హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య కేంద్రంలో ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం, సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా ఆదివాసీలపై జరుగుతున్న అన్యాయంపై పోరాటం ఉద్ధృతం చేయనున్నట్లు ఆదివాసీ నేత, తుడుందెబ్బ వ్యవస్థాపకులు నర్సింగ్‌రావు తెలిపారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. మూల వాసులైన ఆదివాసీలకు సమాజంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రొ.నాగేశ్వరరావు అన్నారు . వీరికి జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేస్తానని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న 42 మంది ఎంపీలతో కలసి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు ఆధ్వర్యంలో ఛలో దిల్లీ కార్యక్రమం జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్నామని ఆయన పేర్కొన్నారు.
లంబాడీల రిజర్వేషన్ తొలగించండి
హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆదివాసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆ సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.