ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. అర్హత గల వారంతా తమ సమీపంలోని వ్యాక్సినేషన్ కేంద్రాలకు తప్పనిసరిగా వెళ్లి టీకా తీసుకోవాలని శ్రీనివాసరావు తెలిపారు. మొదటి డోసు తీసుకున్న తర్వాత తప్పనిసరిగా రెండో డోసును కూడా తీసుకుని కరోనా నుంచి బయటపడాలని కోరారు.
కరోనా వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి అపోహలు, భయాలకు గురికావద్దని సూచించారు. రాష్ట్రంలో 10 లక్షల మందికి పైగా మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారని... వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆరోగ్యపరంగా, ఆహార అలవాట్లపరంగానూ ఎలాంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదన్నారు. అర్హతగల వారంతా నిర్భయంగా సమీప కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.