ఏపీలో విద్యుత్ ఛార్జీల మోత మోగింది. కరెంట్ ఛార్జీలను పెంచుతూ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) నిర్ణయం తీసుకుంది. 30 యూనిట్ల వరకు 45 పైసలు, 31 నుంచి 75 యూనిట్ల వరకు 91 పైసలు, 76 నుంచి 125 యూనిట్ల వరకు రూ.1.40, 126 నుంచి 225 యూనిట్ల వరకు రూ.1.57, 226 నుంచి 400 యూనిట్ల వరకు రూ.1.16, 400 యూనిట్లు దాటితే యూనిట్‌కు 55 పైసలు పెంచుతున్నట్లు ఈఆర్‌సీ ప్రకటించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
5 కేటగిరీలు రద్దుచేసి కొత్తగా 6 శ్లాబులు ఏర్పాటు చేసినట్లు ఏపీ ఈఆర్‌సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి తెలిపారు. ధరలు పెంచడం ఇబ్బందైనా.. తప్పని పరిస్థితి నెలకొందన్నారు. పెరిగిన ఛార్జీలతో పంపిణీ సంస్థలకు రూ.1400 కోట్లు అదనపు ఆదాయం చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: బాయిల్డ్ రైస్ సేకరించేది లేదని తేల్చిచెప్పిన కేంద్రం