ETV Bharat / city

Embalming to Dollar Seshadri Dead Body: డాలర్ శేషాద్రి పార్థివ దేహానికి ఎంబాంబింగ్.. - Embalming to Dollar Seshadri Dead Body

Embalming to Dollar Seshadri Dead Body: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి పార్థివ దేహానికి ఎంబామింగ్​ (embalming) చేసినట్లు ఏఎంసీ ప్రిన్సిపల్​ పీవీ సుధాకర్​ తెలిపారు. పార్థివ దేహం పాడు కాకుండా ఈ ప్రక్రియ చేసినట్లు వెల్లడించారు.

Embalming to Dollar Seshadri Dead Body
డాలర్​ శేషాద్రి కన్నుమూత
author img

By

Published : Nov 29, 2021, 12:23 PM IST

TTD OSD DOLLAR SESHADRI PASSES AWAY: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి పార్థివ దేహానికి ఎంబామింగ్​(embalming) చేయమని తితిదే కోరినట్లు ఏఎంసీ(Andhra medical college) ప్రిన్సిపల్​ పీవీ సుధాకర్​ తెలిపారు. రవీంద్ర కిశోర్​ నేతృత్వంలో అనాటమీ విభాగంలో ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు చెప్పారు. దీనికి రెండు గంటలు సమయం పట్టిందని తెలిపారు. పార్థివ దేహం పాడు కాకుండా ఈ ప్రక్రియ చేసినట్లు వెల్లడించారు.

పార్థివ దేహం ఎక్కువ కాలం ఉండేందుకు ఎంబామింగ్ చేశాం.: పీవీ సుధాకర్​

తితిదే ప్రధానార్చకులు, ఓఎస్డీ డాలర్​ శేషాద్రి పార్థివ దేహానికి.. అపోలో ఆస్పత్రి వైద్యుల సూచనల మేరకు ఎంబామింగ్​ చేశాం. ఆంధ్రా వైద్య కళాశాల అనాటమీ విభాగం ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ పూర్తి చేశాం. ఆయన కొవిడ్​తో చనిపోలేదు. గుండెపోటుతో చనిపోయారు. ఆయన పార్థివ దేహం ఎక్కువ కాలం ఉండేందుకు ఎంబామింగ్ చేశాం. -పీవీ సుధాకర్​, ఏఎంసీ ప్రిన్సిపల్​

డాలర్ శేషాద్రి పార్థివ దేహానికి కొవిడ్ నిబంధనలు వర్తించవని పీవీ సుధాకర్ స్పష్టం చేశారు. ఆరోగ్య పరిస్థితుల్లో ఆయనకు గుండెపోటు వచ్చిందని చెప్పారు. ఎంబామింగ్​ ప్రక్రియ వల్ల ఆరు మాసాలు వరకు భౌతిక దేహం పాడు కాదని పేర్కొన్నారు. శేషాద్రి పార్థివ దేహానికి.. ప్రయాణానికి తగినట్లు ఏర్పాటు చేసినట్లు పీవీ సుధాకర్ వెల్లడించారు.

రేపు అంతిమసంస్కారాలు

తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న కార్తిక దీపోత్సవంలో పాల్గొనడానికి విశాఖ వెళ్లిన ఆయనకు ఇవాళ తెల్లవారుజామున 4 గంటల సమయంలో గుండెపోటు వచ్చింది. హుటాహుటిన రామ్‌నగర్‌లోని ఆసుపత్రికి తరలించగా... అక్కడే చికిత్స పొందుతూ తుదిశ్వాస(Dollar seshadri died) విడిచారు. కాసేపటికి ఆయన భౌతికకాయాన్ని అక్కడినుంచి కేజీహెచ్​కు తరలించారు. 1978 నుంచి శ్రీవారి సేవలో శేషాద్రి తరించారు. 2007లో పదవీ విరమణ చేసినప్పటికీ.. ఆయన సేవలను గుర్తించిన తితిదే ఓఎస్డీగా కొనసాగిస్తూ వస్తోంది. మరణించే చివరి క్షణం వరకు స్వామివారి సేవలో శేషాద్రి తరించారు. డాలర్ శేషాద్రి భౌతికకాయాన్ని విశాఖ నుంచి తిరుపతికి అధికారులు అంబులెన్సులో తరలిస్తున్నారు. రేపు తిరుపతి గోవిందధామంలో ఆయన అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.

ఇదీ చదవండి: డాలర్ శేషాద్రి పార్థివ దేహానికి ఎంబాంబింగ్..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.