ETV Bharat / city

లాక్​డౌన్​ను మరింత కఠినంగా నిర్వహించాలి: డీజీపీ - లాక్​డౌన్​ను మరింత కఠినంగా నిర్వహించాలని సిబ్బందికి డీజీపీ ఆదేశం

హైదరాబాద్​లోని ఏర్పాటు చేసిన పలు చెక్​పోస్టులను డీజీపీ మహేందర్​రెడ్డి పర్యవేక్షించారు. అమలవుతున్న లాక్​డౌన్​ను పరిశీలించారు. లాక్​డౌన్​ సమయం దాటాకా ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ బయటికి రావద్దని హెచ్చరించారు.

dgp mahender reddy visited checkposts in hyderabad

author img

By

Published : May 22, 2021, 3:53 PM IST

హైదరాబాద్​లో అమలవుతోన్న లాక్‌డౌన్​ను డీజీపీ మహేందర్ రెడ్డి పర్యవేక్షించారు. ఈసీఐయల్ చౌరస్తాలో, కూకట్‌పల్లి జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన పోలీసు చెక్‌పోస్టులను డీజీపీ పరిశీలించారు. లాక్​డౌన్​ను మరింత కఠినంగా నిర్వహించాలని సిబ్బందికి పోలీస్​ బాస్​ సూచించారు. 10 గంటలు దాటిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ రోడ్లపైకి రావొద్దని తెలిపారు. ఒకవేళ వస్తే ఆ వాహనాలను సీజ్ చేయాలని... తిరిగి లాక్​డౌన్ తరువాత ఇవ్వాలని తెలిపారు.

ఉదయం 10 గంటల తర్వాత రహదారులపైకి వచ్చిన వాహనదారులపై పోలీసులు కఠినంగా వ్యవహారిస్తున్నారు. గడువు ముగిసిన తర్వాత రోడ్లపైకి వచ్చిన గూడ్స్‌ వాహనాలను పోలీసులు నిలిపివేశారు. గూడ్స్‌ వాహనదారులు రాత్రి 9 నుంచి ఉదయం 8గంటల వరకే రవాణ ముగించుకోవాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. సమయం ముగిసిన తర్వాత డెలివరీలు తీసుకుని రోడ్లపైకి వచ్చిన జొమాటో తదితర సంస్థల సిబ్బందిపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. గడువు ముగిసిన తర్వాత ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని సజ్జనార్ తెలిపారు. లాక్‌డౌన్ మొదలై చాలా రోజులైనా ఇప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని సీపీ అగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహారిస్తే కఠిన చర్యలు తప్పవని సజ్జనార్ హెచ్చరించారు.

ఇదీ చూడండి: సీఎం ఆదేశాలతో రాష్ట్రంలో మరింత కఠినంగా లాక్​డౌన్​ అమలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.