ETV Bharat / city

'విద్యుత్​ వృథా ఉండదు.. వినియోగదారునిపై భారం పడదు' - తెలంగాణ తాజా వార్తలు

స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లు విద్యుత్‌ వినియోగాన్ని పర్యవేక్షించటం, నియంత్రించటంలో వినియోగదారులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తాయని తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి ఛైర్మన్‌ శ్రీరంగారావు అభిప్రాయపడ్డారు. వినియోగదారులకు, విద్యుత్‌ పంపిణీ సంస్థలకు మధ్య ‘టూవే కమ్యూనికేషన్‌’కు అవకాశం కల్పిస్తాయని తెలిపారు. పంపిణీ సంస్థలు నష్టాల నుంచి గట్టెక్కడానికి దోహదం చేస్తాయని చెప్పారు. పాతమీటర్లను మార్చటం వల్ల వినియోగదారునిపైన ఎలాంటి భారం పడదని స్పష్టంచేశారు. కేంద్రం మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా డిస్కంలకు ప్రతిపాదించిన ఆర్థిక సాయంలో కొంత స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు ఉద్దేశించినదేనని ఆయన చెప్పారు. ప్రీపెయిడ్‌ మీటర్లపై విస్తృత చర్చ సాగుతున్న నేపథ్యంలో ఆయన ‘ఈనాడు-ఈటీవీభారత్​’తో మాట్లాడారు.

erc chairman
'విద్యుత్​ వృథా ఉండదు.. వినియోగదారునిపై భారం పడదు'
author img

By

Published : Mar 6, 2021, 7:42 AM IST

  • ప్రీపెయిడ్‌ మీటరుకు, స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటరుకు తేడా ఏమిటి?

ప్రీపెయిడ్‌ మీటర్లు విద్యుత్‌ టోకెన్లు లేదా వోచరు ఉపయోగించి పనిచేస్తాయి. వినియోగదారులు పిక్‌ అండ్‌ పే వంటి వెండింగ్‌ అవుట్‌లెట్ల నుంచి ఒక రసీదు కొనుగోలు చేస్తారు. వోచరులో పేర్కొన్న టోకెన్లను వారి ప్రీపెయిడ్‌ మీటర్లకు లోడ్‌ చేస్తారు. మీటరు కీ ప్యాడ్‌ను ఉపయోగించి వోచరులో ఉన్న పిన్ను నెంబరు నమోదు చేయటంతో ఇది పనిచేస్తుంది. టోకెన్‌ ఆధారంగా మీటరుకున్న యూనిట్‌ (కెడబ్ల్యుహెచ్‌) క్రెడిట్‌ జోడిస్తారు. స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటరులో కీ ప్యాడ్‌ ఉండదు. స్మార్ట్‌కార్డుతోనూ పనిలేదు. రిమోట్‌ కనెక్ట్‌, డిస్‌కనెక్ట్‌ స్విచ్‌లు ఉంటాయి.

  • ప్రస్తుతం స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్ల అవసరం ఎంత వరకూ ఉంది?

విద్యుత్‌ సరఫరా, పంపిణీ, బిల్లింగ్‌ల్లో లోపాలు, విద్యుత్‌ చౌర్యం తదితర కారణాల వల్ల భారతదేశం 30 శాతం ఇంధనశక్తిని కోల్పోతోంది. 300 గిగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కోసం 10 లక్షల కోట్లు ఖర్చు చేస్తే బిల్లింగ్‌ రూపంలో వసూలయ్యేది 7.5 లక్షల కోట్లు మాత్రమే. జీడీపీలో ఈ నష్టం 1.7 శాతంగా నమోదవుతోంది. దేశమంతా 25 కోట్ల స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లను ఏర్పాటు చేస్తే, డిస్కంలు చాలా వరకూ నష్టాలు తగ్గించుకోగలుగుతాయి. మన రాష్ట్రంలో రెండేళ్లక్రితం జీడిమెట్లలో ప్రయోగాత్మకంగా 8,800 సింగిల్‌ ఫేజ్‌ స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లను ఎస్పీడీసీఎల్‌ ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టుకు ఎన్నో ప్రశంసలు దక్కాయి.

స్మార్ట్​ ప్రీపెయిడ్​ మీటరు
స్మార్ట్​ ప్రీపెయిడ్​ మీటరు
  • వీటి వల్ల వినియోగదారులపై ఆర్థిక భారం పడదా?

స్మార్ట్‌మీటర్‌ కార్యక్రమం కింద భారతీయ గృహాల్లోని 25 కోట్ల సంప్రదాయ విద్యుత్‌ మీటర్ల స్థానంలో స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లు ఏర్పాటు చేయాలని విద్యుత్‌ మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఇప్పటికే మీటర్లున్న వినియోగదారులపైన ఎలాంటి భారం ఉండదు. కొత్తవారయితేనే మీటరుకు డబ్బు చెల్లించాలి.

  • సాధారణ మీటర్లతో పోలిస్తే ఇందులో ఎలాంటి ప్రత్యేకతలున్నాయి?

అటు సరఫరాదారుకు, ఇటు వినియోగదారులకు రోజూ విద్యుత్‌ వినియోగానికి సంబంధించిన వాస్తవ సమాచారం అందుతుంది. మానవజోక్యంతో పని ఉండదు.

పారదర్శకంగా ఉంటుంది. డేటా లీకేజీలను గుర్తించవచ్చు. ఖర్చులను తగ్గించుకోటానికి వినియోగదారులు తగిన వ్యూహాలను రూపొందించుకోవచ్చు.

డిస్కంలకు వ్యవస్థాగతంగా లోడ్‌ను సమతుల్యం చేయటానికి, భద్రత స్థిరత్వాన్ని అందించటానికి దోహదం చేస్తాయి.

నివాస, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు లోడ్‌ నిర్వహణ, లోడ్‌ ప్రొఫైల్‌ తెలుస్తాయి.

  • ఇందులో ఎలాంటి సాంకేతిక వ్యవస్థ అమలవుతోంది?

ఎప్పటికప్పుడు సాంకేతికతను ఆధునికీకరించగల ‘డేటాఓవర్‌ ది ఇయర్‌’ వ్యవస్థ ఇందులో ఉంటుంది. ఒకసారి స్మార్ట్‌ మీటరును ఏర్పాటు చేస్తే, కనీసం పదేళ్లపాటయినా స్థిరంగా ఉంటుంది. స్మార్ట్‌మీటర్లలో ప్రీపెయిడ్‌కు, పోస్ట్‌పెయిడ్‌కు అవకాశం ఉంది. వినియోగదారులు అవసరమైతే దానిని మార్చుకోవచ్చు కూడా.

  • భవిష్యత్తు అవసరాలకు స్మార్ట్‌మీటర్లు ఏ విధంగా దోహదం చేస్తాయి?

స్మార్ట్‌ మీటర్లు స్మార్ట్‌ గ్రిడ్‌ నిర్వహణకు మొదటి అడుగు. భవిష్యత్తులో మనదేశానికి స్మార్ట్‌గ్రిడ్‌ చాలా అవసరం. విద్యుత్‌ వాహనాల వినియోగం పెరుగుతోంది. లోడ్‌ డిమాండ్‌ కూడా పెరుగుతుంది. లోడ్‌ కర్ఫ్యూని విశ్లేషించటానికి ‘టూ వే కమ్యూనికేషన్‌’ ముఖ్యం. స్మార్ట్‌ ఉపకరణాల వాడకం, గృహ ఆటోమేషన్‌, పరిశ్రమ 4.0, సౌర, హైబ్రిడ్‌ శక్తి, బ్యాటరీ స్టోరేజీ, డిమాండ్‌ను అంచనాలో ఈ కొత్తరకం మీటర్లు సహాయపడతాయి.

  • ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు మార్చుకోటానికి ఎంత సమయం పడుతుంది?

తెలంగాణలో 1.20 కోట్ల పైగా వినియోగదారులున్నారు. సింగిల్‌, త్రీఫేజ్‌ కనెక్షన్లు ఉన్నవారు ఎక్కువ. ప్రస్తుతం వినియోగదారులపై ఎలాంటి భారం పడకుండా అందరికీ స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయటానికి మూడు నుంచి ఐదు సంవత్సరాలు పడుతుందని అంచనా.

  • వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర ఇవి వాడటం వల్ల ప్రయోజనం ఏముంది?

వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్‌ దగ్గర స్మార్ట్‌ మీటరు టెక్నాలజీని వాడితే కచ్చితమైన లెక్కలు వస్తాయి. సాంకేతిక నష్టాలు చాలా వరకూ తగ్గుతాయి. సబ్సిడీ ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, రాయితీ పొందుతున్న డిస్కంలకు ప్రయోజనం చేకూరుతుంది.

ఇవీచూడండి: గతేడాది హైదరాబాద్‌ వరదలపై నీతి ఆయోగ్‌ నివేదిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.