ETV Bharat / city

శంషాబాద్​లో ధరణి సేవలు పరిశీలించిన సీఎస్ సోమేష్ కుమార్ - cs somesh kumar review dharani services

dharani services started in telangana from today onwards
శంషాబాద్​లో ధరణి సేవలు పరిశీలించిన సీఎస్ సోమేష్ కుమార్
author img

By

Published : Nov 2, 2020, 12:02 PM IST

Updated : Nov 2, 2020, 4:44 PM IST

12:00 November 02

శంషాబాద్​లో ధరణి సేవలు పరిశీలించిన సీఎస్ సోమేష్ కుమార్

   రాష్ట్రవ్యాప్తంగా ధరణి సేవలు ప్రారంభమయ్యాయి. శంషాబాద్​ తహసీల్దార్​ కార్యాలయంలో సీఎస్​ సోమేష్ కుమార్​ పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్​ అమోయ్​ కుమార్​... ధరణి సేవల ప్రక్రియ గురించి సీఎస్​కు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల కోసం ఇవాళ 946 మంది నగదు చెల్లించగా... 888 మంది స్లాట్ బుక్​ చేసుకున్నట్టు సీఎస్ తెలిపారు.  

    హైదరాబాద్​ జిల్లా మినహా 570 మండలాల్లో రైతులకు ధరణి సేవలు అందించనున్నారు. ఇప్పటి వరకు 1.48 లక్షల ఎకరాలకు సంబంధించిన 59.46 లక్షల ఖాతాలు ధరణిలో నిక్షిప్తం చేశారు. ఏకకాలంలోనే సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు చేయనున్నారు. ఈ పోర్టల్​ను అక్టోబర్​ 29న... మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రారంభించారు.

మీ సేవా కేంద్రాలలోనూ రూ.200 చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చని సీఎస్ తెలిపారు. ఇప్పటికే పెండింగ్​లో ఉన్న మ్యుటేషన్​కు త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు. ఒక్క శాతం కూడా అవినీతి లేకుండా అత్యంత పారదర్శకంగా ధరణి సేవలందించాలన్నదే సీఎం కేసీఆర్​ ఆకాంక్ష అన్నారు. దీని కోసం ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు. త్వరలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. 

ఇదీ చూడండి: నేటి నుంచి పోర్టల్​ ద్వారా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు

Last Updated : Nov 2, 2020, 4:44 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.