ETV Bharat / city

Thirumala: శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు - AP government on Cinema tickets selling

తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దర్చించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఏపీ ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి, మద్ది గిరిధర్, అంబటి రాంబాబు, సంగీత దర్శకుడు మణిశర్మ, దర్శకుడు కోదండరామి రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

Thirumala
Thirumala
author img

By

Published : Oct 5, 2021, 1:16 PM IST

Updated : Oct 5, 2021, 2:09 PM IST

తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు మంగళవారం రోజు దర్చించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఏపీ ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి, మద్ది గిరిధర్, అంబటి రాంబాబు, సంగీత దర్శకుడు మణిశర్మ, దర్శకుడు కోదండరామి రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

మా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పలేము..

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నాయని... గెలవడానికి ఇరు వర్గాలు గట్టిగా ప్రయత్నిస్తున్నారని దర్శకుడు కోదండరామిరెడ్డి అన్నారు. కాబట్టి ఎవరు గెలుస్తారో చెప్పలేమని తెలిపారు. సినిమా టిక్కెట్లు విక్రయానికి సంబంధించి సినీ పెద్దలు మాట్లాడినవి ప్రభుత్వం అంగీకరించినట్లుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ అందికీ ఆమోదయోగ్యమైన...మంచి చేసే నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : Tirumala Temple : శ్రీవారి సన్నిధిలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

Last Updated : Oct 5, 2021, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.