ETV Bharat / city

ఏపీ రాజధాని ఏర్పాటు రాష్ట్రం పరిధిలోదే: కేంద్రం - రాజధాని ఏర్పాటు రాష్ట్రం పరిధిలోదే

ఆంధ్రప్రదేశ్​ రాజధాని ఏర్పాటు రాష్ట్రం పరిధిలోని అంశమేనని.. ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉండబోదని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రాల రాజధానిపై నిర్ణయం కేంద్రం పరిధిలోనిదా, రాష్ట్రం పరిధిలోనిదా అనే అంశంపై దాఖలైన పిటిషన్​పై ఏపీ హైకోర్టులో కేంద్ర హోంశాఖ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.

Establishment of capital is within the purview of the State - the Center
ఏపీ రాజధాని ఏర్పాటు రాష్ట్రం పరిధిలోదే - కేంద్రం
author img

By

Published : Aug 6, 2020, 2:17 PM IST

ఆంధ్రప్రదేశ్​ రాజధాని ఏర్పాటు రాష్ట్రం పరిధిలోని అంశమేనని.. ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉండబోదని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రాల రాజధానిపై నిర్ణయం కేంద్రం పరిధిలోనిదా, రాష్ట్రం పరిధిలోనిదా అనే అంశంపై దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో కేంద్ర హోంశాఖ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని ఏర్పాటు కేంద్రం పరిధిలోనిదంటూ ఇటీవల హైకోర్టులో పి.వి.కృష్ణయ్య అనే వ్యక్తి పిటిషన్ వేశారు. ఆ వ్యాజ్యంపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.

ఏపీ రాష్ట్ర విభజన సమయంలో రాజధాని ఏర్పాటుపై అధ్యయనం చేసేందుకు కేంద్రం శివరామకృష్ణన్ కమిటీ వేసింది. కమిటీ నివేదికను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. 2015లో రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ డిసెంట్రలైజషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ యాక్ట్-2020 ద్వారా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇదీ చదవండి: పదివేల కిలోల రేషన్ బియ్యం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.