గతేడాది పోటీకి అనూహ్య స్పందన వచ్చింది. నాలుగు విదేశాలు, 12 తెలుగేతర రాష్ట్రాల నుంచి దాదాపు 2 వేల కథలు వచ్చాయి. 18 నుంచి 90 ఏళ్ల వరకూ అన్ని వయోవర్గాల వారూ కథలను పంపారు. సుప్రసిద్ధ రచయితలు, సాహితీ విమర్శకులతో కూడిన న్యాయనిర్ణేతల బృందం అంతిమ విజేతలను ఎంపిక చేసింది.
ఈ పోటీలో బహుమతులు పొందిన కథలు ‘ఈనాడు ఆదివారం’, ‘తెలుగు వెలుగు’, ‘విపుల’, ‘చతుర’ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఈ ఒరవడిని కొనసాగిస్తూ రామోజీ ఫౌండేషన్ 'కథా విజయం-2020' పోటీకి రచనలను ఆహ్వానిస్తోంది. ఈ పోటీలో 31 మంది విజేతలకు రూ.1 లక్షా 70 వేల బహుమతులు అందుతాయి. వివరాలు, పోటీ నిబంధనలను teluguvelugu.inలో చూడవచ్చు.