ETV Bharat / city

ఒక్క కాల్‌తో సాయం.. ఆరేళ్లలో లక్షల మంది వినియోగం - telangana news

నిన్న ‘దిశ’పై దురాగతం.. నేడు బీఫార్మసీ విద్యార్థినిపై అఘాయిత్యం.. ఇలాంటి ఆపద సమయాల్లో బాధితురాళ్లు సాయం కోసం తొలుత ఫోన్‌ చేసింది కుటుంబ సభ్యులకే! అవే ఫోన్లను ‘100’ నంబరుకు చేసి ఉంటే తాము మరింత వేగంగా స్పందించేందుకు ఆస్కారం ఉండేదంటున్నారు పోలీసులు. ప్రమాదంలో ఉన్నవారికి ఆ నంబరు శ్రీరామరక్ష అని, ఫోన్‌ కాల్‌కు సత్వరం స్పందించే యంత్రాంగం తమ వద్ద ఉందని వారు చెబుతున్నారు. ఇలాంటి ఫోన్‌కాల్స్‌ వచ్చిన ప్రాంతానికి సమీపంలో ఉన్న గస్తీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగుతారు. కాబట్టి బాధితులు వీలైనంత త్వరగా ఉపద్రవం నుంచి బయటపడే అవకాశం ఉంటుందనేది వారి మాట.

dial 100 is helpful to 55.62 lakh people in the last 6 years in telangana
ఒక్క కాల్‌తో సాయం.. ఆరేళ్లలో లక్షల మంది వినియోగం
author img

By

Published : Feb 12, 2021, 9:23 AM IST

ప్రస్తుతం ఇంటర్నెట్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ ప్రతి ఒక్కరి చేతిలో ఉంటోంది. లేదంటే అంతర్జాల సదుపాయం లేని ఫీచర్‌ ఫోన్లనూ వినియోగిస్తున్నారు. ఇంటర్నెట్‌ సదుపాయం ఉన్నా, లేకపోయినా ఆపద వేళ బాధితులు 100 నంబరుకు ఫోన్‌ చేసి, వీలైనంత తొందరగా ఉపశమనం పొందే అవకాశాన్ని తెలంగాణ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఒకప్పుడు బాధితుల ఫోన్‌కు అంతర్జాల సదుపాయం ఉంటేనే వారున్న ప్రదేశాన్ని గుర్తించడం సాధ్యమయ్యేది. అప్పట్లో 100 నంబరుకు ఫోన్‌ చేసినా... ఎక్కడి నుంచి కాల్‌ చేస్తున్నారో తప్పనిసరిగా చెప్పాల్సి వచ్చేది. అలా చెప్పిన తర్వాతే సంబంధిత ఠాణా పోలీసులను డయల్‌ 100 సిబ్బంది అప్రమత్తం చేసేవారు. ఇప్పుడా బాధ లేదు. బాధితులు ఫోన్‌ చేసిన వెంటనే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారన్నది అక్షాంశ, రేఖాంశాలతో సహా తెరపై కనిపిస్తుంది. దీంతో కాల్‌ వచ్చిన వెంటనే సమీపంలోని గస్తీ బృందాలు నిమిషాల వ్యవధిలోనే ఘటనాస్థలికి చేరుకోవడం సాధ్యమవుతోంది.

ఒక్క మీట నొక్కితే... ఒకేసారి ఐదుగురి అప్రమత్తం

తెలంగాణ పోలీసులు ‘హాక్‌ఐ’ యాప్‌ను ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచారు. ఈ డౌన్‌లోడ్‌ చేసుకొని, ఒక్క మీట నొక్కితే... పోలీసులు, కుటుంబ సభ్యులు తదితర ఐదు మందిని ఒకేసారి అప్రమత్తం చేసే వీలుంది.

ఇవీ చూడండి: పథకం ప్రకారమే కిడ్నాప్, అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.