ETV Bharat / city

ఆరువందల కిలోమీటర్లు.. మూడు రోజుల్లోనే నడిచాడట! - ఆరువందల కిలోమీటర్లు.. మూడు రోజుల్లోనే నడిచాడట!

లాక్​డౌన్ వేళ.. హైదరాబాద్ నుంచి విశాఖకు నడుస్తూ చేరానంటున్నాడు ఓ వ్యక్తి. అది కూడా కేవలం 3 రోజుల్లోనే అని చెబుతున్నాడు. 600 కిలోమీటర్లకు పైగా ఉన్న దూరాన్ని నడుస్తూనే కేవలం 3 రోజుల్లో ఎలా పూర్తి చేశాడంటారా? ఈ వార్త తెలుసుకోవాల్సిందే.

due to corona lockdown a man reached with walk from hyderabad to visakha in three days
ఆరువందల కిలోమీటర్లు.. మూడు రోజుల్లోనే నడిచాడట!
author img

By

Published : Apr 30, 2020, 12:06 AM IST

విశాఖ బీచ్ రోడ్డు జోడుగుళ్లపాలెం కూడలి వద్ద.. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ యువకుడిని పోలీసులు ప్రశ్నించారు. ఎక్కడి నుంచి వచ్చావు.. ఎవరని ఆరా తీశారు. అతను చెప్పిన సమాధానం విన్న పోలీసులు విస్తుపోయారు. తాను హైదరాబాద్ లోని హయత్ నగర్ కు చెందిన వ్యక్తిగా చెప్పిన సదరు యువకుడు.. 3 రోజుల క్రితం నడక మొదలు పెట్టి విశాఖ చేరుకున్నట్టు తెలిపాడు. అతని తీరుపై అనుమానంతో పోలీసులు దగ్గర్లోని ఆసుపత్రికి సమాచారం అందించారు. అతనికి వైద్యులు రోడ్డుపైనే పరీక్షలు చేశారు. అక్కడినుంచి వెంటనే సమీపంలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

ఇదీ చదవండి:

వృద్ధురాలికి కరోనా.. అప్రమత్తమైన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.