Electricity Charges Hike in Telangana : ఐదేళ్ల తర్వాత విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. 2022-23 ఏడాదికి డిస్కమ్‌లు 16వేల కోట్ల రెవెన్యూ గ్యాప్ ప్రతిపాదించగా ... 14 వేల 237 కోట్లకు కమిషన్ ఆమోదం తెలిపింది. రెవెన్యూ అవసరాల కోసం 53వేల కోట్ల ఏఆర్‌ఆర్ ప్రతిపాదించగా... 48 వేల 708 కోట్లు ఆమోదించింది. గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు, పరిశ్రమలకు యూనిట్‌పై రూపాయి పెంచుతూ విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది. ఆయా ఛార్జీలు నేటి నుంచి అమలు కానున్నాయి.
Electricity Charges Hiked in Telangana : డిస్కంలు 18శాతం ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు సమర్పించాయి. కానీ, 14 శాతం పెంచేందుకు కమిన్ అనుమతిచ్చింది. మరోవైపు వ్యవసాయానికి ఛార్జీలు పెంచలేదు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ల కేటగిరీలకు టారిఫ్ ప్రతిపాదనలు ఆమోదించలేదు. 200 యూనిట్లలోపు వినియోగించే హెయిర్ కట్టింగ్ సెలూన్లు, ఎల్‌టీ 4లోని కుటీర పరిశ్రమవర్గానికి టారీఫ్‌లను ఈఆర్‌సీ సవరించలేదు. ఓపెన్ యాక్సిస్ వినియోగదారులపై డిస్కంలు ప్రతిపాదించిన ఫెసిలీటేషన్ ఛార్జీలను కమిషన్ తిరస్కరించింది. హెచ్‌టీ కేటగిరీ పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు గ్రీన్ టారిఫ్‌ను ప్రవేశపెట్టే డిస్కంల ప్రతిపాదనను కమిషన్ ఆమోదించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 6 వేల 831 కోట్ల ద్రవ్యలోటుని టారిఫ్ పెంచడం ద్వారా వినియోగదారుల నుంచి సమీకరించాలని డిస్కంలు ప్రతిపాదించగా.. కమిషన్ మాత్రం 5 వేల 596 కోట్లను మాత్రమే ఆమోదించింది.
నివాస గృహాలకు లో- టెన్షన్-1ఏ కేటగిరీలో 50 యూనిట్ల వరకు యూనిట్ ఛార్జీ రూపాయి 40 పైసల నుంచి రూపాయి 95 పైసలకు పెరగనుంది. అదే విభాగంలో 50 యూనిట్లు మించి కరెంట్ వాడేవారికి 100 యూనిట్ల వరకు యూనిట్ 2 రూపాయల 60 పైసలుగా ఉన్న ఛార్జీ... 3 రూపాయల 10 పైసలకు చేరనుంది.
Electricity Charges Hike News : ఇళ్లకు ఎల్‌టీ-1 బీ1 కేటగిరీలో వంద యూనిట్ల వరకు యూనిట్ ఛార్జీ 3 రూపాయల 30 పైసల నుంచి... 3 రూపాయల 40 పైసలకు మాత్రమే పెరిగింది. 101 నుంచి 200 యూనిట్ల వరకు.... యూనిట్ ధర 4 రూపాయల 30 పైసల నుంచి 4 రూపాయల 80 పైసలకు ఎగబాకింది. ఎల్‌టీ-1 బీ2లో 200 యూనిట్ల వరకు 5 రూపాయలుగా ఉన్న యూనిట్ ఛార్జీ... 5 రూపాయల 10 పైసలకు చేరింది. 201 నుంచి 300 వరకు 7 రూపాయల 20 పైసల నుంచి 7 రూపాయల 70 పైసలకు పెరిగింది. 301 నుంచి 400యూనిట్ల వరకు యూనిట్ ధర8రూపాయల 50 పైసల నుంచి 9రూపాయలకు ఎగబాకింది. 401 నుంచి 800యూనిట్ల వరకు యూనిట్‌కు 9 రూపాయలుగా ఉన్న ఛార్జీని తొమ్మిదిన్నర రూపాయలకు పెంచారు.
Electricity Charges Hike Updates : వాణిజ్య సముదాయాలకు ఎల్‌టీ-2ఏలో 50 యూనిట్ల వరకు యూనిట్‌కు 6 రూపాయలు ఉన్న ఛార్జీ కాస్తా.. 7రూపాయలకు చేరింది. వాణిజ్య సముదాయాలకు ఎల్‌టీ-2బీలో 100 యూనిట్ల వరకు ఏడున్నర ఉన్న యూనిట్ ఛార్జీని ఎనిమిదన్నర రూపాయలకు పెంచారు. 101 నుంచి 300 యూనిట్ల వరకు... 8 రూపాయల 90 పైసలు ఉన్న యూనిట్ ఛార్జీ... 9 రూపాయల 90కు పెరిగింది. 301 నుంచి 500యూనిట్ల వరకు యూనిట్ ధర 9 రూపాయల 40 పైసల నుంచి 10 రూపాయల 40 పైసలకు పెరిగింది.