ETV Bharat / city

వైద్యుల ధర్నాలు... రోగుల ఇబ్బందులు - patients struggle

ఎన్​ఎంసీ బిల్లుపై వైద్యుల ఆందోళన బాట.. రోగుల పాలిట శాపంగా మారింది. వైద్యులు ఇవాళ విధులు బహిష్కరిస్తామని రాత్రి ప్రకటించారు. విషయం తెలియని రోగులు.. సుదూర ప్రాంతాల నుంచి ఆసుపత్రి వచ్చి.. విషయం తెలిసి ఉసూరుమన్నారు. అత్యవసర సేవల కోసం వచ్చిన వారు వైద్యం అందక నానా అవస్థలు పడ్డారు.

వైద్యుల ధర్నాలు... రోగుల ఇబ్బందులు
author img

By

Published : Jul 31, 2019, 11:31 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్‌ మెడికల్‌ బిల్లుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు చేపట్టిన ఆందోళన కారణంగా పలుచోట్ల రోగులు ఇబ్బందులు పడ్డారు. ఐఎంఏ రాష్ట్రంలో అతిపెద్ద ఆస్పత్రులైన గాంధీ, ఉస్మానియా, నిమ్స్ లోనూ వైద్యులు ఆందోళనల బాట పట్టారు. ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచే ఓపీ సేవలను నిలిపివేశారు. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ నిరసనలు కొనసాగాయి. గాంధీ, ఉస్మానియా సహా పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు కేవలం గంటసేపు మాత్రమే విధులు బహిష్కరించగా... నిమ్స్​లో పూర్తిగా ఓపీ సేవలను నిలిపివేయటంతో రోగులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఉదయం నుంచే ఓపీ సేవలు బంద్

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉదయం 9 నుంచి 10 గంటల వరకు విధులు బహిష్కరించారు. నిమ్స్ ఆస్పత్రికి కేవలం తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. బంద్ కారణంగా వారంతా తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ పరిస్థితేంటని వాపోయారు.

బంద్​ సాకుతో.. విధులకు గైర్హాజరు

ధర్నా సాకుతో... పలువురు వైద్యులు, పారామెడికల్ స్టాఫ్, ఎక్సరే సిబ్బంది విధులకు గైర్హాజరయ్యారు. నిమ్స్​లో ఎమర్జెన్సీ విభాగంలో బెడ్లు ఖాళీ లేకపోవటం వల్ల అత్యవసర సేవలను కూడా గంటల తరబడి అందించలేదు. వీటి వల్ల దూర ప్రాంతాల నుంచి రోగులను కార్లలో, ఆంబులెన్స్​లలో తీసుకువచ్చిన వారు ఎమర్జెన్సీ విభాగం ఎదుట గంటల తరబడి పడిగాపులు కాశారు.

నాలుగు రోజులైనా...

ఆదివారం సెలవుదినం కావటం, సోమవారం బోనాల సెలవు ఉండటం, మంగళవారం కొన్ని విభాగాల్లో స్పెషలిస్టులు అందుబాటులో లేక మూడ్రోజుల నుంచి రోగులు వైద్యం కోసం ఎదురు చూస్తున్నారు. నేడు వైద్యుల ధర్నా కారణంగా... ఈ రోజు కూడా ఇక్కడే ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైద్యుల ధర్నాలు... రోగుల ఇబ్బందులు

ఇదీ చూడండి: 'ఇలాంటి పరిస్థితి ఏ బిడ్డకు రాకూడదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.