ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ సదుపాయాలు ఉన్నాయని మంత్రి ఈటల స్పష్టం చేశారు. మొదటిగా ప్రభుత్వ ఆస్పత్రులను వాడుకునేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. రెండో దశలో వాడుకునేందుకు ప్రైవేటు వైద్య కళాశాలలను కోరినట్లు వెల్లడించారు. బాధితుల కోసం 10 వేల పడకలు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
26 రోజుల్లో 47 కరోనా కేసులు..
రాష్ట్ర వ్యాప్తంగా 700 ఐసీయూలు, 190 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి చెప్పుకొచ్చారు. గడిచిన 26 రోజుల్లో 47 కరోనా కేసులు నమోదయ్యాయన్నారు. బాధితుల్లో ఏ ఒక్కరూ విషమ పరిస్థితుల్లో గానీ, ఇతరత్రా సమస్యలు కానీ లేవని చెప్పారు. తెలంగాణలో ఎక్కడా కరోనా వ్యాప్తి లేదని స్పష్టం చేశారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారి నుంచే వ్యాధి వచ్చిందని వివరించారు. ప్రజలకు భద్రత, ధైర్యం కల్పించడానికి ప్రభుత్వం వెనకాడబోదని తేల్చి చెప్పారు.
ఇవీ చూడండి: వసతిగృహాలను తెరిచే ఉంచుతాం: నిర్వాహకులు