అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నట్లు తెరాస మల్కాజిగిరి పార్లమెంట్ ఇంఛార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. కంటోన్మెంట్ 3వ వార్డులో ఎమ్మెల్యే సాయన్నతో కలిసి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
నిరుపేదలైన తెలంగాణ ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి వరంలాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఅర్ నేతృత్వంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడం గొప్ప విషయమని తెలిపారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్ ప్రాంత వాసులకు కూడా ప్రభుత్వ పథకాలు అందిస్తున్న ఘనత తెరాసదేనని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: అమెరికా చికాగోలో హైదరాబాదీపై కాల్పులు..