ETV Bharat / city

జగన్‌కు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకోవాలి - జగన్‌కు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకోవాలి

ఏపీ సీఎం జగన్‌కు ఓటేసినందుకు మా చెప్పుతో మమ్మల్ని కొట్టుకోవాలంటూ తిరుపతి జిల్లా వెలంగపాలెేనికి చెందిన దివ్యాంగుడు చింతపట్ల వెంకటేశ్వర్లు, ఆయన సోదరుడు నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంజూరైన పింఛనును ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని వారు వాపోయారు.

AP news
AP news
author img

By

Published : Aug 16, 2022, 1:56 PM IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు ఓటేసినందుకు మా చెప్పుతో మమ్మల్ని కొట్టుకోవాలంటూ దివ్యాంగుడు చింతపట్ల వెంకటేశ్వర్లు, ఆయన సోదరుడు నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పరిధిలోని వెలంగపాలేనికి చెందిన వెంకటేశ్వర్లుకు రెండు కాళ్లు పనిచేయవు. చేతులు వంకర తిరిగాయి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పింఛను మంజూరైంది. ప్రస్తుత ప్రభుత్వం దాన్ని రద్దు చేయడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.

తనలాంటి వందలాది మందికి పింఛను తొలగించి ఆవేదన మిగిల్చారని వెంకటేశ్వర్లు వాపోయారు. ఆయనకు పెళ్లి కాకపోవడంతో ప్రభుత్వ విభాగంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేసే తమ్ముడు నరసింహులు వద్ద ఉంటున్నారు. తనవల్లే పింఛను తొలగించారంటూ అన్న నిష్టూరమాడుతున్నారంటూ నరసింహులు వాపోయారు. ఇద్దరి పేర్లు ఒకే రేషన్‌ కార్డులో ఉన్నాయని, తమ అన్నకు వేరుగా రేషన్‌కార్డు ఇప్పించి పింఛను అందేలా చూడాలని విన్నవించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.