ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస బలపరచిన అభ్యర్ధి వాణి దేవిని గెలిపించుకోవాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ సూచించారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార తీరు తెన్నులపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెరాస ప్రభుత్వ విధానాలపై విస్తృతంగా ప్రచారాన్ని కల్పించాలని, న్యాయవాదులకు ప్రత్యేక నిధిని మంజూరు చేసిన అంశంతో పాటు వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని పద్మా రావు గౌడ్ పేర్కొన్నారు.
ప్రతి 50 మంది ఓటర్లకు ఇద్దరు ప్రతినిధులను సమన్వయ కర్తలుగా నియమించాలని సూచించారు. సమావేశంలో ఎన్నికల ఇంఛార్జి, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు కుమారి సామల హేమ, రాసురి సునీతా, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, నాయకులు మోతె శోభన్ రెడ్డి, శ్రీ కంది నారాయణ, లింగాని శ్రీనివాస్, రాజసుందర్లతో పాటు నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు.