ETV Bharat / city

Minister Suresh: 'వచ్చే నెల 16న పాఠశాలలు పున:ప్రారంభం'

వచ్చే నెల 16 నుంచి ఏపీలో పాఠ‌శాల‌లు పునః ప్రారంభిస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు. ఉపాధ్యాయుల‌కు ఆగ‌స్టు 16లోగా 100 శాతం బూస్టర్ డోస్ వ్యాక్సిన్ పూర్తి చేయాల‌ని సీఎం ఆదేశించినట్లు తెలిపారు.

'వచ్చే నెల 16న పాఠశాలలు పున:ప్రారంభం'
'వచ్చే నెల 16న పాఠశాలలు పున:ప్రారంభం'
author img

By

Published : Jul 29, 2021, 3:48 PM IST

వచ్చే నెల 16న ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా అన్ని పాఠ‌శాల‌లు పునః ప్రారంభిస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​ పునరుద్ఘాటించారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలు తెరుస్తున్నామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులను విద్యార్థుల ఇంటికి పంపి సన్నద్ధతకు ఏర్పాట్లు చేస్తున్నారని మంత్రి వివరించారు. ఉపాధ్యాయుల‌కు ఆగ‌స్టు 16లోగా 100 శాతం బూస్టర్ డోస్ వ్యాక్సిన్ పూర్తి చేయాల‌ని సీఎం జగన్​ ఆదేశించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా నాడు-నేడు ప‌నులు 98 శాతం పూర్తయ్యాయని.. ఆగస్టు 16న సీఎం జగన్ వీటిని ప్రజ‌ల‌కు అంకితం చేస్తారని మంత్రి పేర్కొన్నారు. అదే రోజు నాడు-నేడు రెండోదశ కింద రూ.4వేల కోట్లతో 16 వేల స్కూళ్ల రూపురేఖ‌లు మార్చే కార్యక్రమం ప్రారంభిస్తారన్నారు. అమ్మ ఒడి వ‌ద్దన్న 9 ల‌క్షల మంది, డిగ్రీ కాలేజీల్లో వ‌స‌తి దీవెన వ‌ద్దనుకుంటున్న విద్యార్థులకు వ‌చ్చే విద్యా సంవ‌త్సరం నుంచి ల్యాప్​ట్యాప్​లు ఇస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: KTR: 'సోలార్​ విద్యుదుత్పత్తిలో.. దేశంలోనే తెలంగాణ రెండోస్థానం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.