ETV Bharat / city

'పబ్​జీ'... పూర్తి పేరేంటో తెలుసా? - pubG

నేటితరం యువతలో పబ్‌జీ గేమ్‌ గురించి తెలియని వారు.. వినని వారూ ఉండరంటే అతిశయోక్తి కాదు! అంతగా పాపులర్‌ అయ్యింది ఈ గేమ్‌. ఈ గేమ్​ ఆడేందుకు యువత ఎంతగా ఆసక్తి చూపుతారో అందరికీ తెలిసిందే. ఇంతకీ మీరూ పబ్‌జీ ఆడుతున్నారా? అయితే పబ్‌జీ పూర్తిపేరేంటో తెలుసా? బహుశా చాలా మంది... ‘తెలీదు’ అనే సమాధానం చెప్పొచ్చు. అయినా ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా?

'పబ్​జీ' పూర్తి పేరేంటో తెలుసా?
author img

By

Published : Aug 22, 2019, 12:46 PM IST

బిగ్‌బీ.. అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించే కౌన్‌ బనేగా కరోడ్‌పతి -11 రెండో ఎపిసోడ్‌లో పాల్గొన్న వ్యక్తి వివేక్​ భగత్​ను పబ్​జీ పూర్తి పేరేంటో తెలుసా అని ప్రశ్నించారు. అప్పటి వరకు అడిగిన ప్రశ్నలకు చకచకా సమాధానం చెబుతూ వచ్చిన వివేక్.. ఈ ప్రశ్న అడిగే సరికి బిక్కమొహం వేశారు. చివరికి ఆడియన్స్‌ లైఫ్‌లైన్‌ తీసుకున్నారు. 'ప్లేయర్‌ అన్‌నోన్స్‌ బ్యాటిల్‌ గ్రౌండ్స్‌'’ అనే సమాధానానికి ఎక్కువ మంది ఓటేయడం వల్ల సరైన సమాధానం చెప్పగలిగారు. ఈ ప్రశ్న అడిగిన తర్వాత చాలా మంది ఇంతకీ పూర్తి పేరేం అయ్యుంటుదబ్బా అని నెట్టింట తెగ వెతికారట. దీనిపై సోషల్‌మీడియాలో కూడా చర్చ జరిగింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.