభలో ఆయన ప్రసంగించారు.

  • దివ్యాంగులకు కేంద్రం షాక్

దివ్యాంగులకు ఉద్యోగ కోటా నుంచి పలు పోలీసు సర్వీసులు, సాయుధ విభాగాల్లోని కొన్ని పోస్టులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. కాగా, ఈ నిర్ణయంపై పలు హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తంచేశాయి.

  • పాకిస్థాన్​కు జైశంకర్ చురకలు

ఐరాసలో పాకిస్థాన్​కు తీవ్ర స్థాయిలో చురకలు అంటించారు విదేశాంగ మంత్రి జైశంకర్. ఉగ్రవాదులకు రాజమర్యాదలు చేస్తూ ద్వంద్వ ప్రమాణాలు పాటించేవారిని ప్రశ్నించేందుకు ప్రపంచ దేశాలు వెనకాడకూడదని అన్నారు. ఉగ్ర సంస్థలకు కొందరి నుంచి శిక్షణ, ప్రోత్సాహం అందుతున్నాయని పేర్కొన్నారు.

  • భార్యతో కలిసి రొమాంటిక్​ స్టెప్పులేసిన కృనాల్​

టీమ్​ఇండియా క్రికెటర్​ కృనాల్​ పాండ్యా, పంఖూరి శర్మ దంపతులు ఓ సూపర్​ హిట్​ సాంగ్​కు రొమాంటిక్​ స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్​గా మారింది.

  • భర్తతో నటి యోగా భంగిమలు..  

ఆష్కా గొరాడియా.. ప్రముఖ బుల్లితెర నటి, మోడల్​. 'పియా కా ఘర్'​, 'కుకుసమ్'​, 'సింధూర్​ తేరా నామ్'​, 'లాగి తుజ్​ సే లగాన్'​ వంటి పలు హిట్​ సీరియల్స్​లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే తన భర్తతో కలిసి చేసిన యోగా భంగిమల ఫొటోలను షేర్​ చేసింది. చూస్తే మతిపోయేలా ఉన్న ఆ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్​గా మారాయి. వాటిపై ఓ లుక్కేద్దాం..

20:59 August 19

టాప్​ న్యూస్​ @9PM

  • 'కుర్చీ, కుమారుడు, కుటుంబం కోసం కేసీఆర్​ ఏమైనా చేస్తారు'

కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని.. కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ప్రజలను కోరారు. గతంలో వైద్య అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు.. ఇతర దేశాలపై ఆధారపడ్డారని.. ప్రధాని మోదీ అధికారం చేపట్టాక.. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనాకు స్వదేశంగా టీకా తయారైనట్లు చెప్పారు. ఉపఎన్నికల్లో గెలిచేందుకు కేసీఆర్​ ఏమైనా చేస్తారని.. హుజారాబాద్​లో ఎన్నో కుట్రలు, జిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు. మా కుటుంబమే ఉండాలి అనే ధోరణిలో కేసీఆర్​ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు..

  • 16ఏళ్ల కూతురుకు బలవంతపు పెళ్లి- తల్లికి షాక్!

నిండా 18 ఏళ్లు కూడా లేని బాలికను పెళ్లి చేసుకోమని తల్లే బలవంతం పెడుతోంది. తల్లి పోరు పడలేక ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలిక.. అధికారులను ఆశ్రయించింది. అప్పుడు ఏం జరిగిందంటే?

  • అమెరికా క్యాపిటల్ వద్ద ఉద్రిక్తత 

అమెరికాలోని క్యాపిటల్​ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్​ వద్ద ఓ వాహనాన్ని గుర్తించిన అధికారులు అందులో భారీగా పేలుడు పదార్థాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు.

  • సెట్స్‌లో అడుగుపెట్టిన శిల్పాశెట్టి

పోర్నోగ్రఫీ కేసులో భర్త అరెస్ట్​, మరోవైపు ఫిట్​నెస్​ సెంటర్​ విషయంలో తనపై చీటింగ్​ కేసు నమోదు.. ఇలా వరుస సమ్యసలతో కొద్దిరోజులుగా సతమతమవుతోంది బాలీవుడ్ నటి శిల్పా శెట్టి. ఈ నేపథ్యంలో చిత్రీకరణలకు దూరమైన ఆమె.. మళ్లీ సెట్స్​లోకి అడుగుపెట్టింది. వైరల్​గా మారిన ఆ వీడియోను మీరు చూసేయండి.

  • అఫ్గానిస్థాన్​ క్రికెటర్ రషీద్​ ఖాన్​ ఆవేదన 

అఫ్గానిస్థాన్​ తిరిగి తాలిబాన్ల అరాచక పాలనలోకి జారుకోవడంపై ఆ దేశ స్టార్​ క్రికెటర్ రషీద్​ ఖాన్​ ఆవేదన వ్యక్తం చేశాడు. గురువారం అఫ్గాన్​ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ భావోద్వేగ ట్వీట్ చేశాడు.

19:42 August 19

టాప్​ న్యూస్​ @8PM

  • కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర  

జన ఆశీర్వాద యాత్రలో భాగంగా కేంద్ర కేబినేట్​ మంత్రి కిషన్​రెడ్డి సూర్యాపేట జిల్లా నల్లబండగూడెం చేరుకున్నారు. కిషన్​రెడ్డికి భాజపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ యాత్రలో తెలంగాణలో మూడురోజుల పాటు కొనసాగనుంది.

  • త్వరలో ప్రజల హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రాజెక్ట్

ప్రజల హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. హెల్త్ ప్రొఫైల్ రికార్డు ప్రాజెక్టు కోసం ములుగు, సిరిసిల్ల జిల్లాలు ఎంపిక చేశామని తెలిపారు. అవసరమైన సమయంలో హెల్త్‌ ప్రొఫైల్‌ ఉపయుక్తంగా ఉంటుందని.. తక్షణ వైద్యం కోసం ఉపయోగపడుతుందని కేటీఆర్‌ వివరించారు. వైద్యారోగ్య, ఐటీ శాఖ ఉన్నతాధికారులతో ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ జరిపిన సమీక్షకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్‌ హాజరయ్యారు.

  • కశ్మీర్​లో ఉగ్ర ఘాతుకం

జమ్ముకశ్మీర్​లో మరో నేతను పొట్టనబెట్టుకున్నారు ముష్కరులు. అప్నీ పార్టీ నేత గులాం హసన్​ను దారుణంగా కాల్చి చంపారు.

  • నెట్టింట వైరలవుతున్న ముద్దుగుమ్ముల ఫొటోలు

పలువురు హీరోయిన్లు నెట్టింట వారి ఫొటోలతో సందడి చేస్తున్నారు. ఈ జాబితాలో కాజల్​, ఆండ్రియా సహా మరికొందరు ముద్దుగుమ్మలున్నారు. 

  • అఫ్గాన్ టీ20 ప్రపంచకప్ గెలవొచ్చు

పాకిస్థాన్​పై భారత జట్టు తప్పకుండా ఆధిపత్యం చెలాయిస్తుందని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. టీ 20 ప్రపంచకప్​ తొలి మ్యాచ్​ భారత్, పాక్​ మధ్య జరగనున్న నేపథ్యంలో గంభీర్​ ఈ వ్యాఖ్యలు చేశాడు.

18:56 August 19

టాప్​ న్యూస్​ @7PM

  • కిటకిటలాడుతున్న పూల మార్కెట్లు.. 

శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా మార్కెట్లన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి. వరలక్ష్మీదేవి పూజల కోసం రకరకాల పుష్పాల ధరలకు రెక్కలు వచ్చాయి. భాగ్యనగరంలో బంతి, చేమంతి, మల్లె, గులాబీ, సన్నజాజి, కనకాంబరం, లోటస్ పూలు, ఇతర పూజ సామగ్రి ధరలు భారీగా పెరిగినా.. కొనుగోళ్లకు ప్రజలు వెనక్కి తగ్గడం లేదు. కొవిడ్ రెండో దశ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో.. సుఖసంతోషాలతో ఉండాలని కాంక్షిస్తూ.. ఇళ్లల్లో వరలక్ష్మి వ్రతం, ప్రత్యేక పూజలు చేస్తామని భక్తులు చెప్పారు.

  • ఆన్​లైన్​ క్లాసులకని వెళ్లి.. 

ఆన్​లైన్​ క్లాసులకు హాజరయ్యేందుకు కొండమీదకు వెళ్లిన ఓ విద్యార్థి బండరాయి పడి చనిపోయాడు. ఊరిలో సిగ్నల్​ లేమి కారణంగా మిత్రులతో కలిసి పక్కన ఉండే కొండ మీదకు వెళ్లినట్లు మృతుడి సోదరుడు తెలిపాడు.

  • కాబుల్​లో ప్రస్తుత పరిస్థితి ఇలా...

అఫ్గాన్​ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. రాజధాని నగరమైన కాబుల్​లో పహారా కాస్తున్నారు. ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. 

  • ఈ బౌలింగ్‌ దళం అత్యుత్తమమైంది

టీమ్‌ఇండియాకు ఉన్న బౌలింగ్ లైనప్‌ భారత టెస్టు క్రికెట్‌లోనే ఉత్తమమైందని ప్రశంసించాడు కామెంటేటర్​ ఆకాశ్​ చోప్రా. ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్పాడు. అందుకు గల కారణాన్ని వివరించాడు.

  • డిటెక్టివ్​గా సునీల్ ఆకట్టుకున్నాడా?

సునీల్​ నటించిన 'కనబడుటలేదు'.. థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అభిమానులకు నచ్చే అంశాలు ఏమేం ఉన్నాయి? తదితర విషయాలను ఈ రివ్యూ చూసి తెలుసుకోండి.

17:52 August 19

టాప్​ న్యూస్​ @6PM

  • అత్యాచార ఆరోపణలు అవాస్తవం: పోలీసులు

గాంధీ ఆస్పత్రిలో అత్యాచార ఆరోపణలు అవాస్తవమని పోలీసులు తేల్చారు. మహిళపై అత్యాచారం జరిగిన ఆధారాలు లభించలేదని చెప్పారు.  

  • ముందే అలర్ట్​ అయిన భారత్

అఫ్గానిస్థాన్​లోని మజర్​-ఎ-షరీఫ్ నగరాన్ని తాలిబన్లు ఆక్రమించే రెండు రోజుల ముందే అక్కడి నుంచి భారత కాన్సులేట్ సిబ్బందిని స్వదేశానికి తీసుకొచ్చింది భారత వాయుసేన. కాందహార్​లోనూ కాన్సులేట్ సిబ్బందిని ఆక్రమణలకు ముందే కాబుల్​కు తరలించినట్లు తెలుస్తోంది.

  • 'అందుకే పవర్​స్టార్​ను 40సార్లు పెళ్లి చేసుకుంటా!'

అందంలో ఆమెది తల్లిపోలిక.. నటనలో తండ్రి నడవడిక.. రెండు దశాబ్దాల క్రితం తెలుగు తెరపై తళుక్కున మెరిసి.. తమిళ, మలయాళ భాషల్లో కూడా మంచి నటిగా పేరు సంపాదించింది. అంతేకాదు, నిర్మాతగా, రచయితగా తన ప్రతిభను చాటిన నటి వనిత విజయ్‌ కుమార్‌. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసి.. సరదా సంగతులు చెప్పుకొచ్చారు.

  • IPL 2021: సిద్ధమవుతున్న సీఎస్కే, ముంబయి

ఐపీఎల్​ 14వ సీజన్(IPL 2021)​ రెండో దశ పోరుకు సిద్ధమయ్యాయి చెన్నై సూపర్​కింగ్స్, ముంబయి ఇండియన్స్​. ఈ మేరకు క్వారంటైన్​ పూర్తి చేసుకుని చెన్నై జట్టు గురువారం నుంచి శిక్షణ ప్రారంభించనున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి.

  • క్రెడిట్​ స్కోరు లేకున్నా లోన్​ గ్యారెంటీ

అప్పు తీసుకోవాలంటే క్రెడిట్ స్కోరు చాలా కీలకం. అయితే గతంలో రుణం తీసుకోనివారు, క్రెడిట్ కార్డు వాడని వారికి క్రెడిట్ స్కోరు ఉండదు. మరి అలాంటి వారు రుణం తీసుకోవటం అసాధ్యమా? తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వారికి రుణాలు రావా?

16:59 August 19

టాప్​ న్యూస్​ @5PM

  • 'గాంధీ ఆస్పత్రి ఘటన కేసును 2 రోజుల్లో ఛేదిస్తాం'

గాంధీ ఆస్పత్రి ఘటనలో ప్రతి నిమిషం ఏం జరిగిందో తెలుసుకున్నామని హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్​ అంజనీ కుమార్ తెలిపారు. ఈ కేసును 2 రోజుల్లో ఛేదిస్తామని వెల్లడించారు.

  • తుపాకులతో తాలిబన్ల వీరంగం

అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల అరాచకాలకు అదుపులేకుండా పోతోంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజునే పౌరులపై కాల్పులు జరిపి అనేక మందిని ముష్కరులు పొట్టనబెట్టుకున్నట్లు తెలుస్తోంది.

  • బాలుడ్ని కట్టేసి కొట్టిన అల్లరిమూక

బాలుడు అనే జాలి కూడా లేకుండా రెండు చేతులను తాడుతో కట్టేసి కొట్టింది ఓ అల్లరిమూక. కేవలం సైకిల్​ దొంగలించాడు అనే ఆరోపణలతో చిన్నారి ప్రాణం తీసినంత పని చేశారు అక్కడున్నావారు. ఆ నేరం తాను చేయలేదని ప్రార్థించి వేడుకున్నా.. కనికరం చూపించలేదు. మట్టిలో ఈడ్చి మరి కొట్టి చిత్రహింసలు పెట్టారు. ఈ దారుణ ఘటన బిహార్​లోని జముయీలో జరిగింది.

  • మ్యాచ్​లు లేక స్టేడియంలో పంటల సాగు

పాకిస్థాన్​లోని క్రికెట్ స్టేడియాలు క్రమంగా వ్యవసాయ క్షేత్రాలుగా మారుతున్నాయి. తాాజాగా స్టేడియంలో కూరగాయ పంటలు పండించడం దీనికి అద్దం పడుతోంది. అసలు పాక్​కు అసలు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? అక్కడ మ్యాచ్​లు నిర్వహించకపోవడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం.

  • వెక్కి వెక్కి ఏడ్చిన నటి పూర్ణ

ఈ వారం ఢీ షో కంటెస్టెంట్​ల డ్యాన్స్​లు, ప్రదీప్​, సుడిగాలి సుధీర్​, హైపర్​ ఆది కామెడీతో అదిరిపోయింది. ఆద్యంతం సరదాగా సాగిన ఈ కార్యక్రమం చివర్లో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న నటి పూర్ణ కన్నీరు పెట్టుకుని ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది.

15:53 August 19

టాప్​ న్యూస్​ @4PM

  • 'అఫ్గానిస్తాన్​లోని ప్రవాస భారతీయులను క్షేమంగా రప్పిస్తాం'

తాలిబన్ల చెరలో చిక్కుకున్న అఫ్గానిస్తాన్ నుంచి.. ప్రవాస భారతీయులను క్షేమంగా దేశానికి తీసుకువస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వారి కుటుంబసభ్యులు చింతించాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

  • అఫ్గానిస్థాన్​లో ఆకలి కేకలు.. అయినా తాలిబన్ల వేడుకలు

ఆగస్టు 19న అఫ్గానిస్థాన్​ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నారు తాలిబన్లు. అమెరికా అహంకారంపై విజయం సాధించినట్టు ప్రకటించారు. అయితే పాలనపరంగా ఎన్నో సవాళ్లు వారికి స్వాగతం పలుకుతున్నాయి. ఏటీఎంలు నిండుకుపోవడం, ఆహార సంక్షోభం ఇందులో ప్రధానమైనవి.

  • పాకిస్థాన్​లో బాంబు పేలుడు

పాకిస్థాన్​లో భారీ పేలుడు సంభవించింది. పంజాబ్ రాష్ట్రంలోని బహవాల్​నగర్​ నగరంలో షియా ముస్లింలు నిర్వహిస్తున్న ఓ ఊరేగింపులో బాంబు పేలింది. రోడ్డు పక్కన జరిగిన ఈ శక్తిమంతమైన పేలుడు ధాటికి ముగ్గురు మరణించారు. 50 మంది గాయపడ్డారు.

  • ఒలింపిక్స్​ స్వర్ణ పతాక విజేత నీరజ్​ చోప్రా కీలక వ్యాఖ్యలు

టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణం గెలిచి దేశం దృష్టిని ఆకర్షించిన నీరజ్ చోప్రా.. ప్రస్తుతం తన దృష్టంతా ఆటపైనే ఉందని స్పష్టం చేశాడు. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్.. నటనపై తన​కున్న ఆసక్తి ఏంటని అడగ్గా నీరజ్ ఈ విధంగా స్పందించాడు.

  • బండ్ల గణేశ్ షాకింగ్ కామెంట్స్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు (MAA Elections) రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధ్యక్ష పదవి కోసం ఐదుగురు పోటీపడుతుండగా.. ప్రకాశ్​ రాజ్ ప్యానెల్​లో బండ్ల గణేశ్​ ఉన్నారు. తాజాగా బండ్ల మాట్లాడుతూ .. 'మా'కు అసలు బిల్డింగే అవసరం లేదన్నారు.

14:41 August 19

టాప్​ న్యూస్​ @3PM

  • గాంధీ ఆస్పత్రిలో అత్యాచారం కేసులో ట్విస్ట్​!

సంచలనం రేపిన గాంధీ ఆస్పత్రిలో  అత్యాచార కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆరోపణల తర్వాత కనిపించకుండా పోయిన ఆస్పత్రి భద్రతా సిబ్బంది విజయ కిశోర్​ను అదుపులోకి తీసుకొని విచారించగా కొన్ని విషయాలు వెల్లడించాడు. తాను మహిళపై అత్యాచారం చేయలేదని.. మహిళ అంగీకారంతోనే శారీరకంగా కలిసినట్లు సెక్యూరిటీ గార్డు విజయ కిశోర్ పోలీసులకు తెలిపాడు.

  • అఫ్గాన్​లో కొత్త రూల్స్ ఇలా...

అఫ్గానిస్థాన్​లో ఓ కౌన్సిల్(Taliban leadership council)​ ద్వారా పరిపాలన సాగనుందని, ప్రజాస్వామ్యానికి చోటు లేదని స్పష్టం చేశారు తాలిబన్లు(Taliban). తాలిబన్​ సుప్రీం లీడర్​ హోదాలో హైబతుల్లా అఖుండ్​జాదా వ్యవహరిస్తారని తెలిపారు. అఫ్గాన్​ పైలట్లు, సైనికులు విధుల్లో చేరాలని సూచించినట్లు పేర్కొన్నారు.

  • మధురై పీఠాధిపతిగా ప్రకటించుకున్న నిత్యానంద!

మధురై పీఠానికి అధిపతిని తానేనని నిత్యానంద స్వామి ప్రకటించుకున్నారు. 292వ పీఠాధిపతి శ్రీ అరుణగిరినాథర్​(77) శివైక్యంతో ఈ అంశంపై నిత్యానంద మళ్లీ తెరపైకి వచ్చారు.

  • 'టెస్టు ఫార్మాట్​ కోహ్లీకి ఎంతో విలువైనది'

టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు ఇంగ్లాండ్​ మాజీ సారథి కెవిన్​ పీటర్సన్​. టెస్టు ఫార్మాట్​ తనకెంత విలువైనదో మైదానంలో కోహ్లీ ఉత్సాహం చూస్తే తెలుస్తుందని అన్నాడు. అతడి అభిరుచి సుదీర్ఘ ఫార్మాట్​పై అందరికీ ప్రేమను పంచుతోందని వెల్లడించాడు.

  • 'ఆర్ఆర్ఆర్​' టీమ్​ హైదరాబాద్​కు..

ఉక్రెయిన్ షెడ్యూల్​ పూర్తి చేసుకున్న 'ఆర్ఆర్ఆర్' బృందం.. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టనుంది. అయితే సినిమా రిలీజ్​ డేట్​పై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత?

14:10 August 19

టాప్​ న్యూస్​ @2PM

  •  ఆచూకీ లభ్యం..

సంచలనం రేపిన గాంధీ ఆస్పత్రిలో  అత్యాచార కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆరోపణల తర్వాత కనిపించకుండా పోయిన ఆస్పత్రి భద్రతా సిబ్బంది విజయ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. మరోవైపు అదృశ్యమైన మహిళను హిమాయత్‌నగర్‌లో గుర్తించారు . ఓ మెడికల్ దుకాణం వద్ద సంచరిస్తుండగా నారాయణగూడ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా.. గాంధీ ఆస్పత్రిలో జరిగిన ఘటన గురించి చెప్పినట్లు వెల్లడించారు. 

  • భారత్​పై తాలిబన్ల ఆంక్షలు

అఫ్గానిస్థాన్​- భారత్​(Afghan India relations) మధ్య ఎగుమతులు, దిగుమతులను తాలిబన్లు(Taliban crisis in Afghanistan) నిలిపివేసినట్లు ఫెడరేషన్​ ఆఫ్​ ఎక్స్​పోర్ట్​ ఆర్గనైజేషన్​ తెలిపింది. దీంతో పలు వస్తువుల ధరలపై ప్రభావం పడనుంది. అయితే.. కొద్ది రోజుల్లోనే ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగి వాణిజ్య సంబంధాలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.

  • బుచ్చయ్య చౌదరికి చంద్రబాబు ఫోన్‌!

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు.

  • వారంరోజులుగా చిత్రహింసలు!

మనుషుల్లో రాక్షసత్వం రోజురోజుకూ పెరుగుతోంది! సాటి మనిషిపైనే కర్కశంగా ప్రవర్తించడం ఆందోళన కలిగిస్తోంది. డబ్బులివ్వాలనే నెపంతో పసిపాప సహా ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం కలకలం రేపుతోంది. కిరాయి రౌడీలను పిలిపించి కొట్టిస్తూ... ఇనుపరాడ్లతో కాలుస్తూ... ఉప్పు, కారం చల్లుతూ పైశాచిక ఆనందాన్ని పొందారు. చిత్రహింసలు తాళలేక కేకలు పెట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చుట్టుపక్కల వాళ్లు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగప్రవేశం చేయడం వల్ల వాళ్లకు విముక్తి లభించింది. అసలు ఏంటీ కిడ్నాప్ కథ.. ఆ చిత్రహింసలకు కారణమేంటి?

  • భారీ బోనస్

కరోనా సంక్షోభంలోనూ టాటా స్టీల్ ఉద్యోగులకు భారీ బోనస్​ ప్రకటించింది. 2020-21 అకౌంటింగ్ ఇయర్​కు గానూ రూ.270.28 కోట్ల బోనస్​ ఇచ్చేందుకు టాటా స్టీల్​, టాటా వర్కర్స్​ యూనియన్​కు మధ్య ఒప్పందం కుదిరింది.

12:41 August 19

టాప్​ న్యూస్​ @1PM

  • రేవంత్​పై తెరాస ఫైర్​

కాంగ్రెస్ పార్టీకి అటు జాతీయ స్థాయిలో.. ఇటు రాష్ట్రస్థాయిలో సరైన సారధి లేరని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. దిక్కులేని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పజెప్పారని తెలిపారు. పార్టీకి అధ్యక్షుడైనా.. రేవంత్ తన పద్ధతి మార్చుకోలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్.. తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇదే విధంగా తన ప్రవర్తన కొనసాగితే.. రేవంత్​ రాజకీయ ప్రయాణాన్ని భూస్థాపితం చేస్తామని ఎమ్మెల్యేలు హెచ్చరించారు.

  • 'రాష్ట్రమంతా అమలు చేయాలి' 

సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రమంతా దళితబంధు అమలు చేయాలని భాజపా నేత ఈటల రాజేందర్​ డిమాండ్​ చేశారు. ఎవరు ఎన్ని చేసినా హుజూరాబాద్​లో ఎగిరేది కమలం జెండానే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

  • డెల్టా దడ

టీకా తీసుకున్నవారికీ డెల్టా వేరియంట్(Delta Variant)​ సోకుతోందని భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​) వెల్లడించింది. కానీ వ్యాక్సిన్​ వేయించుకోనివారితో పోలిస్తే.. వీరిలో మరణాల రేటు తగ్గుతుందని పేర్కొంది. ఈ మేరకు చెన్నైలో ఐసీఎంఆర్ అధ్యయనం చేపట్టింది.

  • 'ఖాతా లేకున్నా లాకర్'

బ్యాంక్ లాకర్లకు సంబంధించి ఆర్​బీఐ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై ఖాతాలేని బ్యాంకులో కూడా లాకర్​ సదుపాయం వినియోగించుకోవచ్చని ఆర్​బీఐ వెల్లడించింది. కొత్త మార్గదర్శకాలు 2022 జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి.

  • హైకోర్టులో విశాల్​కు ఊరట

తమిళ కథానాయకుడు విశాల్​పై నమోదైన కేసును మద్రాస్​ హైకోర్టు కొట్టివేసింది. 'చక్ర' సినిమా కాపీరైట్​ ఇష్యూపై లైకా ప్రొడక్షన్స్​ నిర్మాణసంస్థ కోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన న్యాయస్థానం కేసును కొట్టివేసింది. అసత్య ఆరోపణలు చేసినందుకుగానూ నిర్మాణసంస్థపై రూ.5 లక్షల జరిమానా విధించింది.

11:50 August 19

టాప్​ న్యూస్ ​@12PM

  • ట్రాఫిక్ ఆంక్షలు..

మొహర్రం సందర్భంగా భాగ్యనగరంలో  రేపు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. హైదరాబాద్‌ పాతబస్తీలో బీబీ కా ఆలం ఊరేగింపు జరగనుంది. డబీర్‌పురాలోని బీబీ కా ఆలం నుంచి ఊరేగింపు ప్రారంభమై.. చాదర్‌ఘాట్ వరకు సాగనుంది.  

  • ఆ పని చేస్తే పెట్రోల్ రూ.72కే

పెద్దనోట్ల రద్దు వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం అన్నారు. మంచి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నా.. అమలులో విఫలం అయ్యారని తెలిపారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

  • కరోనాను ఎదుర్కోవడం కష్టమే

జన ఆశీర్వాద యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్​లో పర్యటిస్తున్న కిషన్ రెడ్డి.. తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. జనాభా ఎక్కువున్న దేశంలో కరోనాను ఎదుర్కోవడం కత్తిమీద సాములాంటిదేనన్నారు. దేశంలో ఆక్సిజన్, ఇంజెక్షన్ల కొరత లేదన్నారు. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి వేగంగా జరుగుతోందని తెలిపారు.

  • నోరు తెరిస్తే బూతులే!

టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ నోరు తెరిస్తే బుతు మాటలే వస్తున్నాయని ఇంగ్లాండ్​ మాజీ క్రికెటర్​ నిక్​ కాంప్టన్​ అన్నాడు. దీంతో​ కాంప్టన్​పై భారత అభిమానులు విమర్శలు దాడి చేస్తున్నారు. లార్డ్స్​ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లిష్​ ఆటగాళ్లు బుమ్రాను దూషించినప్పుడు నోరెందుకు తెరవలేదని ప్రశ్నిస్తున్నారు.

  • సినిమా సంగతులు..

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో శ్రీదేవి సోడా సెంటర్, సానికాయిదమ్, రైటర్ పద్మభూషణ్, వైష్ణవ్​తేజ్ కొత్త చిత్రానికి సంబంధించిన సంగతులు ఉన్నాయి.

10:51 August 19

టాప్​ న్యూస్ ​@11AM

  • వైద్యపరీక్షల్లో ఏం తేలిందంటే!

నపై అత్యాచారం జరిగిందంటూ హైదరాబాద్​లోని సంతోష్​నగర్​ పీఎస్​లో యువతి ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవం లేదని పోలీసులు భావిస్తున్నారు. యువతి చెప్పిన దాని ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. దీంతో పాటుగా యువతిపై అత్యాచారం జరగలేదని వైద్య పరీక్షల్లో తేలినట్లు సమాచారం. 

  •  చెక్కిన జ్ఞాపకం..

చిత్ర సోయగం. భావోద్వేగాల దృశ్య కావ్యం.. ప్రకృతి రమణీయతకు ప్రతిరూపం.. గతించిన క్షణకాలపు జ్ఞాపకానికి సంకేతం. కెమెరా కాన్వాసుపై ఛాయగ్రాహకుడి సంతకం. వేయి పదాల్లో వర్ణించలేని అనుభూతుల సమ్మేళనం. కళ్లెదుట ఆవిష్కృతమై అద్భుత దృశ్యాన్ని యథాతథంగా ఒడిసిపట్టి పదికాలాల పాటు పదిలపరుచుకునే అద్భుతం. కాలం చెక్కిలిపై కళల మజిలీగా అందమైన చిత్రం అందరి మనస్సులో పదికాలాలపాటు పదిలమవుతోంది. సృజనాత్మకతకు ప్రతిబింబంగా నిలుస్తోంది. ఒకరకమైన ఓ ఉద్వేగాన్ని ఒలికిస్తోంది. ఎన్నెన్నో స్మృతులను మనస్సుకి మాటల్లో చెప్పలేని ఉత్తేజాన్నిస్తోంది.  నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా చిత్రాల సమహారమిలా...

  • కదిలే కారులో

ఎన్ని చట్టాలు తెచ్చినా, కఠిన శిక్షలు విధించినా మహిళలపై అఘాయిత్యాలు ఆగటం లేదు. దేశ రాజధాని నడిబొడ్డున మరో అమానుష ఘటన జరిగింది. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి తీసుకెళ్లి.. కదిలే కారులో 22 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు దుండగులు.

  • 2022 ఏప్రిల్‌ వరకు ఆ కష్టాలు..

ప్రపంచంలో చిప్‌సెట్‌లు తయారు చేసేది కొన్ని కంపెనీలే. కొవిడ్‌ పరిణామాల వల్ల డిజిటలీకరణ అనూహ్యంగా పెరిగినా, అందుకు తగ్గట్లు చిప్‌సెట్‌ల తయారీ ఒక్కసారిగా పెరిగే పరిస్థితి లేదు. దిగ్గజ కంపెనీల పెట్టుబడులు పెరుగుతున్నందున, క్రమంగా చిప్‌సెట్‌ల కొరత తీరే అవకాశం ఉందని రెనో ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మామిళ్లపల్లి వెంకట్రామ్‌ ఈనాడు​తో చెప్పారు. ఈ ఏడాదిలో మాత్రం వాహన పరిశ్రమకు కష్టాలు తప్పవని తేల్చి చెప్పారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ..

  • ప్రపంచ యాత్ర.. ఒంటరిగా!

ఒంటరిగా ప్రపంచ యాత్ర చేపట్టేందుకు ఓ 19 ఏళ్ల యువతి సాహసానికి పూనుకుంది. అతిపిన్న వయసులో ఈ ఘనత సాధించిన మహిళగా నిలవడమే లక్ష్యంగా ఈ యాత్ర చేపట్టింది. ఒకే సీటున్న విమానంలో ఐదు ఖండాలు, 52 దేశాలను చుట్టిరానుంది.

09:46 August 19

టాప్​ న్యూస్ ​@10AM

  • అత్యాచారం.. జరిగిందా? లేదా?

హైదరాబాద్‌లో యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచారం చేశారన్న ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యువతి తెలిపిన వివరాల ఆధారంగా విచారణ చేస్తున్న సంతోష్‌నగర్ పోలీసులకు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో పాటు యువతి వద్ద నుంచి మరింత సమాచారం సేకరించేందుకు ఘటనా స్థలికి తీసుకువెళ్లగా.. ఆటో ఎక్కిన సమయం, యువతి చెప్పే అంశాలకు పొంతన కుదరడం లేదు. ఈ క్రమంలోనే అసలు యవతిపై అత్యాచారం జరిగిందా? లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

  • కొత్తగా 36 వేల కరోనా కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య(Corona Update) స్వల్పంగా పెరిగింది. కొత్తగా 36,401 మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 530 మంది కొవిడ్​ బారిన పడి మరణించారు.

  • క్యాన్సర్‌ రాజధానిగా ఈశాన్య భారతం!

ఈశాన్య భారతం దేశ క్యాన్సర్​ రాజధానిగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేసింది ఐసీఎంఆర్​ నివేదిక. కొత్త కేసులు విపరీతంగా నమోదవుతున్నాయని తేల్చింది.

  • స్వయం పాలనకు ఆయనతోనే బీజం!

భారత స్వతంత్ర కాంక్షను రగిలించి బ్రిటిషర్ల ఆగ్రహాన్ని, భారతీయుల అభిమానాన్ని చవిచూసిన వైస్రాయ్(Indian viceroy)​.. లార్డ్​ రిప్పన్​. 1880-84 దాకా భారత్‌లో పనిచేసిన లార్డ్‌ రిప్పన్‌(lord ripon Indian viceroy) చర్యలు- భారతీయుల్లో స్వాతంత్య్రోద్యమకాంక్షను పరోక్షంగా ప్రోత్సహించాయి. 1885లో భారత జాతీయ కాంగ్రెస్‌ ఆరంభానికి బీజాలు వేశాయి.

  • బంగారం ధరలు ఇలా..

బంగారం ధరలు(Gold Rate Today) క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.60 వరకు తగ్గింది. కిలో వెండి ధర రూ.800 వరకు దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.

08:43 August 19

టాప్​ న్యూస్ ​@9AM

  • "ధర్మపురి" వారి కుటుంబ కథా చిత్రమ్!

వాళ్లది ఒకే కుటుంబం.. కానీ జెండాలు మాత్రం మూడు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ఆ మూడు జెండాలే రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మూడు ప్రధాన పార్టీలకు ఆ ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికార పార్టీకి ఒకరు దూరంగా ఉంటున్నా.. ఆ పార్టీ ఎంపీగా కొనసాగుతున్నారు. ఇంకొకరు కాషాయ పార్టీలో కీలక నేతగా.. అధికార పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు. తాజాగా సొంత గూటికి వెళ్తోన్న మాజీ మేయర్​తో మూడు పార్టీలు ఒకే కుటుంబంలో ఉన్నట్లయింది. అసలు ఎవరిది ఈ ఫ్యామిలీ.. వాళ్ల గురించి తెలుసుకుందాం.

  • జాతీయోద్యమ రణ స్ఫూర్తే..

స్వేచ్ఛా భారతం కోసం మన పూర్వీకులు కలలుకన్న తీరు మనల్ని చకితుల్ని చేస్తుంది. ఆ కలలను సాకారం చేసుకోవాలని వారు పడ్డ తపన, చేసిన పోరాటం పూర్తిగా అర్థం కావాలంటే- స్వాతంత్య్రం అనే పదానికి సరైన నిర్వచనం మనకు బోధపడాలి. ఎంత గొప్ప దేశాన్ని వారు మనకు బహూకరించారో, ఎంత చక్కటి సమాజాన్ని స్వప్నించారో తెలియాలి. ఆ ఉజ్జ్వలతను, ఆశయాలను మన పిల్లలకు చేరవేయాలి. అదే అమృతోత్సవ శుభసంకల్పం అవుతుంది.

  • వధువు డ్యాన్స్.. వరుడు ఫిదా..

జగిత్యాల జిల్లాలో జరిగిన ఓ పెళ్లి బరాత్​లో వధువు చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పుట్టింట్లో తాను ఎలా పెరిగిందో.. తన మనస్తత్వం ఏంటో.. మెట్టినింట్లో ఎలా మెలుగుతానో తెలియజేస్తూ 'బుల్లెట్ బండి' పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. వధువు డ్యాన్స్ చూసి ఫిదా అయిన వరుడు ఆమెతో పాదం కలిపాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం. మీరూ చూసేయండి మరి...

  • శ్రీవారి సేవలో..

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు స్పీకర్​కు తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ.సుబ్బారెడ్డి ఇతర అధికారులు కలిసి స్వాగతం పలికారు.

  • మానసిక వేదనలోంచి జనించిన విజేత..

బాధతో కుంగిపోయే వాళ్లు కొందరు. కానీ ఆ బాధలోంచి పట్టుదల పెరిగి విజేతలుగా నిలిచేవాళ్లు ఇంకొందరు. రెండో కోవకే చెందుతాడు హైదరాబాదీ యువ ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి వడివడిగా టీమ్‌ఇండియా వైపు అడుగులు వేసినా.. అత్యున్నత వేదికలో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోలేక ఇబ్బంది పడ్డ బౌలర్‌ అతను. ఈ వైఫల్యాల బాధ కొనసాగుతుండగానే తండ్రి మరణం అతడికో పెద్ద ఎదురు దెబ్బ. అలాంటి సమయంలో సిరాజ్‌ కుంగిపోకుండా ఎలా నిలబడ్డాడో.. అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఎలా విజేతగా నిలిచాడో భారత క్రికెట్లో గొప్ప ఉదంతాలతో కూడిన 'మిషన్‌ డామినేషన్‌: యాన్‌ అన్‌ఫినిష్డ్‌ క్వెస్ట్‌' పుస్తకంలో వివరించారు. ఆ కథేంటో చూద్దాం పదండి.

07:41 August 19

టాప్​ న్యూస్ ​@8AM

  • మానవతామూర్తులకు వందనం

మానవత్వమంటే ఎవరికో ఏదో ఉపకారం చేయడమో, ఉద్ధరించడమో కాదు. సకాలంలో, సరైన రీతిలో స్పందించే గుణం. ఇతరుల మనసుకు బాధ కలగకుండా మసలుకోవడం. ఈ లక్షణం వల్ల సృష్టి మొత్తానికీ లాభం చేకూరుతుంది. అదే నేడు కొరవడుతోంది. వీటిని గుర్తుచేయడం కోసమే అన్నట్లు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 2009 నుంచి ఏటా ఆగస్టు 19వ తేదీని 'ప్రపంచ మానవతా దినోత్సవం'గా జరుపుకొంటున్నారు.

  • కేఆర్​ఎంబీకి ఏపీ లేఖ

శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ విద్యుత్ ఉత్పాదనపై కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. అవసరం లేకున్నా విద్యుదుత్పత్తి చేయడంతో ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఫలితంగా విలువైన జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని వివరించింది.

  • ఒక్కడేనా? సామూహికమా?

హైదరాబాద్​ నగరంలోని ఓ ల్యాబ్​లో టెక్నీషియన్​గా విధులు నిర్వహించే ఆమె.. రోజూలాగే ఆరోజూ ఉద్యోగానికి బయలుదేరింది. మధ్యాహ్నం షిఫ్ట్ అవ్వడం వల్ల 2.30 గంటల సమయంలో ఆటో ఎక్కింది. యువతి ఒక్కతే ఉండటం గమనించిన ఆ ఆటో డ్రైవర్ మనసులో దుర్బుద్ధి పుట్టింది. ఆమె వెళ్లాల్సిన దారిలో తీసుకెళ్లకుండా ఆటోను దారి మళ్లించాడు. గుర్తించిన యువతి.. తప్పుదారిలో తీసుకెళ్తున్నారెందుకు అనడిగితే.. ఇదే దగ్గరి దారంటూ చెప్పాడు. ఆపై ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

  • 'డ్రాగన్​' వల

భూమిపై జనసాంద్రత అత్యధికంగా ఉన్న ప్రాంతం దక్షిణాసియా. ఈ ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని పెంచుకునే దిశగా.. దక్షిణాసియా దేశాల బృందం పేరుతో ఇటీవల కొత్త కూటమిని చైనా ఏర్పాటుచేసింది. దక్షిణాసియా నాయకత్వ పగ్గాలను ఇండియా నుంచి లాగేసుకునేందుకే ఈ కూటమిని చైనా తెరపైకి తీసుకు వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

  • దుమ్ములేపారు..

నైరోబీ వేదికగా జరుగుతోన్న అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్ షిప్​లో భారత జట్టు దుమ్ములేపింది. సీజన్​లోనే అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఇక 4x400 రిలే ఫైనల్లో ఓడి కాంస్య పథకం సాధించింది.

06:49 August 19

టాప్​ న్యూస్ ​@7AM

  • వ్యాక్సిన్​ తీసుకోవడంలో వెనుకంజ

బయటకు ఎక్కడికి వెళ్లట్లేదు. ఇంట్లోనే ఉంటున్నాం మాకేందుకు కరోనా వస్తుందనే అమాయకత్వం ఓ వైపు... టీకా కేంద్రాలు అందుబాటులో లేకపోవడం. ఈ రెండు కారణాలు మహిళలను వ్యాక్సిన్​కు దూరం చేస్తున్నాయి. మహానగరంలోని మూడు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వమే ప్రత్యామ్నయం ఆలోచించి.. వారికి అవగాహన కల్పించి టీకా వేసుకునేలా ముందుకు నడిపించాలి. అలా అయితేనే మూడో దశ ముప్పును విజయవంతంగా ఎదుర్కోవచ్చంటున్నారు నిపుణులు.

  • అందుకే స్టేషన్​లోనే ఆత్మహత్యాయత్నం

పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఓ ఎస్సీ మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన పొలంలోకి సాగునీరు రాకుండా ఉద్దేశపూర్వకంగా భర్త తరుపు వారు ఇబ్బందులు పెడుతున్నారని, రాకపోకలు కూడా అడ్డుకుంటూ వేధిస్తున్నారని గతంలో ఫిర్యాదు చేసింది. ఈ విషయమై పోలీసులు సరిగా స్పందించడం లేదంటూ స్టేషన్‌ ఆవరణలో పురుగుమందు తాగింది.

  • చిన్నారులకూ కొవాగ్జిన్‌ 

భారత్​ బయోటెక్​ సంస్థ చిన్నారుల కోసం శుభవార్త తీసుకొచ్చింది. కరోనా మహమ్మారి నుంచి చిన్నారులను కాపాడేందుకు అతిత్వరలోనే వ్యాక్సిన్​ తీసుకురానున్నట్లు ఆ సంస్థ సీఎండీ డాక్టర్​ కృష్ణ ఎల్ల తెలిపారు. వచ్చే రెండు నెలల్లోనే ఈ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు వెల్లడించారు.

  • శాంతి భద్రతలపై కీలక పత్రాలు

శాంతి భద్రతల సమస్యపై.. మొదటిసారి రెండు కీలక పత్రాలను భారత్ నాయకత్వంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్​ఎస్​సీ)ఏకగ్రీవంగా ఆమోదించింది. భారత్‌ నేతృత్వంలో తయారైన ఈ దస్త్రాలను భద్రతా మండలిలోని 15 దేశాలతో పాటు 80కిపైగా ఐరాస సభ్యదేశాలు మద్దతు తెలిపాయి.

  • కుబేరుల్లో దమానీ

డీమార్ట్​ అధినేత రాధాకిషన్​ దమానీ వ్యాపార రంగంలో దూసుకెళ్తున్నారు. ప్రపంచంలోని 100 మంది అగ్రశ్రేణి కుబేరుల్లో చోటు దక్కించుకున్నారు.

04:14 August 19

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

  • తెలంగాణకు కొత్త జడ్జీలు

తెలంగాణ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు వస్తున్నారు. జ్యుడిషియల్​ సర్వీసెస్​ నుంచి ఏడుగురు పేర్లను సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇక్కడున్న ఖాళీల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త నియామకాలకు సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. 

  • చిన్నారులకు శుభవార్త...

  • కిషన్​రెడ్డి జనాశీర్వాద యాత్ర...

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి కిషన్ రెడ్డి.. జన ఆశీర్వాద యాత్ర నేడు ప్రారంభంకానుంది. తిరుమల శ్రీవారిని, విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం.. సాయంత్రం 4 గంటలకు కోదాడ అసెంబ్లీ నియోజకవర్గంలోని... నల్ల బండగూడెంకు చేరుకుంటారు. అక్కడి నుంచి జన ఆశీర్వాద యాత్ర చేపడతారు.

  • మరింత జటిలంగా...

సంచలనం రేపిన గాంధీ ఆసుపత్రి ఘటన కేసు చిక్కుముడి వీడటం లేదు. బాధితురాలి సోదరి ఆచూకీ ఇప్పటి వరకూ లభించకపోవడంతో కేసు దర్యాప్తు మరింత జఠిలంగా మారింది. మరోవైపు టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం మరోమారు సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించగా... ఆసుపత్రిలోని పలు ప్రాంతాల్లో బాధితురాలు తిరిగినట్టు దృశ్యాలు కనిపించాయి. 

  • మీకో న్యాయం.. ఇతరులకో న్యాయమా..?

కోకాపేట భూములకు వేలం నిర్వహించాలన్న నిర్ణయానికి ముందు మురుగు నీరు, వర్షపు నీరు పారుదలకు సంబంధించి చేసిన అధ్యయనం ఏమిటో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని, హెచ్ఎండీఏను హైకోర్టు ఆదేశించింది. వేలానికి ముందు ఆలోచనా విధానానికి సంబంధించిన రికార్డులను సమర్పించాలని తేల్చి చెప్పింది. 

  • ముందే గుర్తిస్తే బాగుండేది...

తాలిబన్లతో దౌత్య సంబంధాలపై కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి భారత్​కు వేచి చూసే ధోరణి ఉత్తమమని పేర్కొన్నారు. అఫ్గానిస్థాన్​పై తాలిబన్లు ఆధిపత్యం సాధించక ముందే భారత్ వారిని అధికారికంగా గుర్తించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

  • కరోనా కొత్త ముప్పు...

ప్రపంచంలోని అన్ని దేశాలకు టీకాలు సమానంగా పంచినప్పుడే కరోనా కట్టడి సాధ్యమవుతుందని అమెరికా, కెనడా శాస్త్రవేత్తలు తెలిపారు. లేదంటే కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

  • తాలిబన్లకు భారీ షాక్​..

తాలిబన్లు తమ నిధులు తీసుకునేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) తెలిపింది. అఫ్గాన్‌ ప్రభుత్వ గుర్తింపుపై స్పష్టత లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.

  • రూట్​ను ఔట్​ చేయటమిలా...

ఆతిథ్య జట్టులో టీమ్‌ఇండియాకు అడ్డొస్తున్న రూట్​ను ఔట్​ చేయడం ఎలాగో చెప్పాడు ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మాంటీ పనేసర్‌. జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌.. రూట్​పై ఒత్తిడి పెంచగలరని అభిప్రాయపడ్డాడు.

  • ఆ రూల్​ ఏం లేదు...

'కలర్​ఫొటో'తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సుహాస్. త్వరలోనే 'రైటర్​ పద్మభూషణ్​' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నేడు (ఆగస్టు 19) అతడి పుట్టిన రోజు సందర్భంగా తన కెరీర్​ ఎలా సాగింది, భవిష్యత్​లో ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నాడు ఇంకా పలు విశేషాలను ఈటీవీ భారత్​ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అవన్నీ అతడి మాటల్లోనే..

Last Updated : Aug 19, 2021, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.