ETV Bharat / city

దేనికదే ఓ అపురూప కళాఖండం..! - magazine for cakes

దేన్నైనా వండుకునేది తినడానికే. మహా అయితే, చూడ్డానికీ ఆకర్షణీయంగా ఉండేలా కాస్తంత అలంకరించడం, భిన్నమైన రూపాల్లోనూ తయారుచెయ్యడం చేస్తుంటారు. కానీ అద్భుతమైన కళాఖండాలను సృష్టించేందుక్కూడా ఓ వంటకాన్ని ఎంచుకుంటున్నారంటే అది ముమ్మాటికీ కేకు మాత్రమే. అవి ఎంత గొప్పగా ఉంటాయో చూడాలంటే ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా కేకు మ్యాగజైన్‌ జూన్‌ ఎడిషన్‌ కోసం సృష్టించిన ఈ కేకు కళాకృతుల్ని చూడాల్సిందే.

Incredible India Cake Magazine '
Incredible India Cake Magazine '
author img

By

Published : May 16, 2021, 8:01 PM IST

Updated : May 16, 2021, 8:53 PM IST

కేకు... ఈ పేరు వినని వాళ్లూ ఆ రుచి తెలియని వారూ అరుదనే చెప్పాలి. పిల్లలూ పెద్దలూ కూడా దాని రుచికి ఫిదా అవడంతో ప్రపంచవ్యాప్తంగా ఏ మూలకెళ్లినా దొరికే ఈ వంటకం అంత ప్రాచుర్యం పొందింది మరి. అంతేనా... పుట్టినరోజు, పెళ్లిరోజు, ప్రేమికుల రోజు, కొత్త సంవత్సరం... ఇలా సంతోషించే వేడుక ఏదైనా కేకు ఉంటేనే సంబరం అంబరాన్నంటుతుందన్నట్లుగా ఆ వంటకం మన జీవితాల్లోకొచ్చేసింది.

ఇక, ఏదైనా కళ అందరి దృష్టికీ వెళ్లాలంటే ఇంతకు మించిన మంచి మాధ్యమం ఏముంటుంది..? పైగా చూడచక్కని బొమ్మలు చెయ్యడానికీ, అందమైన పెయింటింగులు వెయ్యడానిక్కూడా కేకు అనువుగా ఉంటుంది. అందుకే, కేకుతో ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్నారు కళాకారులు. వాటిని జనానికి చూపించేందుకు ప్రత్యేకంగా కేకు మ్యాగజైన్‌లు కూడా ఉన్నాయంటేనే ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.

అలాంటిదే ‘ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా కేకు మ్యాగజైన్‌’. టీనా స్కాట్‌ పరాశర్‌ ఆధ్వర్యంలో నడిచే ఈ మ్యాగజైన్‌ జూన్‌ ఎడిషన్‌ కోసం ‘భారతీయత’ థీమ్‌తో కేకుల్ని తయారు చెయ్యమని అంతర్జాతీయ కేకు ఆర్టిస్టులకు ఆహ్వానం పంపారు. అందులో భాగంగా మనదేశంతో పాటు వేరు వేరు దేశాలకు చెందిన 156మంది ఆర్టిస్టులు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కళ్లకు కట్టేలా కేకుల్ని తయారు చేశారు. దేనికదే ఓ అపురూప కళాఖండం. పోటీకి వచ్చిన వాటిలో తుదకు ఎనిమిదింటిని మ్యాగజైన్‌ ముఖ చిత్రం(కవర్‌ పేజీ) కోసం ఎంపిక చేశారు న్యాయ నిర్ణేతలు. అవే ఇక్కడ కనిపించేవి.

కేకుతో చేసిన కళాకృతులు

ఎంత అద్భుతమో!

నాజూకు నడుముతో నాట్యమాడుతున్న సుందరాంగి ధరించిన లెహంగా కూడా అమ్మాయి అందంతో పోటీ పడుతున్నట్లుగా ఎగురుతున్న కేకు ఒకటైతే, తలవాల్చి దీర్ఘంగా ఆలోచిస్తున్న పడుచు పిల్ల, కుంభమేళాలో కనిపించే ఆఘోరా సాధువు, బెంగాల్‌ టైగర్‌, గణపతి, ఆవు, రాధాకృష్ణుల పెయింటింగులతో తాజ్‌మహల్‌... ఇలా టాప్‌ ఎనిమిది కేకుల్లో ప్రతిదీ ఓ అద్భుత కళాఖండమే. అన్నీ విజేతలన్నట్లే. కానీ కవర్‌ పేజీకి ఏదో ఒక్క కేకు చిత్రమే వెళ్తుంది కాబట్టి, ఆ ఎనిమిదింటినీ ‘ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా కేకు మ్యాగజైన్‌’ ఫేస్‌బుక్‌ ఖాతాలో పెట్టి ‘మీకు నచ్చిన దానికి ఓటు వెయ్యండి’ అని పిలుపునిచ్చారు. ఎక్కువ ఓట్లు పెద్దపులి కేకుకే వచ్చాయి. ఇంతకీ మీ ఓటు దేనికి..?

Last Updated : May 16, 2021, 8:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.