ETV Bharat / city

స్పీకర్ తండ్రిలాంటి వారు.. దమ్ముంటే తన మొహం చూడాలని సీఎంకు ఈటల సవాల్​ - తెరాసపై ఈటల మండిపాటు

Etela Rajender fires on TRS: తెరాస నేతలే సభాపతి గౌరవాన్ని తగ్గిస్తున్నారని హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. మరమనిషి అన్నందుకు తనపై ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలు రెండ్రోజులే నిర్వహించడమేంటన్న ఈటల... ప్రజాసమస్యలపై పోరాడేందుకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

etela rajender
etela rajender
author img

By

Published : Sep 7, 2022, 3:52 PM IST

Updated : Sep 7, 2022, 4:30 PM IST

Etela Rajender fires on TRS: తాను ఏనాడూ స్పీకర్‌ను అవమానించేలా మాట్లాడలేదని హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. తెరాస నేతలే సభాపతి గౌరవాన్ని తగ్గిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. 20 ఏళ్లలో స్పీకర్​ను అవమానించిన ఘటనలు లేవని వెల్లడించారు. మరమనిషి అన్నందుకు తనపై ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలు రెండ్రోజులే నిర్వహించడమేంటన్న ఈటల... ప్రజాసమస్యలపై పోరాడేందుకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. బీఏసీ సమావేశానికి భాజపా ఎమ్మెల్యేలను ఆహ్వానించకపోవడంపై ఈటల రాజేందర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

చావుకు సిద్దపడుతానే తప్ప రాజీ పడేదేలేదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. దమ్ముంటే తన మొహాన్ని సీఎంను చూడమనండనీ.. ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నా ఎక్కడి నుంచి పోటీ చేయమంటారో చెప్పండని సవాల్ విసిరారు. స్పీకర్‌ సభకు అధిపతి అని అందరి హక్కులు కాపాడాలన్నారు. స్పీకర్ తనకు తండ్రిలాంటివారని పేర్కొన్నారు. హుందాగా బతికిన వ్యక్తి స్పీకర్‌ అని అటువంటి వ్యక్తిని అగౌరపరిచింది తాను కాదన్నారు. ప్రజ సమస్యలు మీద 20 ఏళ్లుగా ఏ విధంగా ప్రస్తావించానో అదే విధంగా ప్రస్తావిస్తానని తెలిపారు. ప్రతిపక్షాలను కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు ఎందుకు అనుమతివ్వడంలేదని ప్రశ్నించారు.

స్పీకర్ తండ్రిలాంటి వారు.. దమ్ముంటే తన మొహం చూడాలని సీఎంకు ఈటల సవాల్​

'పార్టీలకు అతీతంగా సభ్యులకు అవకాశం కల్పించడం శాసన సభ స్పీకర్ పని. శాసన సభ అనేది ప్రజల సమస్యలు చర్చించి నిర్ణయాలు తీసుకునే గొప్ప వేదిక. పోలీసు పహారా మధ్య అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇనుప కంచెల మధ్య ప్రగతి భవన్​లో ఉంటున్నారు. మంత్రులకు వాళ్ల శాఖపై అధికారాలు లేవు. నలుగురు సీఎంల దగ్గర పని చేశా. ఎప్పుడు ఇలా వాళ్లు వ్యవహరించలేదు. స్పీకర్ ఇటువంటి చర్యలకు పాల్పడలేదు. స్పీకర్ నాకు తండ్రిలాంటివారు. తెరాస, కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటే.' -ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే

ఇవీ చదవండి:

Last Updated : Sep 7, 2022, 4:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.