ETV Bharat / city

'వైద్య పరికరాలను తక్కువ ధరలకే అందించాలి'

వైద్య పరికరాలను మరింత తక్కువ ధరలకే సాధారణ ప్రజలకు అందించాల్సిన అవసరముందని డీఆర్​డీఓ ఛైర్మన్ సతీశ్ రెడ్డి అన్నారు. ఆ దిశగా డీఆర్​డీఓ కృషి చేస్తోందని తెలిపారు.

DRDO Chairman about research in medical field
వైద్యరంగంలో పరిశోధనలపై డీఆర్​డీఓ ఛైర్మన్
author img

By

Published : Dec 22, 2020, 3:18 PM IST

వైద్యరంగంలో మరింత పరిశోధనలు జరగాల్సిన ఆవశ్యకత ఉందని డీఆర్​డీఓ ఛైర్మన్ సతీశ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఈఎస్​ఐ ఆస్పత్రిని సందర్శించిన ఆయన.. వైద్య కళాశాల విద్యార్థులతో ఆన్‌లైన్ ద్వారా మాట్లాడారు. వైద్యరంగంలో ప్రయోగాలు చేయాలనుకునే ఈఎస్​ఐ వైద్య కళాశాల విద్యార్థులు.. డీఆర్​డీఓ ల్యాబ్‌లలో పనిచేసేందుకు వీలుగా ఒప్పందాలు చేయనున్నట్టు ప్రకటించారు.

వైద్యరంగంలో పరిశోధనలపై డీఆర్​డీఓ ఛైర్మన్

దేశంలోనే మొట్టమొదటి బీఎస్4 ల్యాబ్‌ను డీఆర్​డీఓ త్వరలో ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. డీఆర్​డీఓ తయారు చేసిన కాంక్లియార్ ఇంప్లాంట్‌ని ఇప్పటికే ఐదుగురు రోగులకు అమర్చి.. వారి ఆరోగ్య పరిస్థితులను సమీక్షిస్తున్నట్టు వివరించారు. కొవిడ్ సమయంలో ఈఎస్​ఐతో కలిసి అనేక ప్రయోగాలు చేశామన్న సతీశ్​ రెడ్డి.... భవిష్యత్తులోనూ ఆ బంధాన్ని కొనసాగించనున్నట్టు వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.