ETV Bharat / city

ఫిబ్రవరి 15నుంచి ప్రత్యక్ష తరగతులు..? - విద్యాసంస్థలు ప్రారంభం

ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రత్యక్ష తరగతులను ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభించాలని విద్యా శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. తొమ్మిది నుంచి ఆపై తరగతులకు వచ్చే నెల 1 నుంచి ప్రారంభించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. అయిదో తరగతి వరకు ఈ ఏడాది భౌతిక తరగతులు నిర్వహించవద్దని విద్యాశాఖ భావిస్తోంది.

educational institutions starts from february first onwards
తొమ్మిదో తరగతి నుంచి ఫిబ్రవరి 1న తరగతులు ప్రారంభం
author img

By

Published : Jan 17, 2021, 6:55 AM IST

కరోనాతో మూతపడిన విద్యా సంస్థలను క్రమంగా తెరిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతితో... తొమ్మిది నుంచి ఆపై తరగతులను ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. కరోనా జాగ్రత్తలతో విద్యా సంస్థలు తెరిచేందుకు పాఠశాల విద్యాశాఖ, ఇంటర్ బోర్డు, కళాశాల, సాంకేతిక విద్యాశాఖలు, విశ్వవిద్యాలయాలు కసరత్తు చేస్తున్నాయి.

జూనియర్ కళాశాలలు షిఫ్టు పద్ధతిలో... డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ ఇతర వృత్తి విద్య కాలేజీలు రోజుకు సగం మంది విద్యార్థులతో ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రత్యక్ష తరగతుల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తక పోతే... పదిహేను రోజుల తర్వాత ఆరు, ఏడు, ఎనిమిదో తరగతులు కూడా మొదలు పెట్టాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఆరు నుంచి ఎనిమిది తరగతులకు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభించేలా ప్రభుత్వానికి పాఠశాల విద్యా శాఖ ప్రతిపాదనలు పంపించింది.

ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు డిటెన్షన్ ఉండదని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఆరు నుంచి ఎనిమిది తరగతుల వరకు పరీక్షలు మాత్రం నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. పరీక్షల నిర్వహణ తీరుపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఒకటి నుంచి అయిదో తరగతి వరకు ఈ ఏడాది బడులు దాదాపు లేనందున... ప్రత్యక్ష తరగతులు, పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది.

ఇదీ చూడండి: జేఈఈ పరీక్ష ఆన్​లైన్​ దరఖాస్తుల గడువు పెంపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.