రంగారెడ్డి జిల్లా సిద్దులగుట్ట వద్ద మహిళ అనుమానాస్పద మృతి కేసును ప్రాథమికంగా ఆత్మహత్యగా నిర్ధారించినట్లు శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ నగర శివారు శంషాబాద్‌లో నిన్న మహిళ మృతిపై డీసీపీ ప్రకాశ్‌రెడ్డి స్పందించారు. సీసీ కెమెరా దృశ్యాల్లో మహిళ ఒంటరిగా వెళుతున్నట్లు కనిపించిందని చెప్పారు. మృతదేహం లభించిన ఆలయం వద్ద పూజారిని విచారించామని... ఆ మహిళ హిందీలో మాట్లాడుతూ తన కుటుంబ సభ్యుల కోసం వేచిచూస్తున్నానని చెప్పిందని పేర్కొన్నారు.
ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆధారాలు, సాక్షులను విచారించడం ద్వారా నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. సాంకేతిక ఆధారాల ద్వారా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు.
మరోవైపు, పశువైద్యురాలి హత్య కేసులో నలుగురు నిందితులు మాత్రమే ఉన్నారని... ఐదో నిందితుడు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిగేలా చూస్తామని డీసీపీ ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు.