కర్నూలు జిల్లాలో భార్యాభర్తల మధ్య కరోనా వైరస్ చిచ్చుపెట్టింది. జిల్లాకు చెందిన ఆంజనేయులు తెలంగాణలోని మిర్యాలగూడలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయన భార్య శ్యామల పిల్లలతో కలిసి కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ములుగుందంలో ఉంటోంది.
లాక్‌డౌన్‌తో పని లేకపోవటంతో ఆంజనేయులు సొంతూరికి తిరిగి వెళ్లాడు. అయితే కరోనా పరీక్ష చేయించుకుంటేనే ఇంట్లోకి రావాలని అతని భార్య శ్యామల తెలిపింది. పరీక్షలు చేయించడానికి అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లింది.
ఇదీ చదవండి: కరోనాను తరిమికొట్టేందుకు ఊరంతా పసుపు నీళ్లు!