జంటనగరాల్లో బతుకమ్మ చీరల పంపిణీ ఉత్సాహంగా సాగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు వివిధ ప్రాంతాల్లో తెలంగాణ ఆడపడచులకు చీరలు పంచారు. అబిడ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్లతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం అంబర్‌పేటలో స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి మహిళలకు చీరలను అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక కోటి రెండు లక్షల మంది ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
కర్మన్‌ఘాట్‌లో సబితా..
చందానగర్‌లోని హైటెక్ సిటీ సైబర్ కన్వెన్షన్‌లో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీలు మహిళలకు చీరలు అందజేశారు. కర్మన్‌ఘాట్‌లో స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాకర్షక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.
మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డి
మెహిదీపట్నంలో ఎమ్మెల్సీ ప్రభాకర్ చేతుల మీదగా చీరల పంపిణీ జరగగా... కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ బోయిన్‌పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పంపిణీ చేశారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్, పోచారం, పీర్జాదిగూడ, ఘట్కేసర్లలో కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలోని మహిళలంతా సంతోషంగా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.
హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ మున్సిపల్, మండలాల్లోని వివిధ ప్రాంతాల్లో బతుకమ్మ చీరలను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పంపిణీ చేశారు.
ఇవీ చూడండి: 'బతుకమ్మ... తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం'