ఆనందయ్య ఇచ్చే కరోనా మందు మంచిదా? కాదా? - Nellore district news
ఆనందయ్య.. ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చిన ఒక సామాన్య మూలికా వైద్యుడి పేరు. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం కరోనా వైద్యానికి ప్రధాన కేంద్రంగా మారడానికి ఈయనే ప్రధాన కారణం. లక్షల కొద్దీ ఫీజులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా.. ఆసుపత్రుల్లో పడకలు దొరకని పరిస్థితుల్లో ఆనందయ్య అందరికీ ఒక ఆశాకిరణంగా మారారు. ఆయన స్వయంగా తయారు చేసి అందచేస్తున్న కరోనా మందును చాలా మంది సంజీవినిగా భావించి కృష్ణపట్నానికి బారులు తీరారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆనందయ్య ఆయుర్వేదం మందు పంపిణీని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఆయన ఆయుర్వేద మందు మంచిదా? చెడ్డదా? మందు వాడుతున్న వారు చెబుతున్న ప్రకారం అనుకూలతలేమిటి? ప్రతికూలతలేమిటి.. ఓసారి చూద్దాం.
ఆనందయ్య కరోనా మందు
By
Published : May 22, 2021, 1:43 PM IST
అనుకూలత
ప్రతికూలత
ఉచితంగా కరోనా మందు పంపిణీ చేస్తున్నారు.
శాస్త్రీయంగా నిరూపణ కాని మందు వల్ల ఇబ్బందులు రావచ్చు.
సాధారణ మూలికలు కలిపిన ఈ మందు వాడకం వల్ల ఇబ్బంది పడలేదని కరోనా బాధితులు అధికారులకు తెలిపారు.
ఏ మూలిక అయినా ఏ మోతాదులో ఎంత కలపాలి అన్న శాస్త్రం ఉంది. ఆయుర్వేదంలోను విధివిధానాలుఉన్నాయి. అలా మూలికలను సరిగా కలిపి మందు చేయకపోతే ఆరోగ్యంపై చెడు పరిణామాలు ఉంటాయని ఆయుష్ బృందం చెబుతోంది.
వందలాది జనం ఈ మందు కోసం ఎగబడ్డారు. కొందరు కంటిలో ఈ మందు వేసుకున్న తర్వాత లేచి కూర్చున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. పనిచేయని మందు అనడం సరికాదని వాడిన వారు అంటున్నారు.
కొన్ని మూలికా రసాయనాల మిశ్రమం, మందులు అప్పటికపుడు చెడు ప్రభావం చూపకపోవచ్చు. చాలాకాలం తర్వాత ఇబ్బందులు రావచ్చు అని ఆయుష్ వైద్య నిపుణుల బృందం చెబుతోంది.
ప్రభుత్వం కరోనా రోగులకు మందులు, పడకలు సిద్థం చేయలేని పరిస్థితులలో ఆనందయ్య మందు వాడితే తప్పేంటని కరోనా రోగులు నిలదీస్తున్నారు. కొందరు ఈ మందును ఆయన దగ్గర నుంచి బలవంతంగా గుంజుకోవడం డిమండ్‌ను సూచిస్తోంది.
ఇలా గుంపులుగా రావడం వల్ల కొవిడ్-19 నిబంధనలన్నీ గాలిలో కలిసిపోయినట్టే. సామూహికంగా కరోనా విస్తరించి మరిన్ని కేసుల పెరుగుదలకు, మరణాలకు దారి తీస్తుంది. దీన్ని ఎలా నియంత్రించాలని ప్రభుత్వం ఇప్పటికే తల పట్టుకుంటోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఐసీఎంఆర్ నివేదిక వచ్చిన తర్వాతే నిర్ణయం ప్రకటించనుంది. ఇందుకు ఎంతో సమయం పట్టదని కూడా అధికారులు చెబుతున్నారు.
నివేదికలు వచ్చే వరకు మందు జారీ చేయకపోతే కుదరదని కరోనా రోగుల సహాయకులు చెబుతున్నారు. ఇది శాంతిభద్రతల పరిస్థితికి దారి తీసే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు.
ఆనందయ్యను కలిసి ఎలాగో మందు తయారు చేసి ఇవ్వాలని కోరే వారి సంఖ్య పెరిగింది. ఇది జనం డిమాండ్‌గా మారింది.
ఈ డిమండ్ ప్రభావంతో నెల్లూరు జిల్లా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆనందయ్యను పోలీసు రక్షణ చట్రంలో ఉంచారు. ప్రజాప్రతినిధులు కూడా ఆనందయ్య మందు పంపీణీ కావాలనే కోరుకుంటున్నారు.