కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చి, కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడిని అరికట్టాలని డివైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కరోనాను నివారించడంలో పూర్తిగా విఫలమైందని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్, డివైఎఫ్ఐ నగర కార్యదర్శి టి.మహేందర్ ఆరోపించారు.
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరుతూ ఈనెల 19న చేపట్టే నిరాహార దీక్ష గోడ పత్రికను హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆవరణలో డివైఎఫ్ఐ నాయకులు ఆవిష్కరించారు. కరోనా బాధితులు రాష్ట్రంలో సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారని విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ఇంటింటికి కరోనా టెస్టులు నిర్వహించాలని, కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షను ఎమ్మెల్సీ నర్సి రెడ్డి ప్రారంభిస్తారని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు.
- ఇదీ చూడండి:- సామాజిక మరుగుదొడ్లు వాడే వారిలో 62శాతం మందికి కరోనా