ETV Bharat / city

ఉద్యోగాల భర్తీలో శాఖాపరమైన నియామకాలకే పెద్దపేట - latest job notifications

కొత్తగా జరగనున్న ఉద్యోగాల భర్తీలో శాఖాపరమైన నియామక సంస్థలకే పెద్దపీట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అధికశాతం ఉద్యోగాలు వాటి ద్వారానే నింపనున్నట్లు తెలుస్తోంది. సర్కారీ బడుల్లో కొత్త ఉపాధ్యాయ కొలువులను 31 జిల్లాల ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఖాళీలు గుర్తించేందుకుగాను సీఎస్​ సోమేశ్‌కుమార్‌ నేడు సంక్షేమశాఖలతో సమావేశం నిర్వహించనున్నారు.

departmental recruitments in Telangana jobs

author img

By

Published : Dec 19, 2020, 4:57 AM IST

రాష్ట్రంలో కొలువుల భర్తీని శాఖాపరమైన నియామక సంస్థలు చేపట్టేలా సర్కారు యోచిస్తోంది. ఖాళీల భర్తీని త్వరితగతిన పూర్తి చేసేందుకు ఈ పద్ధతే అనుకూలమనే ఉద్దేశంతో ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో టీఎస్​పీఎస్సీ ప్రధాన నియామక సంస్థగా ఉంది. పోలీసు నియామక సంస్థ, వైద్య ఆరోగ్య నియామక సంస్థ, గురుకుల విద్యాలయాల సంస్థ, జిల్లా ఎంపిక కమిటీల ద్వారా ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఉద్యోగాల భర్తీపై ఇటీవల ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ఒకే సంస్థపై భారం వేయడం కంటే ఉద్యోగాల భర్తీని వికేంద్రీకరించి, ఏ శాఖకు ఆ శాఖవారీగా నియామకాలు చేపట్టాలనే అభిప్రాయానికి వచ్చింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా గ్రూపు-1, గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాలతో పాటు సచివాలయ నియామకాలు వంటివి జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. టీఎస్‌పీఎస్సీ నియామకాల్లో కొన్నింటిపై న్యాయస్థానాల్లో కేసుల వల్ల భర్తీలో జాప్యం జరుగుతోంది. దీన్ని నివారించేందుకు తక్కువ ఉద్యోగాలనే టీఎస్‌పీఎస్సీకి ప్రభుత్వం అప్పగించాలనుకుంటోంది.

ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త ఉపాధ్యాయ కొలువులను 31 జిల్లాల ప్రాతిపదికన భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో 31 జిల్లాలకే రాష్ట్రపతి ఆమోదం ఉంది. నారాయణపేట, ములుగు జిల్లాలకు ఇంకా ఆమోదం లభించలేదు. ఈ క్రమంలో రాష్ట్రాన్ని 31 జిల్లాలుగానే పరిగణించి ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టాలనే అంశం ప్రభుత్వ స్థాయిలో చర్చకు వచ్చింది. 32, 33వ జిల్లాలుగా ఏర్పడిన నారాయణపేట, ములుగులను పాత జిల్లాల పరిధిలోనే చూపి, పోస్టులు ఇచ్చే సమయంలో విభజించాలనే దిశగా చర్చ సాగింది. విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ సలహాదారు శివశంకర్‌, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌ తదితరులతోనూ సమావేశమై ఇదే విషయమై చర్చించారు. జిల్లాలవారీగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీలపై నేడు స్పష్టత రానుంది. గత విద్యా సంవత్సరంలో దాదాపు 12 వేల మంది విద్యా వాలంటీర్లు పనిచేశారు. మంజూరు పోస్టుల్లోనే వారిని నియమించినందున అంత మొత్తం ఖాళీలు ఉన్నట్లేనని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పశుసంవర్థకశాఖలో 1,396 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా ఖాళీలు గుర్తించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ నేడు సంక్షేమశాఖలతో సమావేశం నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖల ఉన్నతాధికారులతో జరిగే ఈ సమావేశంలో ఖాళీల వివరాలు తెలుసుకోనున్నారు. మొత్తంగా సంక్షేమ శాఖల్లో సబార్డినేట్‌ పోస్టులతో కలిపి మొత్తం 12 వేలకుపైగా ఖాళీలు ఉండే అవకాశాలున్నాయి.

ఇదీ చూడండి: ఆ 12 ప్రాజెక్టులకు కూడా అనుమతి ఇవ్వండి: వినోద్ కుమార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.