ఏపీ గుంటూరు- గుంతకల్లు డబ్లింగ్, విద్యుద్దీకరణ ప్రాజెక్టులో భాగంగా నల్లపాడు-పేరిచర్ల స్టేషన్ల మధ్య విద్యుద్దీకరణ పనులతో పాటు డబ్లింగ్ లైను పనులు పూర్తి చేసి ప్రారంభించినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ రెండు స్టేషన్ల మధ్య 7.8 కిలో మీటర్ల పొడవు విద్యుద్దీకరణ, డబ్లింగ్ పనులు పూర్తయ్యాయయని పేర్కొంది.
గుంటూరు-గుంతకల్లు మధ్య 404 కిలోమీటర్ల పొడవు లైనుకు విద్యుద్దీకరణతో పాటు డబ్లింగ్ ప్రాజెక్టుకు 2016-17 సంవత్సరంలో ప్రభుత్వం రూ. 3,887కోట్ల వ్యయంతో నిధులు మంజూరు చేసింది. ఇంతకు ముందే పేరిచర్ల-సాతులూరు 24 కి.మీ దూరం, డోన్-పెండేకల్లు 28 కి.మీ దూరం పనులను అధికారులు పూర్తి చేశారు. ప్రస్తుతం గుంటూరు - గుంతకల్లు సెక్షన్‌లో మొత్తం 59.8కి.మీ పొడవున పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ప్రకటనలో వివరించింది.
ఇదీ చదవండి: సిరిసిల్లలో కేటీఆర్ ఆకస్మిక పర్యటన... అభివృద్ధి పనులపై ఆరా