ETV Bharat / city

తిరుమలకు కరోనా ఎఫెక్ట్.. ఏడాదిలోనే అత్యల్ప దర్శనాలు - tirumala latest news

కరోనా కారణంగా ఏపీలోని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులు తగ్గారు. కొవిడ్‌ ప్రభావంతో ఈ సంవత్సరంలోనే అత్యల్పంగా 2,262 మంది మాత్రం శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. రోజుకు దాదాపు 15 వేల టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచినా కొవిడ్‌ ప్రభావంతో, కర్ఫ్యూ కారణంతో భక్తులు టికెట్ల కొనుగోలుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

Tirumala
తిరుమలకు కరోనా ఎఫెక్ట్.
author img

By

Published : May 13, 2021, 5:23 PM IST

కరోనా ప్రభావం వల్ల ఏపీలోని తిరుమల శ్రీవారి దర్శనాలపై భారీగా పడుతోంది. రాష్ట్రంలో పగటిపూట కర్య్ఫూ కారణంగా.. భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. శ్రీవారిని మంగళవారం ఈ సంవత్సరంలోనే అత్యల్పంగా 2262 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయం వద్ద సాధారణంగా ఉండాల్సిన భక్తుల సందడి తగ్గి తిరుమల కళ తప్పింది. శ్రీవారికి 925 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం మరింత తగ్గి కేవలం రూ.11 లక్షలు మాత్రమే లభించింది. తిరుమలకు భక్తుల రాకపోకలు తగ్గడంతో పరోక్షంగా ఆ ప్రభావం శ్రీవారి హుండీ ఆదాయంపై పడింది.

కరోనా ప్రభావం రూ.300 శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లపైనా పడింది. గత నెల 20 తేదీన తితిదే ఆన్‌లైన్‌లో మే నెలకు సంబంధించిన ఎస్‌ఈడీ టికెట్లను విడుదల చేసింది. రోజుకు దాదాపు 15 వేల టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచినా కొవిడ్‌ ప్రభావంతో, రాష్ట్రంలో ప్రారంభమైన కర్ఫ్యూతో భక్తులు టికెట్ల కొనుగోలుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

లోక కల్యాణార్థం తిరుమల వసంత మండపంలో తితిదే షోడశదిన సుందరకాండ దీక్ష కొనసాగుతోంది. తిరుమలలో నాదనీరాజనం వేదికపై ఎస్వీ వేదవిజ్ఞానపీఠం, వేదిక్‌ వర్సిటీ ఆధ్వర్యంలో ఉదయం సుందరకాండ పారాయణం, సాయంత్రం భగవద్గీత, ఆదిపర్వం పారాయణం పండితులు నిర్వహిస్తున్నారు. తిరుమలలోని పద్మావతి అతిథిగృహం, సీఆర్వో, ఎంబీసీ, కౌస్తుభంలో భక్తులకు గదులు లభిస్తున్నాయి.

ఇదీ చూడండి: లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద రద్దీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.