ETV Bharat / city

'ఉద్యోగులకు పోలీసులు సహకరించారా'.. డీజీపీని ప్రశ్నించిన జగన్​ - telangana top news

AP DGP Sawang Meets CM Jagan : ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్.. ఆ రాష్ట్ర సీఎం జగన్​ను కలిశారు. సుమారు అరగంట పాటు జరిగిన భేటీలో... ఛలో విజయవాడ అంశంపైనే చర్చ జరిగినట్లు తెలిసింది. పోలీసు నిర్భందాలు, ఆంక్షలు పెట్టినా ఉద్యోగుల పోరాటం విజయవంతం కావడంపై డీజీపీని ఏపీ సీఎం ప్రశ్నించినట్లు సమాచారం.

AP DGP Sawang Meets CM Jagan, jagan and dgp meeting
జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్ సమావేశం
author img

By

Published : Feb 4, 2022, 3:38 PM IST

AP DGP Sawang Meets CM Jagan : ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల చలో విజయవాడ పరిణామాల దృష్ట్యా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌తో డీజీపీ గౌతమ్ సవాంగ్‌ భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు జరిగిన భేటీలో... ఛలో విజయవాడ అంశంపైనే చర్చ జరిగినట్లు తెలిసింది. పోలీసు నిర్భందాలు, ఆంక్షలు పెట్టినా ఉద్యోగుల పోరాటం విజయవంతం కావడంపై డీజీపీని జగన్ ప్రశ్నించినట్లు తెలిసింది. ఉద్యోగులకు పోలీసులు సహకరించారన్న విషయంపై చర్చించినట్లు సమాచారం.

ఇంటెలిజెన్స్ వైఫల్యం

విజయవాడకు చాలా తక్కువ మంది వస్తారని పోలీసులు అంచనా వేసినా... అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. సుమారు 4 కిలోమీటర్ల మేర ఉన్న బీఆర్​టీఎస్ రోడ్డు నిమిషాల వ్యవధిలోనే ఉద్యోగులతో నిండిపోయింది. ఈ పరిణామాలన్నీ ఎలా జరిగాయనే అంశంపైనా డీజీపీని సీఎం వివరణ అడిగినట్లు తెలిసింది. ఉద్యోగుల రాకను అంచనా వేయడంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైనట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. అందువల్ల ఇంటెలిజన్స్, నిఘా వ్యవస్థ పనితీరుపైనా చర్చించినట్లు తెలిసింది.

ముందే విజయవాడకు వచ్చారు..

చలో విజయవాడను అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు, తీసుకున్న చర్యలను సీఎంకు డీజీపీ సమగ్రంగా వివరించినట్లు సమాచారం. ఉద్యోగులు మారువేషాల్లో రావడం, ముందే విజయవాడ చేరుకుని బస చేయడం లాంటివి జరిగాయని తెలిపినట్లు సమాచారం. భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలనే విషయంపై డీజీపీకి సూచనలు చేసినట్లు తెలిసింది.

ఇదీ చదవండి: Chalo Vijayawada News : అడ్డుకున్నా.. అరెస్టు చేసినా.. అణచివేసినా.. ఆగని ఉద్యోగ పోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.