ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ అగ్నిప్రమాద ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటైంది. విచారణ కమిటీని నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణకు జేసీ(అభివృద్ధి) ఎల్.శివశంకర్ నేతృత్వంలో కమిటీని నియమించారు. కమిటీలో సబ్ కలెక్టర్ ధ్యానచంద్ర, వీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ జి.గీతాబాయి, ఆర్‌ఎఫ్‌వో ఉదయ్‌కుమార్, విద్యుత్ శాఖ డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ ఉన్నారు.
ప్రమాద కారణాలు, భద్రతా నిబంధనలపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆస్పత్రుల నిర్వహణ లోపాలు, అధిక ఫీజుల వసూలపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని పాలనాధికారి ఆదేశించారు.
ఇదీ చదవండీ : మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య సంతాపం