ETV Bharat / city

మధ్యాహ్నం 3 గంటల్లోపు రెండో రౌండ్ పూర్తైతే.. సాయంత్రానికి ఫలితాలు! - గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలు

గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల్లోపు రెండో రౌండ్ పూర్తి కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే సాయంత్రం 5 గంటలకల్లా లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంటుంది.

మధ్యాహ్నం 3 గంటల్లోపు రెండో రౌండ్ పూర్తైతే.. సాయంత్రానికి ఫలితాలు!

author img

By

Published : Dec 4, 2020, 8:55 AM IST

Updated : Dec 4, 2020, 9:29 AM IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతుంది. మెజార్టీ డివిజన్ల ఫలితాలు రెండో రౌండ్లోనే వెల్లడయ్యే అవకాశాలున్నాయి. మధ్యాహ్నం 3 గంటల్లోపు రెండో రౌండ్ పూర్తి కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే సాయంత్రం 5 గంటలకల్లా లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంటుంది. అత్యంత తక్కువగా ఓట్లు పోలైన మెహిదీపట్నంలో మొదటి రౌండ్‌లోనే ఫలితం తేలనుంది. అత్యధికంగా ఓట్లు పోలైన మైలార్​‌దేవ్‌పల్లి డివిజన్‌తో పాటు మరో 11 డివిజన్లలో 3 రౌండ్లలో లెక్కింపు జరగనుంది.

ఆలస్యమైన కౌంటింగ్​..

అయితే రాంనగర్ డివిజన్ స్ట్రాంగ్ రూమ్‌, పురానా పూల్​, నిజాం కళాశాలలో స్ట్రాంగ్ రూమ్‌లు ఇంకా తెరుచుకోలేదు. ఫలితంగా దోమలగూడ ఏవీ కళాశాలలో రాంనగర్ డివిజన్ ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. ఘాన్సీబజార్, పురానాపూల్​లో రీపోలింగ్ కోసం భాజపా హైకోర్టును ఆశ్రయించగా.. ఓట్ల లెక్కింపునకు ముందే తగిన ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ రెండు చోట్ల రీపోలింగ్​ అవసరం లేదని ఈసీ తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే కౌంటింగ్ కొంత ఆలస్యమైంది.

ఇవీ చూడండి: కొనసాగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

Last Updated : Dec 4, 2020, 9:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.