ETV Bharat / city

Disha Enquiry: సెప్టెంబర్​ 1 నుంచి 4 వరకు మరోసారి సిట్​ అధికారి విచారణ - దిశ నిందితుల ఎన్​కౌంటర్ కేసు

దిశ నిందితుల ఎన్​కౌంటర్ కేసులో సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. నాలుగు రోజుల పాటు విచారణ నిర్వహించిన కమిషన్.. ప్రభుత్వం తరఫున హాజరైన సాక్షులను విచారించింది. సిట్ దర్యాప్తు అధికారి సురేందర్ రెడ్డి విచారణ పూర్తి కాకపోవడం వల్ల... మరోసారి విచారించాలని కమిషన్ నిర్ణయించింది. సెప్టెంబర్ 1న మరోసారి విచారణకు హాజరు కావాలని సురేందర్ రెడ్డిని కమిషన్ ఆదేశించింది.

disha case accused encounter enquiry again from September 1 to 4

author img

By

Published : Aug 28, 2021, 8:42 PM IST

దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై విచారణ నిర్వహించేందుకు ఏర్పాటైన సిర్పూర్కర్ కమిషన్ కార్యాచరణ వేగవంతం చేసింది. ఈ నెల 21, 26, 27, 28 తేదీల్లో విచారణ నిర్వహించిన కమిషన్... ఎన్​కౌంటర్​కు సంబంధించి పలు వివరాలు సేకరించింది. ప్రభుత్వం తరఫున సాక్షులుగా విచారణకు హాజరైన హోంశాఖ కార్యదర్శి రవిగుప్తను ఈ నెల 21న విచారణ నిర్వహించింది. ఎన్​కౌంటర్​కు దారితీసిన పరిస్థితులు, నిందితులపై కాల్పులు జరిపే సమయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయాలను రవిగుప్త నుంచి కమిషన్ సేకరించింది.

మూడు రోజులు సురేందర్​రెడ్డినే...

21వ తేదీ మధ్యాహ్నం తర్వాత సిట్ దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన సురేందర్ రెడ్డిని కమిషన్ ప్రశ్నించింది. దిశ నిందితుల ఎన్​కౌంటర్ జరిగిన తర్వాత ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అధ్యక్షతన ఏర్పాటైన సిట్​లో సురేందర్ రెడ్డి దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు. సిట్ సమర్పించిన అఫిడవిట్​లో నుంచి పలు వివరాలను కమిషన్ అడిగి తెలుసుకుంది. సిట్ తరఫున న్యాయవాదిగా వ్యవహరించిన పరమేశ్వర్.. సురేందర్ రెడ్డిని పలు ప్రశ్నలు వేశారు. నిందితులపై కాల్పులు జరిపే ముందు నిబంధనల ప్రకారం వ్యవహరించారా? లేరా? అని ప్రశ్నించారు. ఎన్ని రౌండ్ల కాల్పులు జరిపారు. కాల్పుల్లో పోలీసుల తరఫున ఎవరెవరు పాల్గొన్నారు... కాల్పులు జరిపిన సమయంలో ఆ బృందానికి ఎవరు నేతృత్వం వహించారనే ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నలన్నింటికి అఫిడవిట్​లో ఉన్న సమాధానాలతో పాటు... కొన్ని అదనపు సమాధానాలను సురేందర్ రెడ్డి వివరించారు. కమిషన్ నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం ఈ నెల 21న ప్రభుత్వాన్ని... 26, 27, 28 తేదీల్లో 18మంది సాక్షులను విచారించాల్సి ఉంది. కానీ.. ప్రభుత్వం తరఫున హాజరైన సురేందర్ రెడ్డినే మూడు రోజుల పాటు విచారించింది. ఇంకా ఆయనను విచారించడం పూర్తి కాకపోవడంతో కమిషన్ మరోసారి హాజరు కావాలని ఆదేశించింది.

హాజరు కావొద్దంటూ బెదిరింపులు..

సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు మరోసారి విచారణ జరిపేందుకు సిర్పూర్కర్ కమిషన్ నిర్ణయించింది. 1న సిట్ దర్యాప్తు అధికారి సురేందర్ రెడ్డిని కమిషన్ విచారించనుంది. సురేందర్ రెడ్డి విచారణ ముగిసిన తర్వాత 18 మంది సాక్షులను విచారించనుంది. మృతుల కుటుంబ సభ్యుల నుంచి కమిషన్ సాక్ష్యం సేకరించనుంది. కమిషన్ ఎదుట హాజరు కావొద్దంటూ బెదిరింపులొస్తున్నాయని మృతుల కుటుంబ సభ్యులు సిర్పూర్కర్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడంతో.... వాళ్లకు భద్రత కల్పించారు. కమిషన్ ముందు హాజరయ్యేందుకు నలుగురు మృతుల కుటుంబ సభ్యులు హైదరాబాద్​కు వచ్చారు. మూడు రోజులపాటు హైదరాబాద్​లోనే బస చేశారు. అయితే వాళ్ల వంతు రాకపోవడం వల్ల తిరిగి వాళ్ల గ్రామాలకు వెళ్లారు. ఆరిఫ్, చెన్నకేశవులు, నవీన్, శివ కుటుంబ సభ్యులకు హైదరాబాద్​లో ఉన్న మూడు రోజుల పాటు పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. పోలీస్ కానిస్టేబుల్ సమక్షంలోనే వాళ్ల స్వగ్రామాలకు వెళ్లారు. మక్తల్ నియోజకవర్గంలోని గుండ్లపల్లి, జక్లేర్​లో మృతుల కుటుంబ సభ్యుల ఇళ్ల వద్ద కూడా పోలీస్ పికెటింగ్ నిర్వహించారు.

2019 డిసెంబర్ 12న ఏర్పాటైన సిర్పూర్కర్ కమిషన్ ఆర్నెళ్లలో సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉన్నప్పటికీ... కరోనా కారణంగా విచారణ వాయిదా పడుతూ వచ్చింది. ఆర్నెళ్లలో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు... సిర్పూర్కర్ కమిషన్​ను ఆదేశించడంతో ఆ మేరకు విచారణ కొనసాగుతోంది.

ఇదీ చూడండి:

DISHA CASE: సిట్​ దర్యాప్తు అధికారిని ప్రశ్నిస్తోన్న జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.