ETV Bharat / city

అమరావతి రైతుల ఆకాంక్షలు... తెలంగాణ పాత్రికేయుడి లఘు చిత్రం - documentary on ap capital issue

ఏపీ అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులు, 29 గ్రామాల ప్రజలు చేస్తున్న ఆందోళనపై తెలంగాణకు చెందిన పాత్రికేయుడు శ్రీధర్‌ ధర్మాసనం.. ‘కేపిటల్‌ వూస్‌’ పేరుతో లఘుచిత్రం రూపొందించారు. ఈ చిత్రానికి సామాజిక మాధ్యమాల్లో భారీ స్పందన లభిస్తోంది. ఆ డాక్యుమెంటరీలో రాజధాని రైతులు, మహిళల ఆవేదనను, ఉద్యమాన్ని కళ్లకు కట్టారు.

అమరావతి  రైతుల ఆకాంక్షలు... తెలంగాణ పాత్రికేయుడి లఘు చిత్రం

author img

By

Published : Sep 7, 2020, 10:13 AM IST

అమరావతి పోరాటంపై తెలంగాణకు చెందిన పాత్రికేయుడు శ్రీధర్‌ ధర్మాసనం రూపొందించిన లఘుచిత్రం అమరావతి రైతులు, మహిళల ఆవేదనను కళ్లకు కట్టింది. కేపిటల్‌ వూస్‌ పేరుతో ఆవిష్కరించిన ఈ లఘు చిత్రానికి సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన లభిస్తోంది. మహిళలు, రైతులపై పోలీసుల దురుసు ప్రవర్తన, గ్రామాల దిగ్బంధం, అర్ధరాత్రి ఇళ్లల్లో తనిఖీలు, డ్రోన్లతో గ్రామాల్లో పోలీసుల చిత్రీకరణలు లాంటి అనేక దృశ్యాలను ఇందులో పొందుపరిచారు.

పోలీసుల అణచివేత వైఖరిని వివరిస్తూ అమరావతి మహిళలు కన్నీటి పర్యంతమైన సందర్భం.. కలచివేస్తోంది. పెయిడ్‌ ఆర్టిస్టులంటూ అమరావతి ఉద్యమానికి రాజకీయ రంగు పులిమేందుకు వైకాపా నాయకులు ప్రయత్నించారని ఈ చిత్రంలో రైతులు ఎండగట్టారు. ప్రధాని మోదీనే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: రక్షకులే దండిస్తే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.