ETV Bharat / city

ఈఎస్​ఐ కుంభకోణంలో రోజుకో కొత్తకోణం

ఈఎస్​ఐ కుంభకోణంలో రోజుకో కొత్త కోణం బయటపడుతోంది. అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది, కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు అంతా కలిసి భారీగా దండుకున్నట్టు అనిశా గుర్తించింది. అరెస్టయిన దేవికారాణితో పాటు సంయుక్త సంచాలకురాలు పద్మ, సహాయ సంచాలకులు వసంత ఇందిర, ఫార్మసిస్ట్ రాధిక, సీనియర్ అసిస్టెంట్ హర్షవర్ధన్​పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈఎస్​ఐ కుంభకోణంలో రోజుకో కొత్తకోణం
author img

By

Published : Oct 4, 2019, 4:32 AM IST

Updated : Oct 4, 2019, 8:32 AM IST

ఈఎస్​ఐ కుంభకోణంలో రోజుకో కొత్తకోణం

ఈఎస్‌ఐ కుంభకోణంలో... ఆ విభాగం అధికారులు, సిబ్బంది అడ్డగోలుగా వ్యహరించి ఇష్టానుసారం డబ్బులు దండుకున్నట్టు అవినీతి నిరోధక శాఖ విచారణలో తేలింది. ఇందుకు సంబంధించి పలు కీలక ఆధారాలను అధికారులు గుర్తించారు. నాలుగేళ్లలో దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన ఔషధాలు కొనుగోలు చేసినట్లు తేలింది. ఏటా రూ.250 కోట్లకు పైగా మందులను బీమా వైద్య సేవల సంస్థ సంచాలకురాలు దేవికారాణి ఆధ్వర్యంలో కొనుగోలు జరిగినట్లు ఏసీబీ వెల్లడించింది.

70 డిస్పెన్సరీల ద్వారా...

రాష్ట్రంలోని 70 డిస్పెన్సరీల ద్వారా నిబంధనలకు పూర్తి విరుద్ధంగా కథ నడిచినట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించారు. ఓమ్ని మెడీ సంస్థ ఉద్యోగి నాగరాజు నివాసంలో ఏకంగా రూ.46 కోట్ల ఇండెంట్లు దొరకటం అధికారులను ఆశ్చర్యపరిచింది. వీటిపై ఈఎస్‌ఐ అధికారుల సంతకాలు ఉన్నట్లు బయటపడింది. ఇంకా వందకు పైగా కొనుగోలు ఒప్పంద పత్రాలను విచారణ అధికారులు పరిశీలించాల్సి ఉంది. పత్రాల పరిశీలన పూర్తయితే ఎంత మేరకు అక్రమాలు జరిగాయనే విషయం పూర్తిస్థాయిలో బయటపడే అవకాశం ఉంది.

ఆ పథకంలోనూ అక్రమాలు జరిగాయి..

ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం ప్రవేశ పెట్టిన పథకంలోనూ అక్రమాలు జరిగాయని సీపీఎం నేతలు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెల్​నెస్ కేంద్రాల్లో ఔషధాల కొనుగోలులోనూ అప్పటి అరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈఓగా ఉన్న పద్మ అక్రమాలకు పాల్పడ్డారని సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ ఆరోపించారు. 2016-18 సంవత్సరాల్లో పద్మ సుమారు రూ.20 కోట్ల విలువైన ఔషధాలు కొనుగోలు చేశారని, అందులో నిబంధనలకు విరుద్ధంగా 17 ఫార్మా కంపెనీల నుంచి కొనుగోళ్లు జరిగాయని శ్రీనివాస్​ తెలిపారు.

అధికారులపై సస్పెన్షన్​ వేటు....

ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టయిన సంచాలకురాలు దేవికారాణిపై సస్పెన్షన్ వేటు పడింది. 48 గంటలకు పైగా కస్టడీలో ఉన్న దృష్ట్యా... దేవికారాణిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆమెతో పాటు సంయుక్త సంచాలకురాలు పద్మ, సహాయక సంచాలకురాలు వసంత ఇందిర, ఫార్మసిస్ట్ రాధిక, సీనియర్ అసిస్టెంట్ హర్షవర్ధన్​పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేవికారాణి స్థానంలో ఐఎంఎస్ సంచాలకులుగా కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీంకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.

ఈ వ్యవహారంలో ఏసీబీ విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఎప్పుడు ఎవరు అరెస్టు కావాల్సి వస్తుందోనని ఈఎస్‌ఐ అధికారులు ఆందోళన చెందుతున్నారు.

ఇవీ చూడండి: ఈఎస్​ఐ కేసు: ప్రైవేటు అధికారుల ఇంట్లో 'ప్రభుత్వ పత్రాలు'

sample description
Last Updated : Oct 4, 2019, 8:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.