ETV Bharat / city

మాంసం అధికంగా తింటే గుండె జబ్బులు వస్తాయా? - హెల్త్​ చిట్కాలు

Eating more meat cause heart diseases: మాంసం మితంగా తింటే పర్వాలేదు కానీ, మితిమీరి తినే వారికి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే గుండె రక్తనాళాల్లో పుడికల ముప్పు తగ్గాలంటే మాంసం ఎక్కువగా తినొద్దని డాక్టర్లు చెబుతున్నారు.

meat
meat
author img

By

Published : Oct 14, 2022, 1:29 PM IST

Updated : Oct 14, 2022, 1:35 PM IST

Eating more meat cause heart diseases: గుండె రక్తనాళాల్లో పూడికల ముప్పు తగ్గాలంటే మాంసం ఎక్కువగా తినొద్దని డాక్టర్లు చెబుతుండటం తెలిసిందే. ఇంతకీ మాంసంతో పూడికల ముప్పు ఎలా పెరుగుతుంది? పేగుల్లోని సూక్ష్మక్రిముల ద్వారా! ఆశ్చర్యంగా అనిపించినా కొంతవరకు ఇది నిజమేనని టఫ్ట్స్‌ యూనివర్సిటీ, క్లీవ్‌లాండ్‌ క్లినిక్‌ పరిశోధకుల అధ్యయనం చెబుతోంది. మాంసంలో ఎల్‌-కార్నిటైన్‌ రసాయనం, కోలిన్‌ పోషకం దండిగా ఉంటాయి. వీటిని పేగుల్లోని సూక్ష్మక్రిములు జీర్ణం చేసుకుంటాయి.

ఈ క్రమంలోనే ట్రైమిథైలమైన్‌-ఎన్‌-ఆక్సైడ్‌ (టీఎంఏఓ), అలాగే దీనికి సంబంధించిన వై-బుటీరోబెటైన్‌, క్రోటోనోబెటైయిన్‌ వంటి రసాయనాలు (మెటబాలైట్లు) పుట్టుకొస్తాయి. ఇవి పూడికలు ఏర్పడటంలో పాలు పంచుకుంటున్నాయని పరిశోధకులు గుర్తించారు. ‘‘ఎల్‌-కార్నిటైన్‌, కోలిన్‌ నుంచి పుట్టుకొచ్చిన మెటబాలైట్లు గ్రంథుల మాదిరిగానే పనిచేస్తాయి. హార్మోన్ల మాదిరిగా రక్తం ద్వారా శరీరమంతటా ప్రయాణిస్తూ ప్రభావం చూపుతాయి’’ అని సహ అధ్యయన కర్త డాక్టర్‌ టాంగ్‌ చెబుతున్నారు.

ఇలా పూడికలు ఏర్పడటానికి, గుండె జబ్బుల ముప్పు పెరగటానికి దోహదం చేస్తున్నాయని వివరిస్తున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధిక కొలెస్ట్రాల్‌ కన్నా ఇవే ఎక్కువగా గుండెజబ్బు ముప్పును పెంచుతున్నాయని పేర్కొంటున్నారు. మనలో కొందరికి రక్తనాళాల్లో పూడికల ముప్పు ఎందుకు ఎక్కువగా ఉంటోందనే గుట్టును ఈ అధ్యయన ఫలితాలు కొంతవరకు ఛేదించినట్టయ్యింది. పేగుల్లోని బ్యాక్టీరియా పెద్దమొత్తంలో మెటబాలైట్లను ఉత్పత్తి చేసేవారికి పూడికల ముప్పు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా మాంసాహారులు మితంగానే తినటం మేలు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 14, 2022, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.