కొత్త రెవెన్యూ విధానం నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు సైతం తహసీల్దార్లే చేసేలా ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. దసరా నుంచి ధరణి ప్రారంభమవుతున్న దృష్ట్యా.... ఆ లోగానే అవసరమైన శిక్షణ ఇవ్వనున్నారు. తహసీల్దార్‌తో పాటు డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, ధరణి ఆపరేటర్లకు కూడా శిక్షణ ఇస్తారు.
శిక్షణ కోసం వారి వివరాలతో కూడిన జాబితా అందించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. దసరాలోగా శిక్షణ పూర్తి చేయడంతో పాటు నమూనా ట్రయల్స్ కూడా నిర్వహించి రిజిస్ట్రేషన్లు, ధరణి నిర్వహణపై వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనున్నారు.